Saturday, 31 May 2014

హిందూ ధర్మం - 72 (రాజర్షి విశ్వామిత్రుడు)

దైవమే అన్నిటికంటే గొప్పది. దైవశక్తి ముందు మానవశక్తి ఎందుకూ పనికిరాదు. దైవం వల్ల సర్వం సాధ్యమని నేను నమ్ముతాను. కాదాంటారా? అటువంటి దైవం యొక్క అనుగ్రహం మీ మీద ఆపారంగా ఉంది. మీరే నా కోరిక తీర్చడానికి అర్హులు. నాకు మీరు తప్ప వేరే గతిలేదు, మీరే నాకు శరణు. మానవరూపంలో ఉన్న దైవం మీరు. నా స్థితిని మార్చగలరు అంటూ త్రిశంకు విశ్వామిత్రునితో పలుకుతాడు. దానికి బదులుగా విశ్వామిత్రుడు 'ఓ త్రిశంకు! నువ్వు పరమధార్మికమైన రాజువని నాకు తెలుసు. నువ్వేం బాధపడకు, నీ కోరిక నేను తీరుస్తాను. ఎన్నో పుణ్యకర్మలు చేసిన ఋషులందరిని యాగానికి ఆహ్వానిస్తాను. వారు యాగనిర్వహణలో నీకు సహాయపడతారు. నువ్వు నీ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళవచ్చు. నీ పూర్వరూపాన్ని కూడా తిరిగి పొందుతావు. అందరికి ఆశ్రయమిచ్చే విశ్వామిత్రుని వద్ద నువ్వు ఆశ్రయం పొందావు కనుక స్వర్గానికి వెళ్ళడం, చేతితో సులభంగా చేసుకునే పనిగా మారిపోయింది' అంటూ మధురమైన మాటలను పలికాడు. (వశిష్టుడు కుదరదు అన్నాడు కనుక తాను చేసి తీరాలి, అలాగైన వశిష్టమహర్షి మీద ఉన్న కోపం తీర్చుకోవాలి, ఆయనకంటె గొప్ప అని నిరూపించుకోవాలి అనేది విశ్వామిత్ర మహర్షి కోరిక.)

తన కొడుకలను పిలిచి యాగానికి ఏర్పాట్లు చూడమన్నారు. తన శిష్యులందరిని పిలిచి 'వేదం చదువుకున్న ఋషులను, వారి శిష్యులను, వారి మిత్రులను, ఋత్వుకులను, వశిష్టమహర్షి కుమారులను ఆహ్వానించండి' అంటూ ఆదేశాలు జారీ చేశారు. మీరు ఆహ్వానిస్తున్నప్పుడు ఎవరైనా నా మాటలకు విరుద్దంగా మాట్లాడినా, వాళ్ళు పలికిన ప్రతి పలుకు నాకు చెప్పండి. ఇది విన్న శిష్యులు అన్ని దిశలకు వెళ్ళి, ఆయన ఆదేశాల మేరకు అందరిని పిలిచి, ఆశ్రమానికి చేరుకుని, వేదపండితులు ఎవరెవరు ఏం అన్నారో వివరిస్తున్నారు. 'మీ ఆదేశం విన్న తర్వాత వశిష్టపుత్రుడైన మహోదయుడు తప్ప బ్రాహ్మణులందరు యాగ నిమిత్తం బయలదేరారు. వారు కోపంతో చాలా మాట్లాడారు, వారు చెప్పినవన్ని వినండి. 'క్షత్రియుడు యాగం చేయిస్తున్నాడు, చండాలుడు యగం చేస్తున్నాడు, ఇద్దరూ ఏనాడు గురువు దగ్గర వేదం నేర్చుకోలేదు. యాగం చేయించడం వేదం నేర్చుకున్న పురోహితుని కర్తవ్యం. ఈ యాగం వేదవిధికి విరుద్ధంగా ఉన్నందున దేవతలు ఏ విధంగా హవిస్సు తీసుకుంటారు? ఒకవేళ విశ్వామిత్రునికి భయపడి అందరూ హాజరైనా, ఆ యాగం వేదవిరుద్ధం కనుక, అక్కడ ఇచ్చిన అన్నప్రసాదం తీసుకున్నవారు స్వర్గప్రాప్తికి దూరమవుతారు' అంటూ క్రోధం నిండిన కన్నులతో వశిష్టపుత్రులందరూ ఈ మాటలు పలికారని తెలియజేసారు. దీంతో విశ్వామిత్రునికి ఎక్కడలేని కోపం వచ్చింది.  

To be continued ............

Friday, 30 May 2014

హిందూ ధర్మం - 71 (రాజర్షి విశ్వామిత్రుడు)

నేను దైవసమానులైన వశిష్టమహర్షి చేత, అంతే స్థాయిలో ఉన్న ఆయన కూమరులైన మీ చేత తిరస్కరించబడ్డాను. ఈ పరిస్థితుల్లో నేను వేరొకరిని ఆశ్రయిస్తాను. మీకు స్వస్తి కలుగుగాకా అన్నాడు త్రిశంకు. ఇది విన్న వశిష్టమహర్షి పుత్రులకు జరగబోయే విపత్కర పరిస్థితి గర్హించి మరింత కోపంతో 'నీవు చండాలునిగా మారిపోతావు' అంటూ శపించి, వారి ఆశ్రమాల్లోకి వెళ్ళిపోయారు. (ఇక్కడ చండాలుడంటే అంటరానివారని, తక్కువజాతి వాడని అనుకోకూడదు. అంటరానితనం వేదంలో ఎక్కడా చెప్పబడలేదు, అది అంగీకరయోగ్యం కాదు. సనాతన ధర్మంలో కులం కంటే గుణం ప్రధానం. నువ్వు ఏ కులంలో పుట్టావన్నది కాదు, ఎంత మంచి గుణవంతుడివన్నదే నిన్ను భగవంతుని వద్దకు చేర్చుతుందని మన ధర్మం చెప్తోంది.) మరుసటి రోజుకు రాజు చండాలునిగా మారిపొయాడు. నల్లని వస్త్రాలి ధరించి, రేగిపోయిన జుత్తు, నల్లని శరీర ఛాయ వచ్చేశాయి. మెడలో ఉండే పూలహారాలు పుర్రెలదండలుగా మారిపోయాయి. ఒంటి నిండా బూడిద పూసుకుని, ఇనుప ఆభరణాలు వేసుకున్నాడు రాజు. ఆ రూపంలో అతన్ని చూసిన మంత్రులు, రాజపరివారం, ప్రజలు భయంతో దూరంగా పరుగులు తీశారు. ఒక రాత్రంతా బాధపడిన రాజు, మరుసటి రోజు తపస్వి అయిన విశ్వామిత్రుని వద్దకు వెళ్ళాడు.

రాజును చూసిన విశ్వామిత్రునికి దయ కలిగింది. తన స్థితి వలన సింహాసనం, వైదిక క్రతువులు, స్వర్గాదిభోగాలకు త్రిశంకు దూరమయ్యాడు. నీకు శుభములు చేకూరుగాకా అంటూ ఓ మహారాజా! త్రిశంకు! అయోధా పరిపాలాక! నీ రాకకు కారణమేమిటి? నీవు శాపగ్రస్థుడవు కావటానికి కారణమేమి? అని అడిగారు విశ్వమిత్రుడు. దానికి బదులుగా చేతులు జోడించి త్రిశంకు 'నేను నా గురువు, గురుపుత్రులు చేత తిరస్కరించబడ్డాను. నా కోరిక తీరకపోగా, ఈ దుస్థితి ఏర్పడింది. ఓ విశ్వామిత్ర మహర్షి! సశరీరంతో స్వర్గానికి వెళ్ళాలన్నది నా కోరిక. నేను ఎన్నో వందల యాగాలు చేసినా ఈ ఫలితం నాకు దక్కలేదు. నేను అసత్యం చెప్తున్నానని అనుమానించకండి ఎందుకంటే నేను ఇంతవరకు ఎన్నడు అబద్దం చెప్పలేదు. ఇప్పుడు చెప్పడం లేదు, ఇక ముందు కూడా చెప్పను. ఎందుకంటే ఎన్ని యజ్ఞాలు చేసినా అబద్దం చెప్పినవాడిని, యజ్ఞాలు రక్షించలేవు. అతడు నరకానికి వెళతాడు. నేను నా క్షత్రియ ధర్మం మీద ప్రమాణం చేస్తున్నాను. అనేక విధములైన యజ్ఞముల చేత దేవతలను తృప్తి పరిచాను, ధార్మికంగా ప్రజలను పరిపాలించాను, నా ప్రవర్తన చేత మహాత్ములు కూడా సంతుష్టులయ్యారు. అన్నిటికి ఒకటే ఫలం ఆశించాను. ఎన్నో యజ్ఞాలు చేసినా, నా గురువులు నా కోరికను మన్నించలేదు.

To be continued ..............

Thursday, 29 May 2014

హిందూ ధర్మం - 70 (రాజర్షి విశ్వామిత్రుడు)

ఇది విన్న విశ్వామిత్రుడు సిగ్గుతో తలగించుకుని బాధపడ్డాడు. ఇంత మహత్తరమైన తపస్సు చేస్తే, నన్ను ఈ దేవతలు, ఋషిగణం రాజర్షిగానే గుర్తిస్తున్నారు. కనుక నేను చేసింది వృధా అని అన్నాడు. మళ్ళీ తపస్సుకు కూర్చున్నాడు. ఇదిలా ఉండగా, ఇక్ష్వాకు వంశస్థుడౌ, సత్యవాది, జితేంద్రియుడైన త్రిశంకుడనే రాజు ఉండేవాడు. గొప్ప యాగం చేసి సశరీరంతో (తనకున్న మానవఏహంతో) స్వర్గలోకానికి వెళ్ళాలనే కోరిక ఒకటి అతనికి కలిగింది. వెంటనే తమ కులగురువైన వశిష్టమహర్షి వద్దకు వెళ్ళి విషయం చెప్పగా, అది అసాధ్యం, దైవ సిద్ధాంతానికి విరుద్ధం అన్నారు మహర్షి. (మానవుడు తన శరీరంతో ఇతర లోకాలకు వెళ్ళలేడు. మరణించిన తర్వాత అతను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి, దేహంలో ఉన్న ఆత్మ, సూక్ష్మ, కారణ శరీరాలు స్వర్గనరకాలకు వెళతాయి/ఇతర జన్మలు పొందుతాయి. దేవలోకంలో ఉండే ధర్మాలు వేరుగా ఉంటాయి. కనుక అక్కడికి మానవశరీరంతో వెళ్ళడం అసాధ్యం). మహర్షి వద్దని చెప్పినా, త్రిశంకు వినలేదు, తన కోరిక తీర్చేవారు ఉండకపోరని దక్షిణదిశగా వెళ్ళాడు. ఆఖరికి 100 మంది వశిష్టమహర్షి పుత్రులు పరమతేజస్సుతో తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి చేరుకుని, వారి వారి వయసులను అనుసరించి ఒక్కక్కరికి అభివాదం చేసుకుంటూ వచ్చి, సిగ్గుతో తలదించుకుని తన గురుపుత్రులైన వశిష్ట కుమారులతో ఇ విధంగా అన్నాడు. 'నేను మీ దగ్గర శరణు పొందడానికి వచ్చాను. మీ శరణుజొచ్చినవారికి రక్షణ ఇస్తారని, చక్కని ఆశ్రయం కలిపిస్తారని విన్నాను, నన్ను మీ తండ్రి వశిష్ట మహర్షి తిరస్కరించారు. నేను ఒక విచిత్రమైన యాగం చేయాలని పూనుకున్నాను. మీరు వశిష్ట పుత్రులు కనుక దానికి మీరే సరైన మార్గం చూపించగలరని నా నమ్మకం. నేను మానవదేహంతో స్వర్గలోకానికి వెళ్ళె అర్హత పొందడానికి తగిన యాగం మీరే నా చేత నిర్వహింపజేయాలి. నా గుర్వైన వశిష్టమహర్షి తిరస్కరించారు కనుక వారి పుత్రులైన మీరు తప్ప నాకు వేరే దిక్కులేదు. ఇక్ష్వాకు వంశస్థులకు పురోహితులే పరమాగతి. కనుక వశిష్టుని వారసులైన మీరు నాకు వారిలాగే దైవ సమానులు.

