Labels
- Dharma
- Inspiring
- Ramana Maharshi
- Science and Hindusim
- Yoga
- ఉత్తరాఖండ్ వరదలు
- ఏకాదశి
- కార్తీక మాసం
- గణపతి
- గురు పూర్ణిమ
- గురుతత్వము
- చరిత్ర
- దేవి నవరాత్రులు
- దైవం
- ధర్మం
- నవదుర్గ
- పండుగలు
- పర్యావరణం / Ecology
- బతుకమ్మ పాటలు
- భూతాపం(Global Warming)
- మన దేవాలయాలు
- వినాయక చవితి
- వినాయకచవితి కధలు
- సంకష్టహర చవితి
- సంప్రదాయం - శాస్త్రీయం
- సూక్తులు
- స్తోత్రాలు
- హిందూ విజ్ఞానం
Saturday, 31 December 2016
Friday, 30 December 2016
Thursday, 29 December 2016
స్థిరత్వం యొక్క అనుభూతి- స్వామి సచ్చిదానంద
An Experience of Stillness
Try this yourself. Any time the mind is agitated, just sit quietly, not moving at all. Let the mind be as agitated as it wants. If your body is still, very soon the mind will calm down all by itself. Why? Because when there is no physical movement, the breath becomes slow; and the breath is the interconnection between mind and body. As the breath slows, the thought-making process slows down and the mind becomes calm.
- Swami Satchidananda
Wednesday, 28 December 2016
Tuesday, 27 December 2016
Monday, 26 December 2016
Sunday, 25 December 2016
Saturday, 24 December 2016
స్వామి శివానంద సూక్తి
Understand and realize the powers of thought. Unfold the hidden powers or occult faculties. Close the eyes. Concentrate. Explore the higher regions of the mind.
You can see distant objects, hear distant voices, send messages to distant places, heal persons who are at a distance and move about to a distant place in the twinkling of an eye.
- Swami Sivananda
Friday, 23 December 2016
నీకిప్పుడు శాంతి కావాలా? - స్వామి సచ్చిదానంద
Do You Want Peace Now?
“If you want everything, then don’t want. But not with the idea of, ‘If I say I don’t want, I will get it.’ That won’t work. Truly and sincerely you should say, ‘I am not interested in anything. When things come, fine; when they go, wonderful.’ The minute you renounce your wants, you are eternally in a peaceful condition. So let us find that peace. Do you want that peace now? Even wanting peace is dangerous. Sometimes people are restless: ‘I’m restless. I want to be peaceful.’ By wanting to be restful, you lose your peace. Even that craving should be discarded—have no want at all. It sounds crazy, you know. How can you live without want? Well, try it some time. You will know. When you stop wanting, everything will want you.
- Swami Satchidananda
Thursday, 22 December 2016
Wednesday, 21 December 2016
Tuesday, 20 December 2016
Monday, 19 December 2016
Sunday, 18 December 2016
హిందూ ధర్మం - 233 (జ్యోతిష్యం - 15)
ఆధునిక పరిశోధన కూడా ప్రకారం గ్రీస్, ఇతర నాగరికతలలాగే తనకంటే వైభవంగా విలసిల్లుతున్న నాగరికతల నుంచి జ్ఞానం తీసుకుని, తనలో కలుపుకుని, తన ఆలోచనలో భాగం చేసుకుందని స్పష్టం చేసింది. సోక్రటీస్‌కు ముందే గ్రీస్‌లో హిందువులు నివసించారని కొందరు పాశ్చాత్య చరిత్రకారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గ్రీకులో సన్యాసానికి దగ్గరగా కొన్ని సంప్రదాయలుండటం గురించి Egypt మరియు Israel (1911) గ్రంధ రచయిత, Professor Sir Flinders Patrie (1853-1942) అంటారు- క్రీ.పూ. 480 నాటికే పర్షియన్ సైన్యంలో ఎంతో పెద్ద సంఖ్యలో భారతీయ సేనలు ఉండటం, భారతదేశం మరియు గ్రీస్ మధ్య సంబంధాలు ఎంత వరకు వెళ్ళాయో చెప్తోంది. ఈజిప్ట్‌లోని Memphis అనే ప్రాంతంలో దొరికిన క్రీ.పూ. 5 వ శతాబ్దానికి చెందిన భారతీయుల modeled heads, భారతీయులు వర్తకం కోసం అక్కడ నివసించారని చెప్తున్నాయి. అందువల్ల నూతనమైన పాశ్చాత్య ఆధ్యాత్మికతకు భారతీయతే మూలమని ఎటువంటి కష్టం లేకుండా తేల్చవచ్చు.
సోక్రటీస్ శిష్యుడైన ప్లాటో, తన గురువు రచనలే కాక, కొన్ని తాను కూడా గ్రంధస్థం చేశాడు. అవన్నీ హిందూ సిద్ధాంతాలకు, ఉపనిషద్ బోధనలకు దగ్గరగా ఉంటాయి. ప్లాటో కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మాడు. నిజానికి ఇది ప్లాటొ కంటే శతాద్బం ముందే జీవించిన పైధాగోరస్, భారతదేశంలో గంగా తీరంలో చదువుకున్న తర్వాత, అక్కడ ప్రతిపాదించాడని జెర్మన్ చరిత్రకారులు 17 వ శత్బాదంలోనే అభిప్రాయం వ్యక్తం చేశారు (ఈ విషయం ఇంతకుపూర్వ భాగాల్లో చెప్పుకోవడం జరిగింది). ఈ విధంగా ఈ రోజు పాశ్చాత్య ప్రపంచం తమ ఆలోచనకు మూలపురుషులుగా కొలుస్తున్న ముగ్గురి మీద సనాతనధర్మం యొక్క ప్రభావం ఉంది. కాకపోతే ఆ తర్వాతి వారు ఉపనిషత్తులను పరిశీలించని కారణంగా, వారి ఆలోచన వక్రమార్గం పట్టి ప్రపంచ నాగరికతల నాశనానికి దారి తీసింది. ఇది ఆ తర్వాత కూడా కొనసాగింది. క్రీ.పూ. 2 వ శత్బాదానికి చెందిన అఘతా క్లోస్ అనే గ్రీకు రాజు, శ్రీ కృష్ణుడు, బలరాముడి ముద్రలున్న వెండి నాణేలను ముద్రించాడు. ఇది అక్కడి పురావస్తుశాలలో చూడవచ్చు.
గ్రీకు రాయబారి, మెగస్తనీస్, భారతదేశ సౌభగ్యాన్ని గురించి వివరంగా రాసి పెట్టాడు. గ్రీకు పతనమైన రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన తర్వాత కూడా వాళ్ళకు, మనకు మధ్య వ్యాపారలావాదేవీలు, వాణిజ్యం ఏమాత్రం తగ్గలేదు. రోమన్లు, అప్పట్లో బ్రహ్మాండమైన నౌకాబల సంపన్న దేశంగా ఉన్న భారతదేశం నుంచి చేసుకునే దిగుమతుల నిమిత్తం, ఏడాదికి 5 కోట్ల సెస్టర్సులు (50,00,000 డాలర్లు) ఖర్చు పెట్టేవారని ప్లీనీ (క్రీ.శ. 1 వ శతాబ్ది) అంటాడు. ఆ తర్వాత అక్కడ క్రైస్తవ మతవ్యాప్తి పెరిగింది. క్రైస్తవంలో కూడా ఎన్నో ఆదర్శాలను సనాతన ధర్మం, బౌద్ధ మతాల నుంచి తీసుకున్నారని ఎందరో అభిప్రాయపడ్డారు. భారతదేశ సంపదల గురించి ప్రస్తావిస్తూ బైబిల్ ( II క్రానికల్స్ 9:21.10) అంటుంది, "తార్షీష్ ఓడలు, బంగారం, వెండి, దంతం, కోతులు, నెమళ్ళు మాత్రమే కాకుండా ఆల్గం (చందనం) చెట్ల కొయ్య, రత్నాలు కూడా సమృద్ధిగా, ఓఫిర్ (బొంబాయి తీరంలో ఉన్న సోపారా) నుంచి తెచ్చి సాలమన్ రాజుకు ఇచ్చాయని చెబుతోంది". ఆఖరికి పరమత 'దైవ' గ్రంధాల్లో కూడా హిందూదేశ వైభవం ప్రస్తావించబడింది. అంటే అప్పట్లో ఆ గ్రంధకర్తల మీద మన దేశ ప్రభావం ఎంతగా ఉండేదో గమనించవచ్చు.
To be continued .............
వివరాలకు క్రింది లింకులు పనికి వస్తాయి.
http://historydetox.com/pythagoras-plato-and-india/
http://www.hinduwisdom.info/India_and_Greece.htm
https://ramanan50.wordpress.com/2014/03/30/vedic-hinduism-in-germany-greece-russian-veda/
Saturday, 17 December 2016
Friday, 16 December 2016
కోపంతో ఎలా వేగాలి?- స్వామి సచ్చిదానంద
How to Deal with Anger
“Ask yourself whether your anger achieves anything. On the one hand, it may not create any effect on the person you’re angry with. He or she may say, ‘You are always angry like that,’ and ignore you and keep on. Then your anger is useless. On the other hand, you ruin your own peace and health; it is your blood that boils. If you get angry often, you become nervous. So it’s best to analyze the cause and instead of pointing your finger at somebody, ask yourself, ‘What did I do to become angry?’ Blaming others or expressing anger is not the best way. Every time you express anger, or any habit or desire, you are renewing it. You need to starve it. Don’t give it the opportunity to express itself. Then it starves for want of expression, and you will feel free.
“God bless you. Om Shanti, Shanti, Shanti.”
- Swami Satchidananda
మార్కళి పిళ్ళైయార్
ధనుర్మాసం దేవతలకు తెల్లవారుఝాము కాలము. దైవశక్తిని ప్రచోదనం చేయటానికి ఈ నెల మొత్తం ఎంతో అనువైనది. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఈ మాసమంతా ఆండాళ్ అమ్మవారు రచించిన పాశురాలు చదువుతూ, ధనుర్మాస వ్రతం చేస్తారు. శైవులు అరుణాచలంలో రచించబడిన తిరువెంపావై చదువుతూ, సదాశివుడిని అర్చిస్తారు. అలాగే ద్రావిడ ప్రాంతాల్లో, ముఖ్యంగా శ్రీ లంకలో, అక్కడి సంప్రదాయంలో, శైవాగమం ప్రకారం గణపతిని విశేషంగా పూజిస్తారు. అందులో ఈ ధనుర్మాసం మొత్తం వినాయక స్వామిని అరించే సంప్రదాయం ఉంది.
దాని గురించి నందినాథ సంప్రదాయం కైలాస పరంపరకు చెందిన గురుదేవులు సద్గురు శివాయ శుభ్రమునియ స్వామి ఈ విధంగా చెప్పారు- మార్కళి పిళ్ళైయార్ అనేది గణపతిని ఈ మాసమంతా ఆరాధించే పండుగ. వేల ఏళ్ళుగా చలికాలంలో వినాయకుడిని ఉద్దేశించి ఈ పండుగ/ పూజ జరుగుతోంది. తమిళ మాసమైన మార్కళి - డిసెంబరు మధ్య నుంచి జనవరి మధ్య వరకు- మనం పిళ్ళైయార్ (గణపతి) ని ఎంతో భక్తితో, ప్రత్యేక పూజలు, జపాలు, భజనలతో పూజిస్తాము. సంవత్సరంలో ఇది అత్యంత ఆధ్యాత్మికత ఉట్టిపడే సమయం. ఈ సమయంలో ప్రయత్న పూర్వకంగా, మూఖ్యంగా తెల్లవారుఝాము 4 గంటల నుంచి 6 వరకు గణపతిని ధ్యానిస్తాము. సంప్రదాయంలో, అన్ని పూజలు, ఆధ్యాత్మిక సాధనలు మార్కళి మాసంలో మొదలవుతాయి, ఇంటిని ప్రతి రోజు శుభ్రం చేస్తారు.
ఓం శ్రీ గణేశాయ నమః
17-12-2016, శనివారం, మార్గశిర బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
17-12-2016, శనివారం, మార్గశిర బహుళ చవితి, సంకష్టహర చతుర్థీ.
మార్గశిర మాసంలో వచ్చింది కనుక దీనికి అఖుహర్త సంకష్టహర చతుర్థి అని పేరు.
