తపస్సు - ధర్మాన్ని ఆచరించేవారిలో కనిపించే లక్షణం తపస్సు అంటున్నది యాజ్ఞవల్క్య స్మృతి. ఏంటండి? ధర్మాన్ని ఆచరించాలంటే మీసాలు, గడ్డాలు పెంచుకుని, అందరిని వదిలి, అడవిలోకి వెళ్ళాలా? అనకండి. తపసు అంటే ఇక్కడ నిరంతరం ఉన్నత స్థితిని చేరుకోవాలని తపించడం, దానికోసమే ప్రయత్నించడం అని అర్దం. ఎవరైనా ఒక వ్యక్తి అనుకున్నది సాధిస్తే, అతడి దాని కోసం తీవ్రమైన తపస్సు చేశాడండి అంటాం. ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎన్నో విషయాల కోసం నిరంతరం తపిస్తూ ఉంటాడు. కొందరు గొప్ప ఉద్యోగం కోసం, మంచి జీతం కోసం, ఇంకొకరు ఆస్తులు సంపాదించడం కోసం, వెరొకరు శరీర అందాన్ని కాపాడుకోవడం కోసం, ఇలా రకరకాలుగా ఎప్పుడు ఏదో ఒక దానిని పొందాలని తపిస్తూనే ఉంటారు. కానీ నిజంగా వీటిని తపస్సుగా పరిగణించాలా?
లౌకిక విషయల కోసం వెంపర్లాడి, సాధించినా, తాత్కాలికమైన ఆనందం లభిస్తుంది కానీ, దీర్ఘకాలంలో అది దుఃఖానికి కారణమవుతుంది. మనిషి ఆశాజీవి. ఎంత ఆశాజీవి అంటే, లక్ష రూపాయల జీతం కోసం కష్టపడి, ఉదోగ్యం సాధించినా, ఇంకో లక్షవస్తే బాగుండని దాని కోసం ప్రయత్నిస్తాడు. అది సాధిస్తే, ఇంకో లక్షకోసం. ఆస్తుల విషయంలో కూడా అంతే. ఎన్ని ఆస్తులున్నా, ఇంకా ఇంకా కూడబెట్టాలన్న తపన. కొన్ని తరాలను పోషించదగ్గ సంపద ఉన్నా, ఇంకా పోగు చేసి, మరింత ధనవంతుడిని కావలనే తపన, ఏదో వెంపర్లాట. ఇది జీవితాంతం ఉంటుంది. నిజానికి జీవితం మొత్తం ఈ వెంపర్లాటలోనే గడిచిపోతుంది. యవ్వనంలో సంపాదించడం కోసం కష్టపడతాడు, ముసలివయసు రాగానే రోగాలను నయం చేసుకోవడం కోసం మొత్తం సంపద ఖర్చు చేస్తాడు. ఇదంతా గమనించిన వ్యక్తిలో ఒక ఆలోచన బయలుదేరుతుంది. చచ్చేటప్పుడు నేను వీటిని కట్టుకుపోను, మరి వీటి కోసం ఇంత ఆందోళన ఎందుకు అనిపిస్తుంది. మరణం తర్వాత మనిషి వెంబడి వచ్చేవి కర్మల ఫలితాలు, అంటే పాపపుణ్యాలు మాత్రమే.
ఆ ఆలోచన వ్యక్తిలో మార్పు తీసుకువస్తుంది. నేను జీవితంలో నిజాయతీగా, నీతిగా, వేదం, పురాణం, స్మృతులు, ఋషులు చెప్పినట్టుగా జీవించాలి. ధర్మాన్ని అనుసరించాలి, దైవాన్ని ఉపాసించి, మోక్షాన్ని పొందాలి అనే సంకల్పం జనిస్తుంది. ఆ సంకల్పం వ్యక్తి నడవడికను పూర్తిగా మార్చేస్తుంది. నేను దైవం మెచ్చేలా గొప్పగా జీవించాలి, నా జీవిన విధానంతో దైవాన్ని మెప్పించాలి, నేను దైవాన్ని చేరడం కాదు, దైవం నన్ను హత్తుకుని తనలో ఐక్యం చేసుకోవాలన్న తపన అతని ప్రతి అణువులో నిండిపోతుంది. అతని శరీరం ఎప్పుడు ఆ ఆలోచనతో గడుపుతుంది. దాని కోసం వ్యక్తి తీవ్రమైన సాధన చేస్తాడు. కష్టసుఖాలు, ఆకలిదప్పికలు, శీతోష్ణాలు అతనిని ప్రభావితం చేయవు. ఇదంతా ఒక్క క్షణంలోనో, రోజులోనో, సంవత్సరంలోనో జరగదు కానీ సాధన వల్ల తప్పకుండా సాధ్యం అవుతుంది. ఇటువంటి శాశ్వతమైన, గొప్పదైన, అక్షమైన స్థితి కోసం తపించడమే తపస్సు అన్నది గురువుల సందేశం.
To be continued ................

No comments:
Post a Comment