ఇది విన్న వందమంది కోపంతో 'ఓ దుర్భుద్ది! సత్యవంతుడైన మీ గురువు నిన్ను ఈ విషయంలో తిరస్కరించారు. చెట్టే నిన్ను తిరస్కరించినప్పుడు, కొమ్మలను చేరి ఫలాలు ఆశిస్తావా? ఇక్ష్వాకు కులగురువు యొక్క మాటయే గొప్ప ఆదేశం, మహానుభావుడైన ఆ బ్రహ్మవేత్త మాటలను దిక్కరించడం అసాధ్యం. నువ్వు చెప్పిన వైదికక్రతువు అసాధ్యమైన్ మహాత్ముడైన వశిష్టుడే చెప్పాడు, ఇక ఆ క్రతువు చేయడానికి మాకెలా సాధ్యపడుతుంది. ఓ నరశ్రేష్టా! చిన్నపిల్లలవలె ప్రవర్తించకు. నీ రాజ్యానికి వెళ్ళు. మూడులోకాల్లో ఏ రాజు చేతనైనా ఎటువంటి యాగమైన చేయించగల సమర్ధుడు వశిష్టుడే. ఆయనకు కాదన్న పనిని మీ ఆచరించి, ఆయనకు అవమానం చేయలేము' అన్నారు.

To be continued ..............

Wednesday, 28 May 2014

హిందూ ధర్మం - 69 (రాజర్షి విశ్వామిత్రుడు)

వశిష్టునితో దేవతలు, మునులు పలికిన మాటలు విన్న విశ్వామిత్రుడు గట్టిగా ఊపిరి వదులుతూ తనలో తాను ఈ విధంగా అనుకున్నారు.

దిక్ బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం
ఏకేన బ్రహ్మదండెన సర్వ అస్త్రాణి హంతిమే

బ్రహ్మతేజస్సు ముందు క్షత్రియ బలం ఎందుకు పనిరాదు. ఒక బ్రహ్మదండం చేత నా అస్త్రాలన్నిటిని ఎదురుకున్నాడు. ఇదంతా చూసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. బ్రహ్మతేజస్సును ఎదురుకోవడానికి నేను కూడా ఇంద్రియాలను, మనసును నిగ్రహించి, బ్రహ్మర్షిని అవుతాను. అప్పుడు వశిష్టునితో పోరాడతాను అనుకున్నారు.

(ఎంతో గొప్ప క్షత్రియుడు అయినా, కోపంతో మతి తప్పి బలహీనులైన మునులపై, ఆశ్రమంపై, ఆయుధం పట్టని వశిష్టునిపై పోరాటం చేసి, తన ధర్మాన్ని దిక్కరించాడు. సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమైతే, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మోక్షం అడగకుండా, వశిష్టమహర్షి మీద కోపంతో అస్త్రశాస్త్రం అడిగాడు. పొందిన వరాన్ని సద్వినియోగం చేసుకుని, రాజుగా అస్త్రాలను సరైన పద్ధతిలో ఉపయోగించి ప్రజలను రక్షించాల్సి ఉండగా, అవి వశిష్టమహర్షిపై ప్రయోగించారు. అన్ని అస్త్రాలను వశిష్టమహర్షి నిర్వీర్యం చేసిన తర్వాతైనా బుద్ధి తెచ్చుకుని క్షమాపణ వేడుకున్నారా అంటే అదీ లేదు. ఇంకా శక్తివంతుడినై మహర్షిని ఓడించాలనే పంతానికి పోతున్నాడు. తను కోరింది తనకు దక్కలేదన్న కోపం ఎటువంటి పరిస్థితికి దారి తీసింది. కానీ ఒక మంచి పరిణామం చోటు చేసుకుంది. వశిష్టమహర్షి వంటి మహాపురుషుని దర్శనం కారణంగా నేను కూడా బ్రహ్మర్షి స్థానాన్ని పొందాలనే తపన విశ్వామిత్రునిలో కలిగింది. ఇది మహాపురుషుల యొక్క శక్తి. అందుకే ఎప్పుడైన ఒక మహాపురుషుని దర్శనం చేసుకునే అవకాశం వస్తే, తప్పక వెళ్ళాలి. వారిని దర్శించడం చేతనే, జీవితంలో మంచి మార్పు వస్తుంది.)

జరిగిన సంఘటన బాధపడుతూ విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేయడానికి తన రాణితో కలిసి దక్షిణదిక్కుకు వెళ్ళారు. కందమూలాలు, పండ్లు మాత్రమే తీసుకుంటూ ఘోరమైన తపస్సు చేశారు. ఈ సమయంలో విశ్వామిత్రుడికి హవిస్పంద, మధుస్పంద, ధృఢనేత్ర, మహారథులనే సత్యధర్మ పరాయణులైన నలుగురు పుత్రులు జన్మించారు. సరిగ్గా వేయి సంవస్తరాలు పూర్తయ్యేసరికి లోకాలకు పితామహుడైన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై 'ఓ విశ్వామిత్రా! నీవు తపస్సు చేత రాజర్షి లోకాన్ని పొందావు. అందువల్ల మేము నిన్ను రాజర్షిగా గుర్తిస్తున్నాము' అన్నారు.

To be continued ................

Tuesday, 27 May 2014

హిందూ ధర్మం - 68 (రాజర్షి విశ్వామిత్రుడు)

నీరు అగ్నిని చల్లార్చినట్టు, వశిష్టమహర్షి బ్రహ్మదండం విశ్వామిత్రుడు ప్రయోగించిన అన్ని అస్త్రాలను అడ్డుకుని తనలో కలిపేసుకుంది. అప్పటికే ఆగ్రహం మీద ఉన్న విశ్వామిత్రుడి, ఇంకా రెచ్చిపోయాడి, కోపం మరింత పెరిగి ఇతర ఆయుధాలను సంధించాడు. వరుణ, రుద్ర, ఇంద్ర, పాశుపత, చిక్షేప, సన్నని గడ్డి మధ్యలోనుంచి కూడా దూసుకెళ్ళి శత్రువలను మట్టుబెటగల ఐషీక అస్త్రాలను, మానవ, మోహన, జృంభణం, మదం, సంతాప, విలాప అనే పేరుగల అస్త్రాలను, శోషణ, దారణ అస్త్రాలను, అతిశక్తివంతమైన వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇవే కాక బ్రహ్మపాశం, కాలపాశం, వరుణపాశం, శివుడి ఆయుధమైన పినాకం, దైత్యం, శుష్క, ఆశని, ఆర్ద్ర, పిశాచ, దండాస్త్ర, క్రౌంచం మొదలైన మహామహా అస్త్రాలను, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణుచక్రం మొదలైన చక్రాలను, వాయవ్యం, మథనం, హయశీర్ష మొదలైన భయనంకరమైన ఇతర అస్త్రాలను వశిష్టమహర్షిపైన ప్రయోగించాడు. శివవిష్ణువు శక్తులు కలిసిన ఇంకొక అస్త్రాన్ని, కంకాలం, ముసలం, వైధ్యధారం, మహాస్త్రం, కాలాస్త్రం, దారుణమనే అస్త్రాలను, త్రిశూలం, అఘోరాస్త్రం, కపాలం, కంకణం మొదలైన అస్త్రాలతో పాటు తన దగ్గరున్న అన్ని అస్త్రాలను అద్భుతంగా ప్రయోగించాడు.

తనమీదకు వస్తున్న అన్ని అస్త్రాలను వశిష్టమహర్షి బ్రహ్మదండం శాంతపరిచి, వాటిని గ్రహించి తనలో కలిపేసుకుంది. దీంతో విశ్వామిత్రుని కోపం ఇంకా రెట్టింపైంది. తన దగ్గరున్న బ్రహ్మాస్త్రాన్నితీసి ఎక్కుపెట్టాడు. ఇది చూడగానే అగ్ని దేవునితో సహా దేవతలు,  దేవర్షులు, గంధర్వులు,జంతువులు హడలిపోయారు. మూడులోకాలు బ్రహ్మాస్త్రం యొక్క వేడి చేత కాలిపోతున్నాయి. కానీ ఈ అస్త్రాన్ని కూడా బ్రహ్మదండం గ్రహించి, తనలో కలిపేసుకుంది. అప్పుడు వశిష్టమహర్షి రోమకూపాల నుంచి దట్టమైన వెలుగులు విరజిమ్ముతూ పొగలు వ్యాపించాయి. ఆయన చేతిలో పట్టుకున్న బ్రహ్మదండం మెరిసిపోతూ, ప్రయళకాలంలో కనిపించే కాలగ్నిని తలపిస్తోంది, అపర యమదండంలా అనిపిస్తోంది.

అక్కడున్న మునిగణం వశిష్టమహర్షితో 'ఓ బ్రహ్మన్! మీ బలం అమోఘమైనది. తేజోమూర్తులు మీరు. తేజస్సును కలిగి ఉన్నారు. విశ్వామిత్రుడు గొప్ప తపస్వి అయినా, మీ బలం చేత నిరోధింపబడ్డాడు. కానీ మీ శక్తి చేత చేత అతనితో పాటూ మూడు లోకాలు పరితాపం చెందుతున్నాయి. మూడులోకాలుల్లో శాంతి నెలకొనెలా అనుగ్రహించండి' అని వేడుకున్నారు.

To be continued ........

Monday, 26 May 2014

హిందూ ధర్మం - 67 (రాజర్షి విశ్వామిత్రుడు)

వెళ్తూ వెళ్తూనే అస్త్రాలు సంధించడం మొదలుపెట్టాడు. వశిష్ట ఆశ్రమం మొత్తం తలగబడిపోయింది. అక్కడున్న ఋషులందరూ తలొక దిక్కుకు పరిగెత్తారు. వశిష్టుని శిష్యులు, చివరకు జంతువులు, పక్షులు కూడా భయంతో పరుగులు తీశాయి. ఆ ఆశ్రమం ఎవరు లేక నిశబ్దంగా మారి, శ్మశానాన్ని తలపిస్తోంది. అప్పటికే వశిష్టుడు భయపడకండి, భయపడకండి, నేను ఉన్నాను, విశ్వామిత్రుడిని నశింపజేస్తానని చెప్తున్నా ఎవరు వినలేదు.

అప్పుడు మహా తప్పశాలి, తేజోవంతుడు, బ్రహ్మమానాసపుత్రుడైన వశిష్టుడు విశ్వామిత్రునితో 'ఓం మూఢుడా! ఎంతో కాలం నుంచి పోషింపబడిన ఆశ్రమాన్ని నాశనం చేసి, దురాచారివి అయ్యావు, ఇక నీకు భవిష్యత్తు లేకుండా చేస్తాను' అన్నారు. ఎంతో కాలం నుంచి ధర్మప్రభోదం చేస్తూ జాగ్రత్తగా ఋషులను, జంతువులను, పక్షులను, చెట్లను పోషించుకుంటూ వచ్చాను. అవి ఎప్పుడూ ధర్మాన్ని పాటిస్తూ వచ్చాయి. ఎక్కడికైనా ఎగరగల స్వేచ్ఛ ఉన్నపక్షులు నీకు ఏం హాని చేశాయి? ప్రపంచాన్ని ఇప్పుడే చూసిన లేగదూడలు నీకెం అపకారం చేశాయి. నీకు అడిగింది ఇచ్చే మొక్కల మీద నీ ప్రతాపం ఎందుకు? సర్వజనుల శాంతి కోసం నిత్యం తపించే ముని శ్రేష్టులు నీకు ఏం ద్రోహం చేశారు. నీకు మదమెక్కి ఈ పని చేశావు. నీ గొడవ నాతో అయినప్పుడు నన్నే ధైర్యంగా ఎదురుకో. అంతేకానీ ఇతరులపై నీ ప్రతాపమా? అంటూ వశిష్టమహర్షి వేగంగా తన దండాన్నితీసారు. అది ప్రళయకాలపు అగ్నిలా ఉంది, మరొక యమదండమేమో అనుపిస్తోంది.