వ్రత విధానం ఈ లింక్‌లో చూడగలరు.
http://ecoganesha.blogspot.in/2014/03/20-2014.html
17 డిసెంబరు 2016, చంద్రోదయ సమయం హైద్రాబాదులో (భారత కాలమానం ప్రకారం) - రాత్రి 9.20 నిమి||
http://www.drikpanchang.com/vrats/sankashti-chaturthi-dates.html

Thursday, 15 December 2016
ధనుర్మాసం విశిష్టత
16 డిసెంబరు 2016, శుక్రవారం నుంచి ధనుర్మాసం ప్రారంభం
ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని �బాలభోగం� అని పిలుస్తారు.
భోగితో ముగుస్తుంది:
సూర్యుడు మకర రాశిలో ప్రవేశం చేసే భోగి వరకూ (సంక్రాంతి ముందురోజు) ధనుర్మాసం కొనసాగుతుంది. ఆలయాల్లో పండుగ వాతావణం నెలకొంటుంది. వైష్ణవులు ధనుర్మాస వ్రతానికి శ్రీకారం చుడతారు. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం ధనుర్మాసం. గోదాదేవి (అండాళ్) �మార్గళి వ్రతం� పేరుతో ధనుర్మాసమంతా విష్ణు వ్రతం చేపట్టి, స్వామిని కీర్తించింది. ధనుస్సంక్రమణ రోజు స్నానాలు, పూజలు, జపాలు చేయడం మంచిది. సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం శుభప్రదం.
ఎంతో పునీత మాసం:
ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసం అని అర్థం. �ధను� అనగా దేనికొరకు ప్రార్థించడమో అనే అర్థం దృష్ట్యాధనుర్మాసం అత్యంత పునీతమైనది. ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. నిజానికి అంటే ఆండాళమ్మ పూజ, తిరుప్పావై పఠనం, గోదాకళ్యాణం ప్రసాదాలు మొదలైనవి ద్రావిడ దేశ సంప్రదాయమే అని పెద్దలు చెప్తారు. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం.
బ్రహ్మముహూర్తంలో పారాయణం:
ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. దరిద్రం దూరం అవుతుంది. ఈ మాసంలో ప్రతి రోజు బ్రాహ్మముహూర్తంలో పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులగుట తద్యమని శాస్తవ్రచనం. సాక్షాత్ భూదేవి, అవతార మూర్తి అయిన అండాళ్ రచించిన దివ్య ప్రబంధమే తిరుప్పావై. ద్రావిడ భాషలో �తిరు� అనగా పవిత్రమైన, పావై అనగా వ్రతం,త ప్రబంధం అని అర్థం. వేదాల ఉపనిషత్తుల సారమే తిరుప్పావై అని మన పూర్వాచార్యులు ప్రస్తుతించి యున్నారు. ఉపనిషత్తులే గోదాదేవి నోట సర్వ సులభరీతిలో వెలువడి నాయనీ, తిరుప్పావై మహావిష్ణు పాద పద్మాలను అందుకోవటానికి మార్గదర్శకాలనీ చెప్పబడింది. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం స్వామికి నైవేద్య ంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లిడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడు. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది.
శ్రీకృష్ణుడికి తులసిమాల:
ప్రతి రోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుని ధనుర్మాసం నెలరోజులూ తులసీ మాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది.ధనుర్మాస వ్రతం దీని గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలను కునేవారు శక్తిమేరకు విష్ణు ప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్టించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణు కథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్క రోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిస్తూ ఈ శ్లోకం పఠించి, ఆశీస్సులు అందుకోవాలి.
శ్లో. మదుసూధన దేవేశ ధనుర్మాస ఫలప్రదా
తవ మూర్తి ప్రదానేన మమసంతు మనోరథా:
ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపర మాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయు లందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సుల భంగా వశపరచుకోవచ్చనీ, నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసి వారికి, తిరుప్పావై గాన ,శ్రవణం చేసిన వారికీ ఆయు రారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయం కాగలదనీ, ఆశిద్దాం.
ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ?
ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం , పాయసం , దద్దోచనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది.
ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు , పెరుగు , పెసరపప్పులతో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది . ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారము ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి.
కన్నెపిల్లలకు మేలు జరుగుతుంది:
వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాధుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణముగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని , భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాధ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగానాధుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది.
ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు:
రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు , మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యం జరపకూడదు. కేవలం పండుగ వాతావరణంతో అంతా సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ మాసంలో ఎక్కువగా సూర్య పూజలు చేస్తారు. ఇంకా విష్ణుముర్తిని నిత్యం వేకువనే పూజిస్తారు. ఇలా చేయటం శుభం.
గొబ్బెమ్మలు ఎందుకు పెడతారు? ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యంపిండి , పసుపు , కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తారు. లక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మలను ఈ విధానం వలన పూజించటం జరుగుతుంది. నిత్యం ముగ్గులు వేయడం వలన స్ర్తీలకు మంచి వ్యాయామం కూడా కలుగుతుంది.
కాత్యాయనీ వ్రతం:
పూజా విధానం:
రోజులానే ముందు పూజ చేసుకోవాలి... ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం,గోదా అష్టోత్తరం చదువుకోవాలి..రంగనాధ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది... ముందుగా ప్రార్ధన చదవాలి...ఆ తరువాత వరుసగా తనయ చదవాలి...తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి...తనయ చదువుతూ తొమ్మిది,పది తనయలు రెండు సార్లు చదవాలి..చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి..ఆ తరువాత ప్రార్ధన చదవాలి..ఆ తరువాత గోదాదేవి తనయ చదవాలి..ఆ తరువాత పాశురములు చదవడం ప్రారంభించాలి.. పాశురములు చదివేటప్పుడు మొదటి పాశురము రెండు సార్లు చదవాలి..అల మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి...అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడి గా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను,చివరపాశురంలో ఒక లైను చదవాలి..
చివరగా గోదా హారతి చదవాలి..మంత్ర పుష్పం కూడా చదవాలి..మళ్ళి ఏ రోజు పాశురం ఆ రొజు రెండు సార్లు చదివి హారతి ఇవ్వాలి...నైవేద్యం సమర్పంచాలి(రోజు పొంగలి,తద్ధోజనం,పరవన్నం ఉండి తీరాలి....కాలము ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు...కాని ఒక్క విషయం గుర్థుకు పెట్టుకోవాలి..పైవి అన్ని కూడా సూర్యోదయానికి ముందే అవ్వాలి..
Source: http://www.suryaa.com/features/article.asp?subCategory=6&ContentId=200981

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 8
పంచభూతాలకు శక్తులున్నాయని మన శాస్త్రకారుల మాట. నీటికి మన భావాలను గ్రహించి, దానికి అనుగుణంగా మారే లక్షణం ఉంది. దీన్ని జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిరూపించారు. అలాగే భూమికి, వాయువుకు, ఆకాశానికి, అనలానికి కూడా కొన్ని శక్తులున్నాయి. మహాపురుషులు, అవతారమూర్తులు తపస్సు చేసిన ప్రదేశాలు, నివాసం ఉన్న ప్రదేశాల్లో అక్కడి పంచభూతాల్లో వారి శక్తి నిక్షిప్తమై ఉంటుంది. బృందావనాన్ని దర్శించిన కొందరు పరమభక్తులు, యోగులు అక్కడి వాయు మండలంలో ఇప్పటికి నిక్షిప్తమై ఉన్న శ్రీ కృష్ణుని వేణునాదాన్ని విని పరవశిస్తారు. ఇలా అనేక ఉదాహరణలున్నాయి, కొన్ని రహస్యాలు కూడా ఉన్నాయి. ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం శృంగేరి. అక్కడికి శంక్రులు వెళ్ళేసరికి ఒక కప్ప ప్రసవిస్తూ ఉంటే, పాము పడగపట్టి నీడ ఇస్తుంది. అలాగే విద్యారణ్యులు విజయనగరం వెళ్ళినప్పుడు కుందేళ్ళు వేటకుక్కలను తరమడం చూసి, అక్కడే నగరానికి పునాది వేస్తారు. అది అక్కడి మహత్యం. మహాత్యం అంతా ఆ ప్రదేశంలో ఉన్న పంచభూతాల్లో నిక్షిప్తమై ఉన్న శక్తి వలన వస్తుంది. పుణ్యక్షేత్రం అంటే కూడా అంతే. క్షేత్రం వేరు, అక్కడి ఆలయంలో ఉన్న మూర్తి వేరు కాదు. తిరుమల వెళ్ళడం అంటే, ఆనందనిలయంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరుని మూర్తి ఒక్కటే కాదు, ఆ కొండ, ఆ గాలి, ఆ నడకదారి ........... సర్వమూ గోవిందుడే. ఆ కొండ మీద చెత్త వేస్తే, గోవిందుడి మీద వేసినట్లే. హరిద్వార్, ఋషికేశ్, కైలాస మానస సరోవరం వంటి ప్రదేశాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవి తపోభూములు. అక్కడున్న ఆలయంలో భగవంతునికి అపచారం చేస్తేనే పాపం కాదు, ఆ ప్రదేశంలో చేయకూడని పనులు చేసినా, దాన్ని కలుషితం చేసినా, ఈర్ష్యా, అసూయ, ద్వేషం మొదలైన దుర్భావాలకు లోనయినా, అది అపచారమే. అది ఆ ప్రదేశంలో ఉన్న పంచభూతాల్లోకి చెడు సంకేతాలను పంపుతుంది.
అలాగే మట్టికి కూడా తనలో కొంత శక్తిని నిక్షిప్తం చేసుకునే శక్తి ఉంది. ఇది మనకు వినాయకచవితిలో కనిపిస్తుంది. వినాయక చవితికి మృత్తికతో చేసిన గణపతిని పూజించిన తర్వాత, దాన్ని నిమజ్జనం పేరున జలములలో కలిపేస్తాము. ఏ మట్టి ప్రతిమలోనికైతే మనం గణపతిని ఆవాహన చేసి, అర్చించి, తిరిగి యధాస్థానానికి పంపామో, ఆ ప్రతిమ ఆ తర్వాత కూడా దైవీశక్తిని, మంత్రశక్తిని తనలో నిక్షింప్తం చేసుకుని ఉంటుంది. అందుకే దాన్ని ఎక్కడపడితే అక్కడ పడవేయరు. దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ప్రవహించే నీటిలో కలుపుతారు. దాని వలన ఆ మట్టి, దానితో పాటున్న మంత్ర/ దైవ శక్తి నీటిలో కలుస్తుంది, ఆ శక్తిని నీరు గ్రహిస్తుంది. ఆ జలములు ఎంత దూరం ప్రవహిస్తాయో, అంతదూరం ఈ శక్తి వ్యాపిస్తూ వెళుతుంది. సూర్యరశ్మికి ఆ నీరు ఆవిరై అక్కడి ప్రదేశాన్ని పవిత్రం చేస్తుంది, వర్షం కురిసినప్పుడు, ఆ జలములతో పాటే ఆ శక్తి భూమికి దిగి ఈ భూమిని పవిత్రం చేస్తుంది, పంటల ద్వారా ఆహారంలోకి చేరి, మనస్సులను పవిత్రం చేస్తుంది. అందుకే మన ధర్మంలో కొన్ని క్రతువుల తర్వాత నీటిలో విగ్రహాలను విసర్జిస్తారు. పూజ చేసిన వారికే కాదు, సమస్త భూమండలానికి ఆ ఫలితం అందుగాకా! అందరూ పవితులు అవుదురు గాకా! అన్నదే మన ధర్మ ఆదర్శం. లోకాసమస్తా సుఖినోభవంతు అన్న మంత్రానికి ఇది నిదర్శన పూర్వక ఉదాహరణ.
ఇలా ఇప్పటికి ఎన్నోసార్లు ఎందరో ఈ భూమండలాన్ని పవిత్రం చేశారు. నదీనదాలు, అడవుల మొదలు సమస్త ప్రకృతిలో, మానవులలో శాంతి కొరకు ఇలాంటివి చేసి, ఆ శక్తిని ప్రవేశపెట్టారు. కనుక అన్నిటియందు దైవశక్తి ఉంది, ఇవన్నీ ఒకనాడు నా పూర్వీకుల చేత పవిత్రం చేయబడ్డవే అనే భావనతో నేను వాటిని కలుషితం చేయను, ఇదంతా బ్రహ్మ మయమే అనేవాడే నిజమైన హైందవుడు.
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||
To be continued ..............
Wednesday, 14 December 2016
మెహర్ బాబా సూక్తి
God, who is in everything and everyone, is deaf to formal rituals, ceremonies and prayers in mosques, churches and temples; but He hears the voice of the heart. When you help others, God knows instantly and is pleased. No amount of prayer or meditation can do what helping others can do.
