శ్రీ నిత్యానంద ప్రభు జయంతి
|| ॐ || హరే రామ హరే రామ, రామ రామ హరే హరే || ॐ ||
|| ॐ || హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే || ॐ ||
ॐ మాఘశుద్ధ త్రయోదశి, శ్రీ నిత్యానంద ప్రభు జయంతి. బెంగాల్ ప్రాంతంలోని ఏకచక్ర అనే చిన్న గ్రామంలో జన్మించారు. 1474 సమయంలో, మాఘశుద్ధ త్రయోదశి రోజున జన్మించిన చైతన్య ప్రభుతో కలిసి కృష్ణభక్తిని ప్రజల్లో పెంపొందించారు. శ్రీ రాముడికి లక్షమణుడి వలె, శ్రీ కృష్ణపరమాత్మకు బలరాముని వలె, శ్రీ చైతన్య ప్రభువులకు తోడుగా ఈయన అవతరించారు.
ॐ శ్రీ కృష్ణపరమాత్మ అవతార పరిసమాప్తి జరిగినా, కలియుగంలో జనులను ఉద్దరించడానికి ప్రతి శతాబ్దంలోనూ అనేకమందిని పంపి స్వామి తన భారతదేశాన్ని, తన ధర్మాన్ని నిరంతరం రక్షిస్తూనే ఉన్నారు. శ్రీ మధ్భాగవతం అంటుంది 'కలౌ నామ సంకీర్తనం'- కలియుగంలో కేవలం భగవంతుని నామాలను జపించడం వల్లనే ముక్తి లభిస్తుంది. ప్రజల్లో ఎప్పుడు భక్తిభావన తగ్గిపోతుందో అప్పుడు మహాపురుషులు ఉద్భవించి జనాన్ని భక్తిమార్గంలో నడిపిస్తారు. అలాంటి అవతారపురుషులలో ఒకరే శ్రీ నిత్యానంద ప్రభు స్వామి వారు.
|| ॐ || హరే రామ హరే రామ, రామ రామ హరే హరే || ॐ ||
|| ॐ || హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే || ॐ ||
No comments:
Post a Comment