తొమ్మిదవ అధ్యాయము
గురు భక్తి యోగము
ఎలాగైతే కీర్తన మరియు సాధన అతి శీఘ్రంగా భగవంతుని దర్శనం పొందడానికి కలియుగంలో చేయగలిగిన ప్రత్యేకమైన సాధనలో, అలాగే సందేహాలు, నాస్తికత్వము, అహంకారము, పొగరుతో నిండిన ఈ యుగానికి అత్యంత ముఖ్యమైన శ్రేష్టమైన సాధన, ఒక సరికొత్త యోగము మీ ముందు ఉంచుతున్నాను. అదే గురు భక్తి యోగము. ఇది అత్యద్భుతమైనది. దాని యొక్క శక్తి మహత్తరమైనది. దాని యొక్క ప్రయోజనము ఏనాడు నిష్ఫలం అవ్వదు. గురు భక్తి యోగము యొక్క నిజమైన వైభవం వివరించలేము. ఈ యుగంలో ఈ జన్మలోనే భగవంతుడు రక్తమాంసాలతో కూడిన శరీరంతో మీ ముందు దర్శనం ఇచ్చేలా చేయగలుగే శ్రేష్ఠమైన యోగమిది. కఠినమైన రాజసిక అహంకారమే సాధకునకు ఒక పెద్ద శత్రువు. మదము మరియు దుష్టమైన అహంకారాన్ని నాశనం చేయుటకు గురుభక్తి యోగం అనేది నిశ్చ్యమైన మరియు ఉన్నతమైన సాధన. ఎలాగైతే ఒక ప్రత్యేకమైన రసాయనం ద్వారా మరణాంతకమైన క్రిమి యొక్క సమాహారం జరుగుతుందో, అలాగే అవిద్యను మరియు అహంకారాన్ని నాశనం చేయడంలో ఈ గురుభక్తి యోగం అనేది అసమానమైనది. అహంకారము మరియు మాయ అనేవి భయంకరమైనవి. ఏ వ్యక్తి అయితే గురు భక్తి యోగము ద్వారా తనను తాను తడిపి ముద్ద చేసుకుంటాడు, అతడు అత్యంత అదృష్టవంతమైన జీవుడు మరియు అతడు ఇక ఎంతకాలము మాయ మరియు అహంకారము వలన పీడింపబడదు. అతనిలో ఆ లక్షణాలు పూర్తిగా శక్తిహీనం అవుతాయి. అతి త్వరగా ఈ యోగం లోకి ప్రవేశించిన వాడు అతి త్వరగా దీవించబడ్డవాడూ. ఎందుకంటే అతడు ఇతర అన్ని యోగాలో కూడా తిరుగులేని విజయాన్ని సాధిస్తాడు. అతనికి కర్మ, భక్తి, ధ్యాన మరియు జ్ఞాన యోగాల యొక్క సంపూర్ణమైన ఫలితాలు ప్రత్యేకంగా అందుతాయి.
ఈ యోగాన్ని ఆచరించడానికి కావల్సినవి నిజాయతీ, విశ్వాసము మరియు విధేయత అనే ఈ మూడు గుణాలు. పరిపూర్ణతను పొందాలని మీ యొక్క ఆకాంక్షలో నిజాయితీగా ఉండండి. అనిశ్చితితో, అస్పష్టతతో ఉండకండి. మీరు గురువుగా అంగీకరించిన వ్యక్తి మీద పూర్తి విశ్వాసం కలిగి ఉండండి. ఏ కొద్దిగా కూడా సందేహానికి తావు/అవకాశం ఇవ్వకండి. ఒకసారి నీవు గురువుగా ఎంచుకున్న వ్యక్తి యందు పూర్తి విశ్వాసాన్ని ఉంచినప్పుడు, ఆయన ఏది చెప్పినా అది నీ మేలు కొరకేనని తెలుసుకో. కనుక ఆయన యొక్క బోధనలను తప్పకుండా పాటించు. చెప్పినది చెప్పినట్టు ఆచరించు. ఈ విధంగా చేస్తే నా మాటగా చెబుతున్నాను: మీకు పరిపూర్ణత లభిస్తుంది; గట్టిగా హామీ ఇస్తున్నా.
