Wednesday, 17 October 2012

గాయత్రి

ఓం భూర్భువస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఇదే గాయత్రి మంత్రం.

గాయంతం త్రాయతే ఇతి గాయత్రి.గాయంతం అంటే గానం చేయడం,పాడడం.గాయత్రి మంత్రాన్ని నిత్యం గానం చేసే వారిని రక్షించేది గాయత్రి అని అర్దం.
గాయత్రి చంధసాం మాత.అంటే అన్ని మంత్రాలకు తల్లి గాయత్రి.
తద్యత్ ప్రాణం త్రాయతే తస్మాద్ గాయత్రి.ప్రాణాలను రక్షించేది గాయత్రి అని అర్దం.

గాయత్రి వేదమాత.గాయత్రి మంత్రానికున్న శక్తి వర్ణించలేనిది.జ్ఞాపక శక్తిని పెంచి తీరుతుంది.24 అక్షరాల ఈ మహా మంత్రానికి 32 మంది అధిదేవతలున్నారు.ఈ మంత్రాన్ని క్షించేవారు. శివుడు, విష్ణువు, బ్రహ్మ, నరసింహుడు, ఇంద్రుడు, సూర్యుడు..... ఇలా. ఒక్కసారి గాయత్రి మంత్రాన్ని జపిస్తే ఇంతమంది మన నిత్య జీవితంలో ఏదురయ్యే కష్టాలను తొలగించగల 32 దేవతలను స్మరించిన ఫలితం వస్తుంది.

అందుకే "గాయత్రి పరమో మంత్రః"అన్నారు.అంటే గాయత్రికి మించిన మంత్రం లేదు అని.

గాయత్రి మంత్రం మీద జరుగినవి,జరుగుతున్న పరిశోధనలు మరే మంత్రం మీద కాని,ఇతర మతాల్లోని ఏ అంశం మీద గాని జరగట్లేదంటే అతిశయొక్తి కాదు.గాయత్రి మంత్రాన్ని నియమంగా,పట్టుదలతో,శాస్త్రం చెప్పిన రీతిలో,సరైన స్వరంతో చేస్తే సౌరశక్తికి 1లక్ష రెట్ల శక్తి జపించేవారికి కలుగుతుందని పరిశోధకులు చెప్పారు.

ఈ మంత్రంలో ఉన్న 24 అక్షరాలు మన శరీరంలో ఉన్న 72000 నాడులను ప్రేరేపిస్తాయని,మన ముఖ భాగంలోని కదలికలతో మన శరీరంలో ఉన్న 6 చక్రాలను ప్రభావితం చేసి కుండలిని శక్తిని జాగృతం చేస్తుంది.

పాండ్య అనే ఒక డాక్టరు,ఈ మంత్రం యొక్క శక్తిమీద పరిశోధనకు తన వృతిని కూడా త్యాగం చేసి మన దేశంలో గత 40సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్నారు.ఆయన మాటల్లొ చెప్పాలి అంటే లక్షలమంది ఈ గాయత్రిమంత్రాన్ని ఒకే సమయంలో జపిస్తే,ఆ ప్రాంతంలో ఆ జపం వల్ల పుట్టే ద్వని తరంగానికి(సౌండ్ వెవ్ కి)ఉన్న శక్తి,అతి పెద్ద అణువినాశనం(న్యూక్లియర్ హొలొకాస్ట్)నుండి ప్రజలను రక్షిస్తుంది.ఇంకా చెప్పాలి అంటే ఇది అణుబాంబుల రెడియేషన్ శక్తిని కూడా నిర్వీర్యం చేసి,సమస్త ప్రపంచాన్ని రక్షిస్తుంది.భారతీయులకున్న గొప్ప ఆస్తి గాయత్రి మంత్రమని,అది ప్రతి భారతీయుడు జపించడం చేత ఈ దేశరక్షణకు ఉపయోగపడుతుందని పాండ్య గారు వివరిస్తారు.

హెల్డేన్ అనే శాస్త్రవేత్త గాయత్రి మంత్రాన్ని ప్రపంచంలోని అన్ని లెబరెటరీల తలుపుల మీద చెక్కించాలి అన్నారు.

గొప్ప కార్యాలను కూడా ఈ మంత్ర జపం చేత సాధించవచ్చని మహాయోగి శ్రీ అరబిందొగారి మాట.

గాయత్రి మంత్రమే ఈ భారత దేశాన్ని మేల్కొలిపింది.ఇది చదవడానికి చాలా సులువుగా ఉంటుందని రవింద్రనాధ్ ఠాగూర్ అన్నారు.

దీని మీద జపాన్ లో కూడా పరిశోధనలు జరిగాయి.

వేదకాలంలో అందరికి ఉపనయనం ఉండేది(అసలు కులవ్యవస్థ లేనేలేదు,వేదంలో ఎక్కడ కుల ప్రస్తావన లేదు).స్త్రీలు కూడా గాయత్రి జపం చేసేవారు.సీత దేవి ఆశోకవనంలో ఉన్న సమయంలో కూడా దగ్గర్లొ ఉన్న చెరువులో సంధ్యావందనం చేసి గాయత్రి జపం చేసేది అని వాల్మికి రామాయణంలొ కనిపిస్తుంది.స్త్రీలు గాయత్రి జపం చేయకూడదని,ఉపననయం అందరికి ఉండదు అన్నవి కల్పితాలు మాత్రమే.కాలక్రమంలో ఏర్పడాయి.అందరు ఉపనయనం చేసుకొని గాయత్రి జపం చేయాలని వేదం చేప్తొంది.

మనం మన దేశంలో కులాల పేరుతో కొట్టుకుచస్తున్నాం.విదేశీయులు మన గ్రంధాలను ఎత్తుకుపొయి పరిశోధించి పెటెంట్ హక్కులు పొందుతున్నారు.అందుకు ఉదాహరణ ఈ గాయత్రి మత్రమే.దీని మీద పరిశోధించి ఈ మంత్రం మీద "పెటెంట్ హక్కులు" పొందింది ఒక జర్మన్ కంపెని.

ఈ గాయత్రి మంత్రం గురించి,ఆని మీద జరిపిన పరిశోధనలు,వాటి ఫలితాల గురించి మరింతవిపులంగా తరువాత చెప్పుకుందాం.

యో దేవ స్సవితా‌உస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||

స్త్రీలకు,సమాజంలోని కొన్ని వర్ణాలకు ఉపనయనం చేసే ఆచారం ఇప్పుడు లేదు.మరి వారికి ఎటువంటి మార్గం లేదా?.....ఉంది.పైన చెప్పబడ్డ శ్లోకం.గాయత్రి మంత్ర శక్తికి సమానమైనా శక్తితో,అదే అర్ధంతో మన శాస్త్రం ప్రసాదించినది ఆ శ్లోకం.ఆసక్తి ఉన్నవారు ఆ శ్లోకాన్ని రోజు నియమంగా చదవండి.భవిష్యత్తులొనైనా అందరు మన ధర్మం గురించి తెలుసుకొని,అందరు ఉపనయనం చేసుకొని, గాయత్రి ఉపాసన చేస్తారని ఆశిద్దాం.  
 
ఓం భూర్భువస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ ||

No comments:

Post a Comment