Sunday, 3 February 2013

మన దేవాలయాలు-9

ఓం గం గణపతయే నమః
ఆదివారం-ప్రత్యేకం
మన దేవాలయాలు-9
దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ప్రదక్షిణం గురించి మరిన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.

దేవాలయంలో విగ్రహప్రతిష్ట చేసే సమయంలో విగ్రహం క్రింద పంచలోహాలు వేస్తారు. అలాగే ద్వజస్థభం క్రింద కూడా పంచలోహాలు వేస్తారు. ఇవి భూమిలో ఉన్న విద్యుతయస్కాంత్ శక్తిని ఆకర్షిస్తాయి. సైన్సు ఏమి చెబుతోందంటే?  Nulei/ Nucleus చుట్టూ Electrons వృతాకారంలో తిరుగుతుంటాయి. అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది. వీటికి దగ్గరలో కూడా ఇదే విధమైన ప్రక్రియ( Nucleus/ Nulei చుట్టు Electrons తిరగడం) జరుగుతుంటే, ఇవి పరస్పరం ఆకర్షణకు గురవుతాయి. వాటి మధ్య మరింత బలమైన బంధం ఏర్పడి, అక్కడ ఉన్న  Electrons అన్నీ కూడా వృత్తాకారంలో అంటే కుడి నుంచి ఎడమకు తిరగడం వలన అక్కడ ఒక విద్యుతయస్కాంత్ క్షేత్రం ఏర్పడుతుంది.

దేవాలయంలో కూడా ఇదే జరుగుతుంది. ఆలయంలో ఉన్న మూలవిరాట్టు(ప్రధాన విగ్రహం), ఆయన వాహనం, ద్వజస్థభం మధ్య ఒక శక్తివంతమైన శక్తి క్షేత్రం ఏర్పడుతుంది. మనం కూడా కుడి నుండి ఎడమకు దైవం చుట్టూ తిరిగితే,మన శరీరంలోనికి ఆ విద్యుతయస్కాంత్ శక్తి ప్రవేశిస్తుంది.  అందుకే ప్రదక్షిణంలో మనం కుడి నుండి ఎడమకు తిరుగుతాం. అంటే మన కుడి చేయి వైపు దైవం ఉండేలా చూసుకోవాలి. ఇది ప్రదక్షిణంలో ఉన్న అంతరార్ధం.

అసలు ప్రదక్షిణ ఏలా చేస్తే మన శరీరానికి శక్తి అందుతుంది? ప్రక్షిణం ఎలా చేయాలని శాస్త్రం చెప్తోంది?

ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కుని, ద్వజస్థంభం దగ్గర నమస్కరించి మొదలుపెట్టాలి. ఎలా పడితే అలా వేగంగా తిరగడం కాదు, పచ్చికుండలో నిండుగా నూనె నింపుకుని, ఒక 9 నెలల గర్భిణీ స్త్రీ ఆ పచ్చి కుండను ఎత్తుకుని, ఆ నూనె క్రింద పడకుండా ఎంత జాగ్రత్తగా, మెల్లగా నడుస్తుందో, అంతే మెల్లగా, నెమ్మదిగా ప్రదక్షిణం చేయాలని శాస్త్రం చెప్తోంది. అలా చేస్తేనే దేవాలయంలో ఏర్పడే విద్యుతయస్కాంత్ క్షేత్రం యొక్క శక్తి మనకు అందుతుంది. రోజూ వేగంగా 100 ప్రదక్షిణలు చేయడం కంటే శాస్త్రానుసారం 3 ప్రదక్షిణలు చేయండి చాలు.

మరిన్ని వివారాలు తరువాయి భాగంలో తెలుసుకుందాం.      

దేవాలయో రక్షతి రక్షితః
(దేవాలయాల రక్షణే మన రక్షణ)

ఓం శాంతిః శాంతిః శాంతిః
to be continued.............

No comments:

Post a Comment