మంత్రం అంటే ఏంటి అని సందేహం వస్తుంది. మంత్రం అంటే ఎంతో యుక్తితో కోడింగ్ (Coding) చేయబడిన విజ్ఞానం యొక్క రహస్య రూపం. అసలు మంత్రమే ఒక కోడ్ (Code). అది పైకి మాములుగానే కనిపిస్తుంది, కానీ అర్దం చేసుకుంటే అద్భుతాలు గమనిస్తాం. ప్రతి మంత్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం, ఉద్దేశ్యము ఉంటుంది. పెద్ద మర్రిచెట్టు చిన్న విత్తనంలో ఉన్నట్లే, శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానం మంత్రాల్లో ఉంటుంది. విత్తనాన్ని మట్టిలో వేసి, నీరు అందించి, తగిన పోషకాలు అందించినప్పుడు, భూమిలో పరిస్థితులు అనుకూలించినప్పుడు అది ఏ విధంగా అయితే మొలకెత్తుతుందో, అదే విధంగా తగిన వ్యక్తికి, కొన్ని ప్రత్యేక సమయాల్లో మంత్రాల్లో అర్ధాలు వెళ్ళడవుతాయి. ఈ మంత్రాలను డికోడింగ్ (Decoding) చేసిన వ్యక్తులనే మనం ఋషులు అంటున్నాం. ఇలా భగవంతుడు మంత్రరూపంలో చెప్పడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి సమస్త విజ్ఞానమంతా మంత్రంలో బీజరూపంలో ఉంచి, మేదస్సును, మనోశక్తిని ఉపయోగించి విజ్ఞానాన్ని కనుగొనమన్నారు. రెండవది లోకంలో అనేక మనస్తత్త్వాలు కలిగిన వ్యక్తులు ఉంటారు. కొందరు పరమ నిస్వార్ధపరులు ఉంటారు. తమ గురించి ఏమీ ఆలోచించరు, ఎప్పుడు పదిమంది బాగుండాలని కోరుకుంటారు, అవసరమైతే లోకం కోసం తమ కోరికలను, సుఖాలను సైతం విడిచిపెడతారు. ఈ కోవలోకి వస్తారు ఋషులు. వారు కాక, కొందరు తమ స్వార్ధం చూసుకుంటూ లోకం బాగుండాలని కాంక్షిస్తారు. వారు రెండవరకం. మూడవరకం వారు కేవలం తమ స్వార్ధమే చూసుకుంటారు, లోకం ఏమైపోయినా వీరికి అనవసరం. నాలుగవరకం వారు తమ మాత్రమే బాగుండాలి, లోకం నాశనమవ్వాలి, తాము మాత్రమే సుఖంగా ఉండాలి, వెరొకరు అలా ఉంటే చూడలేరు. ఒక గొప్ప విషయం చెప్పవలసి వచ్చినప్పుడు, అది సరైన వ్యక్తులకే చెప్పాలి, దుర్మార్గులకు కానీ ఒక అద్భుతమైన జ్ఞానం వెళ్ళిందా, అది లోకకంటకం అవుతుంది. మంచివాళ్ళకి, నిశ్వార్ధపరులకు జ్ఞానం చేరితే, అది లోకకల్యాణ కారకమవుతుంది. అందుకే భగవంతుడు తాను చెప్పదల్చుకున్న విషయాలను వేదమంత్రాల ద్వారా చెప్పారు.
మంత్రమనగానే అది కేవలం ఒక అక్షరసమూహం అని భావించకూడదు. మంత్రానికి శబ్దానికి చాలా సూక్ష్మమైన, విశేషమైన సంబంధం ఉంటుంది. శబ్దం చరాచరాత్మక ప్రపంచమంతా వ్యాపించి ఉంటుంది. రెండు వస్తువుల రాపిడివల్ల శబ్దం ఏర్పడుతుంది. అణువుల మధ్య రాపిడి వల్ల కూడా చాలా సూక్ష్మమైన శబ్దాలు ఏర్పడతాయి. లోకమంతా శబ్దతరంగాలు వ్యాపించి ఉంటాయి. ఈ శబ్దానికి మూలం నాదం, అదే ఓంకారం. ఏ వస్తువుల మధ్య రాపిడి లేకపోయినా, నిశ్శబ్దం నుంచి వినిపించే ఏకైక నాదం ఓంకారం. ఈ మంత్రాలకు కూడా మూలం ఓంకారం.
To be continued ...........

No comments:
Post a Comment