Tuesday, 26 November 2019

స్వామి శివానంద విరచిత గురుతత్వము - 31 వ భాగము



131. గురువు పట్ల మర్యాదతో ప్రవర్తించడం కంటే విధేయత కలిగి ఉండటమే కంటే ఉత్తమమైనది.
132. గురువు పట్ల విధేయత కలిగి ఉండటం అనేది త్యాగం కంటే ఉన్నతమైనది.
133. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ గురువుతో సర్దుకుని ఉండటాన్ని అలవరుచుకో.
134. నీ గురువు ముందు అధికముగా మాట్లాడకు.
135. గురువు పట్ల శుద్ధమైన ప్రేమయే నిజమైన విధేయత.
136. ఉత్తమమైన వస్తువులను ముందుగా గురువుకు సమర్పించు.
137. శిష్యుడనేవాడు అహంకారము, అసూయ, ఓర్వలేనితనం నున్చి విముక్తుడై, ఎటువంటి బంధము లేకుండా, గురు భక్తి తత్పరుడై, అసహనం లేనివాడై, సత్యాన్ని తెలుసుకోవాలన్న తపన కలిగి ఉండాలి.
138. తన గురువు యందు శిష్యుడు దోషాలు/ తప్పులు వెతక రాదు.
139. తన గురువు ముందు శిష్యుడు ఎన్నడూ కూడా అనవసరమైన లేదా అక్కర్లేని మాటలు మాట్లాడకూడదు.
140. యజ్ఞ యాగాది క్రతువుల్లో అగ్ని మధించడానికి ఉపయోగించే ఆరణిలోని ముఖ్యమైన లేదా కింద భాగాన్ని గురువుగా, పై భాగాన్న్ని శిష్యునిగా భావించాలి. గురువు చేసే సూచన మధ్యలో ఉన్న ప్రదేశం. జ్ఞానం అనేది వారిద్దరినీ కలిపి ఉంచి ఆనందాన్ని తీసుకువస్తుంది.
141. గురువు నుంచి పొందిన శుద్ధమైన జ్ఞానము మాయ లేదా భ్రాంతి ని తొలగిస్తుంది.
142. ఎవరైతే గురువు అనుగ్రహం ద్వారా ఒక్కడే అయిన భగవంతుడు మాయ చేత అనేకమయ్యడని తెలుసుకుంటాడో, అతను వేదాలను అర్థం చేసుకొని, జ్ఞానాన్ని ఎఱుకపరచుకుంటాడు.
143. గురువు పట్ల సేవా మరియు పూజ్య భావం చేత ఏర్పడిన ఏకీకృతమైన భక్తి చేత సానబెట్టిన జ్ఞానమనే పదునైన ఖడ్గంతో మౌనముగా మరియు నిరంతరము సంసారమనే వృక్షాన్ని నరికి వేయవచ్చు.
144. గురువు అనే వాడు ఓడకు చుక్కాణి, భగవంతుని అనుగ్రహమనే గాలి దాన్ని ముందుకు తీసుకువెళుతుంది.
145. ఏ వ్యక్తి అయితే ప్రపంచము చేత విసిగిపోయి వైరాగ్యంతో నిండి ఉంటాడో, అతని గురువు చెప్పిన విషయాలను అతడు మనసులో మననం చేసుకోగలుగుతాడో, ధ్యానాన్ని నిరంతరం సాధన చేస్తాడొ, అతడి సాధన వలన ఏర్పడిన పుణ్యఫలం చేత అతని మనసు చెడును వదిలివేస్తుంది.
146. గురువు నుంచి సరైన పద్ధతిలో తెలుసుకుని మంత్రోపదేశం తీసుకుంటేనే, మంత్ర శుద్ధి ఏర్పడుతుంది.
147. అనాదిగా ఉండే అజ్ఞానములో చిక్కుకున్న మానవుడు గురువు లేకుండా ఆత్మసాక్షాత్కారం పొందలేడు. బ్రహ్మమును తెలుసుకున్నవాడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని ఇవ్వగలడు.
148. వివేకవంతుడైన మానవుడు గురువే భగవంతుడు మరియు ఆత్మ అని తెలుసుకొని నిరంతర భక్తితో గురువును పూజించాలి.
149. శిష్యునకు గురువు పట్ల మరియు భగవంతుని పట్ల నిజమైన భక్తి ఉండాలి.
150. శిష్యుడు గురువును విధేయతతో, జాగురూకతతో, నిజాయితీతో సేవించి, భాగవత్ధర్మాన్ని లేదా భగవంతుని యొక్క భక్తులైన వారి ధర్మాలను గురువు నుంచి తెలుసుకోవాలి.
151. శిష్యుడు గురువునే తన భగవంతునిగా సేవించాలి. అది మాత్రమే విశ్వాత్మకుడైన భగవంతునికి ప్రీతియై, ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులు అవడానికి నిశ్చయమైన మార్గము.
152 శిష్యుడు బంధరాహిత్యాన్ని సాధన చేస్తూ, తన సద్గురువు తో నిరంతర సంగం ఏర్పరుచుకోవాలి.

No comments:

Post a Comment