ఇది సత్సంగమా?
ఈనాడు పతనమయ్యింది. అది ఒక రకమైన మానసిక కాలక్షేపము గా మారిపోయింది. సాయంకాల సమయంలో ఒక గంట పాటు సన్యాసులు మరియు గృహస్థులు వేదాంత చర్చ పేరున కొన్ని కబుర్లు, గాలి మాటలు, రాజకీయాలు, దుష్ప్రచారాలు, చాడీలు, ముసి ముసి నవ్వులు, కొంత ఇకిలింపులు-సకిలింపులు మరియు పనికిమాలిన భావలతో కూడిన పిచ్చి ప్రేలాపనలు చెప్పుకోవడం అనేది సత్సంగం పేరున జరుపుతున్నారు. సత్సంగం చేసే సన్యాసుల మనస్సులు మరియు దాన్ని వినే ఇతరులు మనస్సులు, ఎన్నో ఏళ్ల సత్సంగం తర్వాత కూడా అదే స్థితిలో ఉంటున్నాయి. వారిలో ఏ విధమైన ఉన్నతి మరియు ఆధ్యాత్మిక ఎదుగుదల లేదు.
ఈ ప్రపంచంలో సాధువులు, సన్యాసులు చరిస్తున్నప్పుడు, గృహస్థులకు వైరాగ్య జీవనానికి ఉదాహరణలుగా నిలవాలి. వారు కేవలం వారి జీవనానికి సరిపడా వస్తువులు మాత్రమే గృహస్థుల నుంచి తెచ్చుకోవాలి. వారితో వీరు స్వేచ్ఛగా కలువకూడదు. గ్రామానికి బయట ఒక ఏకాంతప్రదేశంలో జీవించాలి. ఆధ్యాత్మిక శిక్షణా తరగతులను శ్రద్ధగా నిర్వహించాలి. భౌతికమైన విషయాలు మాట్లాడకూడదు. ఎక్కువగా నవ్వు తెప్పించే కథలను వారు చెప్పకూడదు. ఎగతాళి చేసే/ పరిహాసానికి గురి చేసే సంఘటనలు చెప్పకూడదు. అక్కడ పవిత్రమైన ప్రశాంతత ఉండాలి. మొత్తం ప్రేక్షకులు మంత్రముగ్ధలవ్వాలి. అక్కడ పూర్తిగా నిశ్శబ్దం ఉండాలి. అప్పుడు మాత్రమే గృహస్థులు ప్రభావితమవుతారు. వారికి సత్సంగం నుంచి ఇంకేదో వస్తోందని భావిస్తారు.
ఖీర్- పరోటా పక్షులు
గృహస్థుల నుంచి సన్యాసి ఎన్నో వస్తువులను పదే పదే అడిగిన మరుక్షణం నుంచి అతను తన గౌరవాన్ని, ప్రభావాన్ని కోల్పోతాడు. అతడు ఆ ప్రదేశాన్ని వెంటనే వదిలి వెళ్ళవలసి వస్తుంది. కొందరు సిగ్గులేని సన్యాసులు గృహస్థుల ఇంట్లో నెలల తరబడి ఉంటారు. వారు ఖీర్- పరోటా పక్షులు. వారు నిజమైన సన్యాసులు కాదు. రాబోయే జనాభా లెక్కల్లో అధికారులు వారి నివేదికను పంపడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యక్తులు సాధువులు మరియు సన్యాసుల కోవలోకి రారు. మేక తోలు కప్పుకున్న తోడేలు వలె కాషాయం కట్టుకున్నా నిపుణులైన ముష్టి వారు వీళ్ళు. నిజమైన సన్యాసి యొక్క నడవడిక ఎంతో వాస్తవికంగా ఉంటుంది. అధికంగా సాధువులు పెరగడం వలన మరియు 74 లక్షల మంది సాధువులు ఉండటం వలన ప్రయోజనమేమి? అందులో మంచి సంప్రదాయం కలిగి ఈ దేశానికి మరియు తమకు ఉపయోగపడే సన్యాసులు, రెండు వేలకు మించి ఉండరు. నిజమైన సాధువు లేదా సన్యాసి ప్రకాశవంతమైన సూర్యుని వలె ఉంటాడు. అతడు రేయింబవళ్లు ప్రకాశిస్తూ ఉంటాడు.
సాధకులకు శిక్షణ ఇవ్వడం
సాధువులు మరియు సన్యాసులకు రిషికేశ్ మాత్రమే అత్యుత్తమమైన ప్రదేశము. ఉచిత ఆహారము, ఉచిత కుటీరాలు మరియు ఉచిత ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. అందమైన గ్రంధాలయం ఉంది. వైద్య సదుపాయం కూడా ఉంది. మీరు ఒక పక్షి వలె స్వేచ్ఛగా ఉండవచ్చు. నిజంగా ఆధ్యాత్మిక ఉన్నతి మరియు ఆత్మసాక్షాత్కారం పొందగోరే సాధువు లేదా సన్యాసి లేదా సాధకుడు, ఈ ప్రదేశంలోనే ఉంటూ ఒక్క రోజు కూడా ఊరు దాటకుండా కనీసం 12 ఏళ్లు ఉంటూ తీవ్రమైన నిరంతర సాధన చేయాలి. ప్రదేశం యొక్క మార్పు అవసరం లేదు. గంగా మరియు హిమాలయాలు ఎల్లవేళలా ప్రేరణను, ఉన్నతిని మరియు ఆరోగ్యాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ఇక్కడ నుంచి వేరొక చోటికి మారాలనుకోవడం బలహీన సంకల్పలు, పిచ్చి పట్టిన వైద్యులు మరియు యొక్క ధనికుల యొక్క మూర్ఖమైన ఆలోచన మాత్రమే.
