Monday, 6 June 2016

ముందు మీ వాళ్ళని ఉద్ధరించుకోమని మీ దేవుడికి చెప్పండి

(మనకూ, అన్యమతాలకు మధ్య వ్యత్యాసం)

ఈ మధ్య ముస్లింలు, క్రైస్తవులు సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించండి, సృష్టిని పూజిస్తే నరకంలో పడతారని ఖూరాన్, బైబిల్ నుంచి కొన్ని వ్యాఖ్యాలను చూపిస్తున్నారు. వారొక విషయం అర్దం చేసుకోవాలి. అబ్రహామిక్ మతాల్లో (యూదు, క్రైస్తవం, ఇస్లాం) మతాల్లో సృష్టికర్త వేరు, సృష్టి వేరు. ఈ సృష్టికి దూరంగా ఎక్కడో ఆకాశంలో సృష్టికర్త పెద్ద కుర్చీలో కూర్చుని ఉంటాడు. ఆయనకు ఈ సృష్టితో సంబంధం లేదు. కనుక ఎవ్వరిలోనూ భగవంతుని చూడకూడదు. అందుకే తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించడం, దేశాన్ని ప్రేమించడం, జెండాను గౌరవించి, వందనం సమర్పించడం ఆ మతాల దేవుడు నిషేధించాడు. ఆయన సర్వానతర్యామి కాదు. ఆయన నిరాకారుడని చెప్తారు, మగవాడు కూడా. స్త్రీ దేవతలుండరు. ఆ మతస్థులు సృష్టిని పూజిస్తే నరకంలో పడతారు. వాళ్ళ భగవంతుడితో వాళ్ళకి ఎళ్ళవేళలా access ఉండదు. చరిత్రలో ఒక ప్రత్యేక సమయంలో వచ్చిన ఒక ప్రవక్త యొక్క మాటలను నమ్మి, మతాన్ని పాటిస్తే, సృష్టి అంతమైన సమయంలో వారి దేవుడు వాళ్ళకి నరకమో, స్వర్గమో ఇస్తాడు. ఆయన భూతకాలం (past) లో ఒకానొక 'చారిత్రిక' సందర్భంలో కలజేసుకుని పంపిన ప్రవక్త మాటల యందు విశ్వాసం ఉంచితే, భవిష్యత్తు (future) లో వీరికి తగిన ఫలితం వస్తుంది. వర్తమానం (present) తో సంబంధం లేదు. అది వారి మతం.

హిందువుల విషయంలోకి వస్తే 'సర్వం ఖల్విదం బ్రహ్మ', 'ఈశావాస్యం ఇదం సర్వం' వంటి అనేక ఉపనిషత్తుల వ్యాక్యాలు ఉన్నాయి. ఉన్నది బ్రహ్మం తప్ప వేరొకటి కాదు, చరాచరామైన ఈ జగత్తు, దానికి ఆవల, అంతా ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు అని వాటికి అర్దం. ఇలాంటి అనేక వ్యాక్యాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. కనిపించే ఈ సృష్టి కేవలం జడపదార్ధం కాదు, ఇందులోనూ ఈశ్వరుడున్నాడు. సృష్టిలోని ప్రతి అణువు యందు భగవంతుడున్నాడు. సృష్టి ఆయనే, సృష్టికి అతీతుడు ఆయనే. ఆయన సర్వాంతర్యామి. ఆయనతో మనకు ఎల్లవేళలా access ఉంది. మాములు access కాదు immediate access. ఆయన చరిత్రలో ఒక సమయంలో కలగజేసుకుని, ఒక వ్యక్తిని పంపి అతడిని నమ్మితేనే స్వర్గం అని చెప్పలేదు. ఇక్కడ ఎవరికి వారుగా తమలో, తమ చుట్టూ, సృష్టి అంతా ఈశ్వరుని దర్శించి, ఆయన యందు ఐక్యమవుతారు. మన ధర్మంలో బ్రహ్మం స్త్రీ కాదు, పురుషుడు కాదు, నంపుంసకుడు కాదు. ఆయన శుద్ధమైన చైతన్యం. కానీ అదే బ్రహ్మం సాకరమైనప్పుడు, ఆయన్ను పురుషుడిగాను, స్త్రీగాను ఆరాధించే సౌలభ్యం కూడా ఉంది. ఆయన నిరాకారుడే కానీ సాకారుడు కూడా. నిర్గుణుడు, సగుణుడు. అరూప రూపి. ఎప్పుడో భూతకాలం (past) లో వచ్చిన వ్యక్తులనే విశ్వసించి, ధర్మాన్ని పాటిస్తే, భవిష్యత్తు (Future) లో ఆయన వచ్చి ముక్తినిస్తాడని ధర్మంలో చెప్పలేదు. జీవుడు వర్తమానం (present) లో ఉంటూనే తనకు తానుగా ఈశ్వరానుగ్రహంతో, శాస్త్రాల్లో చెప్పిన సాధనతో ముక్తిని పొందవచ్చు. దేశాన్ని, ధర్మాన్ని ప్రేమించమని, తల్లిదండ్రులను, పెద్దలను, ఆచార్యులను గౌరవించమని ఉపనిషత్తులే చెప్తున్నాయి. అలా గౌరవించి, అన్నిటి యందు భగవంతుని చూసే స్థితికి చేరుకోమని మన ధార్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది మన ధర్మం.