- Meher Baba
Tuesday, 13 December 2016
గాలి నా గురువు- దత్తాత్రేయ స్వామి
Air is my guru- I observed that air is pure and odorless in itself. And it blows on both sweet and foul-smelling things without any discrimination or preference. Though it momentarily seems to take on the smell of its surroundings, in a short while, it reveals its pristine quality. From this I learned that a spiritual aspirant should live in the world, unaffected by the dualities of life like joy and sorrow and by the objects of the senses. He should keep his heart’s feeling and his speech unpolluted by vain objects. As I have learned all this by observing it.
Sri Guru Dattatreya Swami
Monday, 12 December 2016
కంచి పరమాచార్య సూక్తి
ఇతరులను సేవించడంలో మనం ఎన్నో కష్టాలు ఎదురుకుంటాము, త్యాగాలు చేస్తాము, శారీరిక పరిశ్రమ చేస్తాము. కానీ అలా కలిగే ఆనందం, పూర్ణత్వభావన మనం పడే కష్టం కంటే ఎంతో ఎక్కువ. మన పూజ ద్వారా భగవంతుడేమీ పొందడు. ఆయన్ను పూజించడం, ధార్మిక గ్రంధాలు చదవడం, తీర్ధయాత్రలకు వెళ్ళడం చేత ఆంతరంగికమైన ఆనందం పొందుతాము. మనం పూజించేది, ఇతరులకు సేవ చేసేది ఎందుకొరకు? అదంతా మన సంతృప్తి కొరకే.
కంచి పరమాచార్య స్వామి
In serving others we may have to undergo hardships, make sacrifices and exert ourselves physically. But the happiness and sense of fullness we obtain is far greater compared to the trouble taken by us. The Lord does not have to gain anything form the puja we perform. In worshipping him, in reading the sacred texts, in going on pilgrimages we find inward joy. Why do we perform puja and why do we help others? It is all our own satisfaction.
- Kanchi Paramacharya Swami
13 డిసెంబరు 2016, మంగళవారం, మార్గశిర పూర్ణిమ, దత్తపూర్ణిమ.
శ్రీ దత్తాత్రేయుడు జ్ఞానయోగనిధి, విశ్వగురువు, సిద్ధసేవితుడు. ‘శ్రీదత్తా’ అని స్మరించినంతనే మన మనస్సులోని కోర్కెలు తీర్చునని శ్రుతి తెలుపుచున్నది. సర్వజీవులకు జ్ఞానబోధ గావించుట, జ్ఞానమయము, ప్రేమ సత్యానందమయము, ధర్మమయమూ తరింపజేయుటయే దత్తమూర్తి అవతారము. దత్తాత్రేయుడు వేదజ్ఞానము నధిగమించిన జ్ఞానసాగరుడు.
దత్తాత్రేయుడు అత్రి మహర్షి, అనసూయాదేవి కుమారుడు. అత్రి మహర్షి పుత్ర సంతానము కొరకై ఘోర తపస్సు చేసి దివ్యశక్తులు కలిగిన కుమారుడు కావాలని త్రిమూర్తులను కోరుకున్నాడు. తన తపస్సు ఫలితంగా బ్రహ్మ అంశమున చంద్రుడు, విష్ణు అంశమున దత్తుడు, శివ అంశమున దుర్వాసుడు జన్మించారు. కాలాంతరమున జన్మించిన ఆ ముగ్గురే శ్రీదత్తుడు అను నామముతో ప్రసిద్ధి చెందిరి. చంద్రుడు, దుర్వాసుడు తమ యొక్క శక్తులను దత్తునికి ధారపోశారు. దత్తుడు అనగా తనంత తానుగా ఎదుటి వ్యక్తికి ఇష్టముతో పెంచుకొనుటకై వెళ్లినవాడు అని అర్థం. శ్రీహరి తన జన్మస్థలమైన వైకుంఠ పట్టణమును విడిచి, అత్రికి పుత్రుడైన కారణముగా ఈయన ఆత్రేయుడైనాడు. ‘దత్తుడు + ఆత్రేయుడు ‘దత్తాత్రేయుడు’ అని మనం వ్యవహరించుచున్నాము.
ఆధిభౌతికము, ఆధిదైవికము, ఆధ్యాత్మికము అనే త్రివిధాలయిన తాపాలను తన తపో మహిమతో తొలగించుకొన్న మహనీయుడు అత్రి మహర్షి. అత్రి పుత్రుడు కనుక ‘ఆత్రేయుడు’ అని కూడా పిలువబడినాడు. దత్తుడు గోమతీ నదీ తీరమున సత్యజ్ఞాన సముపార్జనకై తపస్సు చేసి సకల విద్యలలో ఆరితేరి జ్ఞానమును సంపాదించి సత్యజ్ఞాని అయ్యాడు. దత్తాత్రేయుడికి ఆరు చేతులు మూడు తలలు నడిమి శిరస్సు విష్ణువుది. కుడిది శివుడిది ఎడమది బ్రహ్మ శిరం. కుడి భాగము సద్గురు స్వరూపము, ఎడమభాగము పరబ్రహ్మస్వరూపము మధ్యభాగాన గురుమూర్తిగా అజ్ఞానమును తొలగించి శ్రీదత్తుడు లోకముల రక్షణ చేయును. మూడు ముఖములతో, ఆరు భుజములతో నాల్గు కుక్కలతో, ఆవుతో కనిపిస్తాడు. నాల్గు కుక్కలు నాల్గు వేదములు, ఆవు మనస్సే మాయాశక్తి, మూడు ముఖములు త్రిమూర్తులు. సృష్టి, స్థితి, లయములు. త్రిశూలము ఆచారము, చక్రము అవిద్యా నాశకము, శంఖము నాదము సమస్త నిధి, డమరు సర్వవేదములు దీని నుంచి పాదుర్భవించినవి. కమండలము సకల బాధలను దూరం చేసి శుభాలను చేకూర్చుటకు ప్రతీక.
సంసార బంధములను తెంచుకొని తమ భక్తులను తనే ఎంచుకుని పరమ పదం వైపుకు నడిపించిన గురుదేవులు దత్తాత్రేయులవారు పుట్టిన రోజు మార్గశీర్షమాసంలో పూర్ణిమనాడు వస్తుంది. మృగశిరా నక్షత్రం వృషభరాశికి చెందినది. పౌర్ణమి అనేది చంద్రునికి సంబంధించిన అన్ని కళలతో నిండిన తిథి. వృషభరాశి చంద్రునికి స్వస్థానం కాబట్టి సంపూర్ణమైన చంద్రుని శక్తి ఉండే రోజు మార్గశీర్షపూర్ణిమనాడు దత్తాత్రేయ జయంతి జరుపుకుంటున్నారు. దత్తాత్రేయుడు మార్గశీర శుక్ల చతుర్దశిని అవతరించినా దత్తజయంతిని మహారాష్ట్రులు మార్గశీర పూర్ణిమనాడే జరుపుతారు. దత్త జయంతిని మధ్యాహ్నం వేళ కాకుండా పూర్ణిమ రాత్రి జరుపుకోవడం మంచిదని పెద్దల వాక్కు. పౌర్ణమినాడు దత్తుని పాలతో అభిషేకించి మనస్సులోని కోరికలను ఆయనకు తెలియజేస్తే విజయమును చేకూర్చుతాడు.
మేడి (ఔదాదుంబరం) చెట్టు మొదట్లో ఉండడానికి దత్తుడు ఇష్టపడుతాడు. ఆ మేడి చెట్టును మనము పూజ్యభావంతో చూస్తాము. అట్టి చెట్టు కింద కూర్చుని శ్రీ దత్తాత్రేయుని మంత్రం పఠిస్తే, ఈ కలియుగంలో నామస్మరణ మాత్రాననే తరించగల అవకాశము మానవ జాతికున్నది. కనుక శ్రీ దత్తావారిని తలచి ఆయురారోగ్యములను, స్మరించి భోగభాగ్యములను పొంది, శ్రీదత్తుని విషయమై ఏదైనా మనము అనుకున్నచో, అనుకున్న రోజుదగ్గరనుండే ఒక చక్కని మార్పు కలుగుట జరుగుతుంది. కనుక అట్టి దత్తుని జయంతి రోజు ఆరాధించి ధన్యులమవుదాం!
Source: http://archive.andhrabhoomi.net/content/dattatreya-jayanthi
మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 7
ఇప్పటివరకు ఆరోగ్యపరంగా, మానసికంగా మనకూ మట్టికి సంబంధం చూశాం. ఇప్పుడు ఆధ్యాత్మిక కోణం దర్శిద్దాము. ఈ శరీరంలో పంచభూతాలతో నిర్మితమైనట్టే, షట్చక్రాల్లో మూలాధారం నుంచి విశుద్ధి చక్రం వరకు క్రమంగా 5 చక్రాలు పృధ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశ తత్త్వాలను కలిగి ఉంటాయి. కుండలిని జాగృతి జరగాలన్నా, లేదా మనస్సు, శరీరం సమతుల్యంతో జీవించాలన్నా, ఈ తత్త్వాలు శుద్ధంగా ఉండాలి. ఇవి చెడిపోవడం వలన అనేక సమస్యలు వస్తాయి. జగ్గీవాసు దేవ్ అంటారు, అధికంగా మానవులంతా భౌతిక, మానసిక క్రియల వలలో ఇరుక్కుని ఉంటారు. వీటిని దాటి ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మొదట మనమీ పంచభూతాలను శుద్ధి చేసుకోవాలి. అప్పుడు భౌతిక, మానసిక స్థితులకు, నీ సహజ స్థితికి మధ్య తేడాను గమనించగలవు అని.
నిజానికి ఈ భూతశుద్ధి తంత్రశాస్త్రాల్లో చెప్పబడిన ప్రక్రియ. అయితే మన సనాతన ధర్మ జీవన విధానం ఎటువంటిదంటే అనేక ప్రక్రియలను మన జీవన విధానంలో భాగం చేశారు ఋషులు. మూలాధారం పృధ్వీ తత్త్వం. భూమికి దూరంగా జరిగితే శరీరంలో ఈ భూతం చెడిపోతుంది. అందువలన ఆధ్యాత్మిక ఉన్నతి అక్కడే ఆగిపోతుంది. అసలు మూలాధారమే ప్రారంభస్థానం. అక్కడి నుంచి కుండలిని జాగృతి జరగాలంటే పృధ్వీ భూతం శుద్ధి జరగాలి. అందుకోసం చెప్పుల్లేకుండా సారవంతమైన మట్టిలో నడవడం, మొక్కలకు పాదులు తీయడం, నీరు పెట్టడం, మట్టిలో పని చేయడం, పెద్ద పెద్ద వృక్షాలను స్పృశించడం, వాటి క్రింద కూర్చోవడం వంటివి రోజూ చేయాలి. అప్పుడే ఆ భూతశుద్ధి జరుగుతుంది. ఇలా ఒక్కో చక్రానికి, ఒక్కో భూతానికి సంబంధం ఉంటుంది. వాటికి దగ్గరగా బ్రతక్కపోతే, ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండదు. అందుకే నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితిలో ఒకమాట అన్నాడు - యోగా ప్రజలను ప్రకృతికి దగ్గర చేస్తుందని. దాని అర్దమిదే. ఈ శరీరం పంచభూతాలతో ఏర్పడిందని, వాటికి దూరంగా అసహజంగా బ్రతికితే ఇవి చెడిపోతాయనే స్పృహ కలిగి ఉండాలి.
