Wednesday, 30 April 2014

హిందూ ధర్మం - 56 (అక్రోధః)

అక్రోధః - క్రోధము లేకుండుట. ధర్మం యొక్క లక్షణం.

మనిషికుండే అవలక్షణాల్లో ఒకటి, పరమదుర్గుణం కోపమే. కోపం ఆవేశానికి దారి తీస్తుంది. ఆవేశం కారణంగా అనకూడని మాటలు అనేస్తాం. ఆయుధం చేయి దాటితే ప్రాణం పోతుంది, మాట నోరు జారితే సమస్తం పోతుంది. ఒక్కోసారి ఆయుధ ప్రయోగం వలన తగిలే దెబ్బలు బాహ్యాంగానే ఉంటాయి. కానీ మాట జారడం వలన వ్యక్తి ఆంతరంగికంగా గాయపడతాడు. శరీరానికి తగిలిన గాయాలను నయం చేయచ్చు కానీ, మనసుకు తగిలిన గాయాలను మాంచలేము. అందుకే కోపంలేని జీవితాన్ని గడపమని ఋషులు చెప్తున్నారు.  

ఎంతో గొప్ప కీర్తివంతులు, మంచి పేరున్నవారు, సమాజంలో గౌరవంతో బ్రతుకుతున్నవారు కోపానికి గురై పొరపాటుగా పలికిన మాట వారి కీర్తిని, గొప్పతనాన్ని నాశనం చేస్తుంది. క్రోధానికి లోనవడం వలన ఆవేశంలో మంచివాడు కూడా దుర్మార్గపు పనులు చేస్తాడు. ఆవేశం అనర్ధాలకు దారి తీస్తుందన్నారు పెద్దలు. ఒక్కసారి ఆవేశానికి లోనయ్యామా, ఇక మనమేం చేస్తున్నామో, ఏం మాట్లాడుతున్నామో, ఏమి గుర్తుకురావు. ఇంతకముందు మనం విన్న మంచిమాటలు, ధర్మసూక్ష్మాలు, శాస్త్రాలు, పురాణాలు, అన్నీ మర్చిపోతాం. అందుకే యోగి వేమన తన వేమన శతకంలో

కోపమున ఘనత కొంచెమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ

కోపం వలన కీర్తి, పరువుప్రతిష్టలు నశిస్తాయి. కోపము వలన మంచిగుణాలు కోల్పోతారు. కోపాన్ని అణుచుకున్నవాడి, అదుపు చేసుకున్నవాడి, జయించినవాడి కోరికలన్నీ తీరుతాయి అని భావం.
     
కోపంలేని జీవితం ఒక్కసారిగా సాధ్యపడదు. దానికి సాధన కావాలి. కోపాన్ని అదుపు చేసుకోండి అని ఋషులు చెపలేదు, కోపాన్ని జయించమన్నారు. అదుపు చేసుకోవడం వేరు, జయించడం వేరు. అందుకు తగిన మాత్గాలు కూడా వారే నిర్దేశించారు.

To be continued...........

Realisation is not acquisition of anything new

The real ‘I’ is always there. It is here and now. It never appears anew and disappears again. That which is must also persist for ever. That which appears anew will also be lost. Compare deep sleep and waking. The body appears in one state but not in the other. Therefore the body will be lost. The consciousness was pre-existent and will survive the body. In fact, there is no one who does not say ‘I am’. The wrong knowledge of ‘I am the body’ is the cause of all the mischief. This wrong knowledge must go. That is Realisation. Realisation is not acquisition of anything new nor it is a new faculty. It is only removal of all camouflage.

Maj. Chadwick: I try to shake off the body.

M.: A man shakes off his clothes and remains alone and free. The Self is unlimited and is not confined to the body. How can the body be shaken off? Where will he leave it? Wherever it is, it is his still.

Maj. Chadwick: (Laughter.)

M.: The ultimate Truth is so simple. It is nothing more than being in the pristine state. This is all that need be said. Still, it is a wonder that to teach this simple Truth there should come into being so many religions, creeds, methods and disputes among them and so on! Oh the pity! Oh the pity!

Talk 96

Tuesday, 29 April 2014

ఒక్క ఓటు

ఓటు దేశాన్ని మార్చడానికి సామాన్యుడి చేతిలో ఆయుధం. ప్ర్రజాప్రతినిధుల పట్ల పేరుకుపోయిన కోపాన్ని ప్రదర్శించగల శక్తి ఒక్క ఓటుకే ఉంది. ఓటు దేశం పట్ల మనకున్న భాధ్యత. 30-04-2014, తెలంగాణాలో ఎన్నికల ఓటింగ్. ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నా, అన్నిటిని ప్రక్కనపెట్టి ఓటు వేయండి. నా ఒక్క ఓటుతో మార్పు ఏం జరుగుతుంది అనుకోకండి. ఒక్క ఓటు దేశచతిత్రనే మార్చగలదు.

1776 లో ఒక్క ఓటు తేడాతో జెర్మన్‌కు బదులు అమెరికా ఆధికార భాషగా ఇంగ్లీష్ ప్రకటించబడింది.
1845 లో ఒక్క ఓటు తేడాతో టెక్సాస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో చేరింది
1875 లో ఒక్క ఓటు తేడాతో ప్రాన్స్ రాచరికం నుంచి ప్రజాస్వామ్యదేశంగా మారింది
1923 లో ఒక్క ఓటు హిట్లర్‌కు నాజీపార్టీ అధిపతిగా పదివి దక్కింది

ఒక్క ఓటుతో పోయిందేముందిలే అనుకుని ఇంట్లో కూర్చోవడం ప్రతి ఎన్నికలలో పోలింగ్ శాతం పడిపోతోంది. దేశానికి మంచి నాయకత్వం అవసరం. చైనా దురాక్రమణలకు, పాకిస్థాన్ కవ్వింపులకు, అమెరికా కుటిలా రాజకీయ ఎత్తుగడలకు సమాధానం ఇవ్వగల సమర్ధవంతమైన నాయకత్వం భారతదేశానికి ఇప్పుడు అత్యవసరం. సరైన నాయకత్వం లేకపోతే దేశం పతనమవుతుంది. దేశభక్తుడు, అవినీతికి లొంగనివాడు, విదేశాలకు సలాం చేయనివాడు, అందరిని ఒప్పించి నడిపించగలవాడికే ఓటు వేయండి. చేతగానితనంతో పదివి నుంచి పారిపోయేవాడు, లంచాలకు ఆశపడేవాళ్ళను, విదేశీ ఏజెంట్లను తిరస్కరించండి.

ఓటు వేయనివాడు దేశద్రోహి, అటువంటి వాడిని దేవుడు కూడా క్షమించడు. మంచి నాయకులనే ఎన్నుకోండి. భారతదేశాన్ని రక్షించండి. ప్రతి ఓటు విలువైనదే.

జై హింద్ 

Monday, 28 April 2014

హిందూ ధర్మం - 55 (సత్యం)

సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం. అందరిలాగే జన్మంచాం, జీవిస్తున్నాం, మరణిస్తాం. జీవితంలో కష్టాలు, కనీళ్ళు వస్తాయి. నిన్న ఉన్నట్టుగా జీవితం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, నిరంతరం మార్పులు చెందుతుంది. కానీ ఎన్ని మార్పులు సంభవించినా, ఒకటి మాత్రం నిశ్చలంగా ఉంది, శాశ్వతంగా ఉంది. అది ఈ శరీరం పుట్టక ముందు ఉంది, తల్లి గర్భంలో ప్రవేశించి దేహానికి చైతన్యాన్ని ఇచ్చింది. పెరుగుతున్నది శరీరమే కానీ, ఆ శక్తి కాదు. ముడతలు శరీరానికే పడతాయి, ముసలితనం శరీరానికే వస్తుంది కానీ ఆ పదార్ధానికి రాదు. ఆనందమైనా, విచారమైనా ఆ తత్వానికి తేడా ఉండదు. అది ఎప్పుడు ఉంటుంది. సుఖదుఖాఃలతో దానికి సంబంధం లేదు. అది ఆత్మ. ఆత్మయే నిజం. ఆత్మను తెలుసుకోవడమే సత్యం. ఆత్మను తెలుసుకోవడం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడం. కేవలం పుస్తకంలో చదవడం కాదు, అనుభూతి చెందడం ముఖ్యం.

ఈ సృష్టిలో పరమాత్మ ఒక్కడే సత్యం. ఈ లోకాన్ని మనం అనుభూతి చెందుతున్నాం కానీ ఈ లోకం శాశ్వతం కాదు. నిత్యం మార్పులకు గురవుతుంది. ఒకనాడు ప్రళయం వచ్చి, సమస్త లోకాలు గాఢాంధకారంలోకి వెళ్ళిపోతాయి. రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు, ప్రజలు, ప్రకృతి, సమస్త లయమవుతాయి. అయినా అప్పుడు కూడా పరమాత్మ నిలిచి ఉంటాడు. మన చుట్టూ ఉన్న బంధువులు, మిత్రులు అందరూ ఏదో ఒక రోజు మరణిస్తారు. మరణం తప్పదు. కానీ ఎందరు మరణించినా, ఎప్పటికి నిలిచి ఉండే తత్వం భగవంతుడు. భగవంతుడే సత్యం. ఆ మాటకు అర్దం ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ అసత్యం అని కాదు. మనమున్న స్థితిలో ఇవన్నీ సత్యాలే. కానీ మనకున్న అజ్ఞానమనే చీకటి తొలగి, సత్యం గోచరించిన రోజు, ఈ లోకమంతా ఒక నాటకంలా అనిపిస్తుంది. మనం ఆ నాటకాన్ని చూస్తున్న ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోతాం. నాటకం ముగియగానే మనం వచ్చిన ప్రదేశానికి తిరిగి వెళ్ళిపోతాం. అంతవరకు మనకు కనిపిస్తున్నవి సత్యాలే. కానీ ఇవన్నీ చిన్నపాటి సత్యాలు, తాత్కాలిక సత్యాలు. శాశ్వతమైన సత్యం భగవంతుడు. ఆ శాశ్వతమైన, నిత్యమైన సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం.

To be continued...........

Sunday, 27 April 2014

హిందూ ధర్మం - 54 (సత్యం)

త్రికరణ శుద్ధిగా సత్యాన్ని ఆచరించడం ధర్మం. అంటే మనసులో ఆలోచనలు, మాట్లాడే మాటలు, చేసే పనుల్లో కూడా సత్యం ఉండాలి. అంటే నీతీగా, నిజాయతీగా బ్రతకాలి, లంచాలు తీసుకోకుండా బ్రతకాలి, అక్రమసంపాదన ఉండకూడదు, ఎవరినీ మోసగించకూడదు. అప్పుడే సత్యాన్ని పాటిస్తున్నాడని అర్దం.

ఉపనిషత్తులు చాలా గొప్పమాటలు చెప్తాయి. అక్రమంగా డబ్బు సంపాదించినవాడు, దుర్మార్గుడు వద్ద నుంచి డబ్బు తీసుకుని బ్రతికేవాడు, దుర్మార్గులని, అక్రమార్కులని ప్రోత్సహించేవారు పాపాత్ములు. వారు మోక్షానికి అనర్హులు. మనం తినే ఆహారం వలన మనసులో మంచి భావనలు ఏర్పడతాయి. అక్రమసంపాదన వలన, తినే ఆహారం కూడా కలుషితమవుతుంది, దొంగ బుద్ధి పెరుగుతుంది. అటువంటి ఆహారం మనసును అపవిత్రం చేస్తుంది. అపవిత్రమైన మనసు చెడు సంకల్పాలు చేస్తుంది, ఫలితంగా మనిషి దుర్మార్గుడిగా మారి లోకకంఠకుడవుతాడు. దైవానికి దూరం అవుతాడు. అట్లాగే అవినీతిపరుల సొమ్ము తినే బ్రతికేవారికి, అతడి వద్ద పనిచేసే ఉద్యోగూలకు ఈ దోషం ఉంటుంది. వారు ఎన్ని కర్మలు చేసినా, అవినీతిపరుడి వద్ద నుంచి వచ్చిన ధనంతో ఆహారం తిన్నారు కనుక వారు కూడా అధోగతి పాలవుతారు.  

