Thursday, 15 November 2012

నాగుల చవితి

కార్తీక శుద్ధచవితిని నాగులచవితిగా జరుపుతారు.మన దేశంలో ప్రాచీన కాలం నుండి నాగపూజ చేసే ఆచారం ఉంది.పూజించడం అంటే గౌరవించడం అని అర్ధం.

నాగులచవితి రోజున ఉపవాసం ఉండి పాముపుట్టను పూజించాలి.ఈ పూజలో పత్తితో చేసిన వస్త్రం,యజ్ఞోపవీతం లాంటి వాటితో పుట్టను అలంకరించి,పుట్టలో ఆవుపాలు పోయాలి.పుట్టను పూజించే అవకాశం లేనప్పుడు నాగవిగ్రహాన్ని పాలతో అభిషేకించాలి.సాధారణంగా ప్రతిచోట ఆలయాలలోనూ,రావి,వేప చేట్ల క్రిందా ఈ నాగవిగ్రహాలు ఉంటాయి.ఈ పూజలో నువ్వులపిండి,చలిమిడి,వడపప్పు,చిమ్మిలి నివేదనగా సమర్పించాలి.ఈ రోజు పూర్తి నిరాహారంగా ఉండలేని వారు నూనె తగలని,ఉడకని పదార్ధలను మాత్రమే తినాలి.

మరునాడు ఇంట్లో బంగారంతో కాని,వెండితో కాని,కొయ్యతో(చెక్క) కాని,మట్టితో కాని చేసిన నాగప్రతిమను పంచామృతాలతోనూ,జాజి,సంపెంగ లాంటి సువాసనగల పూలతోనూ పూజించాలి.

ఈ నాగపూజవలన సర్పదోషాలు నశిస్తాయి.సర్ప భయం ఉండదు.గర్భదోషాలు నివారింపబడతాయి.కళ్ళు,చెవులకు సంబంధించిన వ్యాధులు రావని చెబుతారు.
 సేకరణ-శ్రీ శైలప్రభ అక్టోబరు 2012

No comments:

Post a Comment