వశిష్టుని మాటలు విన్న విశ్వామిత్రుడు ఇదిగో దీన్ని ఎదురుకో అంటూ అస్త్రాలను సంధించడం మొదలుపెట్టాడు. వశిష్టమహర్షి అపరకాలదండాన్ని, తన బ్రహ్మదండాన్ని పైకెత్తి పట్టుకుని, నీతిలేని క్షత్రియుడా! నేను ఇక్కడే నిల్చుంటాను. నువ్వు ఎన్ని అస్త్రాలైనా ప్రయోగించు, అన్నిటికి నాశనం చేసి, నీ దర్పాన్ని నశింపజేస్తాను. తపశ్శక్తి చేత పొందిన దైవబలం, బ్రహ్మబలం ముందు క్షత్రియబలమెంత? చూడు నా తపోబలం ప్రతాపం చూపిస్తాను అన్నారు.

To be Continued ...............

Sunday, 25 May 2014

హిందూ ధర్మం - 66 (రాజర్షి విశ్వామిత్రుడు)

ఎందరో తపస్వులు, మహాతపస్వులకు, కిన్నెరులకు, ఉర్గలకు నిలయమైన హిమాలయపర్వతాలకు చేరుకుని పరమశివును గురించి తపస్సు ప్రారంభించాడు. చాలా కాలానికి వృషభ ధ్వజం కలిగి, త్వరగా వరాలు ఇచ్చే శివుడు ప్రత్యక్షమయ్యాడు.

ఓ రాజా! నీవు దేన్ని కోరి ఈ తపస్సు చేశావో నాకు చెప్పు. నేను నీకు ఆ వరం ఇస్తాను అన్నాడు శివుడు. ఓ మహాదేవా! అనఘా! అంగ, ఉపాంగ, ఉపనిషద్ రహస్యాలతో కూడిన ధనుర్వేదాన్ని నాకు ప్రసాదించు. దేవ దానవ గంధర్వ యక్ష ఋషి మొదలైన వారందరి వద్ద ఏ ఏ ఆయుధాలు ఉన్నాయో, వాటి గురించి మొత్తం నాకు తెలియాలి. వాటి మీద నాకు ప్రతిభ ఉండాలి. ఇది నువ్వు మాత్రమే ప్రసాదించగలవు అన్నాడు విశ్వామిత్రుడు పరమశివునితో. 'ఏవం అస్తు - అలాగే జరుగుతుంది' అని శివుడు అదృశ్యమయ్యాడు.

మహాబలవంతుడైన విశ్వామిత్రుడు ఈ వరం పొందడంతో మరింత బలవంతుడయ్యాడు, అప్పటికి వరకు అణిగి ఉన్న దర్పం ఒక్కసారి సముద్రంలా పోటెత్తింది. పౌర్ణమి రోజున సముద్రం ఏలా ఉంటుందో విశ్వామిత్రుడు అలా ఉన్నాడు. వీరత్వం పెరిగి ఇక ఈ రోజుతో వశిష్టుడు మరణించినట్టే అని వశిష్ట ఆశ్రమానికి బయలుదేరాడు.

(మనం గమనిస్తే, మొదట వశిష్టమహర్షిని భూమిపై తిరిగే దైవంగా భావించి, ఆయన దర్శనమే మహాభాగ్యంగా భావించాడు విశ్వామిత్రుడు. కానీ కోరిక, దాని వెంట వచ్చిన కోపం, ఎటువంటు పరిస్థితికి దారి తీసిందో చూడండి. యజ్ఞానికి మూలమైన కామధేనువు తనకు దక్కాలని కోరిక పుట్టింది. తనది కానీ వస్తువును తాను కోరడం తప్పు, దొంగతనంతో సమానమని గుర్తుకురాకుండా పోయింది. మనసు కోరగానే, నిగ్రహించుకోవడం మానేసి, శబలను అడిగాడు. బ్రహ్మవేత్త, తపస్ సంపన్నుడైన వశిష్టుడు అంగీకరినలేదని ఊరుకోకుండా, వశిష్టుడికి ఇతర వస్తువులు బదులు ఇస్తానని ఆశ చూపడడానికి ప్రయత్నించాడు. ఆయనతో వాదించాడు. ఏ వశిష్టుడైనైతే గౌరవైంచాలో, ఆయన మాటను దిక్కరించాడు. వశిష్టుడు అంగీకరిచలేదని కోపం వచ్చింది. కోపంలో ఏం చేస్తున్నాడో అర్దంకాక, మతితప్పి కల్పవృక్షం లాంటి పవిత్రమైన గోవును తాళ్ళతో కట్టి లాక్కువెళ్ళే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో యుద్ధం చేసి, మొత్తం పరివారాన్ని పోగొట్టుకున్నాడు కానీ ఇంకా కోరిక చావలేదు, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న కోపం తగ్గలేదు. ఇప్పుడు బలం వచ్చింది కనుక ఏకంగా వశిష్టుడు ఇక మరణించినట్టేనని పలికాడు. కోపము, కోరిక మనిషిని ఎంత నీచ స్థితికి దిగజారుస్తాయో చూడండి)

To be continued ..............

Saturday, 24 May 2014

హిందూ ధర్మం - 65 (రాజర్షి విశ్వామిత్రుడు)

ఇది విన్న వశిష్టుడు 'ఎదురుగా ఉన్న ప్రత్యర్ధిని ఓడించగల శక్తిని సృష్టించు' అన్నారు శబలతో. ఈ మాట వినగానే శబల తన హుం కారం నుంచి వందలమంది పహ్లవులను తయారు చేసింది. వారందరూ విశ్వామిత్రుడు చూస్తుండగానే అతని మొత్తం సైన్యాన్ని నశింపజేశారు. ఇది చూసిన విశ్వామిత్రుడి కోపం రెట్టింపై అతని దగ్గరున్న అస్త్రాలతో పహ్లవులను చంపడం మొదలుపెట్టాడు. ఇది చూసిన శబల మళ్ళీ తన హుంకారాలతో వందల మంది యవనులను, శాకులను సృష్టించింది.

బంగారు వర్ణంతో వెలిగిపోతున్న యవనులు, శాకులతో భూమి నిండిపోయింది. వారిలో వీరత్వం ఉట్టిపడుతోంది, శత్రువులను జయించగలిగే ధైర్యం కనిపిస్తోంది. కత్తులు మొదలైన ఆయుధలు ధరించి, బంగారు వస్త్రాలు కట్టుకున్న ఈ వీరులు అగ్నివలె వెలిగిపోతూ, విశ్వామిత్రుని సైన్యాన్ని బూడిద చేశారు. ఇది చూసిన విశ్వామిత్రుడు అస్త్రాలను సంధించారు, వాటి చేత యవనులు, కాంభోజులు, బార్బరులు నశించారు.

ఇది చుసిన వశిష్టమహర్షి శబలతో 'ఓ కామధేనువా! నీ యోగశక్తితో మరింత బలవంతులను సృష్టించు' అన్నారు. శబల హుంకారం నుంచి ఉదయిస్తున్న సూర్యులవలె వెలిగిపోతున్న కాంభోజులు, పొదుగు నుంచి పహ్లవలు, ఇతర భాగాల నుంచి యవనులు, శకులు, వెంట్రుకల నుంచి మ్లేఛ్చులు, హరితులు, కిరాతకులు అనేబడే సైన్యం పుట్టింది. పుట్టిన క్షణమే విశ్వామిత్రుని రధాలను, ఏనుగులను, గుర్రాలను, ఇతర బలాలను మొత్తాన్ని చంపేశారు. ఇది చూసిన విశ్వామిత్రుని కుమారులు వందమంది ఆయుధాలు ధరించి వశిష్టమహర్షి మీద దాడికి వెళ్ళారు. కానీ వశిష్టమహర్షి ఊపిరి విడిచినప్పుడు వచ్చిన హుం అనే శబ్దంతో మిగిలిన సైన్యం, విశ్వామిత్రుని కుమారులు బూడిదైపోయారు. అందరూ నశించిపోవడం చూసి విశ్వామిత్రుడు తీవ్రమైన బాధకు లోనయ్యారు. కెరటాలు లేని సముద్రంలా, కోరులు కోల్పోయిన పాములా, గ్రహణం పట్టిన సూర్యునిలా, కొడుకులు, సైన్యం లేని విశ్వామిత్రుడు రెక్కల్లేని పక్షిలా మిగిలి తీవ్రమైన బాధకు లోనయ్యాడు. అన్ని నశించడంతో బాధ చెందిన విశ్వమిత్రుడు నిర్వేదానికి గురై, తనకు మిగిలిన ఒక్క కూమరుడితో 'నీవు ఇక నుంచి ఈ భూమిని పరిపాలించు' అని చెప్పి అడవులకు వెళ్ళాడు.

To be continued .........

Friday, 23 May 2014

హిందూ ధర్మం - 64

వెంటనే శబల దుఖిస్తూ కంటతడి పెట్టడం ప్రారంభించింది. ఎంత దీన పరిస్థితి దాపురించింది నాకు. నన్ను రాజు సైనికులు ఈడ్చుకుపోతున్నారు. నన్ను వశిష్టమహర్షి వదిలిపెట్టారా? లేకపోతే నేను మహర్షి పట్ల ఏదైనా ఘోరమైన తప్పు చేశానా? నేను మహర్షి పట్ల ఎప్పుడు భక్తితో ఉన్నాను, ఏ తప్పు చేయనేలేదు. అయినా నాకీ పరిస్థితి ఏంటి? అని ఆలోచిస్తూ శబల తనను వందల మంది సైనికులు లాక్కుని వెళుతున్నా, శక్తి పుంజుకుని వశిష్టమహర్షి పాదాలపై పడింది. బాధతో మూలుగుతు సబల వశిష్టమహర్షితో 'మీరు నన్ను ఎందుకు విడిచిపెట్టారు. నన్ను ఈ రాజు సైనికులు మీ నుంచి వేరు చేస్తున్నారు' అంటూ మొరపెట్టుకుంది.

తన సొంత సొదరితో మాట్లాడిన విధంగా వశిష్టమహర్షి ఆందోళన చెందుతూ శబలతో ఈ విధంగా అన్నారు. నేను నిన్ను విడిచిపెట్టేదిలేదు, నువ్వు నా పట్ల ఏ అపరాధమూ చేయలేదు. ఈ రాజే నిన్ను బలవంతంగా లాక్కువెళుతున్నాడు. నాకు అతనితో సమానమైన బలం లేదు కదా? ఇది కాకుండా అతడు ఇప్పుడు రాజు, కనుక బలవంతుడు, క్షత్రియుడు, ఈ భూమికి రాజు, మనం అతనికి తలవంచాలి, కాదాంటావా? ఈ అక్షౌహిణి సైన్యం నిండా ఏనుగులు, గుర్రాలు, రధాలు, ధ్వజాలు ఉన్నాయి. ఇదే అతని బలాన్ని సూచిస్తోంది అంటూ శబల శాంతి పడేలా మాట్లాడారు.

