జ్యోతిష్యం నిత్యజీవితంలో భాగం. తిధులు నిత్యకృత్యాలకు ఎంతో అవసరం. అటువంటి తిధుల నిర్ణయంలోనే ఎంతో శాస్త్రీయత ఉంది. చంద్రుడి వృద్ధి, క్షీణతల అనుసరించి తిధి నిర్ణయం జరిగింది. చంద్రుడికి మొత్తం 16 కళలు ఉన్నాయని ఋషులు గుర్తించారు. అందులో పూర్ణిమ రోజు చంద్రబింబం పూర్తిగా కనిపిస్తే, అమావాస్య రోజు అసలు కనిపించదు. పూర్ణిమ అంటే పూర్ణంగ్ ఉన్న చంద్రుడు. అమావాస్య అన్న పదంలోనే ఎంతో శాస్త్రీయత దాగి ఉంది. అమా+వాస్య - అమా అంటే కలిసి, వాస్య అంటే వసించడం/ ఉండటం. చంద్రుడు, సూర్యుడు ఒకే రేఖ మీద ఉండటం వలన, సూర్యుని కాంతి కారణంగా చంద్రుడు కనిపించడు. అందువలన ఆ రోజు చంద్రదర్శనం ఉండదు. కాబట్టి దాన్ని అమావాస్య అన్నారు. అదే ఆధునిక సైన్స్ చూడండి. దాన్ని న్యూ మూన్ డే అన్నారు. అసలు ఆ రోజు చంద్రుడే లేడు, ఇంకా న్యూ మూన్ ఏంటీ? ఎంత అసంబద్ధంగా ఉంది ఇది. అయినా మన పిల్లలకు అదే చెప్పాలి మరి. ఎందుకంటే మనవి మూఢనమ్మకాలు, వారిది సైన్సు కదా!
అమావాస్య నుంచి మొదలుపెడితే, పూర్ణిమ వరకు చంద్రుడు వృద్ధి చెందుతాడు. వెలుతురును పంచుతాడు. కనుక దాన్ని శుక్ల పక్షం అన్నారు. పూర్ణిమ తర్వాత నుంచి అమావాస్య వరకు చంద్రుడు క్షీణిస్తూ, అమవాస్యకు అంధకారం ఉంటుంది. కనుక దాన్ని కృష్ణ పక్షం అన్నారు. కృష్ణ అంటే నలుపు వర్ణం, చీకటి. అయితే కృష్ణ పక్షమైనా, శుక్ల పక్షమైనా, అష్టమి తిధిలో చంద్రుడి కళ ఒకేలా ఉంటుంది. 16 లో సగం కనుక ఆ రోజును అష్టమి అన్నారు. దీనికి ప్రాముఖ్యం కూడా ఉంది. 16 కళల్లో నాలుగువంతును చవితి / చతుర్థి అన్నారు. క్షీణించిన చంద్రుడి చిన్న బింబం కనిపించే మొదటి రోజును మొదటి కళగా ప్రతిపదా అన్నారు, అదే పాడ్యమి. రెండవ రోజు ద్వితీయ, మనం విదియ అంటున్నాం, మూడు తృతీయ, నాలుగు చవితి, ఐదు పంచమి, ఆరు షష్ఠి, ఏడు సప్తమి, ఎనిమిది అష్టమి, తొమ్మిది నవమి, పది దశమి, పదకొండు ఏకాదశి, పెన్నుండు ద్వాదశి, పదమూడు త్రయోదశి, పదునాలుగు చతుర్దశి. ఈ రెండు పక్షాలని కలిపితే వచ్చేది మాసం (నెల). మాస అనే పదానికి అర్దం కూడా చంద్రుడే. పూర్ణిమలో పూర్ణ్+మా ఉంది, పూర్ణ్ అనగా సంపూర్ణం అని, మా అంటే చంద్రుడి అని అర్దం. ఇలా ఏ తిధి పేరు చూసినా, అది ఎంతో శాస్త్రీయంగానే ఉంటుంది. అది ఊరికే పెట్టిన పేరు కాదు. ఆ పేరు యొక్క అర్దం అంతరిక్షంలో ప్రత్యక్ష నేత్రాలకు కనిపిస్తూనే ఉంటుంది ఏనాటికైనా.
ఇక్కడ రెండు రకాల పద్ధతులను అవలంభిస్తారు. ఉత్తరభారతంలో పూర్ణిమ తరువాత వచ్చే పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 30 తిధులను మాసంగా పరిగణిస్తారు. దక్షిణ భారతంలో అమావాస్య తర్వాత వచ్చే శుక్ల ప్రతిపద నుంచి అమావాస్య వరకు మాసంగా గణిస్తారు. ఏది ఎలా చేసినా, పండుగులు, ఉత్సవాలు అన్నీ ఒకే రోజున చేసుకుంటాం. ఇది మన ధర్మంలో అంతర్లీనంగా ఉన్న ఐక్యతకు, సమన్వయానికి నిదర్శనం.
మన పండుగలన్నీ తిధులను అనుసరించే ఉంటాయి, ఒక్క సంక్రాంతులు తప్ప. అవి మాత్రమే సౌరమానం ఆధారంగా జరుపుకుంటాము. గ్రిగేరియన్ (ఆంగ్ల) క్యాలెండర్లలో డేట్‌లకు, హిందువులు పాటించే తిధులకు - నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అసలా డేట్‌లు పెద్ద అసంబద్ధం, అవి అలా ఏర్పడ్డయనాడానికి కాగితం మీద మనం రాసుకున్న గీతలు తప్ప, ఖగోళంలో వేరే ఏ ఇతర సాక్ష్యాలు ఉండవు. ఈ రోజు మనం నెలకు 30, 31 రోజులు అంటూ పాటిస్తున్నాము, రేపు ఇంకేవరో వచ్చి నెలకు 60 రోజులు పెట్టవచ్చు, ఇంకొకడు 90 అనచ్చు. అప్పుడు ఒక వ్యక్తి ఆశ్వీయుజ పూర్ణిమ నాడు జన్మించాడనుకుందాం. ఇప్పుడు అతను ఏదో డేట్ రోజు జరుపుకుంటే, అప్పుడు అతను ఇంకెప్పుడో జరుపుకోవలసి వస్తుంది. అతడు పుట్టిన రోజు జరుపుకున్న దానికి ఖగోళంలో ఏ విధమైన నిదర్శనం ఉండదు. అదే మన సంప్రదాయంలో చూసుకుంటే, ఎవరు ఎన్ని మార్చినా, చంద్రుడు అశ్విని నక్షత్రంలో పూర్ణిమ రోజున ఉదయించడం ఖగోళ సత్యం. దాన్ని ఎవ్వరూ కాదనలేరు. అతను పుట్టిన సమయంలో ఉన్న గ్రహగతులు మొదలైనవే ప్రత్యేకమే కావచ్చు, కానీ అతను పుట్టిన తిధి మళ్ళీ కనిపించడం అన్నది యదార్ధం. మన పండుగలన్నీ అలా జరుపుకునేవే కదా. మన గణన ఎంత శాస్త్రీయంగా ఉందో ఆలోచించండి.
To be continued ...................

No comments:
Post a Comment