Friday 25 August 2017

ఉత్తరానికి తల పెట్టి ఎందుకు నిద్రించకూడదు? గణేశుని కథలో ఈ విషయం వెనుకనున్న అంతరార్ధం ఏమిటి?



గణేశుని కథలో ఈ విషయం వెనుకనున్న అంతరార్ధం ఏమిటి?

గౌరీ పుత్రుని తల నరికిన తర్వాత, ఆ బాలకునికి కొత్త శిరస్సు పెట్టి జీవం పోయడానికి శివుడు తన గణాలను పంపిస్తాడు. ఉత్తరదిశగా తలపెట్టి నిద్రిస్తున్న జీవి తలను పట్టుకుని రమ్మని చెప్తాడు. గజాసురుడు ఉత్తరానికి తలపెట్టి నిద్రించగా, ఆయన తలను నరికి తీసుకువస్తారు. అయితే ఈ కథ చెప్పినప్పుడు పెద్దలు గట్టిగా చెప్పేమాట- ఉత్తరానికి తల పెట్టి నిద్రపోవద్దు అని. అసలు ఎందుకు అలా నిద్రించకూడదు?

సద్గురు జగ్గీ వాసుదేవ్ గారు ఈ విషయాన్ని అనేక మార్లు వివరించారు. దాని నుంచి కొంత.

దైవం మీ శరీరాన్ని ఎలా నిర్మించారు?

మీ గుండె, మీ శరీరం మధ్యలో ఉండదు. కిందినుండి శరీరానికి మూడు వంతులపైన అది ఉంటుంది. దీనికి కారణం ఏమిటంటే, గురుత్వాకర్షణకు వ్యతిరేకదిశలో రక్తాన్ని పంపడం కష్టం, కిందికి పంపడం తేలిక. పైకి వెళ్లే రక్తనాళాలు కిందికి వెళ్లే రక్తనాళాల కంటే సన్నగా ఉంటాయి. అవి మెదడులోకి చేరుకునే సరికి, వెంట్రుక అంత సన్నగా అయిపోయి ఒక్క చుక్క రక్తాన్ని కూడా అధికంగా తీసికొని వెళ్లే సామర్థ్యం కలిగి ఉండవు. ఒక చుక్క అధికంగా పంపు చేసినా ఏదో ఒక నాళం పగిలిపోయి మీకు మెదడులో రక్తస్రావం జరుగుతుంది.

చాలామందికి వారి మెదళ్లలో రక్తస్రావం కలుగుతుంది. మిమ్మల్నిది పెద్దగా దెబ్బతీయక పోయినా చిన్న నష్టాలు మాత్రం కలిగిస్తుంది. మీరు కొంత మందబుద్దులుగా అవుతారు, చాలామంది అలానే అవుతున్నారు కదా. 35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది. మీ వ్యవహారాలు మీరు నడుపుకోగలగడానికి కారణం మీ జ్ఞాపకశక్తే తప్ప, మీ మేధస్సు కాదు.

మీరు ఉత్తరదిశగా తలపెడితే ఏం జరుగుతుంది?

మీకేదయినా రక్తసంబంధమైన సమస్య, ఉదాహరణకు రక్తహీనత ఉంటే మీ డాక్టరు, మీకు ఏమిస్తాడు? ఇనుము. మీ రక్తంలో అదొక ముఖ్యమైన పదార్థం. భూగోళం మీద అయస్కాంత క్షేత్రాల  గురించి మీరు వినే ఉంటారు. అనేక విధాలుగా భూమి నిర్మాణం దాని అయస్కాంతం కారణంగానే జరిగింది. ఈ భూగోళం మీద అయస్కాంత శక్తుల శక్తి అది.

35 ఏళ్ల వయస్సు తర్వాత మీరెంతో జాగ్రత్త తీసికోకపోతే మీ మేధస్సు కొంత తగ్గుతుంది.

మీ శరీరం బల్లపరుపుగా ఉన్నప్పుడు మీ నాడి వేగం తగ్గిపోవడం మీరు గమనించవచ్చు. మీ శరీరం వెంటనే సర్దుబాటు చేసుకుంటుంది కాబట్టి ఇలా జరుగుతుంది. లేకపోతే అదే స్థాయిలో రక్తప్రసరణ జరిగినట్లయితే రక్తం మీ మెదడులోకి అధికంగా వెళ్లి హాని చేస్తుంది. మీరు ఉత్తరానికి తలపెట్టి 5, 6 గంటలు పడుకున్నట్లయితే అయస్కాంత ఆకర్షణ మీ మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. మీకు కొంత వయస్సు మళ్ళితే మీ రక్తనాళాలు బలహీనమై రక్తస్రావాలు కలుగుతాయి, పక్షవాతం వస్తుంది. మీ వ్యవస్థ దృఢంగా ఉండి ఇటువంటి సంఘటనలు మీకు జరగకపోవచ్చు కాని మీరు నిద్రపోతున్నప్పుడు మీ మెదడులో ఉండవలసిన దానికంటే ఎక్కువ రక్తప్రసరణ జరిగితే మీరు ఆందోళనతో మేల్కోవలసి వస్తుంది. ఇలా జరిగితే ఒక్కరోజులో మీరు చచ్చిపోతారని కాదు. కాని మీరు రోజూ ఇదే విధంగా చేస్తే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే. అలాగే ఉత్తరానికి తలపెట్టి నిద్రిస్తే, సుఖనిద్ర ఉండదు, రక్తపోటు (బీపీ) వస్తుంది. మీ వ్యవస్థ ఎంత దృఢంగా ఉందన్నదాన్ని బట్టి మీకు వచ్చే సమస్యల స్వభావం ఉంటుంది.

అందువల్ల మీరు ఏవైపు తలపెట్టి నిద్రించడం అన్నిటికంటే మంచిది? తూర్పు అన్నిటికంటే మంచిది. ఈశాన్యం పరవాలేదు, పడమర కూడా మంచిదే. తప్పనిసరి అయితే దక్షిణం. ఉత్తరం మాత్రం కూడదు. మనం భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్నప్పుడు మీరు ఉత్తరానికి తప్ప మరేవైపైనా తలపెట్టుకొని నిద్రపోవచ్చు. దక్షిణార్ధ గోళంలో ఉన్నప్పుడు దక్షిణానికి మాత్రం తలపెట్టకూడదు. ఎందుకంటే అక్కడి అయస్కాంత క్షేత్రం యొక్క పనితీరు వేరు. అక్కడ ఉన్నవారు దక్షిణానికి తలపెట్టి నిద్రించకూడదు.

సేకరణ: http://isha.sadhguru.org/blog/te/2016/08/15/how-to-sleep/

No comments:

Post a Comment