దానికి బదులుగా శబల ఎంతో వినయంతో 'బ్రహ్మజ్ఞాని! రాజు బలం గొప్పదే. కానీ అది బ్రాహ్మణుని బలం కంటే కాదు. ఋషి రాజు కంటే బలవంతుడు. రాజు బలం ధనం, సైన్యం, ఇతర సంపద. అవి కాలక్రమంలో నశించిపోతాయి. లేదా ఇతర రాజు దండయాత్ర చేసి ఓడిస్తే, మొత్తం పరుల పాలవుతాయి. లేదా మరణంతో నాసిస్తాయి. కానీ తపస్వులకున్న బలం అసమాన్యమైనది. అది దైవానుగ్రహం చేత లభిస్తుంది. భౌతిక సంపద కాలంలో నశిస్తుంది. కానీ ఆధ్యాత్మిక శక్తి కాలంతో పాటు రెట్టింపవుతుంది. ఎంత మంది వచ్చిన, ఎన్ని చేసిన తపోశక్తి చేత వచ్చిన బలాన్ని ఎత్తుకుపోలేరు. దానితో ఏమైనా చేయచ్చు. ఇంత గొప్ప శక్తి కలిగినప్పటికి బ్రాహ్మణుడు తనను తాను నిగ్రహించుకుంటాడు. మీ బలం అసమాన్యమైంది, మీరు విశ్వామిత్రునకంటే గొప్పవారు. మీరు తేజోవంతులు. నాకు ఆదేశం ఇవ్వండి. మీ దగ్గర ఉండడం చేత వచ్చిన శక్తితో ఈ రాజు దర్పాన్ని, బలాన్ని అంతం చేస్తాను. ఇతను చేస్తున్న ఈ దుష్కార్యానికి బదులు చెప్తాను అన్నది.

To be continued ...........

Wednesday, 21 May 2014

మే 22, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం - మన సంస్కృతి

ఈ సృష్టిలో అన్నిటిలో ఏకత్వం ఎంత ఉందో,  భౌతికంగా, మానసికంగా భిన్నత్వం కూడా అంతే ఉంది. వైవిధ్యమే సృష్టి లక్షణం అంటారు స్వామి వివేకానంద. పరమాత్మ ఈ భూమిని సృష్టించినప్పుడు మనిషితో కలిపి 84,00,000 జీవరాసులకు ఆయువుపోశాడు. వీటిలో ఏ ఒక్కటి అధికంగా కాదు, ఏదీ తక్కువ కాదు. అన్ని సమానమే. అన్ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి జీవనం సాగించేలా ధర్మాన్ని ఏర్పాటు చేశాడు. మనిషి తన ప్రతి అవసరానికి ప్రకృతి మీద ఆధారపడ్డాడు. ప్రకృతి లేనిదే మనిషి జీవితం లేదు. ఇది గమనించిన భారతీయ ఋషులు జీవ వైవిధ్య చక్రం సక్రమంగా సాగేలా, ఎక్కడ మనిషి వాటిలో కల్పించుకునే వీలు లేకుండా మానవ ధర్మాలను చెప్పారు. వ్యవసాయ పద్దతులే కావచ్చు, జీవన విధానమే కావచ్చు, ఆహారపు అలవాట్లే కావచ్చు, అన్ని సృష్టి చక్రానికి లోబడే ఉంటాయి.

చెరువులో ఉండే కీటకాలను తిని కప్ప జీవిస్తుంది. కప్పను తిని పాము జీవిస్తుంది, పామును గద్ద తింటుంది, గద్ద మరణించాక దాన్ని క్రిములు తిని భూమిలో కలిపేస్తాయి. అది మొక్కలకు ఎరువుగా మారుతుంది. ఇదంతా ఒక గొలుసుకట్టు విధానం, ఒక వృత్తం. వీటిలో ఏ ఒక్క ప్రాణి అంతరించినా మిగితా అన్నిటి మీద ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం ఉంటుంది, మిగితా ప్రాణుల మీద పరోక్షంగా ముప్పు ఉంటుంది. ఇలా జగత్తులో అనేక వృత్తాలు ఉంటాయి. వాటిలో మనిషి ఏ మాత్రం జోక్యం చేసుకున్నా అది వినాశనానికి దారి తీస్తుంది, ఏ ఒక్క జీవి అంతరించినా, మానవమనుగడ ప్రశ్నార్ధకమవుతుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏటా 10,000 జాతుల జీవరాసులు అంతరించిపోతున్నాయి.

అందుకే భారతీయ సంస్కృతిలో ప్రతి చిన్న ఆచారం ప్రకృతిహితంగానే ఉంటుది. వ్యవసాయమే తీసుకోండి. ఏ విధమైన హైబ్రిడ్, బీటీ విత్తనాలు ఉండవు. రైతు సొంతంగా విత్తనాలు తయారు చేసుకుంటాడు. భూమి మనకు అమ్మ కనుక విషపు రసాయన ఎరువులతో నింపడు. కేవలం ఆవు పేడ, మూత్రాన్ని మాత్రమే ఉపయోగించి తాను సొంతంగా తయారు చేసుకున్న ఎరువునే వాడుతాడు. వ్యవసాయంలో ప్రకృతి సాయం తీసుకుంటాడు. అందుకే 3-4 రోజులు నీళ్ళు పెట్టకపోయినా, మొక్క వాడిపోదు. ఆఖరున దిగుబడి అధికంగా వస్తుంది, వచ్చినదాంట్లో కొంచం పిచ్చుకల కోసం సింహద్వారానికి ప్రత్యేకంగా కట్టి ఆహ్వానిస్తాడు. రసాయనాలు వాడని కారణంగా పొలంలో రకరకాల మిత్రజీవాలు కనిపిస్తాయి. వైవిధ్యం వెల్లివిరుస్తుంది. రైతుకు పెట్టుబడి పెట్టకుండా లాభం వస్తుంది. ఇది ప్రకృతి వ్యవసాయం. జీవవైవిధ్యాన్ని రక్షించే అచ్చమైన, స్వచ్చమైన భారతీయ వ్యవసాయపద్ధతి. ఈ విధానంలో పూసిన పూలు రెండు నుంచి మూడు రోజుల వరకు ప్రిజ్‌లో పెట్టకపోయిన వాడిపోవు, భూమి కొన్ని ఏళ్ళ తర్వాత ఏ విధమైన ఎరువు వేయకున్నా బంగారం పండిస్తుంది. కానీ ఆంగ్లేయులు వలసపాలనలో ఈ వ్యవసాయాన్ని దెబ్బకోట్టారు.

రసాయనిక ఎరువులను వాడి, భూమిని, జీవాలను చంపి, ఆఖరికి రైతే ఆత్మహత్య చేసుకునేందుకు దోహదపడే దిక్కుమాలిన పద్ధతిని ప్రవేశపెట్టారు. రసాయాలు, బీటీ, హైబ్రిడ్ విత్తనాలు, అన్నీ కలిసి దేశాన్ని రోగిష్టి దేశంగా మార్చేస్తున్నాయి. అనేక జీవజాతుల ప్రాణాలు తీస్తున్నాయి. తరతరాలుగా సొంతంగా మంచి దిగుబడినిచ్చే సహజవిత్తనాలను గిరిజనులు ఇప్పటికి రక్షించుకుంటూ వస్తున్నారు, ఏడాదికొకసారి జాతర ఏర్పాటు చేసుకుని విత్తన మార్పిడి చేసుకుంటున్నారు. కానీ లాభాలే ధేయ్యంగా పనిచేస్తున్న విదేశీ కంపెనీలు సర్వాన్ని నాశానం చేస్తున్నాయి. ఇది భస్మాసుర హస్తమై మొత్తం మానవజాతిని చంపేస్తుంది. ఇది కేవలం వ్యవసాయ రంగంలో జరుగుతున్న దారుణం మాత్రమే. మిగితా అనేక రంగాల్లో కూడా ఇదే తరహాలో జీవవైవిధ్య నిర్మూలన జరుగుతోంది.

మే 22, ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం (International Bio-Diversity Day), ప్రపంచానికి జీవవైవిధ్యం యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తూంటే, భారతీయులకు తమ ప్రకృతిహితమైన ఆచారవ్యవహారాలను, వ్యవ్యసాయపద్ధతులను గుర్తుచేస్తోంది. చీమకు సైతం పిండి వేసి పోషించే సంస్కృతి మనది. మనం మళ్ళీ మనం పూర్వీకుల బాటలో నడవాలి. జీవవైవిధ్యాన్ని రక్షించి భావితరాలకు అందించాలి. ప్రపంచం ఆత్మ విమర్శ చేసుకోవాలి.

Tuesday, 20 May 2014

హిందూ ధర్మం - 63

విశ్వామిత్రుని మాటలను విన్న వశిష్టమహర్షి శాంతంగా 'రాజా! లక్ష ఆవులు ఇచ్చినా, కోటి ఆవులు ఇచ్చినా, వెండి వస్తువులు సమర్పించినా, నేను ఈ శబలను ఇవ్వలేను. ఈ శబలను నేను విడిచిపెట్టడం శబలకు మనచిది కాదు. మీరు నా నుంచి బలవంతంగా కూడా ఈ శబలను తీసుకోలేరు. ఎందుకంటే ఈ శబల శాశ్వతంగా నాది, నా నుంచి దాన్ని వేరుగా చూడలేను. వ్యక్తి నుంచి వ్యక్తి ఆత్మ గౌరవాన్ని వేరు చెయలేనట్లుగానే ఈ శబలను కూడా వేరు చేయలేరు. ఈ శబల చేత నా జీవితం సులభంగా సాగుతోంది. దేవతలకు హవ్యం, పితృదేవతలకు కవ్యం, నిత్యం చేసే అగ్నిహోత్రం, హోమం, బలి (జంతువులను చంపడం కాదు) మొదలైన అన్ని కార్యాలకు ఈ శబలే ఆధారం. నా ఆశ్రమంలో అగ్నికార్యాలకు, వేదాధ్యయనానికి, విద్య మొదలైన అన్నిటికి మూలం శబలే అన్న విషయంలో సందేహంలేదు. నిజం చెప్పాలంటే శబలనే నాకు అన్నీ, దానికి చాలా కారణాలు ఉన్నాయి, కనుక ఓ రాజా! నీకు ఈ శబలను నేను ఇవ్వలేను' అన్నారు.

మాట్లాడటంలో చతురుడైన విశ్వామిత్రుడు వశిష్టుడిన ఒప్పించే విధంగా పలుకుతూనే, వాదించడం మొదలుపెట్టాడు. అందంగా అలకరించబడిన తల్లని నాలుగు గుర్రాల లాగబడే 800 బంగారు రధాలను ఇస్తాను, మంచి జాతికి చెందిన బలిష్ఠమన 11,000 గుర్రాలను, ఎన్నో రకరాకాల రంగులు కలిగిన కోటి ఆవులను ఇస్తాను, అందులో ఏ ఒక్క ఆవుకి మిగిలిన వాటితో పోలిక ఉండదు, మంచి పాలు ఇస్తాయి, మీకు నచ్చితే వజ్రవైఢూర్యాలను, బంగారాన్ని మీరు అడినంత ఇస్తాను కానీ నాకు ఈ శబలను ఇవ్వండి అన్నాడు. దానికి బదులిస్తూ వశిష్టమహర్షి 'మీరు నాకు ఏది ఇస్తారన్నది ముఖ్యం కాదు, నేను శబలను ఇచ్చేదే లేదు. నా దగ్గరున్న ఈ శబల పెద్ద రత్నం వంటింది, కనుక నాకు ఇతర రత్నాల అవసరంలేదు, ఇది నాకున్న సంపద, నాకు రధాలు, గుర్రాలు, ఏనుగులు అవసరంలేదు, ఇదే నాకు సర్వస్వం, నిజానికి ఇదే నా జీవితం, నువ్వు నన్ను నా జీవితం నుంచి వేరు చేయలేవు. ఇదే నాకు దర్శపూర్ణమాసాలతో సమానం, ఇదే దక్షిణతో కూడిన వైదిక క్రతువు వంటిది, నేను చేసే సేవలన్నిటికి ఇదే ప్రధానం. నేను చేసే అన్ని పనులు ఈ శబలతో ముడిపడి ఉన్న కారణం చేత, దీని ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేది లేదు. అయినా దీని కోసం ఇంత బేరం అవసరంలేదు' అన్నారు.

వశిష్టుడు ఇవ్వడంలేదని విశ్వామిత్రుడికి కోపం వచ్చి కామధేనువును బలవంతంగా లాక్కుని వెళ్ళడం ప్రారంభించాడు.

To be continued .............

