Thursday, 17 April 2014

మహాగణపతిని ఆరాధన చేయండి

మహాగణపతిని ఆరాధన చేయండి. ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి చక్కటి శక్తిని, చక్కటి సిద్ధిని ఇస్తాడు. కలియుగంలో మహాగణపతి మహా సిద్ధిని ఇవ్వగలిగే దైవం. ఆయన ఇవ్వగిలిగిన శక్తి, సిద్ధి అనిర్వచనీయమైనది. ఎందుకంటే
త్వమేవ ప్రత్యక్షం తత్వమసి - నువ్వే సమస్త జ్ఞానానివి
త్వమేవ కేవలం కర్తాసి - సమస్తానికి కర్తవు నువ్వే
త్వమేవ కేవలం ధర్తాసి - సంస్తాన్ని ధరించేవాడివి నువ్వే
త్వమేవ కేవలం హర్తాసి - సర్వ విధములైన దోషాలను తొలగించగలవాడిని కూడా నువ్వే
త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం - నిత్యం ఆత్మ స్వరూపంగా
అందరిలో వెలిగొందుతున్నావు

వేదమే ఘోషించింది......... ఆయనకంటే గొప్ప ఘనీభూతమైన దైవం మరొకటి లేదని. అంత గొప్ప దైవం. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో ధనస్సురాశి గురించి చెప్తూ పరిపూర్ణానందస్వామి వారు పలికిన మాటలు ఇవి.

గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చవితి. అటువంటి సంకష్టహర చవితి నాడు గణాధిపతిని ఆరాధించే అవకాశాన్ని వదులుకోవద్దు. గణపతి అనుగ్రహం ప్రసరిస్తే అమోఘమైన బుద్ధి కలుగుతుంది, గణపతి అనుగ్రహంతోనే మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవుతుంది. గణాధిపతి అనుగ్రహించాలే కానీ, సమస్త దోషాలు పరిహారమవుతాయి. అటువంటి వినాయకుడిని ప్రెమతో పూజించండి.18-04-2014 సంకష్టహర చవితి, రాత్రి 9.31 నిమిషాలకు చంద్రోదయ సమయం. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. గణపతి ఆలయాన్ని సందర్శించండి, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. దేవాలయానికి సాయంత్రం స్నానం చేసి వెళ్ళడం మరింత శుభకరం.

ఓం గం గణపతయే నమః      

No comments:

Post a Comment