ఈ మొత్తం ప్రపంచంలో కేవలం 12 జ్యోతిర్లింగాలు మాత్రమే ఉన్నాయి. ఆ 12 కూడా మన పవిత్ర భారతదేశంలో ఉండడం విశేషం. సౌరాష్ట్రలో సోమనాధుడు, శ్రీశైల మల్లిఖార్జునుడు, ఉజ్జైయిని మహాకాళేశ్వరుడు ......ఇలా మొత్తం 12 ప్రదేశాల్లో పరమశివుడు జ్యోతిర్లింగ స్వరూపంలో దర్శనమిస్తున్నాడు.
ఖగోళ, అంతరిక్ష శాస్త్రాలను అనుసరించి ఎక్కడైతే పవిత్రమైన కాస్మిక్ శక్తి అత్యధికస్థాయిలో కేంద్రీకృతమవుతుందో, ఎక్కడైతే దైవ శక్తులు, దివ్య శక్తుల సంచారం అధికంగా ఉంటుందో, ఏ ప్రదేశానికి వెళ్ళడం చేత మానవుడు అతి త్వరగా పరమాత్మ జ్ఞానాన్ని పొందగలడో అటువంటి ప్రదేశాల్లో కొలువై ఉన్నాయి ఈ ద్వాదశ(12) జ్యోతిర్లింగ క్షేత్రాలు.
జ్యోతిర్లింగం అనే పేరే చెప్తోంది అవి జ్యోతి స్వరూపాలని. కొంత సాధన చేసి, వాటిని దర్శించవలసిన రీతిలో దర్శించడం చేత అవి మనలో కమ్ముకున్న దట్టమైన అజ్ఞాన పొరల్నీ కాల్చివేసి ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించగల దివ్య ఉపకరణాలు. వాటి దగ్గర ధ్యానంలో కూర్చోవడం చేతనే ఎన్నో వందల జన్మలుగా మనం కూడగట్టుకున్న పాపపు వాసనలను ఒక్క క్షణంలో తీసివేయగల దివ్య ధామాలు.
వాటిలో ఒక్కటే, హిమాలయ పర్వతాల్లో కొలువై ఉన్న కేధార్‌నాధ్ జ్యోతిర్లింగ క్షేత్రం.
ఓం నమః శివాయ

karet ga chepparu sar
ReplyDelete