Monday, 19 May 2014

హిందూ ధర్మం - 62

విశ్వామిత్రుడు తాను చెప్పాలనుకున్నది పరోక్షంగా చెప్పినప్పటికి, వశిష్టమహర్షి మళ్ళిమళ్ళీ బ్రతిమిలాగా, చివరకు విశ్వామిత్రుడు వశిష్టులవారితో 'మిమ్మల్ని అది సంతోషపెడుతుంది కనుక అలాగే కానివ్వండి' అని సమాధానం ఇచ్చారు. ఈ మాట విన్న మహర్షి ఆనందంతో తన దగ్గర ఆశ్రమంలో పోషింపబడుతున్న శబల అనే పేరుగల ఆవును పిలిచారు, అది కామధేనువు, కోరినవన్నీ వెంటనే ఇస్తుంది.

రా రా శబల. త్వరగా వచ్చి నేను చెప్పింది విను. నేను గొప్ప రాజర్షికి సమానమైన విశ్వామిత్రునకు, అతని సైన్యానికి భోజనం ఏర్పాటు చేసి సేవ చేయదల్చుకున్నాను, నా కోసం వారందరికి నువ్వు భోజనం సిద్ధం చేయాలంటూ "ఓ కామధేనువా! నీవు కోరినవన్నీ ఇట్టే ప్రసాదిస్తావు. ఇక్కడున్న అందరి మనసుల్లో ఎవరికి ఏ ఏ ఆహారం ఇష్టమో గ్రహించి, వారి వారి అభిరుచులకు అనుగుణంగా షడ్రసోపేతమైన ఆహారన్ని ప్రసాదించు. ఓ శబలా! అన్నరాశులను, పాణీయాలను, రసాలను, లేహ్యాలను, చోష్యాలను, సర్వ విధములైన ఆహారమను సృష్టించు' అని ప్రార్ధించారు.

వశిష్టమహర్షి మాటలు విన్న శబల రకరకాల ఆహారపదార్ధాలను సృష్టించింది. చెఱుకుగడలు, తేనే మొదలైన మధురపదార్ధాలను, మంచి పాత్రలతో కూడిన పానీయాలను, సైన్యానికి నచ్చిన పదార్ధాలను, వారికి రాజసానికి తగ్గట్టుగా ఇచ్చింది. ఆహారం స్వీకరించడానికి వెండి పాత్రలు కూడా ఇచ్చింది. రోజు మామూలు ఆహరంతో అలవాటుపడిన సైన్యం ఈ విందు భోజనంతో బాగా సంతృప్తి చెందింది. రాజమందిరంలో ఉండే స్త్రీలు, పురోహితులు, పండితులతో కూడి ఆహారం స్వీకరించే విశ్వామిత్రుడికి ఈ భోజనం కొత్త శక్తిని ఇచ్చింది. ఇంత గొప్ప సత్కారానికి ప్రీతి చెందిన విశ్వామిత్రుడు ఎంతో సంతృప్తి చెంది, మహదానందంతో వశిష్టమహర్షితో ఈ విధంగా చెప్తున్నారు.

"ఓ భగవాన్! మీరు నాకిచ్చిన గౌరవానికి ముగ్ధుడనయ్యాను. నా తరుపున నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుతున్నాను. సర్వాన్ని ప్రసాదించగల ఈ శబలను మీరు నాకు ఒక ఇవ్వండి. నేను దీనికి బదులుగా శత శహస్ర (లక్ష)ఆవులను ఇస్తాను. ఈ గోవు పెద్ద సంపద. రాజు వద్దనే సర్వ సంపదలు ఉండాలి కనుక దీనిని నాకు అప్పగించండి. నిజానికి ధర్మాన్ని అనుసరించి ఈ శబల నాకు చెందుతుంది".  

To be continued.......................

Sunday, 18 May 2014

హిందూ ధర్మం - 61

మీ సేవకులను జాగ్రత్తగా చూసుకుంటున్నారని, వారందరూ మీ ఆజ్ఞను పాలిస్తున్నారని, మీరు మీ శత్రువులను జయించారని భావిస్తున్నాను. మీ రాజ్యంలో సైన్యం, మిత్రులు, పుత్రపౌత్రాదుల విషయంలో బంధాలు సక్రమంగానే ఉన్నాయని, ఆర్ధిక పరిస్థితి/వనరులు సరిగ్గానే ఉందని భావిస్తున్నా అంటూ వశిష్టమహర్షి విశ్వామిత్రుని అడిగుతాడు. అన్నీ బాగానే ఉన్నాయి అన్న సమాధానాన్ని విశ్వామిత్రుడు ఇస్తాడు. ఎన్నో సంవత్స్రాల తర్వతా కలిసిన వారిలా చాలా సేపు వీరిద్దరు ఆనందంతో అనేక విషయాలు మాట్లాడుకున్న తర్వాత ఆఖరున వశిష్ట మహర్షి 'నేను మీకు, మీ సమస్త సైన్యానికి మీ హోదాకు తగ్గట్టుగా ఆతిధ్యం ఇవ్వదల్చుకున్నాను, దయచేసి నా విజ్ఞప్తిని మన్నించండి్' అని విశ్వామిత్రునితో అన్నారు.

మీరు మా ఆశ్రమానికి వచ్చిన విశిష్టవంతమైన అతిధులు, కనుక దయతో నా విజ్ఞప్తిని మన్నించి, నా సేవలు అందుకోండి అని మహర్షి వేడుకున్నారు. అతిధి దేవో భవ అన్నది సనాతన ధర్మం. మన ఇంటికి వచ్చిన అతిధి సాక్షాత్తు పరమాత్మ స్వరూపం. అతిధి తృప్తి చెందితే, దేవతలు సంతోషిస్తారు.

అందువల్ల తన ఆశ్రమానికి విచ్చేసిన విశ్వామిత్రుడికి, అతని సైన్యానికి అతిధ్యం ఇవ్వాలని వశిష్టమహర్షి వారికి ఘనస్వాగతం పలికారు. అయినా ఇంత గొప్ప రాజును, కందమూలాలు, అడవిలో దొరికే పండ్లను మాకు భోజనంగా అందిస్తారు. నా సైన్యంలో ఉన్న ఏనుగులకు, గుర్రాలకు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. అర్దం లేకుండా మాట్లాడుతున్నాడీ మహర్షి అనుకున్న విశ్వామిత్రుడు, మీరు నాతో పలికిన ప్రేమపూరితమైన పలుకులే నాకు మీరిచ్చిన గౌరవం. ఈ విధంగా మీరు నాకు గొప్ప ఆతిధ్యం ఇచ్చారు. వేరే విధమైన ఆతిధ్యం అవసరంలేదు అని జవాబిచ్చాడు.

రాగానే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చారు, దాహం తీర్చారు, మీ దగ్గర కాసే పండ్లను ఇచ్చారు, ఇవన్నీ నాకు సంతోషాన్ని కలిగించాయి. అన్నిటికంటే విలువైనది మీ దర్శన భాగ్యమే. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్న మీకు నమస్కరించడం, మీతో గడపడం, మాట్లాడడమే నా భాగ్యం. కనుక నన్ను మన్నించి, నన్ను వెళ్ళనివ్వండి అన్నారు విశ్వామిత్రుడు.

To be continued ................

Saturday, 17 May 2014

హిందూ ధర్మం - 60

కోపానికి సంబంధించి శ్రీ రామాయణంలో బాలాకాండ 51-62 సర్గల్లో ఒక చక్కటి కధ ఉంది.

ఈ భూమిని కొన్ని వేల్ల సంవత్సరాలు పరిపాలించిన విశ్వామిత్రుడు మొదట క్షత్రియుడు. ఒకసారి తన దగ్గరుండే సైన్యంలో ఒక అక్షౌహిణి సైన్యాన్ని (21,870 ఏనుగులు, 21,870 రధాలు, 65,610 అశ్వదళం/గుర్రాలు, అంద్ 1,09,350 సైనికులు) తీసుకుని ప్రపంచమంతా చుట్టి రావడానికి బయలుదేరాడు. నదులు, పర్వతాలు, నగరాలు దాటి వెళుతున్న విశ్వామిత్రుడి సైన్యం ఒక మనోహరమైన ఋషి ఆశ్రమాన్ని చేరుకుంది. రకరకాల మొక్కలు, చెట్లు, పువ్వులు,, లతలు, తీగలు, ప్రదేశమంతా వ్యాపించి ఉన్న పశువుల మందలు కనిపించాయి, జింకలు పరిగెడుతున్నాయి, అనేక రకాల పక్షులు కనిపించాయి. ఆ ప్రదేశాన్ని సిద్ధులు, చారణులు సేవిస్తున్నారు. దేవ, దానవ, గంధర్వ, కిన్నెరుల రాక చేత ఆ ప్రాంతమంతా వెలిగిపోతోంది. బ్రహ్మవేత్తలందరూ ఆ ప్రాంతంలో యజ్ఞం చేస్తున్నారు. బ్రహ్మర్షులు, దేవర్షులు కనిపిస్తున్నారు. అక్కడున్న వారందరూ అగ్ని వలె తేజస్సుతో ప్రకాశిస్తున్నారు. బ్రహ్మదెవునకు సమానమైన ఋషులు కూడా ఉన్నారు. అందులో కొందరు కేవలం నీటిని, కొందరు గాలిని, ఇంకొదరు ఎండిన ఆకులను, కొందరు పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుని జీవిస్తున్నారు. ఇంద్రియ నిగ్రహాన్ని పూర్తిగా ఆచరిస్తున్న వాలఖిల్యులు, వైఖానసులు కనిపించారు. వారు దోషరహితులై ఉన్నా యజ్ఞయాగాది క్రతువులు చేస్తున్నారు, ధ్యానంలో నిమగ్నులయ్యారు. ఇంత మంది గొప్ప మహానుభావుల యొక్క తపోశక్తి చేత దివ్యంగా ప్రకాశిస్తున్న ఆ ఋష్యాశ్రమం వశిష్ట మహర్షిది. మహాబలవంతుడైన విశ్వామిత్రుడు భూలోకంలో బ్రహ్మలోకం వలే కనిపిస్తున్న ఈ వశిష్టాశ్రమాన్ని చూసి ముగ్దుడయ్యాడు.

గొప్ప తపస్వీ అయిన వశిష్టమహర్షిని చూసిన విశ్వామిత్రుడు ఆనందంతో పులకరించి, వశిష్ట మహర్షికి వినయంతో ప్రణమిల్లారు. అదే విధంగా వశిష్టమహర్షి కూడా విశ్వామిత్రునికి ఘనస్వాగతం పలికి గొప్ప స్థానం ఇచ్చి, ఆసనంలో కూర్చున్నాక, పండ్లు, కందమూలాలు సమర్పించారు. వాటిని స్వీకరించిన విశ్వామిత్రుడు ఆ ఆశ్రమ బాగోగుల గురించి, ఋషుల గురించి, యజ్ఞాల గురించి, ఆశ్రమ వాతవరణం గురించి, శిష్యులు, విద్యార్ధుల గురించి అడిగి తెలుసుకున్నారు. బ్రహ్మ మానసపుత్రుడైన వశిష్టమహర్షి విశ్వామిత్రుని బాగోగులను గురించి, రాజ్య పరిపాలన గురించి వివరంగా అడిగారు. ఓ రాజా! మీరు ధార్మికంగా పరిపాలిస్తున్నారని, మీ క్షత్రియ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నారని భావిస్తున్నాను అన్నారు.

To be continued ..............

Friday, 16 May 2014

భారతీయ జనతా పార్టికి శుభాభినందనలు

2014 ఎన్నికల ఫలితాల్లో దేశంలో అతి పెద్ద పార్టీగా ఆవిర్భివించిన భారతీయ జనతా పార్టికి(బీ.జే.పీ)కి, ప్రధాని నరేంద్ర మోడీకి శుభాభినందనలు. ఈరోజు కాదు, ఎప్పుడైతే దేశంలో ఉన్న పార్టీలన్నీ అధికార పార్టీపై దాడి చేయకుండా, అధికార కాంగ్రెస్‌తో కలిసి మోడీపై దాడి విమర్శల దాడికి పూనుకున్నాయో, ఆ రోజే మోడిని ప్రధాన మంత్రిగా ఆయా పార్టీలు అంగీకరించాయి. మతతత్వం అనే ముద్ర వేసి ఎంత ఆపడానికి ప్రయత్నించినా, సర్వ శక్తులు ఒడ్డి, బీజేపీ ని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత మోడిదే. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా ఒకే ప్రజ అనే నినాదంతో ముందుకువచ్చేలా ప్రజల్లో జాతీయ భావాన్ని, ఐక్యతను తీసుకురావడంలో మోడీ సఫలమయ్యారు, దాని ఫలితం ఈ రోజు చూస్తున్నాం.

