యోగశాస్త్రం ఉంది కదా. అది నరాలపై ప్రభావాన్ని చూపుతుంది. నరాలను శుద్ధి చేసే ప్రక్రియ నందిస్తుంది. ప్రాణాయామం ఎట్లా చేయాలి, ఎట్లా మన శరీరాన్ని వంచి ఆసనాలెట్లా వేయాలో చెప్పి నాడీ శుద్ధిని నేర్పుతుంది. ఆ శ్రమ లేకుండా అప్రయత్నంగా స్వామికి నమస్కరించేటపుడు చేతులు ఫాలభాగాన్ని తాకుట, చేతులు చెవులను స్పృశించుట, గుంజీళ్ళు తీయుట మొదలగు వాటివల్ల నరాలలో ఒక చైతన్యం కలిగి మనలో అనుకూల భావాలేర్పడతాయి. మనకు శ్రద్ధా విశ్వాసాలుంటే మనమీ మార్పులను గమనించవచ్చు కూడా.
అవ్వైయార్ పిల్లలకై పాటలు వ్రాసినా కొన్ని పాటలు యోగ రహస్యాలతో ఉంటాయి. పెద్దలే అర్థం చేసుకోలేని రీతిలో గూఢార్థం ఉంటాయి. తమిళంలో వాటిని వినాయకర్ అవగల్ అంటారు. సూక్ష్మంగా అవగల్ స్తోత్రమంటారు.
ఆమె వ్రాసిన స్తోత్రం చదివితే ఆమె, వినాయకుడు ఇద్దరూ గుర్తుకు వస్తారు. ఈ స్తోత్రాన్ని గుడికి వెళ్ళి చదవండి.
అందరూ స్వామికి చెందినవారే. అందరికీ ఆయన చెందినవాడే. శాస్త్రాలు చదువని సామాన్యునకూ అందుబాటులో ఉంటాడు. మిగతా ఆలయాలలో ప్రసాదాన్ని పంచి పెట్టేటప్పుడు ముందుగా పెద్దలకు ఇస్తూ ఉంటారు. కానీ స్వామి ముందు కొట్టిన కొబ్బరి ముక్కలు పిల్లలకూ, బీదలకే. అర్ధమయినా కాకపోయినా ఆమె స్తోత్రాలను చదవండి.
(అని తమిళనాడు భక్తులకు హితబోధ చేసారు స్వామి. తెలుగులోని పాటలు పద్యాల్ని మనం చదవవచ్చు).
No comments:
Post a Comment