హైద్రాబదులో అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటి దిల్ సుఖ్ నగర్. నిత్యం వేలాది మంది ప్రయాణం చేసేవాళ్ళూ, పెద్ద పెద్ద షాపింగ్ మాళ్ళు, చిన్నా చితక వ్యాపారాలు, అక్కడే ఒక బస్ స్టాండు, కోచింగ్ సెంటర్లు, తిఫిన్ సెంటర్లు, కాలేజిలతో నిత్యం కళకళాడుతూ ఉండే ప్రాంతం అది. సాయంత్రం అయితే ఈ రద్దీ మరీ ఎక్కువగా ఉంటుంది. అందరూ ఇళ్ళకు చేరే సమయం కూడా అది. 21-2-2013 సాయంత్రం ఎప్పటిలాగే ప్రాశంతంగా అందరూ ఇళ్ళకు చేరుకుటున్న సమయంలో జరిగిన బాంబు దాడి ఎంతో మందికి చేదు అనుభవాన్ని మిగిల్చింది.
బాంబు పేలగానే అందరు షాక్ కు గురయ్యారు. చాలామంది భయభ్రాంతులకు గురై పరుగులు తీశారు. ఇంకా ఎవైనా బాంబులు పేలుతాయేమొ తెలియని పరిస్థితి. కానీ అక్కడున్న యువతరం బెదరలేదు. బాంబు పేలిన దాదాపు 20 నిమిషాలవరకు అక్కడకు పోలిసులు కానీ, అంబులెన్సులు కాని చేరుకోలేదు. యువత అక్కడినుండి పారిపోలేదు. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి, దైర్యంగా అక్కడ బస్సులలో ఉన్న ప్రయాణీకులను దింపేసి, గాయపడినవారిని త్వరత్వరగా బస్సులలోకి ఎక్కించి ఆసుపత్రులకు పంపించారు. మీడియా వాహానాలు, అంబులెన్సులు అక్కడికి చేరెసరికి అక్కడ దాదాపుగా ఖాళీ చేశారు. అక్కడితో ఆగలేదు, ఫేసుబుక్కు, ట్విట్టరు లో మెసేజిలు పెట్టి రక్తదానానికి క్యూలు కట్టారు యువతరం. ఇది చాలామంచి పరిణామం. ఇది మన యువతరం యొక్క శక్తిని, దైర్యాన్ని, మానవత్వాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది.
కానీ ఈ బాంబు దాడి పాపం ఎవరిది? మాటిమాటికి మన దేశం మీద ఉగ్రవాదులు దాడులు చేస్తుంటే మన రాజకీయవ్యవస్థ ఏం చేస్తోంది? ఇది జరుగుతుందని తెలిసినా, ఇంటలిజెన్సు, పోలిస్ విభాగాలు సమర్ధవంతంగా ఎందుకు ఎదురుకోలేదు? వీటికి కారణం 'ఓటు బ్యాంకు రాజకీయాలు ', అవినీతి, ప్రజలు. ఈరోజు ప్రధాని, ముఖ్యమంత్రి, ప్రతిపక్షనాయకులు, ఇతర రాజకీయనాయాకులంతా ఆ ప్రాంతాన్ని, ఆసుపత్రిలో ఉన్న క్షతగాత్రులను పరమార్శించడానికి క్యూలు కట్టారు. దీనికి ఒక ప్రధాన కారణం 2014 ఎన్నికలు. వీళ్ళకు ప్రజలమీద ప్రేమ లేదు, దేశభక్తి అంతకన్నా లేదు. వీళ్ళకు కావలసినవి ఓట్లు మాత్రమే. వీళ్ళకు జనం ఏమైనా, ఎలా చచ్చినా, ఏ దేశం మీద దాడి జరిగినా పట్టదు. తాము వెళ్ళి పరామర్శిస్తే సానుభూతితో నాలుగు ఓట్లు ఎక్కువ పడతాయాన్న తాపత్రయం అది. కావలంటే ఈ బాంబు దాడి తరువత మన నేతల మాటలను
ఇక ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే లంచం ఇవ్వాలి. పోలిస్ అవ్వడానికి అన్ని అర్హతలున్నా లక్షల్లో లంచం ఇవ్వాలి. లక్షలు పోసి ఉద్యోగం కొనుక్కునవాడు, మరిన్ని లక్షలు సంపాదించాలని చూస్తాడే కాని ప్రజల గురించి పట్టించుకోడు. దానికితోడు మన దేశంలో ఎప్పుడైన పోలిస్ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేసిందా? అసలు అప్పుడు అలా జరగనే లేదు. ఇంటలిజెన్స్ వాళ్ళను ప్రభుతవం తమకు ఎన్నొ సీట్లు వస్తాయో తెలుసుకొవడానికి వాడుకుంటుందే కానీ ఈ దేశభధ్రత కోసం ఉపయోగించడం చాలా తక్కువే అని చెప్పాలి.
మన దేశంలో ఏ ఏ ప్రాంతాల్లో,ఉగ్రవాదులకు పాఠాలు చెప్తున్నారో రాజకీయనాయకులకు, పోలిసులకు, మీడియాకు, ఇంటలిజెన్స్ విభాగాలకు తెలుసు. తెలవడం ఏముంది? అది బహిరంగ రహస్యమే. ఈ విషయం ప్రజలకూ తెలుసు, కానీ ప్రశ్నించరు. వారి మీద చర్యలు తీసుకోకపోయినా సిగ్గులేకుండా మళ్ళీమళ్ళీ ఈ దిక్కుమాలిన నేతలనే గెలిపిస్తారు.
దేశం కోసం పని చేయనివారిని, దేశభక్తి లేనివారిని, ఉగ్రవాదులతో సంబంధం ఉన్న వారిని, అవినీతిపరులను, అధికారదాహం ఉన్నవారిని పదేపదే గెలిపించి చట్టసభలకు పంపుతుంటే, వారు తమ స్వార్ధం కోసం తపిస్తుంటే ఈ దేశం మీద ముష్కరులు దాడులకు దిగకుండా ఎందుకుంటారు?
ఓటుబ్యాంకు రాజకీయాలను కూల్చేయండి. దేశభక్తి కలిగినవారికి, నిజాయతీపరులకు, ఈ దేశం గురించి ఆలోచించేవారికి మాత్రమే మీ ఓటు వేయండి. అప్పుడే దేశం భద్రంగా ఉంటుంది.
జై హింద్

మక్బూల్ ని 'సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వదిలేస్తున్నాం' అని 2009 ఆగస్టు 15న ముఖ్యమంత్రి వైయస్ అధికారికంగా ప్రకటించారు.
ReplyDelete==============================
హైదరాబాద్ పేలుళ్ల ఘటనలో అత్యంత కీలక పాత్ర పోషించాడని అనుమానిస్తున్న మక్బూల్ ని పదేళ్ల శిక్షా కాలం పూర్తయిన 'మంచి ఖైదీల' జాబితాలో మఖ్బూల్, ఖాసీంబేగ్ కూడా చేరిపోయారు. 'సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను వదిలేస్తున్నాం' అని 2009 ఆగస్టు 15న ముఖ్యమంత్రి వైయస్ అధికారికంగా ప్రకటించారు.
http://telugu.oneindia.in/grapevine/2013/dilsukhnagar-bomb-blasts-maqbool-released-112904.html
http://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2013%2Ffeb%2F25%2Fmain%2F25main17&more=2013%2Ffeb%2F25%2Fmain%2Fmain&date=2%2F25%2F2013