బిజేపీలో ఉన్న సభ్యులంతా ఆర్ఎస్ఎస్ సభ్యులే. ఆర్ఎస్ఎస్ (రాస్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) ప్రపంచంలోనే అతి పెద్ద జాతియవాద సంస్థ. ఆర్ఎస్ఎస్ సభ్యులకున్న క్రమశిక్షణ, దేశభక్తిని గూర్చి చెప్పడం వర్ణనాతీతం. అవసరమైతే దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదలడానికి సిద్ధంగా ఉంటారు ఆర్ఎస్ఎస్ సభ్యులు. భారత్ మీద ఈగ కూడ వాలనివ్వరు. కనుక ఏ విధంగానూ దేశాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేయరు. దేశబధ్రత విషయంలో భారతీయులు సంతోషపడవలసిన సమయమిది.

స్వతంత్ర భారత చరిత్రలో కాంగ్రేతర అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించి బిజేపి ప్రభంజనం సృష్టించింది. ఈ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏకు 336 స్థానాల్లో ఆధిక్యత రావడం, ఒంటరిగా బిజేపీ మాజిక్ ఫిగర్ 272 దాటి 282 స్థానాలను కైవసం చేసుకోవడం హర్షించదగ్గ పరిణామం. ఇదే బిజేపికి మంచి అవకాశం కనుక బిజేపి తన సొంత మ్యానిఫేస్టోని అమలు చేస్తుందని ఆశిద్దాం. అక్రమంగా బంగ్లాదేశి చొరబాటు దారులను వెనక్కుపంపడం, కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇస్తున్న ఆర్టికల్ 370 రద్దు చేసి, కాశ్మీర్‌ను భారత భూభాగంగా గుర్తించడం, గోవధ నిషేధం వంటి వాటితో పాటు విద్యావవస్థలో సమూలమైన మార్పులను తీసుకువచ్చి, అబద్దాలతో నిండి ఉన్న భారతదేశ చరిత్రను నిజమైన చరిత్రతో సరిచేస్తారని, విదేశి అనుకూల ఆర్ధిక విధానలను ప్రక్కతోసి స్వదేశి ఆర్ధిక విధానలను అమలు పరుస్తారని ఆశిద్దాం. ఇవన్నీ బిజేపీ మ్యానిఫెస్టోలో ఉన్నవే. అదే విధంగా కాశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్‌ల విషయంలో పాకీస్థాన్, చైనాలతో కఠినంగా వ్యవహరిస్తారు, ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారని గట్టిగా నమ్మచ్చు. బీజేపీ సాధించిన ఈ విజయం వెనుక ఉన్న ఎందరో కార్యకర్తలకు, సంఘసభ్యులకు శుభాభినందనలు.

నరేంద్ర మోడిగారి సారధ్యంలోని ప్రభుత్వంలో దేశం అన్ని రంగాలలో దూసుకుపోతుందని, దేశంలో ధర్మం నిలబడుతుందని, భారత్ విశ్వగురు స్థానాన్ని తిరిగి చేరుతుందని ఆశిద్ధాం.

సర్వేషాం మంగళం భవతు
జై హింద్   

Friday, 9 May 2014

Ahimsa - Magnet

अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः॥३५॥

ahiMsaapratiShThaayaaM tatsannidhou vairatyaagaH (Patanjali yoga sutra 2.35)

"In the presence of one firmly established in non-violence, all hostilities cease".


Ahimsa or non-violence is the most important virtue. That is the reason why Patanjali Maharshi has placed it first in Yama. Practice of Ahimsa must be in thought, word and deed. Practice of Ahimsa is not impotence or cowardice or weakness. It is the highest type of heroism. The practice demands immense patience, forbearance and endurance, infinite inner spiritual strength and gigantic will-power.

Ahimsa is a modification or expression of truth only. Satyam (truth) and Ahimsa always go together. He who is established in Ahimsa can move the whole world. In his presence, all hostilities vanish; lion and cow, cobra and mongoose, live together peacefully

- Swami Shivananda

[Note: In support of this statement of Swami Shivananda, we cite the example from the life of Sri Ramana Maharshi as observed by the Scottish scientist Alick McInnes. The following extract is taken from the book "The Secret Life of Plants" by Peter Tompkins and Christopher Bird. Chapter titled ‘Dowsing Plants for Health’. The book was first published in 1973. :

In Tiruvannamalai, South India, Alick McInnes, a Scottish scientist, witnessed the strange spectacle of Sri Ramana Maharshi on his evening walk. Within seconds of his leaving his house, cattle tied up in stalls in the village half a mile away would struggle to get out of their ties. When released, they careered along the road to accompany the old man on his walk, followed by all the dogs and children of the village. Before the procession had gone far, wild animals and even snakes joined it from the jungle. Thousands of birds appeared, almost blotting out the sky. There were tiny tits, huge kites, heavy-winged vultures and other birds of prey, all flying in harmony around the Maharshi on his walk. When he returned to his room, said McInnes, all the birds, animals and children would quietly disappear.

From the book "The Secret Life of plants"by Peter Tompkins and Christopher Bird

Source: http://www.hinduism.co.za/dharma.htm

Thursday, 8 May 2014

హిందూ ధర్మం - 59 (అక్రోధః)

కోపం రావడానికి మూలం కామంలోనే ఉంది. మనం అనుకున్నది మనకు దక్కకపోతే కోపం వస్తుంది. అది ఆహారమైనా, వస్తువైనా, సుఖమైనా, ఇంకేదైనా కావచ్చు.  ఈ పని ఈ సమయానికి, ఇలా అయిపోవాలి, ఇదిలా జరిగిపోవాలని కొన్ని ప్రణాలికలు సిద్ధం చేసుకుని, దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాం. కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. కొన్ని సార్లు మనమెంత ప్రయత్నించినా, అనుకున్న పనులు అనుకున్న సమయానికి సక్రమంగా పూర్తికావు. అన్నీ సజావుగానే సాగినా, ఏదో అవాంతరం అనుకోకుండా ఏర్పడి చికాకు కలుగుతుంది. ఇది క్రోధానికి బీజం వేస్తుంది. పనులు సక్రమంగా జరగకపోవడానికి ఎవరో ఒక వ్యక్తి లేదా సమూహమే కారణమని కోపాన్ని ఇతరుల మీదకు నెట్టి వేస్తుంది మనసు. ఫలితంగా వ్యక్తి ఇతరులను కోపగించుకుని, నానా మాటలు అంటాడు మనిషి.

మనిషి తనకంటే గొప్పదైన శక్తి ఒకటి ఈ సృష్టిలో ఉందని, ఈ సమస్త జగత్తు దానికి లోబడే పని చేస్తోందనే సంగతిని మర్చిపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతోంది. 'అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే ఇక దేవుడనే వాడు ఎందుకు గుర్తుంటాడు. అప్పుడప్పుడు అనుకున్నవాటికి భిన్నంగా జరుగుతాయి. అప్పుడే మానవుడికి అర్దమవుతుంది, తనను మించిన శక్తి ఒకటి లోకంలో ఉన్నదని, అప్పుడు దైవం అనే వాడు గుర్తుకువస్తాడు' అనే ఈ మాటశ్రీ రాముడు అన్నాడు రామాయణంలో. దైవం ఉన్నదని, ఈ సమస్త జగత్తు దైవశాసనాన్ని అనుసరించే నడుస్తోందని మనం నమ్మినప్పుడు, మనం అనుకున్న సంకల్పం నెరవేరకపోవడానికి కారణం కూడా ఆ భగవత్ సంకల్పమే అన్న భావన స్థిరంగా ఉంటుంది. మనకు ఏది మంచి చేస్తుంది, అది మాత్రమే దైవం ప్రసాదిస్తుంది, దైవానికి అన్నీ తెలుసు అని నమ్మడమే భక్తి. అనుకున్నది ప్రాప్తించకపోవడానికి కారణం కూడా దైవ శాసనమే అన్న భావన మనలో కలిగినప్పుడు ఇక కోపం అన్నది రానేరాదు.

మనిషిని మాయ కప్పేస్తోంది. తానే శక్తివంతుడిననీ, తనను మించిన వారు లేరని అహకారం ఈ మాయ నుంచి వస్తుంది. దాంతో దైవాన్ని మర్చిపోతున్నాడు. బహుసా దైవానికి ఈ పని ఇప్పుడు జరగడం ఇష్టం లేదేమో, అందుకే ఇలా అర్ధాంతరంగా ఆగిపోయిందని అనుకుంటాడు భక్తుడు. మన ప్రయత్నాలన్నీ మనం చేయాలి, సర్వశక్తులు ఒడ్డి కృషి చేయాలి, కానీ ఎన్ని చేసినా, పైవాడు అంగీకరించనిదే ఏదీ జరగదని నిజం గుర్తించినప్పుడు ఇక ఎవరి మీద కోపగించుకునే అవకాశం ఉండదు.

To be continued.........

Wednesday, 7 May 2014

హిందూ ధర్మం - 58 (అక్రోధః)

అసలు కోపం ఎందుకు వస్తుందన్న ప్రశ్నకు భగవద్గీత మొదలైన గ్రంధాలు, ఉపనిషత్తులు చక్కని సమాధానం చెప్తాయి. కోపానికి ప్రధాన కారణం కామము. కామము అంటే కోరిక (ఏదైనా కావచ్చు), బాగా గమనించండి. అన్నీ మనకు నచ్చినట్టుగానే జరగాలని కోరుకుంటుంది మనసు. అది కామం, కోరిక. మనకు నచ్చినట్టుగా జరగకపోతే కోపం పొడుచుకు వస్తుంది. అందరూ నేను చెప్పినట్టే వినాలి, నా మాటే ఎప్పుడూ నెగ్గాలి అని అనుకుంటుంది మనసు. అది మనసు యొక్క సహజ లక్షణం. మనం చెప్పినట్టు ఎవరైనా వినకపోయినా, మన భావాలకు విరుద్ధంగా చెప్పినా, మనతో మనతో విభేదించినా కోపం తన్నుకు వస్తుంది. అందరూ మనం అనుకున్నట్టే ఉండాలి, లేని పక్షంలో సదరు వ్యక్తిని కోపగించుకుంటాం.. ఆఖరికి ఎదుటివాడు తన వ్యక్తిగత అభిప్రాయం చెప్పుకున్నా, మనం అంగీకరించలేని స్థితికి చేరుకున్నాం. అయ్యో! అది అవతలి వ్యక్తి అభిప్రాయమే. అతనికి తన ఆలోచనల మీద, భావ వ్యక్తికరణకు స్వేచ్చ ఉందని, ప్రతి వ్యక్తికి కొంత వరకు స్వాతంత్ర్యం ఉంటుందన్న విషయమే మనం అంగీకరించలేకపోవడం మన దౌర్భాగ్యం అని నిత్యం మనసుకు సమాధానం చెప్పండి..

