సత్యమస్తేయమక్రోధో హ్రీ శౌచం ధీధృతిర్దమః |
సమ్యతేద్రీయతా విద్యయా ధర్మం సర్వ ఉదాహృతః ||
- యాజ్ఞవల్క్య స్మృతిః
సత్యం, అస్తేయం, అక్రోధము, పశ్చాత్తపాము, శౌచము, బుద్ధిని ఉపయోగిచడం, ధృతి, దమము, ప్రశాంతమైన మనసు, తపస్సు, ఇంద్రియ నిగ్రహం, విద్యను అభ్యసించడం మొదలైన లక్షణాలతో జీవితాన్ని గడిపితే, అది ధర్మాన్ని ఆచరించమవుతుందని యాజ్ఞవాల్క్య స్మృతిలో యాజ్ఞవల్క్య మహర్షి చెప్పారు.
ఇందులో కొన్ని లక్షణాల గురించి ఇంతకముందే చెప్పుకున్నాం. హ్రీః అంటే పశ్చాత్తాపం కలిగి ఉండటం. చేసిన తప్పును అంగీకరించి, దానికి చింతించి, ఇంకెప్పుడు ఇలా నేను చేయను అని గట్టిగా సంకల్పించుకుని, సంకల్పాన్ని నెరవేర్చడం. ఎప్పుడైనా మనం తప్పు చేయగానే ముందు అహం పైకి వస్తుంది. అహకారం కారణంగా చేసిన తప్పును ఒప్పుకోకపోగా, దాన్ని సమర్ధించుకుంటారు. తప్పు ఒకరు చేసినా, ఇద్దరు చేసినా, లోకమంతా చేసిన అది తప్పే. అందరూ తప్పు చేస్తున్నంతమాత్రం చేత అది ఒప్పు అవ్వదు. అందరూ తప్పు చేస్తున్నారు, నేను చేస్తే తప్పేంటని సమర్ధించుకోవడం అధర్మం అంటున్నారు మహర్షి. అలా కాక చేసిన నేరానికి సిగ్గుపడాలి. పశ్చాత్తాపం అగ్ని వంటిది, అది వ్యక్తి శిలాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుతుంది, అహకారం కూడా అగ్నిలాంటిదే కానీ అది వ్యక్తిని పూర్తిగా కాల్చి భస్మం చేస్తుంది.
పశ్చాత్తాపం అన్నది నటన కాకూడదు. చాలామంది తప్పు చేసిన తర్వాత శిక్షపడుతుందని భయంతో అయ్యో! ఇలా చేయకపోయి ఉంటే బాగుండేదే అని బాధపడుతుంటారు. దాన్ని పశ్చాత్తాపంగా భావించకూడదు. శిక్షపడుతుందనే భయం వలన ఏర్పడిన భావన అది. పశ్చాత్తాపానికి గూరైన వ్యక్తి శిక్ష తప్పించుకోవాలాని చూడడు. అసలు అతనికి శిక్ష గురించి పట్టింపే ఉండదు. నేను ఎంత పాపం చేశాను, నాకు శిక్షపడినా తప్పు లేదు, నాకు శిక్షపడాల్సిందే, నేను చేసిన పని వల్ల అవతలివారు ఎంత బాధపడి ఉంటారో అన్న భావన వస్తుంది. ఆ వ్యక్తికి శిక్ష పడకపోయినా, అతను మానసికంగా నిరంతరం ఆవేదన చెందుతూనే ఉంటాడు, లోలోపల కుమిలిపోతూ ఉంటాడు. అటువంటి పశ్చాత్తాప లక్షణాన్ని కలిగి ఉండడం ధార్మికును ఒక లక్షణం అన్నారు యాజ్ఞవల్క్య మహర్షి.
To be continued .....................

పశ్చాత్తాపం అన్నది నటన కాకూడదు. చాలామంది తప్పు చేసిన తర్వాత శిక్షపడుతుందని భయంతో అయ్యో! ఇలా చేయకపోయి ఉంటే బాగుండేదే అని బాధపడుతుంటారు. దాన్ని పశ్చాత్తాపంగా భావించకూడదు. శిక్షపడుతుందనే భయం వలన ఏర్పడిన భావన అది. పశ్చాత్తాపానికి గూరైన వ్యక్తి శిక్ష తప్పించుకోవాలాని చూడడు. అసలు అతనికి శిక్ష గురించి పట్టింపే ఉండదు
ReplyDeleteమన తప్పులను గుర్తించి పట్టాలిగా..తర్వాత పశ్చాత్తాపమును పోందాలి..👍
ReplyDelete