Friday 20 September 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 11 వ భాగము



గురు సేవ
ప్రారంభంలో సాధకులు తమ యొక్క మొత్తం దృష్టిని నిరంతరం గురుసేవ మీదేనే కేంద్రీకరించాలి. నీ గురువుని దివ్యమైన భావముతో సేవించు. ఇతరుల నుంచి తాను వేరు అనుకునే భయానకమైన రోగం తొలగిపోతుంది.

ఓడ ఒక్క నావికుడు ఎల్లప్పుడు జాగురూకతతో ఉంటాడు. చేపలు పట్టే వాడు ఎల్లవేళలా జాగురూకతతో ఉంటాడు. ఆపరేషన్ థియేటర్ లో చికిస్తా సమయంలో ఎల్లవేళలా జాగురూకతతో ఉంటాడు. అలాగే ఆధ్యాత్మిక తృష్ణ కలిగిన శిష్యుడు తన గురువు యొక్క సేవలు ఎల్లప్పుడు జాగరూకతతో ఉండాలి.

గురు సేవ కోసమే జీవించు. అవకాశాల కోసం ఎదురుచూడు. పిలిచి సేవకు అవకాశం ఇవ్వాలని గురువు చెప్పేదాకా ఎదురుచూడకు. గురుసేవ కోసం నీకు నువ్వే ముందుకు వెళ్ళు.

నీ గురువును వినయంతో, ఇష్టంతో, ప్రశ్నలకు తావు లేకుండా, అహంకార రహితంగా, లోభత్వం లేకుండా, సంపూర్ణముగా, అలసట లేదా విసుగు చెందకుండా, ప్రేమతో సేవించు. గురువును సేవించడంలో నీవు ఎంత ఎక్కువ శక్తిని వినియోగిస్తే, అంత ఎక్కువ దివ్య శక్తి నీలోకి ప్రవహిస్తుంది.

గురువు సేవించేవాడు సమస్త ప్రపంచాన్ని సేవిస్తాడు. స్వార్థపూరిత ఆలోచనలు లేకుండా గురువుకు సేవ చెయ్యి. గురువుకు సేవ చేస్తున్న సమయంలో నీలో ఉండే గుణాలను లేదా ఆలోచనలను జాగ్రత్తగా పరిశీలించు. పేరు, కీర్తి, సంపద, అధికారం మొదలైన విషయములను ఆశించకుండా గురువుకు సేవ చేయాలి.

గురువు పట్ల విధేయత

గురువు పట్ల గౌరవం చూపడం కంటే విధేయతతో ఉండటం మేలు. విధేయత అనేది ఒక గొప్ప సద్గుణము. ఎందుకంటే నీవు విధేయతను అలవరుచుకునే ప్రయత్నం చేస్తే, ఆత్మజ్ఞానానికి లేదా ఆత్మసాక్షాత్కారానికి బద్ధశత్రువైన అహంకారం మెల్లి మెల్లిగా వ్రేళ్ళతో సహా నశించిపోతుంది.

గురువు చెప్పిన దానిని పాటించే శిష్యుడు మాత్రమే, తన లో ఉన్న అల్పమైన గుణముల మీద ఆధిపత్యం కలిగి ఉంటాడు. విధేయత అనేది చాలా ఆచరణాత్మకంగా, సంపూర్ణ హృదయంతో, నిరంతరం పట్టు వదలని విధంగా ఉండాలి. గురువు పట్ల నిజమైన విధేయత అంటే మొండికేయడం, వాయిదా వేయడం, అలసత్వం ప్రదర్శించడం లేదా ప్రశ్నించడం వంటివి కూడదు. ఒక కపట శిష్యుడు భయంతో గురువు పట్ల విధేయత చూపుతాడు. నిజమైన శిష్యుడు తన గురువు యొక్క ఆజ్ఞను శుద్ధమైన ప్రేమతో ప్రేమ కొరకే పాటిస్తాడు.

గురువు ఆజ్ఞను ఎలా పాటించాలో తెలుసుకో! గురువుకు విధేయంగా ఉండటం నేర్చుకో. అప్పుడు మాత్రమే నీవు ఆధిపత్యం చలాయించగలవు. శిష్యునిగా ఎలా ఉండాలో నేర్చుకో. అప్పుడు మాత్రమే నీవు గురువు కాగలవు.

గురువుకు శరణాగతి చేయటం, ఆయన ఆజ్ఞను పాటించడం, విధేయుడై ఉండటం మరియు ఆయన చెప్పిన సూచనలను ఆచరించడం బానిస మనస్తత్వానికి సంకేతము అనే కపటమైన ఆలొచన లేదా భృఅంతిని వదిలిపెట్టు. వేరొక వ్యక్తి యొక్క ఆజ్ఞ పాటించడం లేదా అతనికి శరణాగతి చేయడం తన మర్యాదకు లోపమని, స్వేచ్ఛకు విరుద్ధమని అజ్ఞాని భావిస్తాడు. చాలా పెద్ద పొరపాటు. నీవు జాగ్రత్తగా ఆలోచిస్తే, వాస్తవంలో నీ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ, నీ అహంకారానికి మరియు డాంబికానికి పరిపూర్ణంగా బానిసగా మారింది. ఇదంతా విషయాశక్తి గల మనస్సు యొక్క చిత్త చాపల్యము మాత్రమే. ఎవడైతే తన మనస్సు మరియు అహంకారం మీద విజయం సాధిస్తాడో, అతడే నిజమైన స్వేచ్ఛ గల మనుష్యుడు. అతడే వీరుడు. అటువంటి విజయాన్ని సాధించడానికి మానవుడు ఒక గొప్ప ఆధ్యాత్మికతకు ప్రతిరూపమైన గురువుకు శరణాగతి చేస్తాడు. ఈ శరణాగతితో అతను తనలో ఉన్న అల్పమైన అహంకారాన్ని తొలగించుకొని అనంతమైన సచ్చిదానందాన్ని అనుభూతి చెందుతాడు.

No comments:

Post a Comment