ఈరోజు విజయదశమి.శమి వృక్షం(జమ్మి చెట్టు)కు పూజించాలి,సీమోలంఘనం(ఊరి పొలిమేరలను దాటాలని)చేయాలని,పాలపిట్టను చూడాలంటొంది శాస్త్రం.
పాండవులు 13సంవత్సరాల వనవాసం తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళె ముందు జమ్మి చెట్టు మీద వారి ఆయుధాలను దాచారని,అజ్ఞాతవాసం పూర్తయ్యాక వచ్చి ఈ చెట్టును పూజించి,దాని మీద ఉన్న ఆయుధాలను తీసుకున్నారు.వారు ఆ జమ్మి చెట్టును పూజించింది విజయదశమి రోజున.అంతేకాదు ఆ చెట్టు మీద పెట్టిన ఆయుధాలు ఆ దారిని పొయేవారికి పాములుగా కనిపించేవని చెప్తారు.అలాగే రాముడికి ఇష్టమైన చెట్టు జమ్మి చెట్టని.అలాగే వరతంతు అనే గురువు తన దగ్గర సకల విద్యలు నేర్చుకున్న కౌత్సుడనే శిష్యుడిని గురుదక్షిణగా 14కోట్ల బంగారు నాణాలు కావాలంటాడు.వాటి కోసం కౌత్సుడు రఘుమహారాజును ఆశ్రయించగా ఆయన యాగం చేసి ఇంద్రునిపై యుద్ధం ప్రకటిస్తాడు.ఇంద్రుడు భయపడి సంపదను కురిపించమని కుబేరుడిని ఆజ్ఞాపిస్తాడు.కుబేరుడు జమ్మి చెట్లున్న చోట ధన వర్షం కురిపించాడని,అందువల్ల ఈరొజు జమ్మి చెట్టును పూజించి దాని ఆకులు పంచుకోవలాని అంటారు.అసలు జమ్మి చెట్టు ప్రత్యేకత ఏమిటి?
జమ్మి చెట్టు సంవత్సరం మొత్తం పచ్చగానే ఉంటుంది(ever-green tree).అది ఎక్కడ ఉంటే అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటాయి.ఎడారి ప్రాంతంలో కూడా పెరుగుతుంది ఈ చెట్టు.దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు.ఇది భూసారాన్ని పెంచుతుంది.నైట్రొజెన్ స్థాయిని పెంచుతుంది.కరువును తట్టుకొని నిలబడడమే కాదు,ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ఎండా కాలంలో కూడా పచ్చటి ఆకులతో ఉండి,ఒంటెలు,మేకలు మొదలైన జంతువులకు ఆహరాన్ని అందిస్తుంది,రైతులు,బాటసారులకు నీడను అందిస్తుంది.పేదలు వంట చెఱుకుగా దీని కొమ్మలను వాడాతారు.యజ్ఞయాగాదులలో అగ్నిని మదించడానికి(పుట్టించడానికి)జమ్మి,రావి కొమ్మలను ఉపయోగిస్తారు.ఇది త్వరగా పెరిగే చెట్టు.పొలంగట్టున దీనిని నాటుతారు.దీని బెరడు యాంటి-బాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది.దీని ఆకులను కాల్చడం వల్ల వెలువడే పొగ కంటి రోగాలకు వైద్యం.దీని పువ్వులను గర్భవతులకు ఆహారంగా అందించడం వల్ల అబార్షన్ అయ్యే అవకాశాలు తగ్గుతాయి.దీని ఆకులు జంతువులకు పుష్టికరమైన ఆహారం.ఇసుక తుఫాన్ల నుంచి ఇవి పంటలను రక్షించడమే కాదు ఎడారి విస్తరించకుండా సహాయపడతాయి.ఎండిన దీని అకులు మట్టిలో కలిసి మట్టిని మరింత సారవంతం చేస్తాయి.బ్రాంకైటిస్,ఆస్మా,లెప్రసి లాంటి అనెక రోగాలకి మందుగా వడాతారు.ఈ చెట్టులోని ప్రతి భాగం కూడా అవసరమైనదే.ఇలాంటి ఎన్నో గొప్పతనాలు కలిగిన ఈ చెట్టును ఎడారి ప్రాంత ప్రజలు "కల్పతరువు" అంటారు.
ఈ చెట్లను నరికేయకుండా కాపాడడానికి 1730లో అమృత దేవి అనే ఒక సామన్య మహిళ నాయకత్వంలో 363 మంది ప్రాణత్యాగం చేశారు.ఇంత గొప్ప చరిత్ర కలిగిన జమ్మి చెట్టును ఈరోజున ఆరాధించడం చేత పాపం నశిస్తుందని,శత్రువులు నాశనమవుతారని అంటొంది శాస్త్రం.శత్రువలంటే మనలోని రోగాలని అర్దం.
