DIWALI MESSAGE FOR STUDENTS
ఓం గణపతయే నమః;ఓం సరస్వత్యై నమః;ఓం మహాలక్ష్మ్యై నమః
దీపావళి అమావాస్య రోజున జరుపుకుంటాం.అమావాస్య అంటే చీకటి.చీకటి రాత్రి ఎవరి ఇంట దీపాలు ఉంటాయో వారి ఇంటికి లక్ష్మీ దేవి వస్తుంది.మనం కాస్త తాత్వికంగా ఆలోచిస్తే ఇది విద్యార్ధులకు సందేశం ఇస్తుంది.చీకటి అజ్ఞానానికి,దీపం జ్ఞానానికి ప్రతీక.మొత్తం లోకమంతా అజ్ఞానంలో మగ్గుతున్నా,ఎవరు తమలో జ్ఞాన దీపాలు(చదువును)వెలిగిస్తారో వారిని మాత్రమే లక్ష్మీ అనుగ్రహిస్తుంది.అంతేకాదు దేవాలయాలు,మఠాలు,పెద్దల ఇళ్ళవద్ద,నాలుగు వీధులు కలిసే చోట దీపాలను వెలిగించాలన్నారు.అంటే నీకున్న జ్ఞానంతో సమాజంలో అజ్ఞానమనే చీకటిని తొలగించే ప్రయత్నం చెయ్యి.అప్పుడు లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది.లక్ష్మీ దేవి పూజలవల్ల కాదు చదువు వల్ల వస్తుంది.అందుకే విద్యార్ధులారా!మీలో జ్ఞానదీపాలు వెలిగించండి.దీపం(చదువు,జ్ఞానం)లేకుండా లక్ష్మీ రాదని గుర్తుపెట్టుకోండి.
అందువల్ల విద్యార్ధులు సరస్వతి దేవి అనుగ్రహంతో బాగా చదివి లక్ష్మీ దేవి అనుగ్రహం పొందమని దీపావళి గుర్తుచేస్తోంది.
అందరికి దీపావళి శుభాకంక్షలు.
No comments:
Post a Comment