శ్రీ విష్ణురూపాయ నమః శివాయ
నవబరు14-ఆకాశదీపప్రారంభం
ఈ రోజు నుండు కార్తీకమాసం పూర్తయ్యే వరకు ఆకాశదీపాన్ని వెలించాలని శాస్త్రం చెబుతోంది.ఈ ఆకాశదీపాన్ని వెలించేటప్పుడు
"దామోదరాయా నభసి తులాయాం లీలయా సహ|
ప్రదీపం తే ప్రయచ్ఛామి నమో అనంతాయ వేధసే||"
అని చదివి వెలింగించాలి.
ప్రతి ఇంట్లోనూ,దేవాలయంలోనూ వెలిగించాలి,ఈ దీపాన్ని వెలిగించినా,చూసినా సకలపాపాలు నశించి అనంతమైన పుణ్యం కలుగుతుంది.
ఈరోజు నుండి కార్తీకమాసం మొత్తం కార్తీకపురాణం చదవాలని,సూర్యోదయానికి ముందే స్నానం చేయాలని,ఉదయం,సాయంత్రం ఇంటిగడపకు రెండు వైపులా,అలాగే తులసిమొక్క వద్ద,దేవాలయాల్లోనూ దీపాలను వెలిగించాలని శాస్త్రం చెప్తొంది.
No comments:
Post a Comment