Tuesday, 22 April 2014

భూమాతను కాపాడటానికి మనమేం చేయగలం

భూమాతను కాపాడలంటే మనమేం చేయగలం?

ముందు కొన్ని చెప్పుకుందాం.

ఉన్న చెట్లను కొట్టకూడదు. కొత్త చెట్లను నాటాలి. పచ్చదనాన్ని పెంచాలి. మన దేశ వాతావరణానికి సంబంధించిన మొక్కలె పెంచాలి.

ప్లాస్టిక్ భూమిలో కలిసిపొవడానికి కొన్ని లక్షల ఏళ్ళు పడుతుంది. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేయకూడదు. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతవరకు తగ్గించాలి.

కరెంటును, నీటిని పొదుపుగా వాడాలి. పొదుపుకు అర్దం అసలు నీరు, కరెంటును వాడకం మానివేయమని కాదు. వృధా చేయకండి అని అర్దం. ఏ గదిలో ఉంటే ఆ గదిలోనే లైట్లు, ఫ్యాన్లు వాడండి.

మన ఇంటికి దగ్గరలో ఉన్న ప్రదేశాలకు(షాపులకు, ప్రార్ధనా స్థలాలకు) వాహనం మీద వెళ్ళడం కంటే, నడిచి వెళ్ళండి. సాధ్యమైనంతవరకు వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించండి. ప్రజారవాణ(బస్సులు)లో ప్రయాణించండి. దీనివలన పెట్రోల్ ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. దేశ ఆర్ధిక వృద్ధికి దోహదం అవుతుంది.

మన దగ్గరలో ఉన్న చెరువుల్లో, ఇతర జలాశయాల్లో చెత్తచెదారం, ప్లాస్టిక్ కవర్లు వేయకూడదు.

చెత్తను కాల్చడం వలన గాలి కలుషితం అవుతుంది. అందువల్ల చెత్తను కాల్చకూడదు. మన ఇంట్లో వెలువడే చెత్తను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రతి వస్తువును సంపూర్ణంగా వాడాలి. సగం సగం వాడి పడవేయకూడదు. ఇది భారతీయుల రక్తంలోనే ఉంది. కానీ అమెరికా, యూరఫు దేశాలు పధకం వేసి భారత్‌లొ తమ మార్కెట్‌ను వృద్ధి చేసుకోవడం కోసం వాడి పారేసే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మనం మన పూర్వ విధానాన్ని తిరిగి ఆచరణలోకి తీసుకురావాలి.

చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవలసింది ఒక్కటే. మనం భూమాతకు అపకారం చేసేది ఏదైనా సరే, నిర్మొహమాటంగా తిరస్కరించాలి. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మన భూమాతను రక్షిస్తాయి.

No comments:

Post a Comment