అయితే కేవలం దగ్గరగా జరిగితే సరిపోదు. బయట ఉన్న పంచభూతాలను కూడా శుద్ధంగా ఉంచాలి, కాలుష్యం చేయకూడదు. యత్పిండాండే తత్బ్రహ్మాండే అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. పిండాండంలో ఉన్నదేదో, అదే బ్రాహ్మాండంలో కూడా ఉన్నది అని. బయట ఉన్న బ్రహ్మాండాన్ని కలుషితం చేస్తే, ఈ పిండాండం (శరీరం) కూడా కలుషితమవుతుంది. నేలలో ప్లాస్టిక్ కవర్లు పడేయడం, మొక్కలను, అడవులను నరికేసి నేలకోతకు కారణమవ్వడం, మట్టిలో హానికారక రసయానలు కలపడం, భూసార క్షీణతకు కారణమవ్వడం, ప్రకృతి వ్యవస్థ దెబ్బతినేలా మట్టిని, ఇసుకను తవ్వి తరలించేవారికి, కొండలను మైనింగ్ పేరుతో పెద్ద పెద్ద బాంబులు పెట్టే పేల్చేచారికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండనే ఉందడు. అది శూన్యం. వాళ్ళకు భక్తి ఉండచ్చు కాక, కానీ ఆధ్యాత్మికంగా వారు ఎదగడమన్నది ఉండనే ఉండదు. ఎందుకంటే ఈ భగవంతుని శివుడిగా పూజిస్తే, ఈ భూమి పార్వతి. సర్వేశ్వరునిగా నారాయణుని ఆరాధిస్తే, కనిపించే ఈ జగత్తు భూ, నీలా, లక్ష్మీ దేవి. శక్తికి అపచారం చేసి, బ్రహ్మాన్ని చేరుకోవాలనుకోవడం కల. మిగితా భూతాలను కూడా కలుషితం చేస్తే ఇలానే ఫలితాలు ఉంటాయి. అందుకే ప్రకృతిని ప్రేమించేవారికి (మన దేశంలో హోలీకి, వినాయకచవితికి, దీపావళికి మాత్రమే నిద్రలేచే కుహనా పర్యావరణ వేత్తల గురించి కాదు చెప్పేది) ఆధ్యాత్మికత త్వరగా వంటబడుతుంది. ఎందుకంటే వారే ప్రక్రియ చేయకుండానే వారిలో పంచభూతాలు శుద్ధి జరిగి ఉంటాయి. ఇది పాశ్చాత్యుల్లో కనిపిస్తుంది. వారి మతం వేరైనా, అందులో ప్రకృతిని దోచుకోమని స్వయంగా చర్చియే చెప్పినా, అక్కడి ప్రజలు పృకృతిని కాలుష్యరహితంగా ఉంచుతున్నారు. అందుకే వారు సనాతన ధర్మంలోకి వచ్చి, ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతులను పొందుతున్నారు. విదేశీయుల్లో హిందువులుగా మారిన వారిలో 99% మంది ప్రకృతి ప్రేమికులే. మనకు భక్తి ఉంది, కానీ వారికి భక్తితో పాటు ఆధ్యాత్మిక అనుభూతులు కూడా మెండుగా ఉన్నాయి. దానికి కారణమిదే. కాబట్టి మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలన్నా, ప్రకృతికి దగ్గరగా బ్రతకాలి. అందుకే ఋష్యాశ్రమాలన్నీ ప్రకృతి మధ్యనే ఉంటాయి, ప్రకృతిని రక్షిస్తూ, పర్యావరణ హితంగా ఉంటాయి. మానవుడు ఈ ప్రకృతిలో అంతర్భాగమే కాని దాన్ని అనుభవించడానికి పుట్టినవాడు కాదు, దానికి అతీతుడూ కాదు.
To be continued ..........
Sunday, 11 December 2016
సద్గురు శివానంద మూర్తి గారి సూక్తి
Bliss is the highest word describing happiness. Happiness is mental. Bliss is that of the soul-the consciousness. When we say ‘Iam happy’ that refers to the mind. If the bliss of the consciousness is achieved the causeless happiness of the mind is experienced. For that Tapas is necessary.
- Satguru Sivananda Murty Garu
హిందూ ధర్మం - 232 (జ్యోతిష్యం - 14)
మరి మనం గ్రీకుల నుంచి జ్యోతిష్యం స్వీకరించామా? వారు ఇక్కడి నుంచి తీసుకున్నారా? కలియుగం ప్రారంభంలో కొంతకాలం వరకు ప్రపంచమంతా సనాతన ధర్మమే వ్యాపించి ఉంది. మహాభారత యుద్ధం నాటికి వైభవోపేతంగా విలసిల్లింది. ఈ విషయం మీద మనం ఇదే శీర్షికన ప్రరురిచిన అనేక భాగాల్లో దానికి ఆధారాలు కూడా చూశాము. ఈ గ్రీకు, రోమన్ నాగరికతలు కూడా హిందూ ధర్మం నుంచి వేరుపడ్డవే. మహాభారత యుద్ధం తర్వాత యుగాంతం యొక్క ప్రభావం చేత ప్రపంచంలో అనేక మార్పులు సంభవించాయి. సరస్వతీ నది ఎండిపోయింది, అప్పుడు కొంతమంది ఈ భరతఖండం నుంచి పశ్చిమ దిశగా వెళ్ళారు. కొందరు ఈజిప్టులో స్థిరపడ్డారు. కొందరు ఇంగ్లాండ్, గ్రీకు దేశాల దిశగా మళ్ళారు. ఇంతకముందు యుగాల మాదిరిగా ఋషులు దేశపర్యటనలు చేసి ధర్మప్రచారం చేయలేదు, ఈ యుగప్రభావంగా. అలా అక్కడున్న సంస్కృతుల వారు సనాతనధర్మ మూల సూత్రాలకు దూరమయ్యారు. ఆస్ట్రేలియాలో కొన్ని స్థానిక తెగలున్నాయి. వారికి మనలా అగ్నిహోత్రం, యజ్ఞ ప్రక్రియ ఉంది. మంట రగిల్చి, దానిలో ఆకులు, కట్టెపుల్లలు వేస్తూ, హా!హా! అంటూ అరుస్తారు. వేదంలో చెప్పబడ్డ స్వాహా కారం కాలక్రమంలో అక్కడ అలామారింది, మూలగ్రంధాలతో సంబంధం తెగిపోయి. ఇలా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతేందుకు, గ్రీకులకు కూడా భారతదేశమే తమ గురువనే భావన బలంగా ఉండేది. క్రీ.పూ. 326 లో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్రకు వచ్చాడు, కోటా వేంకటాచలం గారు నిర్ధారించిన చారిత్రిక ఆధారాల పరంగా, అలాగే గ్రీకు చరిత్ర ఆధారంగా.
అలెగ్జాండర్ విశ్వమంతా జయించి వస్తానని తన గురువు అరిస్టాటిల్ వద్దకు వెళ్ళినప్పుడు నువ్వు ప్రపంచంలో ఏ దేశం మీదకైనా వెళ్ళు, కానీ భారతదేశం మాత్రం వెళ్ళకు, అక్కడికి వెళితే నీ ఆటలు సాగవు, నీ పనైపోతుంది అంటాడు. అయినా వినకుండా భారతదేశం మీదకు వస్తాడు, అది తెలుసుకున్న అరిస్టాటిల్, నువ్వెలాగో నా మాట వినకుండా భారతదేశం వెళ్ళావు, కనీసం అక్కడి నుంచి వచ్చేటప్పుడు నీతో పటు 5 వస్తువులు తీసుకురా!ఒకటి భారతదేశం మట్టి. ఎందరో ఋషులు, గురువులు, మహాపురుషులకు జన్మనిచ్చిన మట్టి అది. అక్కడ అనేకమంది ఆ మట్టిపై తిరిగారు. దాన్ని నీవు తీసుకువస్తే, నేను దాన్ని పవిత్రంగా భావించి పూజించుకుంటాను. అలగే గంగాజలం తీసుకురా. అది ఎప్పటికి పాడవ్వనిది, పవిత్రమైనది. మూడవది భగవద్గీత, నాలుగు భాగవతం తిసుకురా, ఐదవది, ముఖ్యమైనది, అక్కడి నుంచి ఒక గురువును తీసుకొనిరా. ఆయన్ను నేను గురువుగా చేసుకుంటాను అన్నాడు. అలెగ్జాండర్ మనదేశం మీద యుద్ధానికి రావడం, ఓడిపోవడం, ఇక్కడి బ్రాహ్మణులతో శాస్త్ర చర్చలు జరిపి, వాళ్ళ జ్ఞానానికి మెచ్చి, కొందరిని అక్కడికి తనతో పాటు తీసుకెళ్ళడం జరిగింది. దారిలో ఒక సాధువుకు చేసిన అపచారం కారణంగా, అతని శాపానికి గురై, ఆ శాపవశాత్తు తన మాతృభూమికి చేరకుండానే రోగం వచ్చి మరణించాడు గ్రీకువీరుడు. అలా అలెగ్జాండర్‌తో వెళ్ళిన బ్రాహ్మణ పండితులు గ్రీకువారికి జ్ఞానోదయం చేశారు. అంతేకాక అలెగ్జాండర్ భారతదేశం నుంచి పరాజయంతో తిరిగి వెళుతూ తనతో పాటు ఎన్నో ధార్మిక గ్రంధాలను తీసుకువెళ్ళాడు. అలా సనాతన జ్ఞానం గ్రీకు అంధకారాన్ని నశింపజేసింది.
ఈనాడు పాశ్చాత్య ప్రపంచం తన ఆలోచనా విధానానికి ముగ్గుర్ని మూల పురుషులుగా చెప్తుంది, ఒకరు సోక్రటిస్, రెండు ప్లాటో, మూడు అరిస్టాటిల్. వాళ్ళే కాదు, మన దేశంలో అభ్యుదయవాదులుగా చెలామణి అవుతున్న కుహనా మేధావులు, నాస్తికులు కూడా వీరినే గురువులుగా భావిస్తారు. అరిస్టాటిల్ గురించి చెప్పుకున్నాం. మిగిలింది సోక్రటీసు, ప్లాటో. సోక్రటీస్‌కూ ఒక హిందు మునికి జరిగిన వాగ్వాదాన్ని గురించి 'యూసేబియస్'లో ఒక చోట ఇలా చెప్పడం జరిగింది. సోక్రటీస్ ఆ హిందూ మునిని అఘోర లేదా మార్కెట్ స్థలంలో కలుసుకున్నాడు. ఆ హిందూముని సోక్రటీస్ ను నీవేమీ చేస్తున్నావని, నీ తత్త్వం విషయ విస్తృతి ఏమిటని అడిగాడు. దానికి సోక్రటీస్ మానవ దృగ్విషయాల అనుశీలన అని జవాబిచ్చాడు, కాగా ఆ భారతీయుడు విరగబడి నవ్వాడు. దివ్య విషయాలను ఎరగనప్పుడు, మానవ దృగ్విషయాలను మనిషి ఎలా అనుశీలన చేయగలడని అంటాడు.
మనకు అర్దమయ్యేలా చెప్పుకోవాలంటే సోక్రటీసు 'నేను మనిషిని అర్దం చేసుకోవడం కొరకు మనుషుల్ని ప్రశ్నిస్తున్నాను' అంటాడు. అప్పుడా హిందూముని గట్టిగా నవ్వి, భగవంతుని/ ఆత్మను అర్దం చేసుకోకుండా మనిషిని ఎలా అర్దం చేసుకుంటారని అంటాడు. పాశ్చాత్య తత్త్వశాస్త్రాల్లో ప్రతిధ్వనించే గ్రీకు ఆదర్శం: 'మనిషి, నువ్వు స్వయంగా తెలుసుకో' (Man, Know thyself). హిందువు అనేది 'మనిషీ, నీ ఆత్మను తెలుసుకో' (Man, Know thy Self) అని. నేను ఆలోచిస్తున్నాను కనుక నేను ఉన్నాను (I think, therefore I exist) అనేది పశ్చిమ దేశాల్లో బాగా కనిపిస్తుంది. అది డెకార్ట్ (Descartes) అన్న వాక్యం. కానీ అది తాత్త్వికంగా చెల్లదు. భారతీయుడంటాడు నేను ఉన్నాను, కనుక నేను ఆలోచిస్తున్నాను (I Exist, therefore I think). ఎందుకంటే తార్కిక వివేచన శక్తులు మానవుడి పరమ సత్యాన్ని వెల్లడించలేవు. మానవ మనస్సు, అది గుర్తించే పరిణామశీల ప్రపంచంలాగే శాశ్వత పరివర్తనలో ఉన్నది. అంతిమ నిర్ణయాలను అది అందించలేదు. బుద్ధి సంబంధమైన సంతృప్తి అత్యున్నత లక్ష్యం కాదు, దేవుడిని అన్వేషించేవాడే 'విద్య'ను నిజంగా ప్రేమించేవాడు. విద్య అంటే మార్పు చెందని సత్యం (Absolute Truth). తక్కినదంతా అవిద్య. అంటే సాపేక్ష జ్ఞానం (Relative Knowledge).
To be continued .................