నీకు ఇప్పుడు గురు భక్తి యోగములోని ముఖ్యమైన వివరాలు ప్రతిపాదిస్తున్నాను.
1. గురు భక్తి యోగము అనేది సద్గురువు యందు సంపూర్ణమైన శరణాగతి చేయుట.
2.ఈ గురు భక్తి యోగానికి ఎనిమిది అంగాలు ఉన్నాయి. ముఖ్యమైనవి ఇవి. (అ) గురు భక్తి యోగాన్ని ఆచరించాలని నిజమైన ఆకాంక్ష కలిగి ఉండుట. (ఆ) సద్గురువు యొక్క ఆలోచనలు, మాటలు మరియు కర్మలయందు సంపూర్ణ విశ్వాసము. (ఇ) గురువుకు వినయంతో సాష్టాంగ నమస్కారము చేయుట మరియు గురు నామాని మననం చేయుట (ఈ) గురువు యొక్క ఆదేశాలను పాటించడంలో పూర్తి విధేయత, ఆజ్ఞాపాలన కలిగి ఉండుట. (ఉ) ఏ విధమైన ఫలితాలు ఆశించకుండా సద్గురువులకు వ్యక్తిగత సేవ చేయుట (ఊ) భావము మరియు భక్తితో సద్గురువు యొక్క పాదపద్మాలను ప్రతిరోజు ఆరాధించుట (ఋ) సద్గురువు యొక్క లక్ష్యం కొరకు తన (శరీరం), మన (మనస్సును), ధనా(ధనము) లను అర్పించుట లేదా శరణాగతి చేయుట (ౠ) దయాళువైన గురువు యొక్క అనుగ్రహం కోసం ఆయన యొక్క పవిత్ర పాదాలను ధ్యానం చేయుట మరియు ఆయన యొక్క పవిత్రమైన ఉపదేశాలను విని ఆచరించుట.
3. గురుభక్తి యోగమనేది ఒక యోగము.
4. గురుభక్తి యోగాన్ని పాటించకుండా సాధకుడు భగవంతునిలో లీనమయ్యే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించలేడు.
5. గురు భక్తి యోగ తత్త్వాన్ని అర్ధం చేసుకున్నవాడు మత్రమే తన గురువుకు బేషరుతుగా శరణాగతి చేయగలడు.
6. గురు భక్తి యోగాన్ని ఆచరించడం స్వారా జీవితం యొక్క అత్యున్నత లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారాన్ని సాధించవచ్చు.
7. గురు భక్తి యోగం అనేది ఎలాంటి భయం లేకుండా ఆచరించగలిగిన నిజమైన సురక్షితమైన యోగము.
8. గురువు యొక్క ఆజ్ఞలను పూర్తి విధేయతతో స్వీకరించి, ఆయన బోధలకు అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవడంలోనే గురు భక్తి యోగం యొక్క సారం ఉంది.
9. గురు భక్తి యోగం యొక్క లక్ష్యము గురువుకు సంపూర్ణ శరణాగతి ద్వారా మానవుడిని దేహం యొక్క బంధనాల నుంచి మరియు ప్రకృతి యొక్క సంకెళ్ళ నుంచి విడగొట్టి, అతని యొక్క శుద్ధమైన సచ్చిదానంద తత్త్వాన్ని తెలుసుకునేలా చేయడం.
10. గురుభక్తి యోగాన్ని ఆచరించే వ్యక్తి, ఏ కష్టం లేకుండా అహంకారాన్ని నిర్మూలించుకుని, సంసార సాగరాన్ని దాటగలడు.
11. గురు భక్తి యోగాన్ని పాటించేవానికి ఈ యోగం అమరత్వాన్ని మరియు బ్రహ్మానందాన్ని ఇస్తుంది.
12. గురుభక్తి యోగం మానసిక స్థిరత్వాన్ని మరియు ప్రశాంతతను ఇస్తుంది.
13. పరమానందాన్ని అనుభవించడానికి గురుభక్తి యోగమే కీలకమైనది.
14. జీవితం యొక్క లక్ష్యం గురు-భక్తి యోగం ద్వారా సద్గురువు యొక్క శుభప్రదమైన అనుగ్రహాన్ని పొందడం.
No comments:
Post a Comment