ముందు మనం అందరిని అంగీకరించడం నేర్చుకోవాలని శాస్త్రం చెప్తుంది, గురువుల భోధనల సారం కూడా అదే. ఆధ్యాత్మిక సాధనలో తొలి మెట్టు అందరిని అంగీకరించడమే. కోపగించుకునే ముందు మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతున్నామా? మనం అనుకున్నవి అనుకున్నట్టుగా మాట్లాడుతున్నామా? సమర్ధించుకోకుండా సమాధానం కోసం ప్రయత్నించండి. లేదు అనే సమాధానం మాత్రమే వస్తుంది. మనకు నచ్చినట్టుగా మనం జీవించలేనప్పుడు, ప్రవర్తించలేనప్పుడు, లోకంలో అందరూ మనకు నచ్చినట్టుగా ప్రవర్తించాలి అనుకోవడం మూర్ఖత్వం కాదా? మనం ఎంత శాడిస్టులము? ఎంత సంకుచిత స్వభావం మనది. మన మీద మనకు నియత్రణ లేనప్పుడు, ఇతరులను నియంత్రించాలనుకోవడం ఎంత అమాయకత్వం. అసలు వేరొకరి మనసులోకి తొంగి చూసే అధికారం మనకు ఎక్కడిది? ఇలా మనసును సమాధాన పర్చుకోండి. ధర్మం కూడా అదే అంటొంది. నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా మార్చుకోలేని నువ్వు అవతలివ్యక్తిపై ఎందుకు కోపగించుకుంటావు. అందుకే కోపాన్ని విడిచిపెట్టు (అక్రోధః).

To be continued......

Tuesday, 6 May 2014

విద్యారణ్య భారతీ స్వామి - హిందూ సామ్రాజ్య స్థాపన

విద్యారణ్య భారతీ స్వామిని మరో ఆది శంకరాచార్యులుగా చెప్పచ్చు. మాధవ విద్యారణ్యగా పేరు పొందిన ఈయన గొప్ప దేశభక్తుడు, శ్రీ విద్యా ఉపసకులు, జ్యోతిష్య శాస్త్రంలో దిట్ట, అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. క్రీ.శ.1268 లో వైశాఖ శుద్ధ సప్తమి నాడు జన్మించారు విద్యారణ్యులు.


దాదాపు 700 ఏళ్ళ పైగా భారతదేశం మీద మహమదీయుల దండయాత్రలు జరిగాయి. దక్షిణభారతంలో హిందువుల మీద అనేక దాడులు జరుగాయి, అనేకమంది చంపబడ్డారు, కొందరు మతం మార్చివేయబడ్డారు. విద్యారణ్య భారతీ స్వామి ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతానికి వస్తున్న సమయంలో  గంగానది అధిష్ఠాన దేవత గంగాదేవి ప్రత్యక్షమై 'విద్యారణ్య, దక్షిణభారతంలో మ్లేఛ్చుల దండయాత్రల కారణంగా అనేకమంది హిందువులు చంపబడ్డారు. వారి రక్తం ఏరులైపారుతోంది, ఎన్నో వేల హిందువుల తలలు చెట్లకు వ్రేలాడుతున్నాయి. ఈ పరిస్థితిని నేను చూడలేకపోతున్నాను. నీవు తక్షణమే వెళ్ళి అక్కడ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించు, హిందూ ధర్మస్థాపన చెయ్యి' అంటూ గంగమ్మ కంటతడి పెట్టుకుని భోరున విలపించింది.

గంగాదేవి భాధను చూడలేకపోయిన విద్యారణ్యులు దక్షిణ భారతదేశానికి వచ్చారు. హరిహరరాయులు, బుక్కరాయులు హోయ్సల రాజ్యవంశపు సైనికాధికారులు. కాకతీయులు ఓడిపోయాక వీరిద్ధరు బలవంతంగా ఇస్లాంలో మారచబడ్డారు. విద్యారణ్యులు వీరిని తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకువచ్చి, రాజ్యస్థాపనకు తానే అధ్బుతమైన మూహుర్తాన్ని నిర్ణయించి, ఏ మూహుర్తంలో పునాది వేయడం వలన రాజ్యం 1000-1500 ఏళ్ళపాటు అజరామరంగా విరాజిల్లుతుందో పునాది రాయి వేయించే ప్రయత్నం చేశారు. కానీ దైవశాసనానికి, విధి నిర్ణయానికి ఎవరూ అతీతులు కారు. దాంతో మూహుర్తానికి ముందే కొన్ని కారణాలు చేత పునాది రాయి పడి, విజయనగర సామ్రాజ్యం వైభవోపేతంగా 400 ఏళ్ళు కొనసాగింది.

విజయనగర సామ్రాజ్య స్థాపన కోసం భువనేశ్వరీ దేవిని ప్రార్ధించి, కనకవర్షం కురిపించి, అమ్మవారు ప్రసాదించిన ధనంతో దక్షిణభారతాన హిందూ సామ్రాజ్యం స్థాపించబడింది. విజయనగర సామ్రాజ్యపాలన చరిత్రలో స్వర్ణయుగం. దొంగ అనేవాడు విజయనగరంలో లేడు. పూర్తిగా ధర్మాచరణలో ప్రజలు జీవనం గడిపారు. వజ్రవైఢూర్యాలు రాశులుగా వీధుల్లో పోసి విజయనగరంలో అమ్మేవారని, అంత గొప్ప రాజ్యపరిపాలనను ప్రపంచంలో మరెక్కడా చూడలేదని ఎందరో విదేశీయులు తమ పుస్తకాల్లో రాసుకున్న విషయాలు ఇప్పటికి సజీవ సాక్ష్యాలు. అటు తర్వాత హంపిలో విరూపాక్షాలయాన్ని స్థాపించి, హంపి విరూపాక్ష పీఠాన్ని స్థాపించారు స్వామివారి. తాను సర్వశక్తిమంతుడై ఉండి, పైసా కూడా ఆశించక, సర్వశక్తులు ఒడ్డి సనాతన హిందూ ధర్మ రక్షణకు పాటుపడిన శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ మహాస్వామి వారిని మనస్పూర్తిగా ప్రార్దిద్దాం. ఈ రోజు విద్యారణ్య జయంతి, గంగాసప్తమి. ఇదే రోజున గంగాసప్తమి కనుక భారతదేశానికి, సనాతన ధర్మానికి ఆయువుపట్టు అయిన గంగమ్మను మనసార వేడుకుందాం.

ఈ దేశంలో హిందూ రాజ్యాలు దైవసంకల్పంతో ఏర్పడ్డాయని తెలుసుకోవడం ఎంతో ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ ఉంది కదూ.

Monday, 5 May 2014

హిందూ ధర్మం - 57 (అక్రోధః)

కోపం అనేది అగ్ని వంటిది. అగ్ని ఇతర వస్తువులను కాలుస్తుంది, కానీ కోపం తనకు వశమైన వ్యక్తినే ముందు కాల్చి, తర్వాత మిగితావారి మీద ప్రతాపం చూపిస్తుంది. కోపం మనిషి పతనానికి కారణమవుతుంది, సర్వరోగాలను తీసుకువస్తుంది. కోపం చేసే అనర్ధాలు అన్ని ఇన్నీ కావు. కోపంతో ఒక రాయిని తన్నితే, మన కాలికి దెబ్బతగులుతుంది. కోపం వలన మనం చేసిన సాధన మొత్తం వ్యర్ధమవుతుంది. అందుకే సుమతీ శతక కర్త బద్దెన 'తన కోపమే తన శత్రువు' అన్నారు. కోపం అనేది మనిషి యొక్క సహజ లక్షణం కాదంటుంది భారతీయ సంస్కృతి.

కోపం గురించి పెద్దలు ఒక చిన్న కధ చెబుతారు. ఒక వ్యక్తికి విపరీతమైన కోపం ఉండేది. అందరి మీద అరిచేవాడు, తిట్టేవాడు. దాంతో జనం అతని దగ్గరకు రావడానికి బయపడేవాళ్ళు. కుటుంబసభ్యులు బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు, తప్పదు కనుక భరించేవారు. ఇదిలా ఉండగా ఒక రోజు అతని తండ్రి, తన పిల్లాడి భవిష్యత్తుని గురించి ఆందోళన చెంది, తమ ఊరికి ఒక సాధువు వచ్చాడాని, అతని దగ్గరకు వెళ్తే పరిష్కారం లభిస్తుందని చెప్తాడు.

తన తండ్రి చెప్పినట్టుగానే ఈ వ్యక్తి ఆ సాధువు దగ్గరకు వెళ్ళి, తన సమస్యను ప్రస్తావిస్తాడు. అది విన్న సాధువు, ఇక నుంచి నీకు కోపం వచ్చి, ఇతరుల మీద అరిచిన ప్రతిసారీ, మీ ఇంటిలో రాతి గోడకు ఒక మేకును కొట్టు, నువ్వు మేకులు కొట్టడం ఆపేసిన రోజు మళ్ళీ నా దగ్గరకు రా అని చెప్పాడు. సాధువు చెప్పినట్టుగానే చేయడం మొదలుపెట్టాడు. రోజులు గడిచేకొద్ది, అతనికి మేకులు కొట్టడం ఇబ్బందిగా మారింది, రాతి గోడ కావున మేకు త్వరగా దిగేది కాదు, ఓపిక ఉండేది కాదు, కోపగించుకుని మేకులు కొట్టడంకంటే కోపాన్ని అదుపు చేసుకుని మౌనంగా ఉండడమే మేలు అనిపించింది.. తిరిగి సాధువు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. అప్పుడు సాధువు  ఇప్పుడా మేకులన్నీ తీసేసి నా దగ్గరకు రా అన్నాడు. ఏ మేకులన్నీ తీయడానికి కొన్ని నెలలు పట్టింది. మళ్ళీ సాధువు దగ్గరకు వెళ్ళగా, అప్పుడు సాధువు, మేకులన్నీ తీయగా అక్కడ నువ్వు ఏమి గమనించావు అన్నారు, గోడ మొత్తం బొక్కలు పడి, గోడ అందవిహీనంగా తయారైంది అన్నాడు వ్యక్తి. 'నువ్వు కొట్టిన మేకులు వలన గోడ అందం చెడిపోయినట్టే, నువ్వు కోపంలో అన్న మాటల వలన ఇతరుల మనసు బాధపడుతుంది. గోడకు మరమత్తు చేసి, తిరిగి పూర్వ రూపం తీసుకురావచ్చు, కానీ గాయపడిన విరిగిపోయిన మనసును తిరిగి అతికించలేమి నాయానా!' అని సాధువు భోధ చేశాడు. తను చేసిన తప్పును తెలుసుకున్న ఆ వ్యక్తి ఇంకెప్పుడు ఎవరిని పల్లెతి మాట కూడా అనకపోగా, ఇంటికి వెళ్ళి తన కుటుంబ సభ్యులను క్షమించమని ఏడ్చాడు. మనం కూడా ఎందరిని ఆవేశంతో ఏన్నో మాటలు అని ఉంటాము. ఇప్పటికైనా విషయం అర్దం చేసుకుని కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నిద్దాము.

To be continued.............

Sunday, 4 May 2014

శంకరాచార్యులు - ఆధునిక పరిశోధనలు

శంకరాచార్యులను మనం కేవలం ఒక ధర్మ ప్రబోధకుడిగా మాత్రమే చూస్తున్నాం కానీ, నిజానికి ఆయన ఒక శాస్త్రకారుడు, మానవ సమాజానికి విజ్ఞానం అందించిన మహాపురుషుడు. శంకరులే కాదు, సనాతన హిందూ ధర్మాన్ని ప్రబోధించిన ప్రతి ఆచార్యుడూ ఒక శాస్త్రకారుడే, మానవ ఇతిహాసంలో వైజ్ఞానికంగా కొత్త కోణాన్ని ఆవిష్కరించిన మహానుభావుడే.

