రెండవ అధ్యాయము
యస్యదేవే పరాభక్తిర్- యథా దేవే తథా గురౌతస్యైతే కథితా హ్యర్థాత్ ప్రకాశాంతే మహాత్మనః
భగవంతుని పట్ల ఎవరి భక్తి గొప్పగా ఉంటుందో, ఎవరు తన గురువుని భగవంతునిగా భావించి పూజిస్తారు/ భగవంతునికి సమానంగా చూస్తారు/ అటువంటి గొప్ప జీవులకు/మహాత్ములకు పవిత్ర గ్రంథాలలో ఉన్న వాక్యాలు వాటికవే తెలియబడతాయి. (శ్వేతాశ్వతరోపనిషత్తు)
గురువు యొక్క ఆదేశాలను/సూచనలు తు.చ. తప్పకుండా పాటించేవాడు, మార్గంలో అల్పస్థాయిలో ఉన్న జీవులకు గురువు యొక్క ఉపదేశాలను ప్రబోధం చేస్తూ, జీవితాంతం గడిపేవాడే శిష్యుడు.
నిజమైన శిష్యుడు గురువు యొక్క దివ్యమైన స్వరూపం గురించే పట్టించుకుంటాడు. గురువు యొక్క మానవ చేష్టితములు శిష్యునకు పట్టవు. అతను వాటిని పూర్తిగా మరిచిపోతాడు/ విస్మరిస్తాడు. అతనికి తన గురువు సంప్రదాయం విరుద్ధంగా నడిచినప్పటికీ, ఆయనే గురువని విశ్వాసంతో ఉంటాడు. ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, తపస్సంపన్నుడైన మహా పురుషుని యొక్క స్వభావము చాలా గంభీరమైనది. అతనిలో దోషములు ఎంచకండి, తీర్పులు చెప్పకండి. మీ యొక్క అజ్ఞానం అనే కొలబద్దతో అతని దివ్య స్వభావమును కొలిచే ప్రయత్నం చేయకండి. విశ్వ దృష్టితో గురు చేసే చేష్టలను విమర్శించవద్దు.
నిజమైన శిష్యత్వం కళ్ళు తెరిపిస్తుంది. ఆధ్యాత్మికమైన జ్వాలను రగిలిస్తుంది. శక్తులను మేల్కొలుపుతుంది. వ్యక్తి యొక్క జీవితంలో ఆధ్యాత్మికపథంలో అది అత్యంత అవసరమైనది మరియు. గురు శిష్యుడు ఒక్కటే అవుతారు. గురువు దీవించి, మార్గదర్శనం చేసి, శిష్యుడుని ప్రేరేపిస్తారు. ఆయన శక్తిని ప్రసాదించి, పరివర్తన కలిగించి, ఆధ్యాత్మకీకరణం చేస్తారు.
గురువులు దగ్గరకు వెళ్లడానికి ఎవరు అర్హులు?
ఒక గురువు దగ్గరకు వెళ్లాలంటే, నీకు తగిన అధికారం ఉండాలి. సరైన అవగాహన శక్తి, వస్తువుల పట్ల బంధరాహిత్యము, ప్రశాంతమైన మనస్సు, ఇంద్రియనిగ్రహము, అల్పమైన/భౌతిక కోరికలు లేనితనం, గురువు యందు విశ్వాసం మరియు దైవమందు భక్తి అనేవి గురువును సమీపించే వారికి ఉండాల్సిన అవసరమైన సాధనములు.
మోక్షతృష్ణ ఉన్నవానికి, శాస్త్ర వాక్యాల పట్ల గౌరవం ఉన్నవానికి; కోరికలను, ఇంద్రియాలను నిగ్రహించుకున్నవానికి; స్థిరమైన, ప్రశాంతమైన మనసు ఉన్నవానికి; దయ, దివ్యప్రేమ, వినయము, తితిక్ష, క్షమా మొదలైన సద్గుణాలు కలిగిన వారికి మాత్రమే గురువు ఆధ్యాత్మిక బోధ/ ఉపదేశాలను చేస్తాడు. ఎప్పుడైతే శిష్యుని యొక్క మనస్సు కామరహిత/ కోరికలు లేని స్థితికి చేరుతుందో, అప్పుడే పరబ్రహ్మము గురించి నీగూఢమైన మర్మాల యొక్క ఉపదేశము ఫలించి జ్ఞానము కలుగుతుంది.
No comments:
Post a Comment