ఈ సృష్టిలో దేనికి జన్మ ఉంటుందో, దానికి మరణం ఉంటుంది, దేనికి మొదలు/ఆది ఉంటుందో, దానికి అంతం కూడా ఉంటుంది. కానీ ఈ ధర్మానికి ఆది, ఆంతమూ అన్నవి లేనేలేవు. సృష్టి అంతమైనప్పుడు అంతర్లీనమైన ఈ ధర్మం, సృష్టి ఆవిర్భావంతోనే తిరిగి అమలులోకి వస్తుంది. భూమి గురుత్వాకర్షణశక్తి మానవసమాజం గుర్తించని సమయం నుంచి ఉంది, మనిషి మర్చిపోయినా కూడా అలాగే ఉంటుంది. అట్లాగే ధర్మం కూడా. ఒకవేళ ఏదైనా ఉపద్రవం సంభవించి, ఈ ధర్మాన్ని ఆచరించే వారందరూ మరణించినా, ఈ ధర్మం నశించడం అన్నమాట ఉండదు. అది ప్రకృతిలో అట్లాగే ఉంటుంది. వేరొక సమయంలో తిరిగి ప్రారంభవుతుంది. సృష్టి లేకపోయినా, ధర్మం బీజరూపంలో ఎప్పుడూ ఉంటుంది.
సనాతనము అంటే చావు, పుట్టకలు లేనిది, నిన్న ఉండినది, ఈరోజు ఉన్నది, రేపు ఉండేది, ఎప్పటికి, ఎన్నటికి ఉండేది అని. ఈ ధర్మం ఆది, అంతములు లేనిది, ఎప్పటి నుంచో ఉన్నది, ఎప్పటికి ఉండేది, కనుక దీనికి సనాతన ధర్మం అని పేరు.
ఈ ధర్మాన్ని ఆచరించేవారు సనాతనులు (శరీరానికే పుట్టుకచావులు కానీ, ఆత్మకు కాదు, ఆత్మ సనాతమైనది, మనం శరీరం కాదు, శరీరంలో ఉన్న ఆత్మస్వరూపులం, ఆత్మకు చావు లేదు), ఈ ధర్మాన్ని చెప్పిన భగవంతుడు సనాతనుడు (ఆది, అంతములు లేనివాడు, ఎప్పటికి ఉండేవాడు), ఈ ధర్మం సనాతనంగా వస్తున్నది, ఇది పాటించడం వలన సృష్టి అధిక కాలం సుఖసంతోషాలతో, శాంతిసౌభాగ్యాలతో కొనసాగుతుంది, ఇది ఆచరించి మానవుడు తన సనాతన తత్వాన్ని తెలుకుంటాడు, కనుక దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఈ ధర్మానికి మూలం వేదం కనుక వైదిక ధర్మం అన్నారు.
To be continued...................

No comments:
Post a Comment