Saturday, 10 December 2016
మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 6
ఇంతకముందు చెప్పుకున్నాం కదా, మట్టిలో 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయని. అలాగే ఈ శరీరాన్ని తగులబెట్టినప్పుడు మిగిలేది 20 గ్రాముల మట్టి మాత్రమే. మళ్ళీ అందులో కూడా అవే 18 రకాల సూక్ష్మపోషకాలు ఉంటాయి. అది శరీరానికి, మట్టికి ఉన్న సంబంధం. రాజీవ్ దీక్షిత్ గారంటారు, మట్టి పాత్రలలో వండిన ఆహారం తినడం వలన మాన పూర్వీకులకు జీవితాంతం కళ్ళజోడు రాలేదు, పళ్ళు ఊడిపోలేదు, మోకాళ్ళ నొప్పులు, డయాబిటిస్ వంటి సమస్యలు రాలేదు. శరీరానికి కావల్సిన పోషకలు సక్రమంగా అందుతుంటే జీవితాంతం మన పనులన్నీ ఎవరి మీదా ఆధారపడకుండా చేసుకుంటూ జీవించగలం. అది ఒక్క మట్టి పత్రలలో వండిన ఆహారం భుజించడం వల్లనే సాధ్యమవుతుంది. మట్టిపాత్రలో వండిన ఆహారంలో పోషకాలు ఒక్కటి నాశనమవ్వవు, 100% శాతం అందులో రక్షించబడతాయి. ఆ తర్వాత ఉపయోగపడేది కాంస్యం లేదా కంచు. అందులో 97% పోషకాలు ఉంటాయి, 3 % నశిస్తాయి. ఆ తర్వాత ఇత్తడి పాత్ర. అందులో 93% వరకు పోషకాలు రక్షించబడతాయి. ఇదంతా మేము 3000 ఏళ్ళకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు పొందుపరిచిన ఆయుర్వేద సూత్రాల నుంచి గ్రహించి, వాటిని సి.డి.ఆర్.ఐ. (Central Drug Research Institute) శాస్త్రవేత్తల ద్వారా పరిశోధన చేయించాము. అందులో వారు అంగీకరిచిన మరో సత్యం ఏమిటంటే ప్రెషర్ కుక్కర్ లో వండిన ఆహారం దీర్ఘకాలంగా విషంగా పని చేస్తుందని. ఇది కూడా వాగ్భటులు చెప్పిన సూత్రల్లో ఉంది. ఇంకోటి, ఈ అల్యూమినియం అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఈ పాత్రలో ఆహరం వండుకుని, మళ్ళీ మళ్ళీ తింటూ ఉండేవారికి మధుమేహం, జీర్ణసంబంధిత వ్యాధులు, టిబి, ఆస్తమా, కీళ్ళ వ్యాధులు తప్పకుండా వస్తాయి. ఇలాంటి పాత్రలలో వండిన ఆహారంలో కేవలం 7% నుంచి 13% వరకు మాత్రమే పోషకాలు ఉంటాయి. ఇది ఆ కేంద్రప్రభుత్వ పరిశోధనా సంస్థ వారు అంగీకరించారు. కానీ వారే విషయం బయట పెడితే, ఈ ప్రెషర్ కుక్కర్ కంపెనీలు వారిని ఉండనివ్వవని చెప్పారు. అందుకే మనం ఇప్పుడు ఇండియా పద్ధతి నుంచి భారతీయ పద్ధతికి, మన అసలుసిసలైన సంప్రదాయంలోకి అడుగుపెట్టాలి. మట్టి పాత్రలలో విశిష్టత మీకు ఇంకా తెలియాలంటే డయాబిటీస్ ఉన్నవారికి ఈ పద్ధతిలో మట్టి పాత్రలో వండిన భోజనాన్ని మహర్షి వాగ్భటాచార్యుని సూత్రాల ప్రకారంగా పెట్టి చూడండి. కొన్ని నెలల్లోనే వారు మధుమేహం నుంచి విముక్తులవుతారు. అందుకే మనం మట్టికి దగ్గరగా జరగాలి.
ఈ మట్టికి మానవశరీరానికి ఉన్న సంబంధం శాస్త్రాల్లో ఇలా అనేక విధాలుగా చెప్పబడింది. నిత్యం భగవంతుని ఆరాధనలో 'లం పృధ్వీ తత్వాత్మికై గంధం సమర్పయామి' అని అమ్మవారికి లేదా భగవానునికి అర్పిస్తాము. అందులో మనం చెప్పేది పృధ్వీ తత్త్వానికి గంధం ప్రతీక. పంచభూతాల్లో భూమికి, పంచతన్మాత్రల్లో వాసనకు సంబంధం ఉంది. ఎప్పుడైతే మనం భూమి, మట్టికి దూరంగా అసహజమైన జీవనం గడుపుతామో, అప్పుడు ముక్కుకి తన సహజ లక్షణమైన వాసనలను పసిగట్టే లక్షణం తగ్గిపోతుంది. ఇది ఈ మధ్యకాలంలో జరిగిన పరిశోధనల్లో కూడా వెల్లడయ్యింది. కాలుష్యం వలన, సారవంతమైన మట్టికి దూరంగా జీవించడం వలన మానవుడి వాసనలు పసిగట్టే లక్షణం దారుణంగా పడిపోతున్నదని, కనీసం అప్పుడప్పుడైనా పల్లుటూళ్ళకు వెళ్ళి అక్కడ ప్రకృతికి దగ్గరగా జీవించాలని అందులో పేర్కొన్నారు. ఇది 3-4 క్రితం పత్రికల్లో ప్రచురితమైంది. ఇలా చూసుకుంటే మనం మట్టికి దూరంగా జరగడం వలన ఎన్నో అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాము.
విచిత్రమేమిటంటే మట్టిలో క్రిములున్నాయని పిల్లల్ని మట్టిలో ఆడుకోనివ్వరు తల్లిదండ్రులు. వాళ్ళు ఏడవకుండా సెల్ ఫోన్లు, కంప్యూటర్లు, టివిలు ఇస్తారు. ఒకసారి పరిశోధనలు చూడండి. మీ సెల్ ఫోన్ తెర మీద ఎన్ని క్రిములుంటాయో తెలుసా? టాయిలెట్ డోర్ హ్యాండిల్ మీద ఉన్నన్ని క్రిములు. కంప్యూటర్ కీ బోర్డు ఏమీ తక్కువకాదు. బాత్రూం దగ్గర కాళ్ళు తుడుచుకోవడానికి వేసే డోర్ మ్యాట్ మీద ఉన్నన్ని క్రిమిలు కీబోర్డు మీదుంటాయి. టివి రిమోట్ మీద కూడా దగ్గర దగ్గరగా అన్నే ఉంటాయి. అసలు మనం వాటిని వదిలి ఉండేదెప్పుడు? వాటిని ముట్టుకుని, ఆ తర్వాత ఎన్ని పనులు చేస్తామో, తినడం కూడా. చక్కగా బయట ఆడుకోకుండా వారిని అదుపు చేసి, ఇంట్లో అసహజమైన వస్తువులతో వారికి మనేమి ఇస్తున్నాం? మనమేమి పొందుతున్నాం? ఆరోగ్యమా? అనారోగ్యమా?
To be continued .................
Friday, 9 December 2016
స్వామి సచ్చిదానంద సూక్తి
Atman has no karma; it’s just there as an eternal witness. It’s something like the sun in our solar system. The sun is there and it shines, that’s all. In the presence of the sun we can do anything. We may use the light or misuse the light. The sun is not affected by it. The Self in us is the sun, the Atma Surya, or the Atmic sun. Because of the Inner Light, the mind functions. In front of the sun, the lotus blossoms. In the same way, because of the Atma, your mind thinks, feels, wills, desires, and the body moves. It all happens because of the Atmic light inside.
- Swami Satchidananda
మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 5
చిన్నప్పుడు మేము మట్టిలోనే ఆడుకునేవాళ్ళము. ఎంతగా ఆడుకునేవాళ్ళమంటే ఒళ్ళంతా చెమటలు పట్టేలా. అయితే కొంచం పెద్దయాక స్కూల్ లో మాకు చెప్పారు, మట్టిలో క్రిములు ఉంటాయి, మట్టికి దూరంగా ఉండాలి, మట్టి ముట్టుకుంటే చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి అని. నిజానికి అలా పుస్తకాల్లో ఉంది, అదే టీచర్లు చెప్పారు. అప్పటి నుంచి మట్టికి దూరమయ్యాము అనారోగ్యం వస్తుందన్న భయంతో. చాలా ఏళ్ళ తర్వాత ఇలానే యూ ట్యూబ్ లో సద్గురు జగ్గి వాసుదేవ్ ప్రవచనం ఒకటి విన్నాను. అందులో ఆయన ఆయుర్వేదం గురించి చెప్తూ ఇలా అన్నారు. ఇప్పుడు మనకు అనేక ఆనారోగ్య సమస్యలు రావడానికి కారణం మనం పంచభూతాలకు దూరమవ్వడమే, ఎందుకంటే ఈ శరీరం, మనస్సు పంచభూతాల వల్లనే ఏర్పడ్డాయి. ఈ శరీరం పంచభూతాలే తప్ప మరొకటి కాదు. ఎప్పుడైతే శరీరం, మనస్సు వాటికి దూరంగా జరుగుతాయో, అప్పుడే మానసిక, శారీరిక అనారోగ్యం ఏర్పడుతుంది. మా ఆశ్రమంలో ఉన్న వైద్యశాలకు నిత్యం అనేకమంది రోగులు వస్తూ ఉంటారు. వారికి మేము కేవలం ఔషధాలే ఇవ్వము, అంతకంటే ముందు మట్టిలో పని చేయమంటాము, మొక్కలకు పాదులు తీసి, నీళ్ళు పెట్టమంటాము, మట్టి ఎత్తమంటాము. కొందరికైతే ఔహధాలు అసలే ఇవ్వము, కేవలం ఇవి మాత్రమే ఆచరించమని చెప్తాము. అలా కొద్దిరోజులు వారికి ఆచరించడంతోనే వారి రోగాలను నయమై, వారు ఇంటి ముఖం పడతారు. ఇప్పుడు మనకు సంక్రమిస్తున్న అనేక అనారోగ్య సమస్యలకు కారణం మనం ప్రకృతికి, పంచభూతాలకు దూరంగా జరగడమే.
ఇది విన్న తర్వాత నాకర్దమయ్యింది మనమేమి కోల్పోతున్నామో. ఇంతలో అనుకోకుండా ఒకరోజు మా ఇంటి ముందున్న ఖాళీ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, మట్టిలో చెప్పులేకుండా నిల్చోవాల్సి వచ్చింది. ఆ సమయానికి నాలో పైత్య దోషం ప్రకోపించి, వేడి పెరిగింది. ధ్యానం మొదలైన ప్రక్రియలు చేయడం వలన శరీరంలో జరిగే చాలా సూక్ష్మ చర్యలను కూడా గమనించే శక్తి కలుగుతుంది, ఏకాగ్రత వలన. అది ధ్యానం చేసే చాలామందికి తెలిసిన విషయం. అప్పుడు గమనించాను, మట్టి నా శరీరంలో ఉన్న వేడిని తనలోకి లాగేస్తోందని. కాసేపు నిల్చుంటేనే శరీరంలో ఉన్న అధికవేడిని మట్టి/ భూమి లాగేసింది. ఆ తర్వాత ఎన్నోసార్లు చేసి చూశాను, పైత్యం ప్రకోపించిన ప్రతిసారీ ఇదే చేశాను. మళ్ళీ మళ్ళీ నాకు నేను ఋజువు చేసుకున్నాను. అప్పుడర్దమైంది మట్టికి ఉన్న శక్తి. ఇలా నాకే కాదు, ఇంతకముందు ఆయుర్వేదం గురించి చెప్పిన అనీల్ కిషన్ కి కూడా ఎన్నో అనుభవాలు ఉన్నాయి.
చాలామంది అంటారు, మట్టిలో నడిస్తే కాళ్ళు పగులుతాయని. కానీ అది పెద్ద అపోహ. కాళ్ళు పగిలేది మట్టిలో నడిస్తే కాదు, దుమ్ములో నడిస్తే. మట్టికి, దుమ్ముకు చాలా తేడా ఉంది. మట్టికి ఎంతో హీలంగ్ పవర్ ఉంది. సారవంతమైన మట్టిలో నడిస్తే, కాళ్ళ పగుళ్ళు కూడా వేగంగా, ఏ మందు రాయకుండానే మానిపోతాయి. చాలామంది ఉదయం వ్యహాళికని వెళతారు, వెళ్ళడం మంచిదే కానీ, వేలకు వేలు పెట్టి దాని కోసం ప్రత్యేక బూట్లు కొని, అవి వేసుకుని వెళతారు. అప్పుడేమీ లాభం లేదు. ఏదైనా చేయాలనుకుంటే గాజుముక్కలు లాంటివి లేని చోట, మట్టిలో ఒట్టి కాళ్ళతో నడిచి చూడండి, ఎంతో మార్పు కనిపిస్తుంది, శరీరం తనంతట తానే రోగాలను నయం (Healing) చేసుకుంటుంది. అది మట్టికి ఉన్న శక్తి. కానీ మట్టి సారవంతమై ఉండాలి, పవిత్రంగా, కాలుష్యరహితంగా ఉండాలి. మనం మరమనుషులుగా కాక, మట్టి మనుషులుగా బ్రతకాలి.
