మొట్టమొదట పిల్లలకీ శ్లోకం చెబుతాం. ఈ శ్లోకం అంటున్నప్పుడు వినాయకుడే పిల్లలకు గుర్తుకు వస్తాడు.
ఈ శ్లోకంలోని విష్ణుపదం, ఇతనితో నున్న సంబంధాన్ని వెల్లడిస్తుందిది. వినాయకునకు మామ కదా విష్ణువు!
ఇంతకముందే 'శ్రీకాంతో మాతులోయస్య' అని చదివాం. ఇది వింటూ ఉంటే మలయాళంలోని 'మారువాక్కతాయం' గుర్తుకు వస్తుంది. ఆ రాష్ట్రంలో మేనమామ సంపద మేనల్లునికి చెందుతుంది. ఇది వారసత్వం (ఔరసత్వం).
ఇక తల్లిదండ్రుల గొప్పదనం: మామను ముందు పేర్కొని మామ చెల్లెలైన అనగా తల్లిని ఇట్లా పేర్కొన్నాడు:
జననీ సర్వమంగలా - సర్వమంగలయైన పరాశక్తియే ఇతని తల్లి. ఆమె గుణాలు, క్రియలు శుభకరములే కదా! అమ్మవారిని నుతిన్చేటప్పుడీ శ్లోకాన్ని చదువుతారు.
సర్వమంగల మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి, సమోస్తుతే
ఎన్నో పేర్లు విష్ణువునకున్నా శ్రీకాంత పదం, సర్వ సంపదలు కలవాడని సూచిస్తుంది. అట్లాగే అమ్మవారికి ఎన్నో పేర్లున్నా సర్వమంగల పదం అట్టిదే. ఇక తండ్రి - జనకః శంకరో దేవః ఆనగా తండ్రి శంకర భగవానుడు.
శివునకెన్నో పదాలున్నా ఇక్కడ శంకర పదమే వాడబడింది. అంటే మంచి పనులు చేసేవాడని, లేదా ఆనందాన్నిచ్చేవాడని. ఇట్లా విఘ్నేశ్వరుడు శ్రీ మంగలం, సుఖం పదాలతో కూడి మామ, తల్లి, తండ్రులతో కూడియున్నాడు.
శ్రీకాంతో వందే కుంజరాననం - తంకుంజరాననం వందే అట్టి గజముఖునికి నమస్కరిస్తున్నాను.
No comments:
Post a Comment