సమాజంలో అవినీతిని, అక్రమాలను, లంచగొండితనాన్ని ప్రోత్సహించడం సత్యవ్రతానికి విరుద్ధం. పరిపాలించే రాజు సత్యవంతుడైతే దేశం సుభిక్షంగా ఉంటుంది, అదే అతడు అధర్మాత్ముడు, దొంగ అయితే దేశానికి సర్వ అరిష్టాలు చుట్టుకుని జనం నశించిపోతారని శాస్త్రమే చెప్తున్నది. కనుక సమాజంలో మంచిని పెంచడం, నీతి, నిజాయతీలను  ప్రోత్సహించడం సత్యవంతుని లక్షణం. మనసులో కూడా ఇతరుల సొమ్మును ఆశించకపోవడం సత్యం.  

To be continued...........

Saturday, 26 April 2014

హిందూ ధర్మం - 53 (సత్యం)

సత్యమే భగవంతుడు. భగవంతుడిని సత్యపరిపాలన ద్వారానే ఆరాధించాలి. ప్రతి శుభకార్యం తర్వాత మనం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం. సత్యమే తానై ఉన్నవాడు కనుక సత్యనారాయణుడని పేరు. ఆ వ్రతానికి సత్యవ్రతం అని పేరు. ఆ వ్రత కధ చదివితే అర్దమవుతుందో సత్యం విలువ ఏమిటో? సత్యనారాయణ స్వామిని ఆర్ధాదించడంలో తొలిమెట్టు సత్యాన్ని గట్టిగా పాటించడమే.

సత్యనారాయణ స్వామి కధనే పరీశీలించండి. అందులో వైశ్యుని కధ చూస్తే, తమకు కష్ట వచ్చిన ప్రతిసారీ 'స్వామి నీ వ్రతం చేస్తాము' అని మొక్కుకోవడం, కష్టం నుంచి గట్టేక్కగానే మొక్కును మర్చిపోవడం, లేదంటే ఇప్పుడు కాదులే అంటూ వాయిదా వేయడం. ఇదే తంతు. ఆఖరున వారు చెరసాలలో బంధించబడడం, రాజు వారికి సమస్త కానుకులు ఒక ఓడ నిండుగా ఇచ్చి పంపించడం జరుగుతుంది. అప్పుడు అటు సాధువు రూపంలో వచ్చిన స్వామి 'ఆ ఓడలో ఏమున్నాయి అబ్బాయి' అని అడుగుతారు. అందుకు సమాధానంగా 'ఆ ఓడలో ఏముంటాయి రాళ్ళూ రప్పలు తప్ప!' అని సమాధానం ఇస్తారు. వారు ఆ ఓడ ఎక్కి చూస్తే సంపద మొత్తం చెత్తగా మారిపోతుంది. వచ్చినవాడు సాధువు, అతనికి డబ్బుపై మమకారం ఉండదు, అయినా అసత్యం పలికారు, సత్యమే పరమాత్మ. పరమాత్మను ప్రక్కకుతోసారు, దిక్కరించారు, మోసం చేయాలనుకున్నారుం, పర్యవసానం అనుభవించారు. ఆ కధను బాగా గమనించండి. భగవంతునికి మనం మొక్కిన మొక్కు తీర్చకపోవడం వల్ల కోపం రాదు. ఆయనకు కొబ్బరికాయలు, పూలదండలు అవసరం లేదు.

అయ్యో! వీడు నా దగ్గరే అబద్ధం ఆడుతున్నాడు. నా దగ్గరే ఇంతకు తెగిస్తే, ఇక లోకంలో అన్ని అకృత్యాలు చేస్తాడు, అన్ని అసత్యాలు ప్రచారం చేసి, ఎంతమందిని మోసం చేస్తాడో అని పరమాత్మ భావిస్తాడు. అందుకే మొక్కు తీర్చలేదని శిక్షిస్తాడు. మొక్కు తీర్చకపోవడమంటే ఆడినమాట తప్పడం. అది ఆయన దగ్గర తప్పితేనే శిక్షిస్తాడు అనుకోకండి. పరమాత్మ ఎప్పుడు సత్యం వైపే ఉంటాడు. సత్యమే గెలుస్తుంది.

జీవితంలో ఎవరి కోసం సత్యంగానో, అసత్యంగానో బ్రతకవలసిన అవసరమేమిటి? మీకోసం సత్యంగా బ్రతకండి, మీ జీవితాలను ఉద్ధరించుకోవడం కోసం సత్యంగా బ్రతకండి. ముందు మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం ఆపండి. మీ బలహీనతలను పరమాత్మ ముందు అంగీకరించండి. మీలో దుర్గుణాలను నిస్సందేహంగా అంగీకరించి, మార్చుకునే ప్రయత్నం చేయండి. అంతేకానీ ఇది కాలం కాదు, ఇలా బ్రతకలేమంటూ సమర్ధించుకోకండి. అదే ధర్మం చెప్తుంది. సత్యం ధర్మాచరణలో ముఖ్యమైన అంశం.

To be continued...........

Friday, 25 April 2014

హిందూ ధర్మం - 52 (సత్యం)

సత్యాన్ని పాటించమన్నారని ఎప్పుడూ నేను నిజాలే మాట్లాడుతాను అంటూ అందరితో గొడవలు పెట్టుకోమని, శతృత్వం పెంచుకోమని చెప్పలేదు. రాముడి గురించి వర్ణిస్తూ 'సత్యాయ మితబాషిణాం' అంటారు వాల్మీకి మహర్షి. రాముడు సత్యవంతుడు, మాటమార్చనివాడు, అలా అని ఎక్కువగా మాట్లాడడు. ఆలోచించి మాట్లాడుతాడు, తక్కువగా మాట్లాడుతాడు, కానీ మాట్లాడితే మాత్రం అన్ని నిజాలే మాట్లాడుతాడు. రాముడు అరణ్యవాసంలో తన గురించి చెప్పుకున్నా, సీతమ్మ చెప్పినా ఎక్కడ కైక కారణంగా తాము అడవుల పాలయ్యామని, ఈ కష్టాలన్నిటికి కైకేయి కారణమని, ఆమె మీద చెడుగా చెప్పలేదు. నేను నా తండ్రి దశరధ మహారాజు ఆజ్ఞ ప్రకారం వనవాసానికి వచ్చానని మాత్రమే చెప్పుకున్నాడు. అట్లా అని నిజాలు దాచి పెట్టమని చెప్పడం ఉద్ద్యేశం కాదు.

కఠినమైన నిజాలను ప్రతి సందర్భంలో పలుకవలసిన అవసరంలేదు. సమయం కానీ సమయంలో చెప్పిన నిజం ఒక్కోసారి హానీ చేయవచ్చు. అందువలన కొన్ని సార్లు మౌనం వహించాలి. కానీ మనం మౌనంగా ఉండడం వలన వేరొకరికి అన్యాయం జరగకూడదు. మాట విషయంలో బుద్ధి ఉపయోగించాలి. 'సత్యాయ మితబాషిణాం' తక్కువగా మాట్లాడినా, నిజాలే మాట్లాడాలి. అదే వివేకవంతుని లక్షణం.

మామూలు జీవితానికి వస్తే, చాలామంది ఇతరులతో చాలా విషయాలు పంచుకుంటారు. అవి కష్టసుఖాలే కావచ్చు, లేకమరే ఇతర విషయమైనా కావచ్చు. కొందరి గురించి తప్పుగా మాట్లాడవచ్చు, విమర్శించవచ్చు. అవన్నీ అవతలవారికి చెప్పడం అనవసరం. నిజాలే మాట్లాడమన్నారు కదా, అందుకని వీళ్ళు మనతో మంచుకున్న విషయాలన్నీ వతలవారి ముందు చెప్పేయాలని అనుకోకండి. విమర్శలు, ఇతరుల గురించి చెప్పుకునే మాటలు మొదలైనవి అవివేకంతో మాట్లాడుకునేవి. వాటికి జీవితంలో ప్రాధాన్యం ఇవ్వడం దండగ. అసలు వాటిని గుర్తుంచుకోవడమే వృధా. అటువంటి విషయాలను విడిచిపెట్టాలి తప్ప, సత్యాన్ని పాటిస్తున్నామన్న పేరుతో అందరితో పంచుకుని, శతృవులను పెంచుకోమని ధర్మం చెప్పలేదు. ఒకరి విషయాలను మనం తెలుసుకోవడం అనవసరం, ఒకవేళ పంచుకున్నా, అక్కడికి వదిలేయడమే మంచిది. ఒకరి రహస్యాలను బయటపెట్టడం కూడా దోషమేనని గుర్తుపెట్టుకోండి.

To be continued...........

Thursday, 24 April 2014

హిందూ ధర్మం - 51 (సత్యం)

నిజాలు మాట్లాడే రోజులు కావండి ఇవి. ఇప్పుడు నిజాలు మాట్లాడేవాళ్ళు, నిజాయతీగా బ్రతికేవాళ్ళు సమాజంలో జీవించడం కష్టమని అనుకోను మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎవరి కోసం నిజాలు మాట్లాకుండా ఉండడమేమిటి? ఎవరి మెప్పుకోసమో అబద్ధాలు చెప్పడేమిటి? సత్యం అనేది ధర్మం. వ్యక్తిగతంగా ఆచరించవలసింది. మిమ్మల్ని భగవంతుని వద్దకు చేర్చేది సత్యమే. సమస్త స్మృతుల్లో చెప్పబడింది, ఋషుల చేత ఎలుగెత్తి చాటబడింది సత్యం. సత్యవ్రతాన్ని ఆచరించడం.

సత్య వద ధర్మం చర......సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం అంటూ విద్యాభ్యాసం ముగుసే సమయంలో గురువు శిస్యునికి భోధిస్తారు. సత్యాన్నే పలుకు, ధర్మాన్ని ఆచరించు ......... సత్యాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకు, ధర్మాన్ని ఎప్పుడు విడిచిపెట్టకు అని అర్దం. సమస్త విద్యల యొక్క ప్రాధాన సందేశం సత్యవంతులుగా బ్రతకడమే.

మంత్రానికి ప్రాణం సత్యం. ఎంత జపం చేసినా, ఎన్ని పూజలు చేసిన అబద్ధాలు మాట్లాడే వాడికి ఆ జపఫలితం రాదు, మంత్రం సిద్ధించదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, నేను ఎప్పటి నుంచో మంత్రం జపిస్తున్నా కానీ ఫలితం లేదు లాంటి మాటలు చాలామంది మాట్లాడుతుంటారు. సత్యవంతుడు కానీవారికి మంత్రం పనిచేయదని గుర్తించరు.

అబద్ధాలు చెప్పడానికి నేర్పు కావాలేమో, తెలివి ఉండాలేమో, కానీ నిజాన్ని ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి. నిజాన్ని ఒప్పుకోలేకపోవడమే పిరికితనం. తెలివైనవాడు జీవితంలో పైకి రావచ్చు, అదృష్టం లేకపోతే పతనం కావచ్చు. కానీ ధైరవంతుడు జీవితంలో అన్నిటిని ఎదురుకుని నిలబడతాడు, గొప్ప స్థానానికి చేరుతాడు. ధైర్యమే బలం, పిరికితనమే బలహీనత. అందుకే స్వామి వివేకానందా బలమే జీవనం, బలహీనతే మరణం అన్నారు. నిజాన్ని అంగీకరించలేని వాడు నిరంతరం చస్తూనే ఉంటాడు. ధైర్యం బలాన్నిస్తే, సత్యం ధైర్యానిస్తుంది. సత్యవంతులే ధైరవంతులు, ధీరులు. అధ్యాత్మిక జీవితంలో పురోగతి సత్యపాలన మీదనే ఆధారపడి ఉంటుంది. కనుక జీవితంలో ప్రధానమైన లక్షణం సత్యవంతులుగా బ్రతకడం. అదే ధర్మం.

To be continued...........

Tuesday, 22 April 2014

భూమాతను కాపాడటానికి మనమేం చేయగలం

భూమాతను కాపాడలంటే మనమేం చేయగలం?

ముందు కొన్ని చెప్పుకుందాం.

ఉన్న చెట్లను కొట్టకూడదు. కొత్త చెట్లను నాటాలి. పచ్చదనాన్ని పెంచాలి. మన దేశ వాతావరణానికి సంబంధించిన మొక్కలె పెంచాలి.