To be continued ..........
Thursday, 8 December 2016
మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 4
ఇప్పుడు ప్రజలు ఎదురుకంటున్న ఆరోగ్యసమస్యల్లో ఒకటి బి 12 విటమిన్ లోపించడం. వినడానికి ఏదో ఒక చిన్న విటమిన్ లోపంగానే అనిపిస్తుంది కానీ, అది లోపిస్తే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాడీసంబంధం సమస్యలు చాలా తీవ్రంగా వస్తాయి. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైంది. ఇది లోపించినవారు పడే బాధ, నొప్పులు వర్ణానతీతం. చాలామంది ఆసుపత్రిలో చేరి సిలైన్లు, ఇంజెక్షన్లు తీసుకుని చికిత్స చేయించుకున్నారు. ఇలాంటి వారిని నేను ప్రత్యక్షంగా చూశాను. డాక్టర్లు, ఫార్మా కంపెనీలు అంటాయి, బి 12 లోపం శాఖాహారులకు తప్పకుండా కలుగుతుంది, ఈ విటమిన్ మాంసాహారంలోనే అధికంగా ఉంటుంది, శాఖాహారులు ఖచ్చితంగా ఇంజెక్షన్లు తీసుకోవాలి అని. ఇదే విషయం మీద నా మిత్రుడు, అనీల్ కిషన్ పురాతన ఆయుర్వేద గ్రంధాలపై పరిశోధన చేస్తున్నారు. వారంటారు 'మాంసాహారం తినే పులితో పోల్చుకున్నప్పుడు, బరువు తక్కువగా ఉన్న మేక లేదా జింకలో బి12 అధికంగా ఉంటుంది. సమస్య శాఖాహారంలో లేదు, అందులో సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్లనే వస్తోంది. పైగా మాంసాహారంలో ఉండే బి12, ఆహారం వండే సమయంలోనే చాలా శాతం నశించిపోతుంది. ఈ బి 12 అనేది మట్టిలో అధికంగా ఉంటుంది, మీకు ఎప్పుడైనా వెంటనే బి 12 రావాలంటే మట్టిలో పని చేయాలి, మట్టి పిసకడమో, మొక్కలు నాటడమో, లేద మట్టి తొక్కడమో చేయాలి. అప్పుడు ఇంజెస్కన్ కంటే వేగంగా ఈ విటమిన్ శరీరానికి చేరుతుంది. టాబ్లెట్లు, ఇంజెక్షన్లు తాత్కాలిక ఉపశమనం కలిగించినా, జీవన విధానంలో మార్పు చేసుకోవాలి. మట్టికి దగ్గరగా బ్రతకాలి. అయితే మట్టి గురించి చెప్పుకున్నప్పుడు ఈ బి 12 నేది చాలా చిన్న విషయం. మట్టిలో యోగిని అనే సూక్ష్మజీవులు ఉంటాయి. అవి శరీరానికి ఎంతో అవసరం. మన శరీరంలో మనకు మంచి చేసే రకరకాల సూక్ష్మజీవులు ఉంటాయి. అవి నిర్వర్తించే కార్యాన్ని అనుసరించి వాటికి పేర్లను నిర్ణయించారు ఋషులు. శరీరంలో కాళీ అనే సూక్ష్మక్రిములు ఉంటాయి. ఎలాగైతే ఆదిపరాశక్తి కాళీ రూపంలో దుష్టులను హతమార్చిందో అలా ఇవి రోగకారక క్రిముల పై పోరాడి వాటిని శరీరం నుంచి బయటకు పంపేస్తాయి. అందుకే వీటికి ఆ పేరు. అలాంటివే ఈ యోగిని కూడా. ఇది ఎంతో పెద్ద సబ్జెక్టు. కానీ ఈ యోగిని క్రిముల లక్షణం ఏమిటంటే ఇవి శరీరంలో బి12 ఉత్పత్తి జరిగేలా చూస్తాయి. ఇలాంటి క్రిములు కేవలం మంచి సారవంతమైన మట్టిలో చెప్పులేకుండా ఒట్టి కాళ్ళతో నడవడం చేత, తేమ కలిగిన పచ్చని ప్రాంతాల్లో నివసించడం చేత, పెద్ద పెద్ద, బాగా వయసున్న వృక్షాల దగ్గరకు వెళ్ళడం చేత, వాటి గాలిని పీల్చడం చేత శరీరంలోనికి ప్రవేశించి, రోగాలను నివారిస్తాయి. అదేకాకుండా ఆవుపేడతో కళ్ళాపి చల్లిన చోటా, ఆవుపేడ అలికిన కూడా ఈ యోగిని క్రిములు ఉంటాయి. (అప్పుడు నాకర్దమయ్యింది, మన సంప్రదాయంలో ఇల్లంతా పేడతో ఎందుకు అలుకుతారో, ఇంటి ముందు కళ్ళాపి ఎందుకు చల్లుతారో). ఇలా మట్టి ద్వారా, శాకాహారం ద్వారా వచ్చే బి12 మాంసాహారం ద్వార లభించే బి12 కంటే ఎంతో శ్రేష్టమైనది. శరిరంలో ఈ సూక్ష్మక్రిములు ఉంటే విషాన్ని సైతం జీర్ణం చేసుకుని అమృతంగా మార్చుకోవచ్చు. వారికి మంచి ఆలోచనా శక్తి ఉంటుంది, శారీరిక పుష్టి ఉంటుంది, ఆహారం జీర్ణం కాకపోవడమనేది వీరి విషయంలో ఒక పెద్ద జోక్. వీరికి అసలా బాధే ఉండదు. కాబట్టి మనం మన జీవన విధానాన్ని మార్చుకోవాలి, మట్టికి, మొక్కలకు దగ్గరగా జరగాలి'.
ఈ తరానికి తెలియదు కానీ ఒకప్పుడు మనమంతా మట్టిలో ఆడుకున్నవాళ్ళమే. అప్పుడు మనమేమీ చెప్పులు వేసుకోలేదు. ఎంతో హాయిగా గంతులు వేసేవారము. మనకంటే మన అమ్మనాన్నలు, తాతయ్యల చిన్నతనానికి వెళితే, వారు ఇంకా ఎన్నో ఆడుకునేవారు, పంటపొలాల్లో, చెట్ల మీద లేదా చెట్ల క్రింద. అందుకే వారు ఏ రోగం లేకుండా హాయిగా ఉన్నారు. వాళ్ళ శరీరంలో ఈ సూక్ష్మ క్రిములు అధికంగా ఉండేవి. అందుకే వారికి స్థూలకాయం రాలేదు, జీర్ణ సమస్యలు రాలేదు, మలబద్ధకం అసలే లేదు. కానీ ఇప్పుడున్న తరాన్ని చూస్తే, వారు మట్టికి దూరమయ్యి, అనేక రోగాలకు దగ్గరవుతున్నారు.
మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం ..........................
(ఆ మృత్తికా, మాకు పుష్టినివ్వు, సర్వం నీలోనే ఉంది (ఈ శరీరానికి కావల్సిన విటమిన్లు కూడా))
మనం ఎంత చక్కగా ఆడుకున్నాం, ఆ రోజులే వేరు అని అనుకుంటూ ఉందామా లేక మన పిల్లల్ని వాటికి దగ్గర చేసి, వాళ్ళు జీవితాలు పండిద్దామా? మనం కూడా మళ్ళీ దగ్గరయ్యి ఆరోగ్యంగా జీవిద్దామా? లేకపోతే మందులు మింగుతూ ఇలానే ఉందామా?
To be continued ...........
Wednesday, 7 December 2016
ప్రసిద్ధి చెందిన 3 కాలభైరవ క్షేత్రాలు
రక్తజ్వాలా జటాధరం శశిధరం రక్తాంగతేజోమయం
హస్తే శూలకపాల పాశ ఢమరుం లోకస్యరక్షాకరం
నిర్వాణం శునవాహనం త్రినయనం ఆనందకోలాహం
వందే భూతపిశాచ నాధ వటుకం శ్రీః క్షేత్రస్య పాలం శివం
విశిష్టమైన కాలభైరవాష్టమి పర్వదినాన వేగంగా 3 కాలభైరవ క్షేత్రాలను దర్శించుకుందాం.
1. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనమవ్వకుండా, శివుడి త్రిశూలం మీద నిలబడి ఉంటుంది కాశీ. కాశీలో మరణిస్తే చాలు మోక్షం లభిస్తుంది. కాశీలో మరణించే దోమల కుడి చెవిలో కూడా సర్వేశ్వరుడు తారకమంత్రం చెప్పి, మోక్షాన్ని ప్రసాదించడం శ్రీ రామకృష్ణ పరమహంసకు దర్శనమయ్యింది. అటువంటి కాశీలో ఉండే కాలభైరవ స్వామి ఈయన. ఈయనే కాశీ క్షేత్రపాలకుడు. ఈయన అనుమతి లేకుంటే కాశీలో అడుగు కూడా పెట్టలేరు. కాశీలో మొదట కాలభైరవుడిని దర్శించి, ఆ తర్వాతే విశ్వనాధుని దర్శనానికి వెళతారు.
ఈ రోజు కాలభైరవాష్టమి సందర్భంగా ఒకసారి స్వామికి, నమస్కరించి స్మరించుకుందాం.
2. ఇప్పుడు మనం ఖాట్మండు హనుమాన్ దోకాలో ఉన్న కాలభైరవ స్వామిని దర్శించుకుందాం. ఉత్తరాభి ముఖుడై ఉన్న ఈ స్వామి ఇక్కడ ఎప్పటి నుంచి కొలువై ఉన్నాడో తెలియదు, కానీ ఇక్కడి రాజు 17 వ శత్బాదంలో ఆలయం నిర్మించాడని నేపాలీలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్వామి 10 అడుగుల పైనే ఎత్తుగల ఏకశిలా విగ్రహం. ఈయన ఎంతో మహిమాన్వితుడు. ఈ స్వామి ముందు అబద్దమాడినవారు రక్తం కక్కుని అప్పటికప్పుడే మరణిస్తారట. అందుకే దీన్ని ఒకప్పుడు నేపాల్ సుప్రీం కోర్టు అని పిలిచేవారు. ఇంతకముందు ప్రభుత్వాలు ఎదాఇన కేసు తేలనప్పుడు, ఈ స్వామి ముందుకు నిందితులని తీసుకువచ్చేవారట. అందుకే ఈ స్వామి ఆలయానికి దగ్గర్లోనే పోలిస్ స్టేషన్ ఉంది. కాలభైరవుడు న్యాయానికి అధిదేవత. అన్యాయాన్ని అసలు ఒప్పుకోడు. అందుకే ఏదైనా న్యాయపోరాటం చేసే ముందు ఇక్కడకు వచ్చి, స్వామిని దర్శించుకుంటారు అక్కడి ప్రజలు. మహిమాన్వితమైన ఈ కాలభైరవాష్టమి పర్వదినాన ఒకసారి స్వామికి నమస్కరించి, స్మరిచుకుని, ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం.
3. ఇప్పుడు మన దేశంలో అత్యంత పురాతన కాలభైరవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కిలికిరీ బాబా భైరవ నాధ్‌జీ పాండవీ కాలీన్ మందిరంగా ప్రసిద్ధి చెందిన ఆలయం దర్శనం చేద్దాం, ఇది దిల్లీలో పురానా ఖిలా బయట ఉంది. సుమారు 5500 ఏళ్ళ క్రితం నాటి ఆలయమని చెప్తారు. ఈ ఆలయాన్ని ఇంద్రప్రస్థ నగరం నిర్మించే ముందు పాండవులు నిర్మించారట, దేశరక్షణ కొరకు. ఇదే స్థలంలో పాండవుల్లో ఒకడైన భీముడు తపస్సు చేసి, శక్తులను పొందాడు. అప్పటి నుంచి ఇక్కడ నిత్యం అర్చనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ స్వామికి మద్యం నివేదిస్తారు. అది నివేదించడం ఇష్టంలేని భక్తులు పక్కనే ఉన్న ఇంకో ఆలయంలో కాలభైరవుడికి పాలు సమర్పించవచ్చు.

మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 3
మృత్తికే దేహిమే పుష్టిం త్వయీ సర్వం ప్రతిష్టితం |
తన్మే నిర్ణుదా మృత్తికా తయా హతెనా పాపేన గచ్ఛామి పరమాంగతిం ||
ఓ మృత్తికా! నాకు పుష్టినివ్వు. సర్వంలో నీలోని దాగి ఉంది, అన్ని సంపదలకు మూలం నీవు. నాకు మార్గదర్శనం చేసి, నా పాపాలను తొలగించు. నువ్వలా నా పాపాలను నశింపజేయగానే నేను ఊర్ధ్వలోకాలకు వెళ్ళగలను, నీ దయతో పరమగతి అయిన మోక్షాన్ని సైతం పొందగలను.
ఒకసారి రాజీవ్ దీక్షిత్ గారు పూరీ జగన్నాధస్వామి రధోత్సవం చూడాటానికి వెళ్ళగా, అప్పుడు వారికి అక్కడ పప్పన్నం ప్రసాదం పెట్టారట. అది ఎంతో రుచిగా ఉండడంతో, ఇది ఎలా వండారు, దీని ప్రత్యేకత ఏమిటని ఆరా తీస్తే, అక్కడ మట్టిపాత్రలలో వండి నివేదన చేస్తారని తెలుసుకున్నారు. అక్కడున్న శంకరాచార్య పీఠాధిపతితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ మట్టిపాత్రలలో ప్రసాదం వండడానికి గల కారణం ఏమిటి? అని అడగ్గా, మట్టి పవిత్రమైనది, భగవంతునికి నివేదన చేసేది పవిత్రంగానే ఉండాలి, అందుకే మట్టి పాత్రలలో వండుతామని స్వామి వారు సమాధానమిచ్చారు. అయితే దీన్ని పరీక్ష చేయించాలనుకున్న రాజీవ్ దీక్షిత్ గారు దాన్ని భువనేశ్వర్ లో ఉన్న సి.ఎస్.ఐ.ఆర్. (CISR) కు తీసుకెళ్ళి పరిశోధించమంటే, దానికి దాదాపు 6 నెలల సమయం పడుతుందని, అయినా తమ వద్ద అన్ని పరికరాలు లేవని, అందుకని ఆ ప్రసాదాన్ని దిల్లీ వెళ్ళి పరీక్ష చేయించమని చెప్పారు. అది అప్పటికి వండి కొన్ని గంటలు గడించి, దిల్లీ వెళ్ళాలంటే సుమారు 36 గంటలు పడుతుంది. అప్పటికి ఇది పాడవుతుంది కదా అని రాజీవ్ గారు అనగా, అది పూరీ ప్రసాదమని, మట్టి పాత్రలో వండబడుతుంది కనుక పాడవ్వదు అని చెప్పారు అక్కడి శాస్త్రవేత్తలు. ఆయన దాన్ని దిల్లీ తీసుకెళ్ళి పరీక్షలు చేయించగా తేలిందేమిటంటే పప్పులో 18 రకాల సూక్ష్మపోషకాలుంటాయి (Micro Nutrients), అవే దానిలో ఉన్న బలం, ఆ 18 లో ఒక్కటి కూడా ఈ ప్రసాదంలో తగ్గలేదట. పూర్తిగా 100% ఉన్నాయట. వంటనే ఆయన ప్రెషర్ కుక్కర్ లో వండిన పదార్ధాన్ని పరీక్ష చేయిస్తే, అందులో కేవలం 13 శాతం పోషకాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, మిగితా 87 % పోషకాలు లోపించాయని (నశించాయని) తేలింది. ఆ విషయం చెప్పి రాజీవ్ దీక్షిత్ గారంటారు పూరీలో పూజారులు సైన్సు చదవలేదు, అందుకని వాళ్ళు శాస్త్రీయంగా చెప్పలేకపోయారు, అయినా మట్టి పవిత్రమైనదని చెప్పారు. నేను సైన్సు చదివి కూడా పరీక్ష చేయిస్తే గాని తెలుసుకోలేకపోయాను. అందుకే మన భారతీయ సంస్కృతిలో అనాదిగా మట్టి పాత్రలలో వంట వండడమే సంప్రదాయంగా వస్తోంది. అల్యూమీనియం ముడిపదార్ధం మన భూమిలో పుష్కలంగా ఉన్నా, మన పూర్వీకులు ఏనాడు దాన్ని ఉపయోగించలేదు. అదేకక మట్టి పాత్రలో వండిన పదార్ధానికి రుచి కూడా అద్భుతంగా వస్తుంది. మట్టికి ఆ శక్తి ఉంది.
ఇంకా వారంటారు వైజ్ఞానికంగా మన శరీరం అంతటా ఉండేది మట్టియే. ఈ శరీరానికి కావల్సిన 18 సూక్ష్మపోషకాలన్నీ మట్టిలోనే ఉంటాయి. ఆ పోషకాలనే మొక్క గ్రహించి పప్పుధాన్యాల్లో నిక్షిప్తం చేస్తుంది. అందుకే ఆ 18 పోషకాలు పప్పులో ఉంటాయి. మళ్ళీ ఇవే 18 పోషకాలు గోమూత్రంలో కూడా ఉంటాయి.
అందుకే ఇప్పటికీ లలితా సహస్రనామ పారయణ చేసేవారు అమ్మవారికి, ఆ నామావళిలో చెప్పబడిన నివేదనలు సిద్ధం చేయడానికి ఇప్పటికీ మట్టిపాత్రలనే వాడతారు, ఆవు పిడకలను వంటచెరుకుగా వాడుతూ కుంపటి మీద వండుతారు. పవిత్రత కోసమని. అదే శ్రద్ధకు నిదర్శనమని లలితాసహస్రనామ బాష్యం ప్రవచనం చెప్తూ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు అన్నారు.
అందుకే సారవంతమైన మట్టిని కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే శరీరానికి పుష్టికరమైన ఆహారం అందుతుంది. ఇప్పుడు అఘమర్షణ సూక్తంలో చెప్పిన 'మృత్తికే దేహిమే పుష్టిం' అనే మాట ఎంత సత్యమో అర్దమయ్యిందా? ఈ పొషకాలే కాకుండా ఇంకా ఏమేమి పోషకాలున్నాయో పరిశీలిద్దాం.
To be continued ...........
Tuesday, 6 December 2016
మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 2
మృత్తికే హరమే పాపం యన్మయా దుష్కృతం కృతం |
మృత్తికే బ్రహ్మదత్తాసి కాశ్యపేనాభి మంత్రితాః ||
ఓ మృత్తికా! నేను చేసిన పాపాలను, దుష్కృతాలను నశింపజేయి. నీవు బ్రహ్మ చేత సృష్టించబడ్డ దానవు, మరియు కశ్యప ప్రజాపతి చేత మంత్రపూతమై పవిత్రం చేయబడ్డావు. ఆయన పవిత్రం చేసిన మృత్తికను తిరిగి ఈ భూమంతా చల్లాడట.
ఈ మంత్రాల్లో ఎంతో అర్దం దాగి ఉంది. మట్టి పవిత్రత ఎంత గొప్పదంటే ఒకసారి పార్వతీ దేవి శివుడితో 'మీరు బంగారు, వెండి, ఇత్తడి మొదలైన అనేక లింగాల్లో అర్చించబడతారు కదా. మీకు ఏ లింగార్చన అంటే ఇష్టం?' అని అడిగింది. అప్పుడు శివుడు 'నాకు అన్నిటికంటే పార్ధివ లింగార్చన అంటే ఇష్టం' అని సమాధానం ఇస్తాడు. పార్ధివ లింగం అంటే మట్టితో చేసిన లింగం, దానికి మిగితా లోహాలతో చేసినవేవీ సాటి రావంటాడు. పార్ధివ లింగాన్ని అర్చిస్తే, కోరికలు తొందరగా నెరవేరుతాయని శాస్త్రంలో చెప్పబడింది. కానీ ఈ లింగాన్ని ఎప్పటికప్పుడు చేసి, పూజ ముగియగానే ఉద్వాసన చెప్పి, నిమజ్జనం చేయాలి. శివుడలా చెప్పడానికి మట్టి అందరికీ అందుబాటులో ఉండడం ఒక కారణమైతే, మట్టికున్న పవిత్రత రెండవ కారణం. అలా పరమశివుడే మట్టి పవిత్రతను చాటాడు.
ఒకసారి లింగ పురాణానికి వెళదాం - గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. "ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?"
"మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వము కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి యొక్క విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది అని సూతుడు సమాధానం చెప్తూ ఇంకా అనేక విషయాలను చెప్తాడు. (మహాగణపతి పురాణం(బ్రహ్మశ్రీ తాడంకి వెంకట లక్ష్మీనరసింహరావు)
ముద్గల పురాణంలో గణేశ చతుర్థీ రోజున కేవలం మట్టి గణపతిని మాత్రమే పూజించాలని చెప్పబడింది. ఇతర లోహాలతో చేసిన గణపతులను అర్చించాలని అందులోలేదు. ఎందుకంటే ఆ తిధి నాడు వచ్చే గణపతి శక్తిని ఆకర్షించే శక్తి ఒక్క మట్టికే ఉంది. భగవంతుని దేనిలోకి ఆవహన చేస్తామో, అది పవిత్రమై ఉండాలని శాస్త్రము చెప్తున్నది. ఆ పవిత్రత మట్టికి ఉంది కనుక ఆ పర్వంలో మృత్తికా గణపతి పూజ. ఎన్నో విషయాలను చెప్పినా మన పురాణాలు, అరటి తొక్కలతో, చింతపిక్కలతో గణపతిని తయారు చేయమని చెప్పలేదు, ఇప్పుడు మనం చేస్తున్నట్లుగా. ఏమి? వారికి తెలియదా? చింతపిక్కలతో, పూలరెక్కలతో, గాజుముక్కలతో విగ్రహాలు చేయచ్చని? అదికాదు సంగతి. అలా చేసినవి పవిత్రతను నిలుపుకోలేవు. ఆ దైవీ శక్తిని ఆకర్షించలేవు.
మనం ఏ పూజ చేసినా, నూతన కార్యం ప్రారంభించినా, ముందుగా పసుపు ముద్దతో గణపతిని చేసి, ఆ తర్వాత పని మొదలుపెడతాము. ఒకవేళ పసుపు గణపతిని కొలిచే వీలు లేని పరిస్థితి వస్తేనో? అప్పుడు మట్టిబెడ్డను తెచ్చి, అందులోకి గణపతి ఆవహన చేసి పూజించినా, అంతే సమానమైన ఫలితం వస్తుందని చెప్పారు.
గతభాగంలో మనం చెప్పుకున్న మంత్రం నిత్యం పఠించకపోయినా, యజ్ఞయాగాది క్రతువుల సమయంలో నదీస్నానం చేస్తారు. అప్పుడు కూడా నదిలోంచి మట్టిని తీసి, ఒంటికి రాసుకుని, శిరస్సును ధరించి, ఆ సూక్తాలు చదివి స్నానం చేస్తారు. పవిత్రత కోసం. అంటే ఇక్కడ మనకు ఏమి అర్దమవుతున్నది, మట్టి పవిత్రతకు చిహ్నం. మరి మనం మట్టిని పవిత్రంగా ఉంచుతున్నామా?
To be continued .........
Monday, 5 December 2016
మన సంస్కృతిలో 'మట్టి' వైభవం- 1
మట్టే మన ఆహారం. అవును, మట్టే మన ఆహారం. మీరు విన్నది నిజమే. అదేమిటని అడుగుతారేమో! మట్టి నాణ్యతను బట్టే మొక్కలో పోషకాలు తయారువుతాయి. మొక్క తనకు కావల్సిన పోషకాలన్నీ మట్టి నుంచి తీసుకుంటుంది. 45% మినరల్స్, 25% గాలి, 25% నీరు, 5 % ఆర్గానిక్ తో తయారవుతుంది మట్టి. మీకో విషయం తెలుసా? ఉపరితల భాగంలో ఉందే ఒక అంగుళం మట్టి (Top soil) ఏర్పడటానికి 100 ఏళ్ళు పడుతుంది. అదే మట్టి కలుషితమైతే? సారం కోల్పోతే? మానవుడి చర్యల వలన వికృతమైతే? మానవులు తీసుకునే ఆహారం కలుషితమవుతుంది, సారహీనమవుతుంది. ఆరోగ్యం, బలం ఇవ్వాల్సిన ఆహారం, అనారోగ్యాన్ని ఇచ్చి బలహీనులను చేస్తుంది. బలహీనమైన జాతి నశిస్తుంది. మానవసమాజం కుప్పకూలుతుంది. మానవ అకృత్యాల వలన సారం, జీవం కోల్పోతున్న మట్టిని సంరక్షించడానికి ఐక్యరాజ్య సమితి డిసెంబరు 5 ను ప్రపంచ మృత్తికా దినోత్సవంగా ప్రకటించింది. ఒకసారి మట్టికి మన హిందూ సంస్కృతిలో ఉన్న వైశిష్ట్యం తెలుసుకుందాం.
