Wednesday, 7 December 2016

ప్రసిద్ధి చెందిన 3 కాలభైరవ క్షేత్రాలు

రక్తజ్వాలా జటాధరం శశిధరం రక్తాంగతేజోమయం
హస్తే శూలకపాల పాశ ఢమరుం లోకస్యరక్షాకరం
నిర్వాణం శునవాహనం త్రినయనం ఆనందకోలాహం
వందే భూతపిశాచ నాధ వటుకం శ్రీః క్షేత్రస్య పాలం శివం

విశిష్టమైన కాలభైరవాష్టమి పర్వదినాన వేగంగా 3 కాలభైరవ క్షేత్రాలను దర్శించుకుందాం.

1. ప్రపంచ ప్రళయకాలంలో కూడా నాశనమవ్వకుండా, శివుడి త్రిశూలం మీద నిలబడి ఉంటుంది కాశీ. కాశీలో మరణిస్తే చాలు మోక్షం లభిస్తుంది. కాశీలో మరణించే దోమల కుడి చెవిలో కూడా సర్వేశ్వరుడు తారకమంత్రం చెప్పి, మోక్షాన్ని ప్రసాదించడం శ్రీ రామకృష్ణ పరమహంసకు దర్శనమయ్యింది. అటువంటి కాశీలో ఉండే కాలభైరవ స్వామి ఈయన. ఈయనే కాశీ క్షేత్రపాలకుడు. ఈయన అనుమతి లేకుంటే కాశీలో అడుగు కూడా పెట్టలేరు. కాశీలో మొదట కాలభైరవుడిని దర్శించి, ఆ తర్వాతే విశ్వనాధుని దర్శనానికి వెళతారు.
ఈ రోజు కాలభైరవాష్టమి సందర్భంగా ఒకసారి స్వామికి, నమస్కరించి స్మరించుకుందాం.



2. ఇప్పుడు మనం ఖాట్మండు హనుమాన్ దోకాలో ఉన్న కాలభైరవ స్వామిని దర్శించుకుందాం. ఉత్తరాభి ముఖుడై ఉన్న ఈ స్వామి ఇక్కడ ఎప్పటి నుంచి కొలువై ఉన్నాడో తెలియదు, కానీ ఇక్కడి రాజు 17 వ శత్బాదంలో ఆలయం నిర్మించాడని నేపాలీలు చెప్తున్నారు. ఇక్కడ ఉన్న స్వామి 10 అడుగుల పైనే ఎత్తుగల ఏకశిలా విగ్రహం. ఈయన ఎంతో మహిమాన్వితుడు. ఈ స్వామి ముందు అబద్దమాడినవారు రక్తం కక్కుని అప్పటికప్పుడే మరణిస్తారట. అందుకే దీన్ని ఒకప్పుడు నేపాల్ సుప్రీం కోర్టు అని పిలిచేవారు. ఇంతకముందు ప్రభుత్వాలు ఎదాఇన కేసు తేలనప్పుడు, ఈ స్వామి ముందుకు నిందితులని తీసుకువచ్చేవారట. అందుకే ఈ స్వామి ఆలయానికి దగ్గర్లోనే పోలిస్ స్టేషన్ ఉంది. కాలభైరవుడు న్యాయానికి అధిదేవత. అన్యాయాన్ని అసలు ఒప్పుకోడు. అందుకే ఏదైనా న్యాయపోరాటం చేసే ముందు ఇక్కడకు వచ్చి, స్వామిని దర్శించుకుంటారు అక్కడి ప్రజలు. మహిమాన్వితమైన ఈ కాలభైరవాష్టమి పర్వదినాన ఒకసారి స్వామికి నమస్కరించి, స్మరిచుకుని, ఆయన అనుగ్రహానికి పాత్రులమవుదాం.

3. ఇప్పుడు మన దేశంలో అత్యంత పురాతన కాలభైరవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కిలికిరీ బాబా భైరవ నాధ్‌జీ పాండవీ కాలీన్ మందిరంగా ప్రసిద్ధి చెందిన ఆలయం దర్శనం చేద్దాం, ఇది దిల్లీలో పురానా ఖిలా బయట ఉంది. సుమారు 5500 ఏళ్ళ క్రితం నాటి ఆలయమని చెప్తారు. ఈ ఆలయాన్ని ఇంద్రప్రస్థ నగరం నిర్మించే ముందు పాండవులు నిర్మించారట, దేశరక్షణ కొరకు. ఇదే స్థలంలో పాండవుల్లో ఒకడైన భీముడు తపస్సు చేసి, శక్తులను పొందాడు. అప్పటి నుంచి ఇక్కడ నిత్యం అర్చనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ స్వామికి మద్యం నివేదిస్తారు. అది నివేదించడం ఇష్టంలేని భక్తులు పక్కనే ఉన్న ఇంకో ఆలయంలో కాలభైరవుడికి పాలు సమర్పించవచ్చు.



2 comments:

  1. రక్తజ్వాలా జటాధరం శశిధరం రక్తాంగతేజోమయం
    హస్తే శూలకపాల పాశ ఢమరుం లోకస్యరక్షాకరం
    నిర్వాణం శునవాహనం త్రినయనం ఆనందకోలాహం
    వందే భూతపిశాచ నాధ వటుకం శ్రీః క్షేత్రస్య పాలం శివం

    ఈ శ్లోకం ఎందులోది దయ చేసి చెప్పండి

    ReplyDelete
    Replies
    1. అది మంత్రమండి, అప్పట్లో పొరపాటున రాసాను... అది ఉపదేశం లేకుండా చదువకూడదు... దాన్ని మార్చేస్తానండి

      Delete