ప్లాస్టిక్ భూమిలో కలిసిపొవడానికి కొన్ని లక్షల ఏళ్ళు పడుతుంది. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు పడేయకూడదు. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంతవరకు తగ్గించాలి.

కరెంటును, నీటిని పొదుపుగా వాడాలి. పొదుపుకు అర్దం అసలు నీరు, కరెంటును వాడకం మానివేయమని కాదు. వృధా చేయకండి అని అర్దం. ఏ గదిలో ఉంటే ఆ గదిలోనే లైట్లు, ఫ్యాన్లు వాడండి.

మన ఇంటికి దగ్గరలో ఉన్న ప్రదేశాలకు(షాపులకు, ప్రార్ధనా స్థలాలకు) వాహనం మీద వెళ్ళడం కంటే, నడిచి వెళ్ళండి. సాధ్యమైనంతవరకు వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గించండి. ప్రజారవాణ(బస్సులు)లో ప్రయాణించండి. దీనివలన పెట్రోల్ ఆదా అవుతుంది. కాలుష్యం తగ్గుతుంది. దేశ ఆర్ధిక వృద్ధికి దోహదం అవుతుంది.

మన దగ్గరలో ఉన్న చెరువుల్లో, ఇతర జలాశయాల్లో చెత్తచెదారం, ప్లాస్టిక్ కవర్లు వేయకూడదు.

చెత్తను కాల్చడం వలన గాలి కలుషితం అవుతుంది. అందువల్ల చెత్తను కాల్చకూడదు. మన ఇంట్లో వెలువడే చెత్తను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి.

ప్రతి వస్తువును సంపూర్ణంగా వాడాలి. సగం సగం వాడి పడవేయకూడదు. ఇది భారతీయుల రక్తంలోనే ఉంది. కానీ అమెరికా, యూరఫు దేశాలు పధకం వేసి భారత్‌లొ తమ మార్కెట్‌ను వృద్ధి చేసుకోవడం కోసం వాడి పారేసే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మనం మన పూర్వ విధానాన్ని తిరిగి ఆచరణలోకి తీసుకురావాలి.

చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మనం గుర్తుపెట్టుకోవలసింది ఒక్కటే. మనం భూమాతకు అపకారం చేసేది ఏదైనా సరే, నిర్మొహమాటంగా తిరస్కరించాలి. మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలు కూడా మన భూమాతను రక్షిస్తాయి.

Monday, 21 April 2014

ఏప్రియల్ 22, ధరిత్రీ దినోత్సవం

సముద్రవసనే దేవి, పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వయే ||

సముద్రమును వస్త్రంగా అలంకరించుకుని, పర్వతములను స్తనములుగా కలిగిన ఓ విష్ణుపత్ని(శ్రీ మహా విష్ణు భార్యైన భూదేవి), నీ మీద నాకాలు మోపుతున్నందుకు నన్ను క్షమించు అని పై శ్లోకం అర్దం.

ప్రతి రోజు ఉదయమే నిద్రలేవగానే చదువాల్సిన రెండవ శ్లోకం ఇది. కాలు మోపడమే పెద్ద తప్పుగా భావించారు మన పూర్వీకులు. భూమిని తల్లిగా, భూమాతాగా సంబోధించిన మహోన్నతమైన భారతీయ సంస్కృతి మనది.

మన తాతాముత్తాతలు నడిచి, జీవించి, కలిసిపోయిన పరమ పవిత్రమైనది భూమి. దీనిని కలుషితం చేయడమంటే వారిని అవమానించడమే అన్నారు రెడ్ ఇండియన్లు.

సంస్కృత భాషలో గో శబ్దానికి చాలా అర్దాలున్నాయి. అందులో గో అంటే ఒక అర్దం భూమి. గోపాలకుడు (శ్రీ కృష్ణుడు) అంటే ఈ సమస్త భూగోళాన్ని పాలించేవాడు, రక్షించేవాడు అని కూడా అర్ధాలున్నాయి.

మన పురాణాలు, వేదాలు, ఇతిహాసాలన్నీ మనం భూమాతను అంతో గొప్పగా కీర్తించాయి. మన పూర్వీకులు అంతే గొప్పగా రక్షించుకుంటు వచ్చారు. మనం మన గత వైభవాన్ని మర్చిపోయాం, మన పూర్వీకుల మాటలను, సూక్తులను వదిలిపెట్టేశాం. పాశ్చాత్యదేశాల అభివృద్ధి నమూనా అందిపుచ్చుకున్నాం. అక్కడే వచ్చింది చిక్కంతా. వాళ్ళకు దోచుకోవడమే అబివృద్ధి, మనకు (భారతీయులకు) సంరక్షణే అబివృద్ధి. అందుకే వాళ్ళు సమస్త వనరులను నాశనం చేశ్తారు, మన పూజిస్తాం.

మారిన ఆలోచన విధానం, అభివృద్ధి నమూనా పర్యవసానం ఏమిటి?..................

భూమి మీద రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని లక్షల సంవత్సరాల భూమి చరిత్రలో ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలే అధికం.

420 కోట్ల సంవత్సరాల భూగోళం గత 300 సంవత్సరాలలో గుడ్డిగా అభివృద్ధి పేరుతో చేసిన భీభత్సం కారణంగా రాబోయే 80 సంవత్సరాలలో బూడిద కాబోతోంది.

ఈ భూమి మీద ఉన్న సమస్త మానవజాతి అంతరించిపోతుంది, 2100 కల్లా ఈ భూమి మీద మానవుడు బ్రతికే పరిస్థితి ఉండదని పరిశోధనలు నోక్కి చెప్తున్నాయి.

మనం చేసే కాలుష్యం గ్లోబల్ వార్మింగ్(భూతాపం)కు కారణమవుతోంది. సమస్త భూగోళం వినాశనం దిశగా అడిగులేస్తోంది.

మన వారసులకు మనం చక్కటి ఆహ్లాదకరమైన భూమిని ఇవ్వవలసింది పోయి, శ్మశానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామా? ఇస్తే వాళ్ళు స్వీకరిస్తారా? భూగోళాన్ని పరిరక్షించే చర్యలకు ఎందుకు చేపట్టలేదని మనల్ని తిరిగి ప్రశ్నిస్తే? మనమేం సమాధానం ఇస్తాం?

ఏప్రియల్ 22, ధరిత్రీ దినోత్సవం మనకు ఈ విషయాలను గుర్తుచేస్తోంది. ప్రపంచదేశాలకు తమ పంధాను మార్చుకోమని చెప్తుంటే, మనకు మాత్రం మనం మరిచిపోయిన మన పూర్వసంస్కృతిని గుర్తుచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 172 దేశాలు ధరిత్రీ దినోత్సవం జరుపుతున్నాయి. మిగితా దేశాలకంటే భారతీయులకు భూమితో ఉన్న అనుబంధం చాలా ఎక్కువ. మన సంస్కృతి మనకు నేర్పింది పర్యావరణ పరిరక్షణే.  మన భూగోళాన్ని కాపాడుకోవడం కోసం చర్యలు చేపడదాం.

రండి మన భూమిని మనమే కాపాడుకుందాం.

Sunday, 20 April 2014

హిందూ ధర్మం - 50 (సత్యం)

సత్యం:

ధర్మాచరణలో ముఖ్యమైనది సత్యం. సత్యాన్ని పలకటం, సత్యాన్ని తెలుసుకోవడం ధర్మం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మా అని ఉపనిషత్ వాక్కు. సత్యమే (నిజమే) భగవంతుడు. అటువంటి సత్యాన్ని ఒక వ్రతంగా ఆచరించాలన్నారు ఋషులు. ఎప్పుడు నిజాలే మాట్లాడితే చాలా ఇబ్బందులు ఎదురు కావచ్చు అన్న భావన వస్తుంది. దానికి మనుస్మృతి చక్కని మార్గం చూపిస్తుంది.

సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ అసత్యంప్రియం
హితంచ నానృతం బ్రూయాత్ హేషధర్మో సనాతనః

మనుమహర్షి ఈ విధంగా చెప్తున్నారు. సత్యాన్నే నిత్యం పలకండి. ప్రియమైన మాటలనే మాట్లాడండి (ప్రియమైన మాటలంటే ఎదుటివారికి నచ్చేమాటలు). అబద్దాలను, అప్రియమైన మాటలను మాట్లాడకండి. ఇతురులకి ఉపకారం, మేలు చేకూర్చే మాటలనే పలకండి (హిత వాక్కులను). కానీ మేలు చేస్తుందని అబద్దాలు చెప్పకండి. ఎప్పుడూ నిజాలనే మాట్లాడండి. ఇదే సనాతనమైన ధర్మం. (ఇది పై శ్లోకం సారాంశం).

మనుమహర్షి ఏం చెప్పారంటే ఎప్పుడూ సత్యాన్నే పలకాలి. అలాగని కఠోరమైన సత్యాన్ని ఎక్కడపడితే అక్కడ చెప్పకండి. వినేవారిని దృష్టిలో ఉంచుకుని, వారి స్థితికి అనుకూలంగా, వారు మెచ్చుకునేలా, వారి మెప్పు పొందేలా, వారికి నచ్చేవిధంగా మాట్లాడండి. చెప్పాలనుకున్న దానిని కుండబద్దలు కొట్టినట్టు, మొహం మీద చెప్పకుండా, కాస్తంత సున్నితంగా, చాకచక్యంగా చెప్పే ప్రయత్నం చేయండి. ఇది ప్రియకరమైన వాక్కు. లేదంటే శ్రోతకు అది ఇబ్బంది కలిగించవచ్చు, చెప్పేవాడికి హాని చేయవచ్చు. విన్నవాళ్ళు అది నచ్చక దాన్ని తిరస్కరించవచ్చు, చెప్తున్నవారి మీద ద్వేషం పెంచుకోవచ్చు. కనుక ఈ విషయంలో జాగ్రత్త పడండి. కానీ మీరు చెప్పేది అబద్దం కాకుడదు, నిజమే అవ్వాలి సుమా. ఎప్పుడు అసత్యం (అబద్ధం) చెప్పకండి. అప్రియమైన వాక్కులను (ఎదుటివారికి నచ్చనిమాటలు, చిరాకు కలిగించే మాటలు) కూడా పలుకకండి. హితకరమైన మాటలనే (మంచి మాటలనే/ మేలు చేసే మాటలనే) మాట్లాడండి. అలాగని మంచి జరుగుతుందని అబద్ధాలు చెప్పకండి. మేలుచేకూర్చే సత్యాన్నే పలకండి. ఒకవేళ ప్రియవాక్కును పలకాలో, హితకరమైన వాక్కును పలకాలో తేల్చుకోలేని సందర్భం వస్తే, అప్పుడు హితకరమైన వాక్కులనే పలకండి. ఇదే సనాతన ధర్మం.

To be continued..............

Saturday, 19 April 2014

హిందూ ధర్మం - 49 (విద్య)

శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. ఆధునిక కాలంలో మళ్ళీ మనిషి ఇతర గ్రహాలపై అడుగుపెట్టాడు. విశ్వం యొక్క రహస్యాన్ని చేధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ ఎన్ని విషయాలు తెలుసుకున్నా, ఇంకా అంతులేని ప్రశ్నలు వేల కొద్ది పుట్టుకొస్తున్నాయి. కొన్నిటికి సమాధానం ఉండదు. కొన్ని చేధించడం కష్టం. వీటిని తెలుసుకోవద్దని కానీ, ఇవి అవసరం లేదని కానీ వేదం, శాస్త్రం ఎప్పుడు చెప్పలేదు. వేదంలో కంప్యూటర్ మొదలైన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉంది. కానీ ఇదంతా బాహ్య విషయజ్ఞానం. విద్య అంటే ఏమిటి? దెన్ని తెలుసుకుంటే ఇక ఏది తెలుసుకోవలసిన అవసరం ఉండదో, ఏది అర్దమైతే ఈ లోకంలో రహస్యాలన్నీ అర్దమవుతాయో, దేన్ని తెలుసుకున్న క్షణంలోనే మానవ మస్తిష్కానికి వచ్చే సమస్త ప్రశ్నలకు సమాధానం తొలగుతుందో, ఏ జ్ఞానం చేత ఇక మనిషికి ప్రశ్నలు అనేవి తలెత్తవో, అదే విద్య. దాని గురించే ధర్మం మాట్లాడుతోంది.

