Wednesday, 13 February 2013

సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది ఎందుకు?

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ || 

ॐ మిగితా దేవీదేవతలందరూ కలువ,తామర పువ్వుల్లోనూ కూర్చుంటే చదువుల తల్లి సరస్వతి దేవి మాత్రం రాయి మీద కూర్చొని ఉంటుంది ఎందుకు?

ॐ ఏ పువ్వైనా కొంత సమయం మాత్రమే వికసించి ఉంటుంది.ఉదయానికి వికసించిన పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది.కాని రాయి మాత్రం పదిలంగా ఉంటుంది.అంటే మనకు సరస్వతి దేవి ఇస్తున్న సందేశం విద్య,జ్ఞానం మాత్రమే శాశ్వతం.సంపదలు కొంత కాలం మాత్రమే ఉంటాయి అని అర్దం.

ॐ అంతేకాదు మనకు చిన్నప్పటి పద్యాల్లో చదువు గురించి ఒక పద్యంలో"పోదు యుగాంతపు వేళనైనా"అని చదువుకున్నాం.అంటే ప్రపంచ ప్రళయకాలంలో అన్ని నశించినా కూడా విద్య నశించదు. 

ॐ హర్తకుగాదు గోచరం అంటూ దొంగలు పడి అన్నీ ఎత్తుకుపోయినా, విద్యను మాత్రం తీసుకుపోలేరని మన చిన్నప్పుడు చదువుకున్నాం కదా. విద్య పదిలమైనది, శాస్వతమైనది అని తెలియజేయడానికే మన విద్యలతల్లి సరస్వతి దేవి రాయి మీద కూర్చును ఉంటుంది. 

ॐ ఫిబ్రవరి 15, వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి. ఆ రోజు తప్పకుండా అందరూ ఆ తల్లిని ఆరాధించండి.

|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||

No comments:

Post a Comment