Monday, 31 August 2020

కంచి పరమాచార్య స్వామి వారి అమృత వచనాలు - గణపతి (10)



అతడు సమస్త జగత్తునకు చెందినవాడు


సాదాసీదా జనులందరికీ అందుబాటులో ఉంటాడు. గణపయ్య పసుపుతోనో, మట్టితోనో, గోమయంతోనో అతని విగ్రహాన్ని చేసి పూజించవచ్చు. మట్టి ప్రతిమ రూపంలో, శిలా రూపంలో సాధారణంగా సాక్షాత్కరిస్తాడు. 

మిగతా దేవతలకు బోలెడంత తతంగం ఉంది. ప్రాణ ప్రతిష్ట హడావిడి యుంది. కానీ గణపయ్యకై అంత శ్రమ పడనవసరం లేదు.

మిగతా దేవతలను పూజించాలంటే ఫలానా కాలంలో, స్నానం చేసి పూజా సామాగ్రితో బయలు దేరాలి. వెళ్ళినా తిన్నగా మూర్తి దగ్గరకు వెళ్ళలేం. దూరంగా ఉండే దర్శనం చేసుకోవాలి. ఇవేమీ అక్కరలేదు మన స్వామికి. దేశంతో కాని, కాలంతో కాని నిమిత్తం లేకుండా చెయ్యెత్తి మ్రొక్కితే చాలు, పలుకుతాడు. విగ్రహం కనిపిస్తే చాలు, అప్రయత్నంగా చేతులెత్తి మొక్కుతాం• చేతులతో చెవులను తాకిస్తాం. గుంజిళ్ళు తీస్తాం. పని ముగించుకుని కదిలి పోతాం. చిత్తానికి శాంతి సమకూరుతుంది.  

అతని ఆలయం ఒక గదిలో ఉంటుంది. కాబట్టి ఎవరైనా సమీపించవచ్చు. దేవాలయ ప్రవేశం అంటూ చట్టాలవసరం లేదు కూడా మిగతా. దేవతల మందిరాలకు ప్రహరీ గోడలని, అంతరాళ మంటప్మని, ముఖమంటపమని, గర్భగుడియని ఏవేవో భేదాలుంటాయి. ఇవేమీ లేవు మన స్వామికి. 

No comments:

Post a Comment