ఈ విద్య మన గురించి చెప్తుంది. 'యత్ పిండాండే తత్ బ్రహ్మాండే' అని సంస్కృత వాక్కు ఒకటి ఉంది. ఏదైతే ఈ పిండాండంలో (శరీరంలో) ఉందో, అదే బ్రహ్మాండంలో కూడా ఉంది. ఎక్కడో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం కంటే మనలో ఉన్న విషయాన్ని అర్దం చేసుకోవడం సులభం. ఈ రహస్యం మనకు దగ్గరగా ఉంది. మనిషి ఎక్కడి నుంచి వస్తున్నాడు? ఎక్కడికి వెళుతున్నాడు? జీవితంలో వచ్చే సుఖదుఖాలకు, కష్టనష్టాలకు కారణం ఏమిటి? అసలు అందరిలో ఉన్న 'నేను' ఎవరు? ఆ నేను ఎక్కడి నుంచి వచ్చింది? ఇటువంటి అనేక రహస్యాలను విస్పష్టం చేస్తుంది విద్య.

ఇంకోమాటలో చెప్పాలంటే ఎవరో చనిపోతారు. అందరూ ఏడుస్తుంటారు, అక్కడున్న వారు అప్పుడే పోయావో అంటూ శోకాలు పెడతారు. ఇంకా శవాన్ని దహనం చేయలేదు కదా. ఆ వ్యక్తి అక్కడే పడుకుని ఉన్నాడు. కాకపోతే ఉలుకుపలుకు లేదు, ఒక బొమ్మలాగా ఉన్నాడు, అంతేకదా. మరి ఎక్కడికో పొవడమేమిటి? అక్కడ పోయింది ఎవరు? కదలకుండా ఉన్న ఆ దేహం ఎవరు? అతనే దేహం అయితే అతను అక్కడే ఉన్నాడు కదా. మరీ ఈ ఏడుపులు, శోకాలు ఎందుకు? వెళ్ళిపోయిందెవరు, అక్కడ పడి ఉన్నది ఎవరు? అతను ప్రాణం అయితే, ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి పోయింది? అసలు ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? ఇలా అనేక ప్రశ్నలు వస్తాయి. వాటికి సమాధానం చెప్తుందీ విద్య.

To be continued...........

Friday, 18 April 2014

హిందూ ధర్మం - 48 (విద్య)

ఎన్నో గొప్ప గొప చదువులు చదువుతున్నారు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద విశ్వవిద్యాలయాల నుంచి డిగ్రీలు పొందుతున్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. కానీ ఎంత సంపాదించినా, ఆనందంగా ఉండలేకపోతున్నారు, జీవితంలో ఒక అసంతృప్తి, ఏది తెలియని వెలితి. ఎందుకు? ఎంత గొప్ప చదువులు చదివినా తల్లిదండ్రులను వీధిన పడేస్తున్నారు, తన్ని తరిమేస్తున్నారు, జీతం తక్కువగా వస్తోంది, కలిసి ఉంటే మన జీతం కూడా మన అన్నకో, తమ్ముడికో ఇవ్వాల్సి వస్తుందని వేరు కాపురం పెడుతున్నారు ఎందుకు? సొంత చెల్లలి పెళ్ళి భారంగా భావిస్తున్నారు ఎందుకు?

ఎందుకంటే ఈ రోజు  మనం చదువుతున్న చదువులు సంస్కారాన్ని ఇవ్వడంలేదు. ప్రేమలు, అనుబంధాల గురించి చెప్పడంలేదు, నైతిక విలువల గురించి మనము, మన పిల్లలు చదువుకున్న చదువులో ఏమి ఉండదు. పిల్లలను కేవలం ఒక యంత్రాలుగా చూస్తూ, నిత్యం ఏదో ఒకటి నూరి పోయడమే విద్యా విధానం అయిపొయింది. అసలు ఇది విద్యనే కాదు, ఇది ఒక మిధ్య. ఆస్తికులుగా వెళ్ళిన పిల్లలను నాస్తికులుగా, భౌతికవాదులుగా మారిపోతున్నారు. ఆత్మనూన్యతకు లోనవుతున్నారు, ఒత్తిడికి గురువతున్నారు, కనీసం 8 గంటల సుఖనిద్ర కూడా లేని స్థితికి చేరుకున్నారు. ఇది భారతీయ విద్యావిధానం కాదు.

విద్య వినయాన్నిస్తుంది, అందరిని, అన్నిటిని అంగీకరించడం నేర్పిస్తుంది. ఆస్తికతను పెంచుతుంది, నైతికవిలువలను వృద్ధి చేస్తుంది. సమాజం పట్ల బాధ్యతలను, తోటి మనుష్యుల పట్ల ప్రేమానురాగాలను కలిగిస్తుంది. స్వార్ధాన్ని తొలగిస్తుంది, పదిమందికి సాయపడే మనస్తత్వాన్ని కలిగిస్తుంది. సహనాన్ని ఇస్తుంది, ఓర్పును పెంచుతుంది. అన్నిటికి మించి సంతృప్తినిస్తుంది. ఇది ఒక్క ఋషుల చేత ఏర్పరిచిన భారతీయ విద్యావిధానంలోనే కనిపిస్తుంది. ఈ రోజు సొంత చెల్లలికి పెళ్ళి చేయడం అన్నకు భారంగా మారింది. కానీ ఒకప్పడు భారతదేశంలో గృహస్థులు తమ కుటుంబీకులతో పాటు, బంధువుల బాగోగులను కూడా దగ్గరుండి చూసుకున్నారు. వారి నుంచి ఏమి ఆశించకుండా సాయం చేశారు. భారతీయ విద్యావిధానంలో చదువుకున్న ఏ విద్యార్ధి అడుక్కుతిన్న దాఖలాల్లేవు. అవరు ఆత్మహత్య చేసుకోలేదు, దోచుకులేదు, మోసం చేయలేదు, తల్లిదండ్రులను ఇంట్లో నుండి వెళ్ళగొట్టలేదు, ముసలివారిని భారంగా భావించలేదు. ఇవన్నీ ఒక భారతీయ విద్య మాత్రమే అందించింది. విద్య అంటే భారతీయ విద్యనే. అటువంటి విలువలను పెంచే విద్యను అభ్యసించడం ధర్మం.

To be continued............

Surrender - Ramana Maharshi

"Surrender is to give oneself up to the original cause of one’s being … One’s source is within oneself. Give yourself up to it. That means that you should seek the source and merge in it." From "Talks with Sri Ramana Maharshi" Talk 208.

Comforting the devotee who said that destiny prevented her from having peace, Bhagavan replied, "What is destiny? There is no destiny. Surrender, and all will be well. Throw all the responsibility on God. Do not bear the burden yourself. What can destiny do to you then?” (Talk 244). Bhagavan in Talk 244 (Talks with Sri Ramana Maharshi). In this beautiful dialog, Bhagavan was comforting a lady devotee and teaching her the power of surrender to the Lord for peace of mind.


Thursday, 17 April 2014

మహాగణపతిని ఆరాధన చేయండి

మహాగణపతిని ఆరాధన చేయండి. ప్రతిబంధకాలన్నీ తొలగిపోయి చక్కటి శక్తిని, చక్కటి సిద్ధిని ఇస్తాడు. కలియుగంలో మహాగణపతి మహా సిద్ధిని ఇవ్వగలిగే దైవం. ఆయన ఇవ్వగిలిగిన శక్తి, సిద్ధి అనిర్వచనీయమైనది. ఎందుకంటే
త్వమేవ ప్రత్యక్షం తత్వమసి - నువ్వే సమస్త జ్ఞానానివి
త్వమేవ కేవలం కర్తాసి - సమస్తానికి కర్తవు నువ్వే
త్వమేవ కేవలం ధర్తాసి - సంస్తాన్ని ధరించేవాడివి నువ్వే
త్వమేవ కేవలం హర్తాసి - సర్వ విధములైన దోషాలను తొలగించగలవాడిని కూడా నువ్వే
త్వం సాక్షాత్ ఆత్మాసి నిత్యం - నిత్యం ఆత్మ స్వరూపంగా
అందరిలో వెలిగొందుతున్నావు

వేదమే ఘోషించింది......... ఆయనకంటే గొప్ప ఘనీభూతమైన దైవం మరొకటి లేదని. అంత గొప్ప దైవం. ఈ సంవత్సరం పంచాంగ శ్రవణంలో ధనస్సురాశి గురించి చెప్తూ పరిపూర్ణానందస్వామి వారు పలికిన మాటలు ఇవి.

గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సంకష్టహర చవితి. అటువంటి సంకష్టహర చవితి నాడు గణాధిపతిని ఆరాధించే అవకాశాన్ని వదులుకోవద్దు. గణపతి అనుగ్రహం ప్రసరిస్తే అమోఘమైన బుద్ధి కలుగుతుంది, గణపతి అనుగ్రహంతోనే మూలాధార చక్రంలో ఉన్న కుండలిని శక్తి జాగృతమవుతుంది. గణాధిపతి అనుగ్రహించాలే కానీ, సమస్త దోషాలు పరిహారమవుతాయి. అటువంటి వినాయకుడిని ప్రెమతో పూజించండి.18-04-2014 సంకష్టహర చవితి, రాత్రి 9.31 నిమిషాలకు చంద్రోదయ సమయం. సంకటనాశన గణేశ స్తోత్రం పఠించండి. గణపతి ఆలయాన్ని సందర్శించండి, గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. దేవాలయానికి సాయంత్రం స్నానం చేసి వెళ్ళడం మరింత శుభకరం.

ఓం గం గణపతయే నమః      

Tuesday, 15 April 2014

శనీస్వరుడు - ఆంజనేయస్వామి

ఒకసారి శనీస్వరుడు వచ్చి హనుమంతుడి తలపై కూర్చున్నాడు. నా దగ్గరికి ఎందుకొచ్చావు అని హనుమ అడుగగా, నేను దేవతలందరినీ పట్టుకున్నాను, ఇప్పుడు నీ వంతు వచ్చింది, కనుక నిన్ను కూడా పీడిస్తా అంటాడు. సరేనన్న ఆంజనేయస్వామి వింధ్య పర్వతాన్ని ఎత్తి తన తలపై పెట్టుకుంటారు. స్వామి మహా బలవంతుడు, పరాక్రమవంతుడు, కొండలను సైతం పిండి చేయగలడు. ఆయనకు వింధ్య పర్వతం భారంగా అనిపించలేదు. కానీ స్వామి నెత్తిన కూర్చున్న శనికి భారంగా అనిపించింది. నా వల్ల కాదు, నేను మోయలేను, క్రిందకు దింపేయండి అంటూ కేకలు పెట్టారు. అయితే నన్ను విడ్చిపెడతావా అని స్వామి అడుగుతారు. అందుకు శని ఒప్పుకుంటాడు. వింధ్య పర్వతాన్ని తీసేస్తారు. శని వచ్చి స్వామి కాళ్ళపై పడి వేడుకుంటారు. అప్పుడు స్వామి, ఎవరు నన్ను ఉపసాసిస్తారో, వారికి నీ పీడ లేకుండా ఉండాలి అంటారు హనుమ. అందుకు అంగీకరించిన శని, హనుమను ఉపాసించేవారి మీద నా ప్రభావం ఉండదు అని అనుగ్రహిస్తారు.

ఎవరు హనుమను ఉపాసిస్తారో వారికి శని బాధలు ఉండవు. ఉపాసన అంటే కేవలం రోజు పూజ చేయడమే కాదు, హనుమతుడిని అనుకరించడం, ఆయన లక్షణాలను మనలో వృద్ధి చేసుకోవడం. ఉపాసన అన్న మాటకు దగ్గరగా కూర్చోవడం అని అర్దం ఉంది. స్వామి దగ్గరగా జరగడం అంటే స్వామి చెప్పినట్టుగా నడుచుకోవడం, ఆయన లక్షణాలను మనలో, మన పిల్లలో పెంపొందిచుకోవడం. ఎప్పుడైతే మనం స్వామి మీద అపారమైన నమ్మకం కలిగి ఉంటామో, ఎప్పుడు ఆయన మీద మనకు ఎనలేని ప్రేమ కలుగుతుందో, ఇక నువ్వు లేక నేను ఉండలేను అన్న స్థితి కలుగుతుందో, అప్పుడు స్వామి దర్శనం మనకు లభిస్తుంది.