ఒక చోటి నుంచి వేరొక చోటికి మారుతూ అనేక వేదికల మీద ప్రవచనాలు చెప్పే సన్యాసి కంటే, తన ఆశ్రమంలోనే కూర్చున్న సాధువు లేదా సన్యాసి మరింత దృఢమైన, ఘనమైన కార్యాన్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తాడు. ఒక పువ్వు పుష్పించగానే అది తేనెటీగలకు ఏ విధమైన ఆహ్వానాన్ని పంపనవసరం లేదు. తేనెటీగలు వాటంతట అవే వస్తాయి. సత్యం కోసం తపించే నిజమైన సాధకులు నిజమైన సన్యాసి యొక్క ఆశ్రమం ద్వారం ఉంది వెళ్లి నిలబడతారు. సన్యాసులు అనేకచోట్ల ప్రచారం చేసుకోవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక వేదికల మీద ప్రవచనాల అరగంటలో జరిగేది తాత్కాలికమైన ఉద్దీపనం మాత్రమే. అక్కడ పన్ని మూలల్లో కొంత అల్లరి, గొడవలు, తగువులాలు, చప్పట్లు, 'విను విను' అనే శబ్దాలు ఉంటాయి. నిజమైన అధికారులు (అర్హత కలిగిన సాధకులు/ భక్తులు) మాత్రమే సన్యాసులను కలవడానికి వారి ఆశ్రమానికి వెళతారు. ఇటువంటి సాధకుల యొక్క హృదయాలు సన్యాసులు ఇచ్చే ఉపదేశాలతో ప్రభావితమవుతాయి. సాధకులను తర్ఫీదు/ శిక్షణ ఇవ్వడమే సన్యాసులు చేయగలిగిన అతి గొప్ప సేవ. ప్రతి సాధకుడు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా లేదా శాంతి, జ్ఞానము మైర్యు ఆనందాన్ని పంచడానికి వీలయ్యే ఒక వాహకంగా మారుతాడు. సన్యాసులు తిరిగినప్పుడు అతని సమయం వృధా అవుతుంది. అన్ని రకాల వ్యక్తులు ఈ రోజుల్లో సన్యాసులను ఉత్సుకతతో కలవాడానికి వస్తారు. సన్యాసుల యొక్క అవసరాలను గృహస్థులు ఈనాడు తీర్చడంలేదు. వారు పూర్తిగా స్వర్ధపరులు అయ్యారు. వారు కేవలం నోటి మాటగా జాలి చూపెడతారు; "స్వామీజీ మహారాజ్! ఏమైనా సేవ చేయాల్సింది ఉంటే చెప్పండి". ఇది పూర్తిగా మోసము, కపటత్వం మరియు మాయ.
కాషాయం ధరించిన వ్యక్తి ఒక గొప్ప ఉన్నతమైన జీవితంలోకి ప్రవేశిస్తున్నాడని మరియు తన మీద గొప్ప బాధ్యత ఉందని, అతను త్వరలోనే ఈ ప్రపంచానికి ఒక ధార్మికమైన మరియు ఆధ్యాత్మిక గురువుగా మారుతున్నాడని అతను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. అతడు సద్గుణాలు, దైవీ గుణాలు మరియు వైరాగ్యం, పవిత్రతతో కూడిన ఆదర్శవంతమైన జీవితం గడపడానికి తన వంతు ప్రయత్నం పూర్తిగా చేయాలి.
నిజమైన సన్యాసులు ఈ ప్రపంచానికి వెలుగు చూపేవారు మరియు లాంతర వంటివారు. దూరంగా సముద్రంలో ఉన్న నావలకు దీపగృహము (లైట్ హౌస్) ఏ విధంగానైతే వెలుగును పంపుతుందో, అలాగే సన్యాసులు సైతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న దూరదేశ ప్రజలకు వారి యొక్క దివ్యమైన కాంతి ప్రసరించాలి. వారు ప్రపంచాన్ని కదిలించగలరు.
సమస్తాన్ని త్యాజించి, సత్య మార్గంలో నడుస్తున్న నిజమైన సన్యాసులకు మంగళమగుగాక! తన స్వస్వరూపంలో, బ్రహ్మ నిష్ఠలో ఉండే సన్యాసులకు అభివందనాలు! పరివ్రాజకాచార్యలు, బ్రహ్మ విద్యా గురువులు ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని దశదిశలా వ్యాపింప చేస్తున్నారో, వారికి మంగళమగుగాక! వారందరి దీవెనలు మనపై ఉండుగాక!
ఎనిమిదవ అధ్యాయము సమాప్తము
No comments:
Post a Comment