~ ఉత్తరాఖండ్‌లో అలకానంద నదిపైపై హైడల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అక్కడి ప్రభుత్వం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. మన రాష్ట్రానికి చెందిన జీవీకే సంస్థ అనుబంధ కంపెనీ అలకానంద హైడ్రో పవర్ కంపెనీ, 330 మెగావాట్ల జలవిద్యుత్ కేంద్ర నిర్మాణానికి సిద్ధమయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన ధారీదేవి ఆలయం నీట మునుగుతుందని అక్కడి స్థానికులు ఆందోళన చెందారు. బీజేపీ నేతలు, సాధువులు, స్థానికులతో పాటు ప్రాజెక్టు నిర్మాణంతో పర్యావరణానికి హాని జరుగుతుందన్న భయంతో పర్యావరణవేత్తలు కూడా ఈ భారీ జల విద్యుత్ ప్రాజెక్టును గట్టిగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇక్కడ జరిగే పర్యావరణ విధంవసం విషయమై పర్యావరణ శాఖ సుప్రీం కోర్టులో అపిడవిట్ దాఖలు చేసింది.
ప్రాజెక్టు నిర్మాణానికి గట్టిగా పూనుకున్న కంపెనీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తైన ప్రదేశానికి తరలించాలని భావించింది. ప్రాజెక్టు నిర్మాణానికి అనుగుణంగా, నీటిలో మునగనంత ఎత్తున ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేసి దానిపైకి ధారిదేవి విగ్రహాన్ని తరలించుకోవచ్చంటూ తాత్కాలికంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తూ తిది నిర్ణయాన్ని వాయిదా వేసింది.
విగ్రహాన్ని తరలింపును స్థానికులు అడ్డుకుంటామని హెచ్చరించడంతో, ప్రాజెక్టు అధికారులు వ్యూహాత్మకంగా డ్యాంలో నీటిమట్టాన్ని పెంచుతూ వచ్చారు. దీంతో, అమ్మ ఆలయం మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది. విగ్రహం మునిగిపోతుందంటూ హడావుడి చేసి, గత నెల(జూన్ 16), ఆదివారం రాత్రి 7.30కు ధారీదేవి పైభాగాన్ని పెకిలించి, ఎత్తున నిర్మించిన ప్లాట్ ఫామ్ పైకి మార్చారు. విగ్రాహాన్ని ప్రవైటు సిబ్బంది సాయంతో మార్చారు.
ధారి దేవి విగ్రహాన్ని మార్చుతున్న సమయంలోనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు విపరీతంగా వచ్చాయని ధారీదేవిని పెకిలించిన సిబ్బందే చెప్తున్నారు. కొద్దిసేపటికే భారీ వర్షం మొదలయ్యింది. హిమాలయాల్లో క్లౌడ్ బ్రస్ట్ జరిగి, భారీగా వరద పోటెత్తడంతో పెద్ద నష్టం జరిగింది. ఇదంతా అమ్మ ప్రకోపించడం వల్లే సంభవించిందంటున్నారు స్థానికులు. వందలాది భవనాలు నామరూపాల్లేకుండా పోయినా, వేలాదిమంది కొట్టుకు పోయినా, అలకానంద నది మధ్యలో ఉన్న కేదర్్నాథ్ ఆలయం మాత్రం చెక్కుచెదరకుండా ఉండడం, ఆలయంలోని శివలింగం బురదలో కూరుకుపోకుండ ఉడడం (పూజకోసం తెచ్చిన బిల్వ పత్రాలు శివలింగాన్ని కప్పిఉంచడం),
అంతా అమ్మ మహిమే అంటున్నారు స్థానికులు.
1882లోనూ ఓ సారి ధారాదేవిని ఈ స్థానం నుంచి తరలించడానికి స్థానిక రాజు, సైన్యంతో కలిసి ప్రయత్నించారు. అప్పుడూ ఇదే తరహాలో భారీగా వరదలు వచ్చి ప్రాణ నష్టం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ఇప్పటి వరదలు కూడా ధారీదేవి ఆగ్రహం వల్లే వచ్చాయని అంటున్నారు.

No comments:
Post a Comment