జై శ్రీ రాం
జై హనుమాన్

Dietary concerns - Ramana Maharshi

Q: Has the body any value to the Self?
M: Yes, it is through the body's help that the Self is realized. 

Q: What about diet?
M: Food afFects the mind. The right food makes it more g sattvic. For the practice of any kind of yoga, vegetarianism is absolutely necessary. 

Q: What about those not accustomed to a vegetarian diet?

M: Habit is only adjustment to the environment. It is the mind that matters. The fact is that the mind as been trained to think certain foods tasty. Nourishment may be obtained from vegetarian food no less than from flesh. But the realized person's mind is not influenced by the food eaten. However, get accustomed to vegetarianism gradually.

Q: But if it is a matter of non-killing, then even plants have life.

M: And so do the tiles which you are sitting on!

Q: Could one receive spiritual illumination while eating meat?

M: Yes, but abandon it gradually and accustom yourself to sattfyic food. Once you have attained illumination, what you eat will make less difference, just as on a great fire it is immate­rial what fuel is added.

Conscious Immortality

Saturday, 12 April 2014

హిందూ ధర్మం - 47 (విద్య)

విద్య: జ్ఞానము కలిగి ఉండడం. అది నిజజీవితంలో ఉపయోగపడేదిగా ఉండాలి. విద్యా నమ్రతను, అణుకువను, వినయమును ఇవ్వాలి. అదే నిజమైన విద్య.

భూమి నుంచి దైవం వరకు, జడపదార్ధం నుంచి విశ్వచైతన్యం వరకు, స్థూలమైన విషయాల నుంచి సూక్ష్మ విషయాల వరకు, భౌతిక జ్ఞానం నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం వరకు,  సరైనా జ్ఞానాన్ని ఆర్జించడం, సమస్త విషయాయలపైన సరైన అవగాహన ఉండాలి, లేదా తెలుసుకోవాలి. తెలుసుకున్న జ్ఞానం కేవలం పుస్తకాలకే పరిమితం కాకూడదు, నిజ జీవితంలో ఉపయోగపడాలి. అటువంటి జ్ఞానమే విద్యా. మరొక విధంగా చెప్పాలాంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోవడం, మనసులో ఉన్న భావాన్ని అచ్చం అలాగే వ్యక్తపరచడం/పలకడం, ఏది మాట్లాడుతున్నామో, అచ్చంగా అదే చేయడం విద్యా అని, దానికి విరుద్ధంగా ఉండడం అవిద్యా అని అన్నారు ఆర్యసమాజ స్థాపూకులు దయానంద సరస్వతీ. అంటే ఏ కర్మనైనా త్రికరణశుద్ధిగా చేయించగల శక్తి ఒక్క విద్యకు మాత్రమే ఉంది.

The Knowledge of self is vidya - Swami Chinmayananda. (ఆత్మ) తన గురించి తాను తెలుసుకోవడమే విద్య అన్నారు స్వామి చిన్మయానంద. విద్య అనేది జనంలో ఆస్తికతను పెంచాలి తప్ప నాస్తికతను పెంచకూడదు.

మనం ఏం చదువుకున్నామో అది మన జీవితంలో ఉపయోగపడాలి. ఈ రోజు గమనిస్తే, మనం చదివిన చదువుకి, చేసే పనికి ఎంతమాత్రం పోలిక ఉండదు. వేదం అంటుంది కేవలం చదవడమే కాదు, మీరు చదివిన చదువు మీకు మీ జీవితంలో ఉపయోగపడాలి, కొత్త ఆవిష్కరణలు చేయడానికి ఉపయోగపడాలి, మీరు నేర్చుకున్న విద్యతో కొత్త విషయాలను వెలుగులోకి తేవాలి అంటే ముందుగా మీరు నేర్చుకున్న విద్య మీకు పూర్తిగా తెలిసి ఉండాలి. అది మీ మనసులోకి దట్టించకూడదు, మీకు మీరుగా స్వేచ్చగా తెలుసుకునేంత ఆసక్తిగా ఉండాలి. విద్య మీ సంస్కారాన్ని వృద్ధి చేయాలి, మీ జీవితాన్ని, మీ ద్వారా సమస్త సమాజాన్ని ఉద్ధరించాలి. మీలో స్వార్ధాన్ని తొలగించాలి. మీ ధృక్పదాన్ని మార్చాలి. నేను, నా కుటుంబం అనే భావన నుంచి సమస్త ప్రపంచం నా కుటుంబమే (వసుదైవ కుటుంబకం) అన్న భావన తీసుకురావాలి. విద్య దైవాన్ని దర్శింపజేయాలి. మీలో మీకు తెలియని రహస్యాలను తెలియజేయాలి. మీలో ఉన్న సమస్త శక్తిని బహిర్గతం చేయాలి. ఆత్మ తత్వాన్ని భోధించాలి. అదే నిజమైన విద్య.  

To be continued..............

Friday, 11 April 2014

హిందూ ధర్మం - 46

భారతీయ ధర్మం ప్రకారం మన దైవసంతానం. ఋషుల వారసులం. అంతేకానీ పాపులం కాదు. మనది ఋషుల డి.ఎన్.ఏ. వాళ్ళ గొప్ప మేధాశక్తి మన జన్యువుల్లో ఇంకా సజీవంగా ఉంది. ధూమాపానం, మద్యపానం డి.ఎన్.ఏ ను నాశనం చేస్తాయి. డి.ఎన్ ఏ స్వరూపాన్ని సంపూర్తిగా మార్చి వేస్తాయి. అట్లాగే మత్తు పదార్ధాలు కూడా. ఫలితంగా మేధాశక్తి, బుద్ధి శక్తి నాశనమవుతుంది, ఇంద్రియనిగ్రహం సడలిపోతుంది. కనుక ఇటువంటి దురలవాట్లకు దూరంగా ఉండడం ధర్మాచరణకు ఉండవలసిన లక్షణం.

అట్లాగే చెడు సాంగత్యం ఎప్పుడూ ఉండకూడదు. దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. ఈ లోకంలో అత్యంత దుర్లభమైనవి, దైవానుగ్రహం ఉంటే తప్ప లభించనవి మూడు ఉన్నాయి. ఒకటి మానవజన్మ, రెండవది మోక్షం పొందాలి, పరమాత్మను చేరాలన్న తపన, మూడవది మహాపురుషులు, సాధుపురుషులతో స్నేహం, సహవాసం. భాగవతులు, భవద్భక్తులతో స్నేహం చేయడం వలన మనలో భక్తి ఏర్పడుతుంది. గురువులు, మహాపురుషుల భోధనలు, మాటలు వినడం వలన చిత్తశుద్ధి కలిగి, మనసు భగవంతుని గురించి తీవ్రంగా తపిస్తుంది, ఆత్మసాక్షాత్కారం కలిగి, ఆత్మ పరమాత్మలో ఐక్యం అవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చిన ఇటువంటి మహాపురుషులతో స్నేహం వదలకూడదు. అట్లా సత్ సాంగాత్యం చేయడం ధీః.

యోగా, ధాన్యం మొదలైనవి ఆత్మశుద్ధిని కలిగిస్తాయి, రోగాలను తగ్గిస్తాయి. ధాన్యం, యోగా వలన క్షీణించిన డి.ఎన్.ఏ తిరిగి పూర్వస్థితిని పొందుతుందని, డి.ఎన్.ఏ.లో లోపాలు సవరించబడతాయని ఈ మధ్యనే శాస్త్రవేత్తలు తెలుసుకొన్నారు. ఈ ప్రక్రియలు బుద్ధిని వృద్ధి చేస్తాయి.

నిత్యం ఆరోగ్యకరమైన జీవనాన్ని గడపడం, శుద్ధ జలాలను త్రాగడం, శుద్ధమైన గాలిని పీల్చడం మొదలైనవి కూడా ధర్మాచరణలో భాగమే అన్నారు భారతీయ గురువులు. ఇటువంటి లక్షణాలతో జీవంచడం 'ధీః'.

To be continued..........

Inspiring:Village in India plants 111 trees every time a girl is born


All too often, it seems that an increase in human population must come at a cost to the environment, like in straining resources and encroachment on once wild habitats. But one quaint village in India has adopted a wonderfully eco-conscious tradition that is actually helping to ensure a greener future with each new generation.
While in some parts of India, many expectant parents still say they'd prefer bearing sons, members of the Piplantri village, in the western state of Rajasthan, are breaking this trend by celebrating the birth of each baby girl in way that benefits everyone. For every female child that's born, the community gathers to plant 111 fruit trees in her honor in the village common.
This unique tradition was first suggested by the village's former leader, Shyam Sundar Paliwal, in honor of his daughter who had passed away at a young age.
But planting trees is only one way that the community is ensuring a brighter future for their daughters. According to a report in The Hindu, villagers also pool together around $380 dollars for every new baby girl and deposited in an account for her. The girl's parents are required to contribute $180, and to make a pledge to be considerate guardians.
“We make these parents sign an affidavit promising that they would not marry her off before the legal age, send her to school regularly and take care of the trees planted in her name,” says Paliwal.

Over the last six years alone, as population there has increased, villagers in Piplantri have planted nearly a quarter million trees -- a welcoming forest for the community's youngest members, offering a bit of shade for their brighter future.

Thursday, 10 April 2014

హిందూ ధర్మం - 45 (పోషకాలతో నిండిన ఆహారాన్ని స్వీకరించడం ధీః )

పోషకాలతో నిండిన ఆహారాన్ని స్వీకరించడం ధీః

సహజంగా పండిన శాఖాహారమే బుద్ధిని వృద్ధి చేస్తుంది. ప్రపంచ మేధావులను ఒకసారి పరిశీలిస్తే, అందులో మూడువంతుల మంది శాఖాహారులే ఉంటారు. మాంసాహారం పేరుకే పుష్టికరమైనా ఆహారం. కానీ ప్రపంచంలో అత్యధికంగా రోగాల బారిన పడేది మాంసాహారులే అన్ని పరిశోధనలు చెప్తున్నాయి. మాంసాహారం త్వరగా అరగదు, ఫలితంగా మత్తును కలిగిస్తుంది. దాంతో కొత్త విషయాలను తెలుసుకునే తగ్గిపోతుంది. మాంసాహారమే కాదు, శాఖాహారంలోనూ రజో గుణాన్ని, తమో గుణాన్ని కలిగించే ఆహారాలను అధికంగా తీసుకోకూడదు. మసాల దట్టించిన వంటకాలు తినడం, ఉల్లి, వెల్లులి అతిగా తినడం వలన కూడా బుద్ధి మందగిస్తుంది.

కాయకష్టం చేసుకునే కూలికి బలం కావాలంటే రోజు కాసింత ఎద్దుకూర తినాలంటాడు ఓ ప్రబుద్ధుడు. అసలు ఎద్దుకు అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించడు. ఎద్దు తినేది గడ్డి, అంటే శాఖాహారమే కదా. ఎవరైనా లోకంలో మాంసాహారం తినండి అని ప్రోత్సహిస్తున్నారంటే వారు ప్రజల నాశనాన్ని కోరుకుంటున్నారని, మందబుద్ధులుగా తయారుచేయాలని కోరుకుంటున్నారని అర్దం చేసుకోండి.

స్వామి వివేకానందుడు కన్యాకూమారి వద్ద హిందూ మహాసముద్రం మధ్యలో ఒక శిలపై సామాధిలో 3 రోజుల పాటు కూర్చుని, ఆ పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు వివేకానందుడికి భవిష్యత్ దర్శనమైంది. భారతదేశం విశ్వగురు స్థానానికి చేరాడానికి ఉపయుక్తమయ్యే వాటిని స్వామీజీ దర్శించారు. భారత్‌లో ప్రజలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. భారతీయులందరికి పుష్టికరమైన ఆహారం అందిన రోజునే భారత్ తిరిగి పునర్వైభావాన్ని పొందుతుందని గ్రహించారు. అది దైవసందేశం. వివేకానందుడి ద్వారా పరమాత్ముడు భారతీయులకు చెప్పిన దివ్య సందేశం.