శంకారాచార్యులవారు అద్వైతాన్ని ప్రభోదించారు. అద్వైతాన్ని వైజ్ఞానిక దృష్టితో చూసినప్పుడు అద్వైతంలో అణుశాస్త్రం కనిపిస్తుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితమే శ్రీ శంకరభగవత్పాదులు Concept of Indivisible atoms ను అద్వైతంలో వివరించారు. ఈ సృష్టిలో ఉన్న తత్వం ఒక్కటే. జీవుడికి, ఈశ్వరుడికి అభేధం.
బ్రహ్మ సత్యం జగత్ మిధ్యా జీవో బ్రహ్మైవనాపరః  
బ్రహ్మం ఒక్కటే సత్యము, ఈ జగత్తు అంతా మాయ, జీవుడు(ఆత్మ) బ్రహ్మం తప్ప వేరొకటి కాదు అన్నారు శంకర భగవత్పాదాచార్యులు. ఆత్మ కూడా పరమాత్ముడు నుండి వేరుపడిన పదార్ధమే. ఆత్మ పరమాత్మ రూపమే. జీవుడే దేవుడు, కాని మాయ చేత మనిషి తన స్వరూపం తాను తెలుసుకోలేకపోతున్నాడంటూ ఈయన ప్రబోధించిన అద్వైతం Albert Einstein కు ప్రేరణ ఇచ్చింది. శంకరులవారి అద్వైతసిద్ధాంతం చదివి ప్రేరణ పొందిన Albert Einstein, Thoery of Relativity ని అందించారు.

శంకరాచార్యులవారి రచనలు భక్తినే కాకా విజ్ఞానాన్ని కూడా అందించాయి. పైకి భక్తి రచనల్లా కనిపించినా, వాటిలో శాస్త్ర రహస్యాలు అనేకం అందించారు. సౌందర్యలహరిలో శంకరులు అమ్మవారిని సహస్రదళ కమలంలో కూర్చున్నట్టుగా వర్ణించారు. ఆధునిక సైంటిస్టుల పరిశోధనలో దైవ పధార్ధమే ఆ సహస్రదళ పద్మం అని ఈ మధ్యే జరిగిన పరిశోధన ఆధారంగా తెలుసుకుని విస్తుపోయారు. శ్రీ చక్ర మహామేరు సృష్టి ఆరంభం గురించి రహస్యాలను తెలుపుతుందని, శ్రీ చక్రానికి ఉన్న త్రికోణాలు లయం గురించి చెప్తాయని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శంకరాచార్యులే పార్టికల్ ఫిజిక్సుకు పితామహులని (father of particle physics) వర్ణిస్తున్నారు.

ఇక్కడో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే శంకరులు ప్రవచించిన అద్వైతం మామూలువారి కంటే Quantum physics ఫీల్డ్ లో పని చేస్తున్న శాస్త్రవేత్తలకు బాగా అర్దమవుతుంది. నిజానికి విదేశాల్లో అద్వైతాన్ని వారే ప్రచారం చేస్తున్నారు.

శంకరులు ప్రభోదించిన అద్వైతం సృష్టిలో ఏకత్వాన్ని చాటుతోంది. 20వ శతాబ్దపు ఫిజిక్స్ శాస్త్రవేత్తలకు పరిశోధనల ఫలితంగా స్పష్టంగా అర్దమైంది. ఇది స్పష్టమైంది. పెద్ద సూర్యగోళం నుంచి చిన్న అణువు వరకు, జీవులలోను, అజీవాలలోనూ ఒకే శక్తి ఉన్నదని, ఒకటే అనేకంగా కనపడుతోందని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్తూ, ఇదంతా శంకరులు అద్వైతంలో చెప్పినదేనని స్పష్టం చేయడం హిందువులకు గర్వకారణం. ఆధునిక పిజిక్స్ మీద జరిగిన ప్రతి పరిశోధన అద్వైత సిద్ధాంతాన్ని నిరూపణం చేస్తోంది.  కావాలంటే ఈ లింకుల్లో ఉన్న సైంటిస్టుల అభిప్రాయాలను చదవండి.
http://bhagavatulu.blogspot.in/2013/11/david-ohm-and-advaita-vedanta.html
http://bhagavatulu.blogspot.in/2013/09/entanglement-and-advaita.html

E=mc²  సూత్రం చెప్పిన తర్వాత Albert Einstein మాట్లాడుతూ, నేను చెప్పిన  E=mc² సూత్రం మానవసమాజాన్ని ముందుకు తీసుకువెళుతుందో లేదో స్పష్టంగా చెప్పలేను  కానీ, శ్రీ శంకరాచార్యులవారి మిథ్యా సిద్ధాంతం మాత్రం మనిషి మనిషిగా బ్రతికేందుకు తప్పక ఉపయోగపడుతుందని సుస్పష్టంగా చెప్తున్నా అన్నారు.

స్వామి వివేకానందుడు భవిష్యవాణి  చెప్తూ, 21వ శతాబ్దంలో సమస్తప్రపంచానికి అద్వైతం మార్గదర్శకమవుతుంది. అద్వైతం వైభవం ప్రపంచమంతా వ్యాపిస్తుందంటూ చెప్పినమాట వాస్తవంలో కనిపిస్తూనే ఉంది.

జయ జయ శంకర! హర హర శంకర!!          

Sri Adi Shankaracharya - An ancient Indian philosopher as well as an Scientist.

Sri Adi Shankaracharya - An ancient Indian philosopher as well as an Scientist. 

Sri Adi Shankaracharya is the preacher of Advaita (Non duality, Oneness) philosophy of Hinduism (Sanatana Dharma). He was born in 509 BC in Kerala of India. He mastered vedas, Philosophy, Metaphysics, Theology and other subjects in his childhood at the age of 8 only.  

Shankara spread the tenets of Advaita Vedanta, the supreme philosophy of monism to the four corners of India with his ‘digvijaya’ (the conquest of the quarters). The quintessence of Advaita Vedanta (non-dualism) is to reiterate the truth of reality of one’s essential divine identity and to reject one’s thought of being a finite human being with a name and form subject to earthly changes.

According to the Advaita maxim, the True Self is Brahman (Divine Creator). Brahman is the ‘I’ of ‘Who Am I?’ The Advaita doctrine propagated by Shankara views that the bodies are manifold but the separate bodies have the one Divine in them.

The phenomenal world of beings and non-beings is not apart from the Brahman but ultimately become one with Brahman. The crux of Advaita is that Brahman alone is real, and the phenomenal world is unreal or an illusion. Through intense practice of the concept of Advaita, ego and ideas of duality can be removed from the mind of man.

The comprehensive philosophy of Shankara is inimitable for the fact that the doctrine of Advaita includes both worldly and transcendental experience.

Shankara while stressing the sole reality of Brahman, did not undermine the phenomenal world or the multiplicity of Gods in the scriptures.

Shankara’s philosophy is based on three levels of reality, viz., paramarthika satta (Brahman), vyavaharika satta (empirical world of beings and non-beings) and pratibhashika satta (reality).

Shankara’s theology maintains that seeing the self where there is no self-causes spiritual ignorance or avidya. One should learn to distinguish knowledge (jnana) from avidya to realize the True Self or Brahman. He taught the rules of bhakti, yoga and karma to enlighten the intellect and purify the heart as Advaita is the awareness of the ‘Divine’.

A famous quote from Vivekacūḍāmaṇi, one of his prakarana granthas that succinctly summarises his philosophy is:

Brahma satyaṃ jagat mithyā, jīvo brahmaiva nāparah

Brahman is the only truth, the spatio-temporal world is an illusion, and there is ultimately no difference between Brahman and Atman(individual self).

He was the first person who proposed the Concept of Indivisible atoms in his Advaita. In his works, Advaita, he explained philosophy as well as Atomic Science. 

Albert Einstein proposed the 'Theory of Relativity' after being inspired from works of Sri Shankaracharya's Advaita philosophy. Advaita and Theory of Relativity have many similarities.

Adi Shankaracharya is the Father of Particle Physics, says Prof. V Suryanarayana Rao, Chairman of Foundation of Vedic Sciences. Shankara's diagram in SOUNDARYA LAHIRI of the PADMA (lotus) has been discovered as the source of God Particle by scientists with the recent accelerator experiment when the thousand-petalled lotus manifested while they brought proton in collision with another proton of the same particle. The Sri Chakra with its pinnacle, Mahameru, the tip of the iceberg, is the representation of the entire process of creation, sustenance to destruction with the triangles being the forces of Shiva (pure consciousness/spirit) and Shakti (energized consciousness/matter). There is ONE PARABRAHMAN (eternal, indescribable, attributeless, Nirguna) which is reflected as the world of MAYA (moving, filled with attributes, Saguna).  A cosmic creative vibration (called sphota or explosion) arises between Shiva and Shakti called Nada. This Nada then gets consolidated into Shabda Brahman (differentiated sound energy), the universal cosmic resonance, symbolized by Om. From this arises cosmic intelligence that is responsible for the creation.

According to some followers of Advaita, the non-dual monistic philosophy propounded by Adi Shankara, Advaita may very well be a place where the scientific world intersects with the spiritual world. They point to the relationships between mass, frequency, wave and energy that 20th century physics has established and the Advaitic ‘Unity of the Universe’ as the common ground. They feel that these relationships, formalized as equations by Planck and Einstein, suggest that the whole mesh of the Universe blend into a One that exhibits itself as many. This follows Advaita's view that everything is but the manifestation of a “One.” The scientific investigations show that a living body has an internal energy pattern of millions of sparkling lights and experiments suggest that the energy is neither electric nor electromagnetic. Some scientists thought that the energy was an emanation from nerve endings, but they were baffled to see that plants also possessed this energy pattern without any nervous system at all! 

The meanings of terms such as space and time take different dimensions when physics comes out with new discoveries and theories such as what Albert Einstein proposed where one is taken to the sphere of spacelessness and timelessness. The modern scientist is aware that he is standing on some strange shores. Einstein remarked that the most beautiful and the most profound emotion we can experience is the sensation of the most mystical.  It is the source of all true art and science. Einstein rewrote the Newtonian concepts and revolutionized science. In a nutshell, it is observed that while moving, particles of elements disappear in our vision because mass times the square of the speed of light is being converted into energy. This was the turning point towards a trend to resolve several differences between the two so-called loggerheads, science and spirituality. The length of a train while static and while in motion, the speed of a moving object as observed by us when we are standing still and while moving ourselves, the time shown by wrist watches on people in a running train and clocks along the stations, the curves in space that cause magnetic attraction and gravitational fields and the importance of light that steadily travels in space at an unimaginable speed are observations that would baffle unless one accepts the spiritual stream flowing underneath. From the higher point of the changeless Absolute, everything is in constant change, hence relative.

Max Planck, the eminent physicist, who revolutionized modern physics with his quantum theory observes that as a physicist, i.e., as a man who has devoted his life to the most matter of fact branch of science, namely the investigation of matter, he is surely free of any suspicion or fanaticism.  After his research into the atom, he says, there is no such as matter per se!  All matter originated from and consists of a force which sets the atomic particles in oscillation and concentrates them into minute solar systems of the atom. Since he did not believe in an intelligence or an internal force in the universe, he assumes a conscious intelligent spirit behind the force and calls this force, the basic principle of all matter. The Rishis called this energy body as Pranamaya-kosha. By prana they did not mean ordinary energy or breath. Prana is the vital energy associated with the Universal consciousness or it is the ‘force’ of a ‘conscious intelligent spirit.’ Therefore, they maintained that by the proper control and channelizing of the prana, man could expand his consciousness and evolve to higher states of being. How well the nuclear physicist Werner Heisenberg amplifies this and suggests that we should revere those things beyond science which really matter and about which it is difficult to speak.

Notable scientists like Erwin Schrodinger and Robert Oppenheimer were also Vedantists. Fritjof Capra's book, The Tao of Physics, is one among several that pursue this viewpoint as it investigates the relationship between modern, particularly quantum physics and the core philosophies of various Eastern religions, including Hinduism, Buddhism and Taoism. The author is enthralled by the beauty and mystery of NATARAJA and says there is a close connection between the dance of vibrations in the Quantum theory and the dance of Nataraja.

The intensive study on electric energy, electromagnetism, radioactivity, particles, wave theories, quantum physics and so on, have over the years led to an undeniable connection between the deepest truths and principles propounded in the sacred Vedas and Upanishads and scientific theories.

Adi Shankarcharya lived only for 32 years. He died in 477 BC. In his short lifespan of 32 years, He wrote commentries on Karma siddhantam, Brahma sutras and Bhagavadgita which form foundation stones for understanding Hinduism.

Source: Some of the Information is collected from वेद and http://www.narthaki.com/info/articles/art343.html