|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||
ॐ సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది.
ॐ వేదం అనంతమైన జ్ఞానానికి సంకేతం. వేదం ఈ సృష్టికి ముందే పరమాత్ముడి ద్వారా ఇవ్వబడింది. ఈ రోజు ఆధునిక సైన్సు కనిపెట్టిందని చెప్తున్నా రెడియోలు, టి.వి.లు, కంప్యూటర్లు, శాటిలైట్లు, విద్యుత్తు ఇవ్వన్ని ఎప్పుడొ చెప్పబడ్డాయి వేదంలో. నిజం చెప్పాలంటే అందరూ తెలుసుకోవలసినది వేదమే.
ॐ జపమాల జపానికి
సంకేతం. జపమాలతో సరస్వతి దేవి నిరంతరం జపిస్తూ ఉంటుంది.దాని అర్దం మనకు చదువు రావాలి,జ్ఞానాన్ని పొందాలి అంటే, వచ్చిన దాన్ని అనేక మార్లు రీపెట్ చేయాలి. అప్పుడే
మనకు సారం అర్ధమవుతుంది.
ॐ “తపస్స్వాధ్యాయ నిరతం" అంటే క్రొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన(ఇంట్రస్ట్)ఎంత అవసరమో,తెలిసిన విషయాలను మళ్ళీ మళ్ళీ గుర్తుచేసుకోవడం కూడా అంతే అవసరం అంటుంది మన ధర్మ శాస్త్రం. అందుకే సరస్వతి దేవి ఒక చేతిలో జపమాలను,మరొక చేతిలో వేదాలను ధరించి కనిపిస్తుంది.
ॐ ఫిబ్రవరి 15, వసంత పంచమి, సరస్వతి దేవి జయంతి. ఆ రోజు తప్పకుండా అందరూ ఆ తల్లిని ఆరాధించండి.
|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||
|| ॐ || ఓం సరస్వత్యై నమః || ॐ ||
No comments:
Post a Comment