వివేకానందుడి 150 వ జయంతి జరుపుకున్నా, ఇంకా ఈ దేశంలో అనేకమంది పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారంటే అందుకు కారణం బాధ్యతారహితులైన భారతీయులే. పౌష్టికారానికి అర్దం మీరు, మీ పిల్లలు రోజు గిన్నెల నిండ అన్నం తినడం కాదు. ఆహారం కోద్దిగా స్వీకరించినా, అది బలవర్ధకమైనదై ఉండాలి. అందులో పోషకాలు ఉండాలి. అది మన బుద్ధిని వృద్ధి చేయాలి. శరీరానికి మంచిబలాన్ని ఇవ్వాలి. అటువంటి ఆహారన్ని స్వీకరించడం ధీః (మన ధర్మం). ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు, తిన్న ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయన్నదే ముఖ్యం.    

కానీ ఈ రోజు మన దౌర్భాగ్యం ఏమిటంటే మన పిల్లలకు అటువంటి ఆహారం ఇవ్వడంలేదు,  మనమూ తీసుకోవడంలేదు. జొన్నలు, రాగులు, సజ్జలు, పెసలు మొదలైన తృణధాన్యాలను ఎంతమందిమి తింటున్నాం? మన పిల్లలో ఎంతమందికి అసలు జొన్నలు, రాగులు, సజ్జలు మొదలైన తెలుసు?

To be continued............

Wednesday, 9 April 2014

హిందూ ధర్మం - 44

బుద్ధిని వికసింపజేసే ఆహారం తీసుకోవడం ధీః

ఆరోగ్యవంతమైన, పుష్టికరమైన, పోషకాహారం తీసుకుకోవడం ధర్మం అన్నారు మనుమహర్షి. బుద్ధిని వికసింపజేసే ప్రధానమైన ఆహారం ఆవుపాలు. దేశవాళీ ఆవుపాలు రోజు త్రాగేవారికి అమోఘమైన బుద్ధి ఉంటుంది. ఆవుదూడ త్రాగిన తరువాత మిగిలిన పాలనే స్వీకరించాలి. అటువంటి ఆవుపాలు మాత్రమే బుద్ధిని వృద్ధి చేస్తాయి. జెర్సీ ఆవుపాలు విషంతో సమానం. అవి తాగడం కంటే, తాగకపోవడం శ్రేయస్కరం. ఆంగ్లేయులు భారత్‌ను తన ఆధీనంలోకి తీసుకునే సమయానికి కలకత్తాలో జనాభాకు సరిసమానంగా గోవుల సంఖ్య ఉండేది అని బ్రిటీషర్ల రికార్డులు చెప్తున్నాయి. అప్పుడు వ్యవసాయం మొత్తం గో ఆధారితంగానే జరిగేది. దానికి సహజ వ్యవసాయం అని పేరు. అదే పాలేకర్ విధానం. జనమంతా ఆవుపాలనే స్వీకరించేవారు. గేదెపాలు స్వీకరించడం ఈ మధ్య కాలంలో మాత్రమే వచ్చింది. కానీ ఈ గేదెపాలు బుద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపవు.

దేశవాళీ గోపేడ, గో మూత్రాలను, వేప మొదలైన కొన్ని ఇతర సహజ పదార్ధాలను కలిపి చేసే ఎరువుతో ఆహారం పండించేవారు. ఎద్దు చేత దున్నబడిన భూమిలో పండిన ఆహారం నేత్రవ్యాధులను అస్సలు రానివ్వదని వేదం అంటుంది. ఓ భూమాతా! నువ్వు మా తల్లివి. నిన్ను గోమయం చేత మరింత పవిత్రం చేస్తున్నాము అంటూ గోమయాన్ని (ఆవుపేడ) ఎరువుగా వాడాలని ఒక ఉపనిషత్‌లో మాట. ఈ విధమైన వ్యవసాయ విధానమే దేశమంతటా ఉండేది. ఆ కాలంలో వారు ఒక ఎకరం భూమిలో పండిన ఆహార ధాన్యాలను, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఎన్ని పరిశోధనలు చేసినా ఈరోజుకు పండిచలేకపోతున్నాయి. ఈ వ్య్వసాయానికి మూలం వేదం. ఈ విధమైన సహజ వ్యవసాయం విధానంలో పండిన ఆహారమే బుద్ధి వికసింపజేస్తుంది.

తద్విరుద్ధంగా రసాయనాల చేత పండిన ఆహారం శరీరాన్ని విషతుల్యం చేస్తుంది. ఆఖరికి తల్లిపాలల్లో కూడా విషం చేరిపోయిందంటే పరిస్థితి మనం అర్దం చేసుకోవచ్చు. ధీః బుద్ధిని వికసింపజేసే ఆహారం తీసుకోవడం. దీనీ అర్దం ఎంత ఎక్కువ ఆహారం తీసుకుంటే అంత మంచిది అని కాదు, మనమున్న ప్రదేశాన్ని బట్టి, నడుస్తున్న ఋతువును బట్టి, వాతవరణ పరిస్థితులను బట్టి, ఎప్పుడు ఏది తీసుకుంటే మనకు మంచిదో ఆయుర్వేదంలో ఋషులు సూచించారు. అట్లాగే అప్పుడు ఏది తీసుకోకూడదో, దాన్ని శాస్త్రంలో నిషేధించారు.

ధీః - మంచి ఆహారాన్ని ఋషులు చెప్పినట్టుగా, మనమున్న దేశకాలాలకు లోబడి స్వీకరించడం.

To be continued.........

Monday, 7 April 2014

రాముడిలా గొప్పగా బ్రతకాలి

ఓం శ్రీ రామాయ నమః

ఎవరైన ఒక వ్యక్తిని అతని మిత్రులు పొగుడుతుంటారు. కానీ, అతని చేతిలో దెబ్బలు తిన్నవారు, శతృవులు పొగిడితే ఆ వ్యక్తి ఎంత గొప్పవాడై ఉంటాడు.

మారీచుడు దగ్గరకు రావణుడు వచ్చి రాముడు గురించి చాలా చెడ్డరీతిలో రాముడి మీద లేనిపోనివన్నీ మాట్లాడుతాడు. అప్పుడు మారీచుడు "రావణ! నువ్వు వీరుడు, గుణవంతుడైన రాముడిని పొగడకపోవచ్చు, కానీ రాముడు నీలాగా చపలుడు కాదు, తొందరపడి మాట్లాడేవాడు అంతకన్నా కాదు. ఇంద్రుడు, వరుణ దేవుడికి సమానమైనవాడు.

రాముడు తన తండ్రి చేత అడవులకు వెళ్ళగొట్టబడ్డాడు అని అనుకుంటున్నావా? కాదు. రాముడు మర్యాద లేనివాడనుకుంటున్నావా? కాదు. శీలవంతుడు కాదంటావా? పచ్చి అబద్ధం. స్వార్ధపరుడు అనుకుంటున్నావా? కాదు. అల్పమైన క్షత్రియుడు అనుకుంటున్నావా? కానేకాదు. ధర్మహీనుడు, గుణహీనుడు అసలేకాదు. తనకంటే చిన్నవైన జీవులను బాధిస్తాడు అనుకుంటున్నావా? కాదు. రాముడు సర్వ జీవుల మేలు కోరేవాడు.

తన తండ్రిమాటను కైకేయి ద్వారా విని, "మా నాన్నా మాటను నిజం చేస్తా" అని వనవాసానికి బయలుదేరాడు. కైకెయి కోరిక తీర్చడం కోసం సమస్త రాజభోగాలను వదులుకుని వనవాసానికి వెళ్ళాడు. భరతుడు రాజ్యం ఇస్తానని చెప్పినా, తండ్రి మాట నిలబెట్టడం కోసం భరతుడి విన్నపాన్ని తోసిపుచ్చాడు.

రాముడు కర్కషుడు కాదు. అవిద్యావంతుడు అంతకంటేకాదు. ఇంద్రియాలను జయించనివాడు కాదు. రాముడు గురించి వినకూడనివి, ఊహించలేని మాటలను మాట్లాడ్డం నీకు తగదు రావణ.

"రామో విగ్రహవాన్ ధర్మః సాధుసత్య పరాక్రమః
రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవి వాసవః"

ధర్మానికి ఒక రూపం ఇస్తే అదే రాముడు, సాధుపురుషుడు, పరాక్రమవంతుడు, సర్వలోకాలకు, దేవతలకు ప్రపంచానికి రాజు.

విశ్వామిత్రుడి యాగాన్ని పాడుచేయడానికి నేను వెళ్ళినప్పుడు రాముడు 12 ఏళ్ళ బాలుడు. సరిగ్గా ఆయుధాలు వాడడం కూడా రానివాడు. ఈ పిల్లవాడేం చేస్తాడులే అనుకున్నా. రాముడికి నా మీద వేసిన బాణానికి వందయోజానాల దూరంలో సముద్రంలో పడ్డాను. నన్ను చంపద్దు అనుకున్నాడు కాబట్టి బ్రతికి ఉన్నాను.  

అప్పటినుంచి ఏ చెట్టు పక్కన రాముడు ఉన్నాడో, ఎటునుంచి వస్తాడో అని భయపట్టుకుంది. ఎవరిని చూసిన రాముడే కనిపిస్తున్నాడు, కలలో రాముడు వచ్చిన హడలిపోతున్నా. నీకో విషయం చెప్పనా రావణా! "ర"తో మొదలయ్యే ఏ పేరు విన్నా గుండెలు జారిపోతున్నాయి" అంటాడు.

ఎక్కడైనా శతృవును ఎదుటివారి తిడుతుంటే తెగ సంతోషపడతారు. కానీ, రాముడు చేతిలో చావుదెబ్బ తిన్న మారీచుడు రావణాసురుడు రాముడి గురించి తప్పుగా మాట్లాడితే సహించలేకపోయాడంటే రాముడు ఎంత గొప్ప వాడు. అటువంటి శ్రీ రామచంద్రుడిని మనం ఆదర్శంగా తీసుకుని జీవితంలో రాముడిలా గొప్పగా బ్రతకాలి.

ఓం శ్రీ రామాయ నమః        

Sunday, 6 April 2014

చావో రేవో ఆలోచించండి

ఎన్నికలు వచ్చేస్తున్నాయి. ప్రతి రాజకీయపార్టీ ప్రచారంలో మునిగిపోయింది. కుల సంఘాలు, మతపెద్దలు ఏ పార్టీలకు ఓటు చేయాలో చెప్తున్నారు. ఇటువంటి సమయంలో హిందువులు ఓటు వేసే ముందు కొన్ని నిజాలు తెలుసుకోండి.

కాంగ్రెస్ ముస్లిం, ఇతర మైనారటీ సంస్థలను మెప్పించడానికి మతహింస నిరోధక బిల్లు 2011 తెచ్చింది. దీనిలో స్వల్పమార్పులతో మతహింసనిరోధక బిల్లు 2014ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ మతహింస నిరోధక బిల్లు గురించి ప్రతి హిందువు తెలుసుకోవాలి.

మతహింస నిరోధక బిల్లు - దేశంలో మతహింసను నిరోధించడానికి, లౌకికవాదాన్ని(సెక్యులరిసం) కాపాడటానికి ఉపకరిస్తుందని ఈ బిల్లు చేసిన సభ్యుల అభిప్రాయం. ఆ బిల్లు ఏం చెప్తుందో చూడండి.

ఈ బిల్లు ప్రకారం మెజారటిలు అంటే కేవలం ఓ.సి., బీ.సి, హిందువులు మాత్రమే, ఎస్సి.,ఎస్టీలు హిందువుల చేత పీడింపడుతున్నవారు. మైనారటీలు అంటే ఇతర మతస్థులు, ఎస్సీ, ఎస్టీలు. ఈ బిల్లు కేవలం హిందువులకే వర్తిస్తుంది.