రుద్రాయా’తతావినే క్షేత్రా’ణాం పత’యే నమో నమః’ సూతాయాహం’త్యాయ వనా’నాం పత’యే నమో నమో రోహి’తాయ స్థపత’యే వృక్షాణాం పత’యే నమో నమో’ ............. కృష్ణ యజుర్వేదంలో శ్రీ రుద్రంలో ఉన్న మంత్రమిది. ధర్మమార్గంలో నడించేవారిని రక్షించువాడు, మా పొలాలను/ మట్టిని/ భూమిని రక్షించువాడు, అందరిని నడిపించువాడు, శత్రువుల చేత హతం చేయబడనివాడు, అడవుల రూపంలో ఉన్నవాడు/ వనాలను రక్షించువాడు, వాక్కును ప్రసాదించినవాడు, విశ్వాన్ని నిర్మించి పోషిస్తున్నవాడు, వృక్షరూపంలో ఉన్నవాడు/ వృక్షాలకు అధిపతి అయిన రుద్రునకు మా నమస్కారాలు అని పదేపదే నమస్కరించడం కనిపిస్తుంది. అందులో ఎంతో చక్కగా చెప్పారు, దీన్ని ఎన్నో కోణాల్లో దర్శించవచ్చు. ఇప్పటికి ఈ అంశానికే పరిమితమవుదాము. క్షేత్రానికి ఒక అర్దంలో మట్టి కూడా వస్తుంది. మట్టిరూపంలో ఉన్న శివునకు నమస్కారాలు అని, ఇంకో అర్దంలో మృత్తికకు అధిపతి, రక్షకుడైన శివునకు నమస్కారాలు అని అర్దం. దీనిబట్టి మనమేం అర్దం చేసుకోవాలి, మట్టిని కలుషితం చేయడం, భూసారం క్షీణించే చర్యలకు దిగడం రుద్రునకు చేసే అపచారం.
చమకంలోనికి వెళితే, అశ్మా చ’ మే మృత్తి’కా చ మే గిరయ’శ్చ మే పర్వ’తాశ్చ మే - అనే మంత్రంలో ఋషి, మాకు మంచి సారవంతమైన మృత్తికను ఇవ్వు అని అడుగుతున్నాడు.
అఘమర్షణ సూక్తం అనే సూక్తం వేదంలో ఉంది. అది స్నానం సమయంలో పఠిస్తారు. అది మట్టి విలువను ఎంతో గొప్పగా ప్రతిపాదిస్తోంది.
అశ్వక్రాంతే రధక్రాంతే విష్ణుక్రాంతే వసుంధరా
శిరసాధారయిష్యామి రక్షస్వమాం పదేపదే
అంటూ ఉండే మంత్రం మట్టి శిరస్సుపై ధరించి స్నానం చేయడం వలన రక్షణ కలుగుతుందని చెప్తోంది. ఒకప్పుడు మట్టినే స్నానానికి వాడేవారు, బట్టల మురికి వదిలించడానికి కూడా మట్టినే వాడేవారని రాజీవ్ దీక్షిత్ గారు పలు ఉపన్యాసాల్లో చెప్పారు. దానికి కారణం మట్టిని ఉపయోగించడం వలన భూమి, నీరు కలుషితం కావు, రెండవది, అది సహజసిద్ధంగా తయారైనది. శరీరానికి హాని చేయనిది, పైగా పోషకాలను అందించేది. ఇప్పుడు మనం వాడే సబ్బులు చర్మానికి మంచివికావు, బట్టలకు మంచివికావు, పర్యావరణానికీ మంచివి కావు. అంతేనా? ఆ స్నానానికి వాడే సబ్బులను తయారు చేశాక, పరీక్షల కోసమని వాటిని జంతువుల మీద రకరకాలుగా ప్రయోగిస్తారు. కొన్నిటిని వాటి కంట్లోకి చొప్పించి, కళ్ళు పోతాయా లేదా అని పరీక్షిస్తారు. షాంపూల గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీలేదు. అంత హింసతో కూడుకున్నవి వాడటం అవసరమా? అలాంటి హింసకు పరోక్షంగా కారణమవుతున్న వాటి వినియోగదారులు మోక్షాన్ని పొందగలరా? కనీసం అలా ఆలోచించడానికి పాత్రులా?
To be continued ..............
http://techfactslive.com/world-soil-day-theme-quotes-history/15869/
Sunday, 4 December 2016
హిందూ ధర్మం - 231 (జ్యోతిష్యం - 13) (మనకూ, గ్రీకు, రోమన్లకు సారూప్యతలు)
మనం చూశాం కదా, మన సనాతన సంప్రదాయంలో వారాలకు నామాలను ఎలా నిర్ణయించారని. ఇప్పుడు ఒకసారి గ్రీకు, రోమన్ సంప్రదాయాలను పరికించి చూద్దాం. ఎందుకంటే ఈ రోజు మనం అనుసరిస్తున్న పాశ్చాత్య వారక్రమం కూడా మన జ్యోతిష్య శాస్త్ర లెక్కలతో సరిపోతున్నది. పైగా అది క్రైస్తవ సంప్రదాయానికి చెందినది కాదు, అసలు కొన్ని మతాలకు మనలా కాలగణన లేదు. ఈనాడు ప్రపంచం అనుసరిస్తున్న కాలగణనలో చాలా శాతం గ్రీకు, రోమన్ మూలాలు కలిగిందే. మరి వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకున్నారు? వారి మూలం ఎక్కడ ఉంది? వంటి అంశాలు పరిశీలిద్దాం.
పాశ్చాత్య క్యాలెండర్ మీద పరిశోధన చేసినవారి ప్రకారం వారాలకు రోమన్ దేవతల పేర్లను నిర్ణయించారు ఎందుకంటే ఇది రోమన్, గ్రీకు నాగరికతల నుంచి తీసుకున్న అంశం కనుక. దాన్ని జెర్మన్లు స్వీకరించి, అందులో కొన్ని అంశాలను మార్చి ఈ రోజు మనం పాటిస్తున్న ఆంగ్ల వారాల పేర్లు తీసుకువచ్చారు. ఒకసారి సారూప్యతలు (similarities) గమనించండి.
సన్‌డే అనే పదం dies solis అనే లాటిన్ పదం నుంచి వచ్చింది, దాని అర్దం సూర్యుని వారము అని. ఇది పేగన్లకు సెలవు దినము. (తమ మత ఆరాధన పద్ధతులకు, విశ్వాసాలకు భిన్నంగా ప్రకృతిని పూజించే సంప్రదాయం కలవారిని పేగన్ (Pagan) లుగా ముద్రవేసి, వారి మతం మార్చడమో లేదా పూర్తిగా ఆ నాగరికతను, జీవనవిధానాన్ని ఊచకోత కోసేవారు క్రైస్తవులు. అలా ప్రకృతిని ఆరాధించేవారిని పేగన్లు అనడం మొదలుపెట్టారు.) అలాగే ఇది వారి దేవునకు సంబంధించిన దినము.
మన్‌డే అనగా మూన్ (చంద్రునికి) కు చెందినది అని జెర్మన్ సంప్రదాయం చెప్తున్నది. ఇది dies lunae అనే లాటిన్ పదం అనువాదం. చంద్రుడిని దేవతగా పూజించే సంప్రదాయం అక్కడ కూడా ఉండేది.
Tuesday అనేది Týr అనే దేవతకు సంబంధించినది. ఈయన యుద్ధానికి సంబంధించిన దేవత అని రోమన్ల విశ్వాసం. ఈయన గురించి జెర్మన్ పేగనిజంలో కూడా వర్ణన ఉంది. మనకు ఇది మంగళవారం. మంగళుడంటే కుజుడు, ఆయన భూమిపుత్రుడు కూడా కనుక భౌమవారమని పేరు వచ్చింది. మన జ్యోతిష్యంలో కూడా కుజుడిని యుద్ధానికి, తగువులకు, రక్తానికి కారకుడిగా చెప్తాము.
Wednesday అనేది Wodan (Odin) కు సంబంధించినది. లాంటిన్ లో దీన్ని dies Mercurii అన్నారు. ఈ దేవతను ఇంగ్లాండులో కూడా 17 శత్బాదం వరకు పూజించేవారు. వీరు సోల్స్ (Souls) కి మరణం తర్వాత మార్గదర్శనం చేస్తారని భావిస్తారు. బుద్ధికి సంబంధించిన దేవతగా రోమన్ల విశ్వాసం. ఈయన కవితలు, సంగీతానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో ఇది బుధవారం. బుధుడు బాగుంటే విద్యలలో రాణిస్తారు. బుధుడి ధ్యానం చేత బుద్ధికి సంబంధించిన బాధలు తొలగుతాయని మనకు తెలిసిందే.
Thursday అనేది నోర్స్ దేవుడు Thor కు సంబంధించిన రోజట. లాంటిన్ లో దీన్ని dies Jovis అన్నారు. రోమన్లకు ముఖ్యమైన దేవుడు Jupiter, గురువుకు ప్రీతికరమైన రోజు. పురాతన రోమన్ల సంస్కృతిలో ఈయన దేవతలకు అధిపతి. మన జ్యోతిష్యంలో దేవ గురువు, బృహస్పతి.
Friday అనేది లాటిన్ పదం dies veneris అనువాదం. Venus అంటే శుక్రుడు. రోమన్లకు ఈయన ప్రేమ, అందం, శృంగారం, సంతానం, కోరికలకు చెందిన దేవత. మన జ్యోతిష్యంలో కూడా శుక్రుడిని పైన చెప్పుకున్న లక్షణాలకు అధిపతిగా చెప్తారు.
Saturday లో Saturn ఉంది. మూలాల్లోకి వెళ్ళకుండా చూసినా Saturn అంటే శని. మనకు శనివారమే వారికి Saturday. అయినా ఒకసారి పరిశీలిద్దాం. Saturday అనేది లాటిన్ పదం dies Saturni అనువాదం. రోమన్లకు ఈయన సృష్టి, ప్రళయం, సంపద, వ్యవసాయం, మోక్షానికి సంబంధించిన దేవత. మన జ్యోతిష్యంలో శని పూర్వ కర్మకు సూచిక. పుణ్య కర్మ ఉంటే ఆయన సంపదలను, సుఖాలను, అధికారాన్ని ఇస్తాడు, పాప కర్మ ఉంటే వాటిని నశింపజేస్తాడు.
To be continued ............
Source: https://en.wikipedia.org/wiki/Names_of_the_days_of_the_week
http://www.pantheon.org/miscellaneous/origin_days.html

Saturday, 3 December 2016
స్వామి సచ్చిదానంద సూక్తి
Dreaming makes us realize the depth and condition of the mind. Dreams help us to know what sort of impressions are in the mind. If the mind has good impressions, you get good dreams. On the surface we have a lot of waves like the ocean, which is called the conscious mind. Below that you have the subconscious mind and the unconscious. The impressions that were the deposits of our previous actions slowly slip down from the conscious level to the subconscious. Only in sleep does the subconscious mind come out. Dreams help us to know our mental condition. Also, dreams let us know that the mind can function without the body—the mental or astral body is separate from the physical body. This helps us so we won’t feel it as a terrible loss when we lose this physical body.
- Swami Satchidananda
Friday, 2 December 2016
Thursday, 1 December 2016
Wednesday, 30 November 2016
సనాతన భారతీయత గురించి జగదీశ్ చంద్రబోస్
Can anything small or circumscribed ever satisfy the mind of India? By a continuous living tradition, and a vital power of rejuvenescence, this land has readjusted itself through unnumbered transformations. Indians have always arisen who, discarding the immediate and absorbing prize of the hour, have sought for the realization of the highest ideals in life—not through passive renunciation, but through active struggle............................
No patents will ever be taken. The spirit of our national culture demands that we should forever be free from the desecration of utilizing knowledge only for personal gain.
Jagadish Chandra Bose
Subscribe to:
Posts (Atom)