విజయదశమి మనకు పచ్చని సందేశం ఇస్తోంది.
విజయదశమి నాడు పాలపిట్టను చూసే ఆచారం ఉంది.పాలపిట్టను చూస్తే శుభాలు కలుగుతాయని శకున శాస్త్రం చెప్తొంది.మనవాళ్ళ తీరు చూస్తే నాకు ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంటుంది:'మీ పిల్లలు ఏనుగును పుస్తకాల్లో తప్ప ఇంకెక్కడా చూడలేని పరిస్థితి వస్తే మీరు సంతోషిస్తారా?అని అన్నారు డేవిడ్ అటన్ బరో అనే పర్యావరణవేత్త.ఇప్పుడు మనం కూడా పాలపిట్ట అంటే ఏంటి అని అడుగే పరిస్థితికి వచ్చాం .పాలపిట్ట మన రాష్ట్ర పక్షి.మనమే కాదు కర్ణటక,బీహార్,మరికొన్ని రాష్ట్రాలు కూడా దీనిని రాష్ట్ర పక్షిగా ప్రకటించాయి.అది ఎక్కువగా పంటపొలాల్లో కనిపిస్తుంది.పంటలకు వచ్చే చీడలను,పురుగును తిని రైతుకు సహాయంచేస్తుంది.అలాగే కీటకాలను,సీతకోకచిలుకలను,వానపాములను,చిన్న చిన్న పాములను వంటివి దాని ఆహారం.ఒకప్పుడు ఇవి 1 చదరపు కిలొమీటరుకు సగటున 50 కనిపించేవి.ఇప్పుడివి అంతరించిపొయే జాతుల జాబితలో చేరిపోయాయి.అవి అంతరించిపొవడానికి ప్రధాన కారణం రసాయన ఎరువులు,పురుగుల మందులు వల్ల దానికి ఆహారం దొరక్కపోవడం.వీటిని తప్పకుండా చూడాలని చెప్తారు.
ఇక రెండవది సీమోలంఘనం.అంటే గ్రామం లేదా పట్టణ సరిహద్దులు దాటడం.దసరా రోజున మనం ఉంటున్న ఊరి సరిహద్దు దాటి రావాలని చెప్తారు.సరిహద్దులో అడవి ఉంటుంది.కుటుంబ సమేతంగా అడవిలొకి వెళ్ళి జమ్మి చెట్టుకు పూజ చేసి,పాలపిట్టలను చూసి,భోజనం చేసి రావాలని చెప్తారు.పిల్లలకు కాస్త కుతూహలం ఎక్కువ.అందువల్ల అడవిలోకి వెళ్ళగానే ఏ చెట్టును చూసినా ఇది జమ్మి చెట్టా?అది జమ్మి చెట్టా?అని అడుగుతారు.కాదు అంటే మరి ఇది ఏ చెట్టూ అంటూ మళ్ళి ప్రశ్నిస్తారు.అదే పాలపిట్ట విషయంలో కూడా జరుగుతుంది.చూసిన ప్రతి పక్షిని పాలపిట్టనుకోవడం,వాటి గురించి తెలుసుకోవడం జరుగుతుంది.అందువల్ల వారికి రకరకాల పక్షులు,చెట్ల గురించి జ్ఞానం వస్తుంది.వాటి ఉపయోగాలు తెలుసుకోవడం చేత వాటి మీద గౌరవం ఏర్పడుతుంది.వాటి గురించి పురాణ కధల్లొ ఉన్న విషయాలు తెలుసుకోవడం వల్ల వాటి యందు దైవ భావన ఏర్పడి వాటిని పూజించాలన్న అలొచన కలుగుతుంది.ఇవన్ని ప్రకృతి పట్ల ప్రేమను పెంచుతాయి.పర్యావరణ పరిరక్షణకు దోహదపడతాయి.అందువల్లే ఈ దేశంలో జీవ వైవిధ్యం బ్రిటీష్ వారు రాకముందు వరకు,మన మనసులలొనికి బ్రిటిష్ ఆలొచనా విధానం చొరబడకముందు వరకు రక్షింపబడింది.తరువాత భక్షింపబడుతోంది.
తన వేర్లూ,మూలాలు పేవ్ మెంట్ల మీద కంటే నల్లమట్టిలో బలంగా ఉన్న సమాజమే మరింత సుస్థిరంగా ఉంటుందన్నది నిస్సందేహం అన్న ఆల్డో లియొపాల్డ్ అనే అమెరికా అటవి శాస్త్రవేత్త మాటలను మనం ఇప్పుడు గుర్తుచేసుకుంటే ఇక్కడ మన సంస్కృతి కూడా సరిగ్గా అదే చేసింది.పిల్లలకు పుస్తకాల్లో చెట్లను,నదులను,జంతువులను,పక్షులను,ప్రకృతిని చూపించడం కాదు ప్రత్యక్షంగా వారిని ప్రకృతిలోకి తీసుకువెళ్ళి వాటిని పరిచయం చేయడం నేర్పింది మన హిందూ సమాజం.
ఈ నవరాత్రుల్లో మనం పూజించిన బతుకమ్మ ప్రకృతి స్వరూపం.లక్ష్మి దేవి కూడా తాను ప్రకృతిని అని,"ఓం ప్రకృత్యై నమః"అనే నామాన్ని మొదటి నామంగా చేసుకుంది.పార్వతి దేవి కూడా తనను శివాని అనే పిల్పించుకునేకంటే పార్వతిగానే పిలిపించుకొవడానికి ఇష్టపడుతుంది.పార్వతి అంటే పర్వత రాజు పుత్రిక.పర్వతాలే అడవులకు,నదులకు,జీవ వైవిధ్యానికి తొడ్పడుతాయి.అక్కడే ఉంటుంది అసలైన ప్రకృతి.ఆమే పార్వతి.ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మొత్తం హిందూ ధర్మమే పర్యావరణపరిరక్షణను ప్రొత్సహించింది.
No comments:
Post a Comment