ఈ బిల్లు ప్రకారం దేశంలో ఉన్న హిందువులంతా సహజంగానే దోషులు, నేరస్థులు, హింసను ప్రేరేపించేవారు, ఆందోళంకారులు. దేశంలో మేజార్టీశాతం ఉన్నారు కనుక హిందువులు మాత్రమే దేశంలో భయాందోళనలు సృష్టిస్తారు. ఇదే ప్రధాన అంశం. అందువల్ల దేశంలో ఎక్కడ మతఘర్షణ జరిగినా, ఎక్కడ ఉగ్రవాదులు బాంబు పేల్చినా, నిజానిజాలతో సంబంధం లేకుండా, ఎవరు చేశారు, ఏ దేశం యొక్క ప్రోద్బలంతో చేశారన్నది కూడా పట్టించుకోకుండా దానికి హిందూ సమాజాన్నే బాధ్యులను చేస్తుంది ఈ బిల్లు. అంటే ఉగ్రవాదుల దాడి జరిగితే, దాడి చేసినవారిని కాకుండా, దేశంలో హిందువులు మెజారటీ కనుక వారినే అరెస్ట్ చేస్తారు. అది ఏ ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న హిందునాయకులను, పీఠాధిపతులను జైల్లో వేస్తారు. ఇతర మతస్థులు దాడు చేశారనంటే ఈ బిల్లు అంగీకరించదు.

మెజారీటీ జనాభా అధికంగా ఒక ప్రాంతంలో చేరితే, అది ఉద్రిక్తతకు, ఆందోళనకు దారి తీస్తుందన్నది, ఇతర మతస్థులపై దాడులకు కారణమవుతుందని ఈ బిల్లు చెప్తుంది. కనుక హిందువులు అందరూ ఒక చోట చేరే సభలను, ర్యాలీలను, ఉత్సవాలను ప్రభుత్వం నిషేధించవచ్చు. అంటే వినాయకచవితి, దుర్గానవరాత్రి, బతుకమ్మ, జాతరలు మొదలైనవి ఈ బిల్లు ప్రకారం నిషేధింపబడతాయి.

ఈ బిల్లు హైందవేతరుల మనోభావల గురించి నొక్కి చెప్తుంది. హిందువులు ఇతర మతస్థుల మనోభాలను ఏ విధంగా దెబ్బ తీసినా, హిందువులు శిక్షార్షులు. మీరు అవతలవారిని దూషించవలసిన అవసరంలేదు. వారి భయాందోళనలకు హిందువే కారణం అన్న ఒక చిన్న కంప్లైంట్ చాలు, నాన్-బెయిలబుల్ కేస్ క్రింద హిందువులను జైల్లో పెడతారు.

మనోభావాలు దెబ్బతీయడం అంటే? ఉదాహరణకు మీ ఇంట్లో మీరు దైవానికి పూజ చేసుకుంటున్నారు. ఒక హైందవేతరుడు వచ్చి, మీరు పూజిస్తున్న దైవాన్ని ప్రక్కకుతోసి తన దైవాన్ని పెడితే, మీరు నోరు మూసుకుని పూజ చేయాలి. ఇలా ఎందుకు చేశావని ప్రశ్నించినా, నేను ఒప్పుకోను అన్నా, అతని మనోభావలు గాయపరిచినవారవుతారు. అతను కంప్లైంట్ చేస్తే కనుక మీరు శిక్షార్హులు. ఇదే కాదు, మిమ్మల్ని మతం మారమని బలవంత పెట్టినా, నేను మారను అని మీరు సమాధనం చెప్తే, అది వారి మనోభావలను దెబ్బతీయటమేనట. ఇక్కడ జరిగిన సంఘటన్ గురించి ఈ చట్టానికి అనవసరం. వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయా లేదా అన్నదే ప్రధానం.

ఇక భయాందోళనల విషయానికి వద్దాం. హిందువులు ఒక చోట ఉత్సవం పేరున గుమ్మిగూడటం మాలో భయాన్ని కలిగిస్తోందన్న ఒక్క కంప్లైంట్ చాలు హైందవేతరుల నుంచి, ఆ ఉత్సవాన్ని నిషేధించవచ్చు. బిల్లు ప్రకారం ఇంట్లో పూజ సమయంలో గంటలు కొట్టడం, దేవాలయాల్లో సుప్రభాతాలు పెట్టడం, లౌడ్ స్పీకర్లలో ప్రవచనాలు చెప్పడం కూడా బ్యాన్ చేయబడతాయి. అసలు ప్రవచనాలు, ధర్మప్రచారాలను నిషేధించినా ఆశ్చర్యపడనవసరంలేదు. ఈ బిల్లు అమలైతే సంగీత కచేరీలు, భరతనాట్యాలు ఇక కలే అని చెప్పుకోవాలి. ఎందుకంటే కచేరీలో మన భగవంతుని గుణగణాలను మెచ్చుకుంటాం, కచేరి పేరిన ఈ హిందువులు తమ దేవుడే గొప్పని చెప్పుకుంటున్నారని వారి కంప్లైంట్ చేసినా అది వర్తిస్తుంది.

పిండప్రధాలు, తర్పణాలు చేయడం, శవాలను ఊరేగించడం వలన మాకు భయం వేస్తోంది అని ఏ హైందవేతరుడు కంప్లైంట్ చేసినా శవయాత్రలు, పిండప్రధానాలు, శ్రద్ధకర్మలు నిషేధిస్తారు. మీ ఇంట్లో మీరు చేసుకున్నా, మీ పక్క ఇంట్లో ఉన్నవాడు కంప్లైంట్ చేస్తే, వాడిని భయపెట్టినందుకు మిమ్మల్ని అరెస్టు చేస్తారు.

పెళ్ళి సమయంలో మ్రోగించే మంగళవాయిద్యాలు మాలో ఆందోళన కలిగిస్తున్నాయి, ఇబ్బంది కలిగిస్తున్నాయి అంటే చాలు, ఆ పెళ్ళివాళ్ళని జైల్లో పెట్టవచ్చు. వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో జరుగుతున్న యజ్ఞాలు, యాగాలు, వేదపారాయణలు ఈ బిల్లుతో ఆగిపోయే పరిస్థితి. దేవాలయాలు పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు.

ఒక ప్రాంతంలో ఇద్దరు వ్యాపారులు ఉన్నారు, ఒకరు హిందువు, మరొకరు హైందవేతరుడు. జనం అధికంగా హిందువు షాపులో వస్తువులు తీసుకుంటే, ఈ హిందువు నా వ్యాపారానికి అడ్డవస్తున్నాడు, ఇతని వల్లనే నేను నష్టపోతున్నాను, తద్వారా నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడు అన్న ఒక కంప్లైంట్‌తో ఆ హిందువు వ్యాపరిని అరెస్ట్ చేసి, అతడి వ్యాపారాన్ని, అస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చని బిల్లు చెప్తోంది.

ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అవినీతిపరుల ఆస్తిని జప్తు చేయాలని చట్టం చేయలేని రాజకీయపార్టీలు కేవలం నింద పడిన కారణంగా హిందువు ఆస్తిని స్వాధీనపరుచుకునే హక్కు కల్పించడం!

ఈ బిల్లులోని మరొక ఆశ్చర్యకరమైన విషయం చూడండి. సాధారణంగా చట్టం ప్రకారం ఒక వ్యక్తి మీద పడిన నేరారోపణ ఋజువు అయ్యేవరకు అతడు కేవలం నిందితుడు మాత్రమే. ఋజువు చేస్తేనే అతడిని దోషిగా పరిగణించి శిక్ష వేస్తారు. కానీ మతహింస నిరోధక బిల్లు అందుకు పూర్తి విరుద్ధం. హిందువు మీద హైందవేతరుడు కంప్లైంట్ చేస్తే, దానికి సాక్ష్యం అవసరమేలేదు. నేను తప్పు చేయలేదని హిందువు నిరూపించుకునేవరకు అతడు దోషే. అతడు శిక్షార్హుడు. అతని ఆస్తిని జప్తు చేయవచ్చు. ఒకవేళ హైందవేతరుడే తప్పు కంప్లైంట్ ఇచ్చాడని తేలితే, అతని శిక్షపడదు, అతడిని విడిచిపెట్టేస్తారు. అదే బిల్లులో సుస్పష్టం.

ఈ బిల్లు ప్రకారం హిందువులపై 1950 నుంచి ఉన్న కేసులన్నీ రీఓపెన్ చేసి విచారణ చేపట్టవచ్చు. ఒక చిన్న కంప్లైంట్ చాలు. కానీ ఇది ఇతర మతాలవారికి వర్తించదు.

ఏదైనా ఒక రాష్ట్రంలో మతఘర్షణ జరుగుతుందన్న నెపంతో అక్కడున్న ప్రభుత్వాన్ని రద్దు చేసి, కేంద్ర బలగాలను దింపి, ఆ ప్రాంతంలో రాష్ట్రపతి పాలన అమలు చేసే సదుపాయం ఈ బిల్లులో ఉంది. ఈ బిల్లు రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది, ఫెడరల్ వ్యవస్థను నాశనంచేస్తుంది.

ఈ బిల్లు మొత్తం హిందువుల గురించే మాట్లాడుతుంది. మైనారటీలు ఎన్ని అకృత్యాలు చేసినా దీనికి సంబంధం ఉండదు. ఒకరకంగా చెప్పాలంటే ఈ బిల్లు ప్రకారం మైనారటీలు చెప్పేవన్నీ నిజాలు, హిందువులు అబద్దాలకోరులు. దీనికి ప్రత్యేక కమీషన్ ఒకటి కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పాటవుతాయి. వాటికి ప్రత్యేక నిధి కూడా ఉంటుంది. ప్రత్యేక సిబ్బంది కూడా ఉంటుంది.

ఇది కేవలం హిందువులు మెజారాటిలుగా ఉన్న రాష్ట్రాలకే పని చేస్తుంది. ఎక్కడ హిందువులు తక్కువ సంఖ్యలో ఉంటారో, ఆ రాష్ట్రాల్లో ఏ చట్టం అమలు జరగదని బిల్లే స్పష్టం చేస్తోంది. ఎందుకంటే ఈ దేశంలో అల్లర్లకు హిందువులే కారణమట.

ఇంత దిక్కుమాలిన బిల్లును యూ.పీ.యే ప్రభుత్వం పార్లమెంటు రాజ్యసభలో ప్రవేశపెట్టడం కూడా జరిగిపోయింది. ఒక హిందూ దేశంలో హిందువులకు ఎంతో అన్యాయం చేసే ఈ బిల్లు మీద బీ.జే.పి. తప్ప ఇతర రాజకీయపార్టీలు స్పందించకపోవడం, తప్పని చెప్పకపోవడం ఈ దేశపు హిందువులు దౌర్భాగ్యం. ప్రతి చిన్న విషయాన్ని పదేపదే చూపించే మీడియా ఈ భయానక బిల్లు గురించి జనానికి చెప్పకపోవడం, మీడియా యొక్క కుహనాలౌకికవాదానికి నిదర్శనం.

కనీసం ఇప్పటికైనా హిందువులు కులాలకు అతీతంగా సంఘటితం కావాలి. తమదైన ఓటు బ్యాంకును నిర్ముచుకోవాలి. కేంద్రంలో హిందూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని మతాలను ఆదరిస్తూనే, హిందు ధర్మాన్ని ఆచరించాలి, కాపాడుకోవాలి.

కేంద్రంలో ఈసారి కూడా కూహనాలౌకికవాద ప్రభుత్వం ఏర్పడి ఈ చట్టం తీసుకువస్తే, ఈ దేశంలో హిందువులకు మూడే దారులు ఉంటాయి.

ఒకటి మతమార్చుకోవడం, రెండవ చచ్చిపోవడం, లేకుంటే బాధలు పడటం.

ఓటు వేసే ముందు కాస్త ఆలోచించండి. ముస్లింలు, క్రైస్తవులందరూ గంపగుత్తగా కాంగ్రెస్‌కు ఓటు వేయడానికి నిర్ణయించుకున్నారు. హిందువులేమో కులాల పేరున కొట్టుకుచస్తున్నారు. కమ్మలు ఒక పార్టీకి, రెడ్లు ఒక పార్టీకి, కాపులు వేరే పార్టీకంటూ మనలో మనమే గుద్దుకుని ఓట్లు చీల్చుకుంటున్నాం. హిందువుల ఓట్లు కూడా గంపగుత్తగా ఒకే పార్టికి పడాలి. మనకోసం, మన ధర్మం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భారతదేశ రక్షణ కోసం.

