మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ధృతి అని తప్పుడు పనులను కూడా అట్లాగే పూర్తి చేయాలనుకోకూడదు. మనం చేసే పని మంచిదైనప్పుడు, లోకమంతా అడ్డగించినా, పూర్తి చేయడం మాత్రమే ధృతి అవుతుంది. అంతేకానీ, దుష్ట ఆలోచనలు చేసి, అవి తప్పని తెలిసినా, వాటిని వదిలిపెట్టక, వాటిని పూర్తి చేయాలనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది
ఈ జీవితం అనేది సుఖదుఃఖాల కలియక, గెలుపు, ఓటముల సంగమం. ఒక సమయంలో సుఖం ఉంటే, మరొక సమయంలో దుఖం ఉంటుంది. సుఖం వచ్చిందని అతిగా ఆనందపడిపోకూడదు, దుఖం వచ్చిందని క్రుంగిపోకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, తట్టుకుని, మరణం వచ్చేవరకు జీవించాలి. సముద్రానికి ఆటుపోట్లు ఉన్నట్టే జీవితానికి ఉంటాయి. తనలో ఎన్నో నదులు వచ్చి కలుస్తున్నా, సముద్రం పొంగిపోదు. సూర్యుడు తన నీటిని ఆవిరిరూపంలో పీల్చుకున్నా క్రుంగిపోదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. అట్లాగే మనిషి కూడా జీవితంలో అన్నిటిని తట్టుకుని నిలబడాలి. ఈ ప్రపంచం ఒక వ్యాయమశాల వంటిది, ఇక్కడ నిన్ను బలవంతుడిగా చేసుకోవాలి అంటారు స్వామి వివేకానంద. స్వామిజీ చెప్పిన ఈ మాటలను గుర్తుపెట్టుకుని, జీవితంలో మనం అనుభవించే ప్రతి కష్టం నుంచి ఏదో ఒక విషయం నేర్చుకోవాలి. ఇక్కడ మన బలవంతులుగా మారాలి. ఎక్కడ జీవితం మీద నిరాశ చెందకుండా, ఆశవాదంతో జీవితాన్ని పరిపూర్ణంగా జీవించడం ధృతి. అదే ధర్మం యొక్క ప్రధమలక్షణం.
To be continued...................

No comments:
Post a Comment