Sunday, 15 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 8వ భాగము



శక్తి సంచారము

నీవు ఒక మనిషికి కమలాపండు ఇచ్చిన విధంగానే, అలాగే ఆధ్యాత్మిక శక్తిని కూడా ఒకరి నుంచి మరొకరికి ఇవ్వవచ్చు. ఈ విధంగా ఆధ్యాత్మిక శక్తులను బదిలీ చేయడాన్ని లేదా ప్రసరించడాన్ని శక్తి సంచారము అంటారు. శక్తి సంచారంలో, సద్గురువు యొక్క ఒకానొక ఆధ్యాత్మిక తరంగం శిష్యుని యొక్క మనస్సులోకి బదిలీ అవుతుంది.

శక్తి సంచారానికి ఏ శిష్యుడు తగినవాడని గురువు భావిస్తారో, ఆ శిష్యునకు ఆధ్యాత్మిక శక్తి ప్రచురించబడుతుంది. గురువుకేవలం తన చూపు, ఆలోచన, మాట, సంకల్పం లేదా స్పర్శ ద్వారా ఒక శిష్యుడిని మార్చగలరు.

శక్తి సంచారము అనేది పరంపర ద్వారా వస్తుంది. అది నిగూఢమైన, మార్మిక శాస్త్రము. అది గురువు నుంచి శిష్యులకు అందుతుంది. 

స్వామి సమర్థ రామదాసు గారి శిష్యుడు, తన మీద మోహం పెంచుకున్న ఒక నాట్యగెత్తె కూతురుకు తన శక్తిని ప్రసరించారు. ఆ శిష్యుడు ఆమె వైపు చూసారు మరియు ఆమెకు సమాధిస్థితిని ఇచ్చారు. ఆమె యొక్క కామము తుడిచిపెట్టుకొని పోయింది. ఆమె ఎంతో ధార్మికంగా మరియు ఆధ్యాత్మికంగా మారిపోయింది. శ్రీకృష్ణ భగవానుడు సూర్‌దాస్ యొక్క గుడ్డి కళ్ళను ముట్టుకున్నాడు. సూర్‌దాస్ యొక్క అంతఃనేత్రాలు తెరుచుకున్నాయి. అతనికి భావసమాధి కలిగింది. గౌరంగుడు తన స్పర్శ ద్వారా అనేకమంది వ్యక్తులలో ఆధ్యాత్మిక మత్తు కలిగించి, వారిని తన వైపునకు మార్చుకోగలిగాడు. ఆయన స్పర్శతో నాస్తికులు సైతం వీధులలో ఆనందంతో నాట్యమాడి, హరి యొక్క గానం చేశారు.

గురువు నుంచి శక్తులను పొందడంతోనే శిష్యుడు సంతృప్తి చెందకూడదు. పూర్ణత్వాన్ని మరియు ఇంకా ఎన్నో సాధించడానికి అతను తీవ్రంగా కష్టపడాలి. శ్రీరామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుని స్పృసించారు. స్వామి వివేకానందకు దివ్యానుభూతి కలిగింది. కాని ఆ తర్వాత కూడా ఆయన పూర్ణత్వం పొందడానికి మరో ఏడేళ్ళు శ్రమించారు.

No comments:

Post a Comment