ఇప్పుడు మనం రెండు పనులు చేయాలి. త్వరలో ఎన్నికలు వచ్చేస్తున్నాయి కనుక హిందువుల ఓట్లు చీలకుండా జాగ్రత పడాలి, మన గురించి మాట్లాడేవారిని గెలిపించుకోవాలి. దీర్ఘకాలంలో హిందువులంతా రాజకీయాలకు అతీతంగా ఒక ఉమ్మడి ఓటు బ్యాంకుగా మారాలి. ఆ పార్టీ, ఈ పార్టీ అని కాదు, అన్ని రాజకీయపార్టిలు హిందువులకు జై కొట్టాలి.

ఒక పక్క ఇల్లు తగలబడుతుంటే, వాటాల కొసం కొట్టుకుచావడమేమిటి? ముందు ఇల్లు తగలబడకుండా ఆపుదాం. ఆ తర్వాత మిగితా సంగతి చూసుకుందాం. ఓటు వేసే ముందు ఆలోచించండి.

Thursday, 3 April 2014

హిందూ ధర్మం - 43

పాపపుణ్యాలు అన్నవి అసలు ఉండవు, అన్నీ మన భావనలే, భగవంతుడే అన్నిటికి ప్రేరణం చేయిస్తున్నాడు అన్న భావన ఉంటే, మనం ఏం చేసినా పాపపుణ్యాలు అంటవు అంటూ ఎవరైనా చెప్తే అది తప్పు. ఈ లోకంలో అన్ని భగవత్ సంకల్పం వల్ల జరుగుతున్న మాట వాస్తవమే అయినా, అది ఆత్మజ్ఞానంతో పరబ్రహ్మంతో సమన్వయం చెందినవారికి గోచరించే సత్యం. దాన్ని పట్టుకుని, నేనే ఈ శరీరం అని భ్రాంతిలో ఉన్నవారు, ఆత్మానుభూతి పొందనివారు తమకు నచ్చినవన్ని చేస్తూ, ఎలా కావాలంటే అలా బ్రతుకుతూ, అన్ని భగవంతుడి ప్రేరణ వల్లనే జరుగుతున్నాయి అనడంలో అర్దంలేదు. ఒక వ్యక్తి అభివృద్ధిలోకి రావాలన్నా, పతనం కావాలన్నా, అది అతని బుద్ధిని ఉపయోగించడం మీదనే ఆధారపడి ఉంటుంది. నేను ఇచ్చిన బుద్ధిని సక్రమంగా వాడుకుని, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోవాలి అని గీతలో శ్రీ కృష్ణపరమాత్మ స్పష్టం చేశారు.

భగవంతుడిచ్చిన బుద్ధికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. ఆ బుద్ధి విషయంలో మనం అడిగేవరకు, సంపూర్ణశరణాగతి చేసేవరకు ఆయన కలగజేసుకోడు. మనం వేడుకుంటే మనకు సహాయం మాత్రం చేస్తాడు. అంతవరకు మనం చేసే ప్రతి కర్మలకు మనమే బాధ్యులం. మీరు మంచి చేసినా, చెడు చేసినా దాని ఫలితం అనుభవించవలసిందే. మనమే ఎప్పుడు ఏం చేయాలో, ఎలా బ్రతకాలో మనకు చెప్పడానికి శాస్త్రం ఉంది. మనిషి తన బుద్ధిని ఎంత సక్రమంగా వాడుకుందామన్న దాని మీద మనసు, పూర్వజన్మ వాసనల ప్రభావం పడుతుంది. అందుకే మనం మన బుద్ధిని సక్రమంగా వాడుకునే శక్తిని ఇమ్మని పరమాత్మను ప్రార్ధిస్తాం.

మనం వేదాలు గమనించినా, అందులో భగవంతుడిని ప్రార్ధిస్తూ 'నువ్వు మా బుద్ధిని ప్రచోదనం చేయి, మంచి మార్గంలో మా బుద్ధి నడిచేలా అనుగ్రహించు, మేము మంచి పనులే చేయుదుముగాకా, నువ్వు మా బుద్ధులను ప్రేరేపించెదవు గాకా' ఇలా నడిచిపోతుంది వైదిక ప్రార్ధన. అంతేకానీ, ఓ దేవుడా! నేను పాపిని, దుర్మార్గుడిని అంటూ సాగదు. నాతో అన్నీ నువ్వే చేయిస్తున్నావు, నేను తప్పు చేసినా, దొంగతనం చేసినా, అదంతా నీ ప్రేరణే అని ఉండదు. మీరు చేస్తున్న ప్రతి పనికి మీరే బాధ్యులు. ఏ పని చేస్తున్న బుద్ధిని సక్రమంగా ఉపయోగించి చేయాలి. అలా చేయడమే ధర్మం.

To be continued..............

Wednesday, 2 April 2014

హిందూ ధర్మం - 42

ధర్మం యొక్క తదుపరి లక్షణం ధీః - బుద్ధి అంటుంది మనుస్మృతి.

ధర్మాచరణకు ఉండవలసిన లక్షణం బుద్ధిని ఉపయోగించడం. బుద్ధిని వృద్ధి చేసుకోవడం, జ్ఞానాన్ని పెంచుకొవడం, బుద్ధి శక్తికి విఘాతం కలిగించే మాదకద్రవ్యాలు, మత్త పదార్ధాలు, మద్యం, ధూమపానం (సిగిరెట్టు), మత్తు కలిగించే ఆహారపదార్ధాలు, మాంసహారం మొదలైనవాటికి దూరంగా ఉండడం, బద్ధకస్తులు, దుర్మార్గులు, చెడు అలవాట్లు కలిగినవారి నుంచి దూరంగా ఉండడం, అజాగ్రత్తగా ఉండకపోవడం (సావధానంగా ఉండడం), మంచివారితో, సాధుపురుషులతో, భగవత్ భక్తులతో స్నేహం చేయడం, సత్సంబంధాలు కలిగి ఉండడం, యోగా మొదలైన ప్రక్రియలను ఆచరించడం, పుష్టికరమైన, సంతులిత ఆహారం తీసుకోవడం, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధమైన అలవాట్లను కలిగి ఉండడం వంటివి బుద్ధిని వికసింపజేస్తాయి. ఈ లక్షణాలు కలిగి ఉంటూ బుద్ధి శక్తిని కాపాడుకోవడం, వృద్ధి చేసుకోవడం ధర్మం అంటున్నారు మను మహర్షి.

మనిషికి బుద్ధి జీవి అని పేరు. సృష్టిలో అన్ని జీవులకు బుద్ధి ఉన్నా, వాటి నడవడిక వాటి పూర్వజన్మ కర్మను, వాసనలను అనుసరించె ఉంటుంది. మానవుల విషయంలో కూడా అంతే. కానీ మనిషికి, ఇతర జీవులకు ఉన్న తేడా, మనిషి కొత్తగా కర్మ చేయవచ్చు, అది పుణ్యమైనా, పాపమైనా. జంతువులు కేవలం ఫలాలు మాత్రమే అనుభవిస్తాయి. అవి చేసే కర్మలకు పాపపుణ్యాలు ఉండవు. మనిషికి భగవంతుడు ఇచ్చిన గొప్ప సాధనం బుద్ధి.

మనమేం చేసినా అది తిరిగి మనవద్దకు వస్తుంది, ఈ సమస్త ప్రకృతి కొన్ని చక్రాల మీద నడుస్తున్నది, మనసు పూర్వజన్మ వాసనలనే చక్రంలో బంధించబడి ఉంటుంది. కర్మలు కూడా అంతే. ఈ జగత్తు మొత్తం ఒక పెద్ద యంత్రం లాంటిది. కానీ ఈ జగద్యంత్రానికి వెలుపల నుంచి పని చేసే సాధనమే బుద్ధి.

జీవితంలో మనకు ఎప్పుడు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి మంచిదారి, రెండవది చెడ్డదారి. ఏ దారిలో పయనిస్తామన్నది మనం తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది, మనిషికి సంపూర్ణంగా నిర్ణయాధికారం ఉంది. మీరు ఎటువంటి నిర్ణయాలైనా తీసుకునే స్వేచ్చ భగవంతుడి ఇచ్చాడు. మీరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, ఎంచుకున్న మార్గాన్ని బట్టి మీకు ఏ ఫలాలు లభించాలో, అవి మాత్రమే భగవంతుడు ఇస్తాడు. ఇక్కడే బుద్ధిని ఉపయోగించాలి. సరైన సమయంలో సరైన మార్గాన్ని ఎంచుకోవాలి.

To be continued..............

Tuesday, 1 April 2014

హిందూ ధర్మం - 41 (శౌచం)

మనకు ఇష్టమైనవాళ్ళు ఎన్ని మాట్లాడిన, అన్ని దుర్మార్గాలు చేసినా మనకు అవేమి కనిపించవు. వాళ్ళు పొరపాటున ఏదైనా అంటే ఆవేశంలో అన్నాడులే అను ఊరుకుంటారు. అదే మనకు నచ్చనివాళ్ళు ఏదైనా అంటే, ఇక మన ఆవేశానికి హద్దులు ఉండవు. వాడు చిన్న తప్పు చేసినా, మనకు పెద్దగానే కనిపిస్తుంది. వాడు చేసే మంచిపనులను మెచ్చుకోకపోగా, అందులో తప్పులు వెతికే ప్రయత్నం చేస్తాం. మన మనసు ఒకరకంగా ట్యూన్ చేసేసుకున్నాం. ఇది దాదాపు అందరికి ఉంటుంది. కానీ ధర్మం అంటుంది పక్షపాత రహితంగా ఉండడమే శౌచం. ఒకరిపట్ల పక్షపాతంతో వ్యవహరించడం ఆశౌచం.

అట్లాగే విషయ పరిజ్ఞానం పూర్తిగా సొంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఏర్పచుకుంటాము. అది వ్యక్తుల విషయంలో కావచ్చు, వ్య్వస్థల విషయంలొ కావచ్చు. మనకున్న కొద్ది జ్ఞానంతో అందరి మీద లేనిపోని అభిప్రాయాలు ఏర్పరుచుకుని వాళ్ళని, వీళ్ళని విమర్శిస్తాం, ఏవోవో మాటలు అనేస్తాం. మన జీవితం గురించి మనకు లేని శ్రద్ధ పక్కవాడి జీవితంలో చూపిస్తాం. మనం ఎలా ఉన్నామో చూసుకోము, ఎప్పుడు వాడిని, వీడిని విమర్శించడమే పనిగా పెట్టుకుంటాం. అవతలివాళ్ళు బాధపడతారని ఉండదు. అసలు మనకు ఎదుటివాడి మనోభావలతో సంబంధమే ఉండదు. ఇది అశౌచము.

వ్యక్తులను వివిధ కారణాల చేత నీచంగా చూడడం అశౌచం. జ్ఞానవిషయంలో, జన్మ, కుల, మత, ప్రాంతాల విషయంలో వ్యక్తులను కానీ, ఇతర జీవాలను కానీ మనకంటే అల్పంగా, నీచంగా చూడడం, భావించడం అశౌచం. ఈ విధంగా ఎవరు చూస్తారో, వారు ఆ క్షణమే తమ శౌచాన్ని కోల్పోతారు.  అన్ని జీవులయందూ పరమాత్మ సమభావంతో వెలుగొందుతున్నాడు కనుక సర్వజీవులను సమభావంతో చూడడం, అందరిని గౌరవించడం వల్లనే పవిత్రత ఏర్పడుతుంది.

భగవంతుడు పక్షపాతరహితుడు. తన భక్తుడికి ఒక విధంగా, తనను ద్వేషించేవానికి మరొక విధంగా ఫలితాలు ఇవ్వడు. వ్యక్తి చేసిన కర్మలను అనుసరించే ఫలితాలను ఇస్తాడు. జనులందరూ కూడా అట్లాగే పక్షపాత రహితంగా ఉండాలనుకుంటాడు. నువ్వు స్నానం చేసి, మంచి బట్టలు ధరించి ఆయన ముందు నిల్చుంటే శుచిగా ఉన్నావని చెప్పడు, నీలో పక్షపాతం ఉండకూడదు, నీ ఆలోచనలు స్వచ్ఛంగా ఉండాలి. అప్పుడే నువ్వు శౌచం కలిగి ఉన్నావని అంటాడు.

ఈ విధమైన శౌచం కలిగి ఉండడం ప్రతి వ్యక్తి యొక్క ధర్మం అన్నది ఋషివాక్కు.

To be continued..............