సృష్టిని కాదు, సృష్టికర్తను పూజించండి, లేదంటే నరకానికి పోతారు అని చెప్పిన బైబిల్, ఖురాన్ వ్యాక్యాలు ఆ గ్రంధాలను విశ్వసించే క్రైస్తవులకు, మహమ్మదీయులకు వర్తిస్తాయి కానీ వేదాలను, ఉపనిషత్తులను ప్రామణికంగా భావించే హిందువులకు కాదు. అబ్రహామిక్ మతాల వారు ఆయుర్వేదం, యోగా, ధ్యానం, ముద్రలు, ఆసనాలు వేయకూడదు. ఆరోగ్యం కోసం యోగా చేస్తున్నామని చెప్పుకున్నా, యోగా యొక్క ప్రధాన ఉద్దేశ్యం వ్యక్తిలో అంతర్లీనంగా ఉన్న ఈశ్వరుని ఆరాధించడం, ఆయన్ను చేరుకునే మార్గంలో నడవడం. ఇది హైందవేతర మతాల్లో పెద్ద పాపం. ఆయా మతస్థులు ఇవి చేయకూడదు. ప్రవక్తను కాదని, ఆయన చెప్పిన మార్గంలో కాక తమకు తాముగా ఈశ్వరుని చేరే అవకాశం అవి ఇవ్వవు. వీటికి ఆ మతస్థులు దూరంగా ఉండడమే ఆయా మతాల పట్ల వారి గౌరవాన్ని ప్రకటించడం.

హిందువులకు వేద వ్యాక్యాలే ప్రామాణికం. అలా కాదు, మా దేవుడు మీ హిందువులను నరకంలో పడేస్తాడని మీరు అంటే, మా పని తర్వాత, ముందు మీ వాళ్ళని ఉద్ధరించుకోమని మీ దేవుడికి చెప్పండి, ఆయన పని ఆయన్ను చూసుకోమనండి (Let your God mind his own business), మీ దేశాల్లో జనం ఒకే మతస్థులైనా, పరస్పరం విద్వేషాలతో కొట్టుకు చచ్చిపోతున్నారు. ఉగ్రవాదం పేరుతో మారణహోమం సృష్టిస్తున్నారు దాన్ని ఆపమని చెప్పండి అని మేము సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయినా మీ దేవుడు మమ్మల్ని నరకంలో పడవేయాలని చూస్తే, మా దేవుళ్ళేమీ చూస్తూ ఊరుకోరని గుర్తించుకోండి.

మీకు ఇది కేవలం సృష్టి మాత్రమే, కానీ మా ఉపనిషత్తుల ఆధారంగా ఇది మాకు ఈశ్వరుని అభివ్యక్తీకరణ (For you, this (creation) is mere creation and not anything else, but for us as per Upanishads statements, this creation is manifestation (of divine). మీ గ్రంధాల్లో ఏమున్నా, మేము మిమంలని గౌరవిస్తాము, మీ నమ్మకాలను, ఆరాధనను తక్కువ చేయడంలేదు, మీ నుంచి తిరిగి అదే ఆశిస్తున్నాము.

ఇప్పుడు మతాల మధ్య కావల్సింది పరస్పర గౌరవం (mutual respect). మీరు మమ్మల్ని గౌరవిస్తేనే మేము మిమ్మల్ని గౌరవిస్తాం.

(రాజీవ్ మల్‌హోత్రా  రచనల ఆధారంగా) 

3 comments:

  1. హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు - శ్రీమదాంధ్రమహాభాగవతం.

    ReplyDelete
  2. చేరి మూర్ఘుల మనస్సు రంజిమ్పచేయరాదు-విష్ణుశర్మ...

    ReplyDelete
  3. సనతనధర్మావలంబనులు ఇతరమతాలపట్ల అనుపమానమైన సమదృష్టీ సహనమూ కలిగి ఉండాలి. లేకుంటే (ఉన్నా కూడాను అనుకోండి) వారిలో తీవ్రవాదం చూస్తాయి రాజకీయపక్షలు. అదేసమయంలో సదరు మైనారిటీమతాలవారికి వారికి వారి మతాలనూ మతలబులనూ‌ ప్రచారం చేసుకొనే హక్కు ఉంటుంది - వారి సమదృష్టినీ సహనాన్ని ప్రశ్నించే పాపిష్టిపని మెజారిటి మతస్థులు చేయరాదు కాక చేయరాదు. ఉదాహరణకు అన్యమతస్థుడొకడు మీ‌ కాలేజీ ఆవరనలో వారి మతం గురించి ఉనన్యసించినా, క్లాసురూముల్లోనే వారి మతగ్రంథాలను పంచి పెట్టినా మీరు అభ్యంతరం చెప్పకూడదు మరి. మీరు కాని అన్యమతావలంబకుల ప్రార్థనాస్థలాల దగ్గరలో ( దూరంగా ఐనా సరే ) బహిరంగంగా మీ మతం గురించి మాట్లాడారో మీరు మైనారిటీలకు కల రక్షణకవచాన్ని భేదించటానికి యత్నిస్తున్న మతపిచ్చి ఉగ్రవాదులైపోతారు. దొరతనాలు మిమ్మల్ని దొరకబుచ్చుకుంటాయి. మేతావులకు మీరు మేత ఐపోతారు. అదీ సంగతి.

    ReplyDelete