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ|
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనః||
దీనిలో అగ్ని తత్వానికి ప్రతీకయని,దీనిలో అగ్ని దేవుడుంటాడని పురాణాల్లొ కనిపిస్తుంది.ఇది శివస్వరూపంగా కొన్ని చోట్ల అరాధించే ఆచారం కూడా ఉంది.నిజానికి బ్రిటీష్ వారు రాకముందు ఈ దేశంలో ప్రకృతిని దైవంగా ఆరాధించేవారు.చెట్లను నరకడం,అక్రమ రవాణ చేయడం పాపం అని,చెట్లు దేవతలకు ప్రతి రూపాలని వాటిని కాపాడేవారు.బ్రిటిష్ వారు వచ్చి ఇవన్ని మూఢ నమ్మకాలని,దైవం ప్రకృతిలో ఉండదని,ఎక్కడొ ఉంటుందని,అభివృద్ధి పేరున ప్రకృతిని విచ్చలవీడిగా నాశనం చేయడం తప్పుకాదన్న భావన మనకు కలిగించారు.అందువల్ల అప్పటివరకు కాపాడబడిన మన ఆయుర్వేద మూలికలు,మొక్కలు,జీవ వైవిధ్యం అంతరించడం మొదలయ్యింది.సగటున రోజుకు 100 పైగా ఆయుర్వేద మూలికలు అంతరిస్తున్నాయని అంచనా.
మన పండగలు మనకు పర్యవరణ పరిరక్షణనే గుర్తుచేస్తున్నాయి.ప్రకృతిని కాపాడండి.ఉన్న చెట్లను నరకకండి.క్రొత్త మొక్కలు నాటండి.
వృక్షో రక్షతి రక్షితః
పాండవులు 13సంవత్సరాల వనవాసం తరువాత అజ్ఞాతవాసానికి వెళ్ళె ముందు జమ్మి చెట్టు మీద వారి ఆయుధాలను దాచారని,అజ్ఞాతవాసం పూర్తయ్యాక వచ్చి ఈ చెట్టును పూజించి,దాని మీద ఉన్న ఆయుధాలను తీసుకున్నారు.వారు ఆ జమ్మి చెట్టును పూజించింది విజయదశమి రోజున.అంతేకాదు ఆ చెట్టు మీద పెట్టిన ఆయుధాలు ఆ దారిని పొయేవారికి పాములుగా కనిపించేవని చెప్తారు.అలాగే రాముడికి ఇష్టమైన చెట్టు జమ్మి చెట్టని.అలాగే వరతంతు అనే గురువు తన దగ్గర సకల విద్యలు నేర్చుకున్న కౌత్సుడనే శిష్యుడిని గురుదక్షిణగా 14కోట్ల బంగారు నాణాలు కావాలంటాడు.వాటి కోసం కౌత్సుడు రఘుమహారాజును ఆశ్రయించగా ఆయన యాగం చేసి ఇంద్రునిపై యుద్ధం ప్రకటిస్తాడు.ఇంద్రుడు భయపడి సంపదను కురిపించమని కుబేరుడిని ఆజ్ఞాపిస్తాడు.కుబేరుడు జమ్మి చెట్లున్న చోట ధన వర్షం కురిపించాడని,అందువల్ల ఈరొజు జమ్మి చెట్టును పూజించి దాని ఆకులు పంచుకోవలాని అంటారు.అసలు జమ్మి చెట్టు ప్రత్యేకత ఏమిటి?
ఈ చెట్లను నరికేయకుండా కాపాడడానికి 1730లో అమృత దేవి అనే ఒక సామన్య మహిళ నాయకత్వంలో 363 మంది ప్రాణత్యాగం చేశారు.ఇంత గొప్ప చరిత్ర కలిగిన జమ్మి చెట్టును ఈరోజున ఆరాధించడం చేత పాపం నశిస్తుందని,శత్రువులు నాశనమవుతారని అంటొంది శాస్త్రం.శత్రువలంటే మనలోని రోగాలని అర్దం.
శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశినీ|
అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనః||
దీనిలో అగ్ని తత్వానికి ప్రతీకయని,దీనిలో అగ్ని దేవుడుంటాడని పురాణాల్లొ కనిపిస్తుంది.ఇది శివస్వరూపంగా కొన్ని చోట్ల అరాధించే ఆచారం కూడా ఉంది.నిజానికి బ్రిటీష్ వారు రాకముందు ఈ దేశంలో ప్రకృతిని దైవంగా ఆరాధించేవారు.చెట్లను నరకడం,అక్రమ రవాణ చేయడం పాపం అని,చెట్లు దేవతలకు ప్రతి రూపాలని వాటిని కాపాడేవారు.బ్రిటిష్ వారు వచ్చి ఇవన్ని మూఢ నమ్మకాలని,దైవం ప్రకృతిలో ఉండదని,ఎక్కడొ ఉంటుందని,అభివృద్ధి పేరున ప్రకృతిని విచ్చలవీడిగా నాశనం చేయడం తప్పుకాదన్న భావన మనకు కలిగించారు.అందువల్ల అప్పటివరకు కాపాడబడిన మన ఆయుర్వేద మూలికలు,మొక్కలు,జీవ వైవిధ్యం అంతరించడం మొదలయ్యింది.సగటున రోజుకు 100 పైగా ఆయుర్వేద మూలికలు అంతరిస్తున్నాయని అంచనా.
మన పండగలు మనకు పర్యవరణ పరిరక్షణనే గుర్తుచేస్తున్నాయి.ప్రకృతిని కాపాడండి.ఉన్న చెట్లను నరకకండి.క్రొత్త మొక్కలు నాటండి.
వృక్షో రక్షతి రక్షితః
No comments:
Post a Comment