44. ఈ జన్మలోనే అన్ని విధముల బాధలను తొలగించే ఏకైక పరిష్కారం గురు భక్తి యోగము.
45. అర్హత కలిగిన శిష్యునకు ఈ గురు భక్తి యోగ మార్గము త్వరగా ఫలాలను ఇస్తుంది.
46. గురు-భక్తి యోగము అహంకార నాశనముతో ముగిసి, సచ్చిదానందాన్ని అందిస్తుంది.
47. గురుభక్తి యోగము అత్యంత ఉన్నతమైన యోగము.
48. గురువు యొక్క పవిత్ర పాదాల ముందు సాష్టాంగ దండ ప్రణామాలు చేయుటకు సిగ్గు పడటం అనేది గురు-భక్తి యోగము యొక్క ఆచరణలో ఒక పెద్ద విఘ్నము/ అడ్డంకి.
49. తనను తాను సమర్ధించుకుంటూ, తన వద్దే అన్ని కలిగి ఉన్నాయి అనుకుంటూ; దురభిమానము; తనపై తనకు నియంత్రణ లేనితనము, తను చెప్పినదే వేదమని, తనకు తెలిసినదే నిజమే నమ్ముట, అలసత్వము, జడత్వము, మూర్ఖత్వం, మొండితనము, దోషములు వెతకడం, చెడు సహవాసం, నిజాయితీ రాహిత్యం, లౌల్యము, దురహంకారము, కోపము, దురాశ, పొగరు అనేవి ఈ గురు భక్తి యోగ మార్గంలో అతిపెద్ద అడ్డంకులు.
50. గురు భక్తి యోగము యొక్క నిరంతర ఆచరణ ద్వారా మనస్సు యొక్క చంచలత్వాన్ని నశింప చేసుకోండి.
51. గురు భక్తి యోగము యొక్క ఆచరణ ద్వారా చెదిరిపోయిన మానసిక కిరణాలు ఒకే దిశగా ఏకీకృతం అయి మీరు అద్భుతాలు చేయగలరు.
52. గురు-భక్తి యోగము అనే పథము గురువుకు సేవ చేయడం ద్వారా పవిత్ర హృదయాన్ని, ధ్యానము చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందటానికి అత్యధిక ప్రాధాన్యతను ఇస్తుంది.
54. ముందు గురు భక్తి యోగము యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని, ఆ తర్వాత దాన్ని ఆచరణలో పెట్టు. నీవు విజయం సాధిస్తావు.
55. దుర్గుణాలు అన్నింటిని నిర్మూలించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గము నిజాయితీగా గురు-భక్తి యోగాన్ని ఆచరణలో పెట్టుటయే.
56. గురు భక్తి యోగము అనే వృక్షానికి గురువుయందు అనన్యమైన విశ్వాసమే తల్లివేరు/మూలము.
57. ఎల్లప్పుడు గురువు యందు భక్తి పెరుగుతూ ఉండుట, వినయము, విధేయత మొదలైనవి ఈ చెట్టుకు కొమ్మలు. సేవ అనేది పుష్పము. గురువుకు శరణాగతి చేయుట అనేది అమరత్వాన్నిఇచ్చే ఫలము.
58. ఇది ఈ జన్మను ఉద్ధరించి రక్షించే సద్గురువు యొక్క పాదాల యందు అనన్యమైన విశ్వాసం మరియు భక్తి కలిగి ఉంటే నీవు ఈ గురు భక్తి యోగం లో విజయం పొందుతావు.
59. గురువుకు నిజమైన మరియు నిజాయితీతో కూడిన శరణాగతి గురు-భక్తియోగం యొక్క సారము.
60. గురు భక్తి యోగాన్ని ఆచరించడమంటే గురువు పట్ల అమితమైన ప్రేమ కలిగి ఉండుట.
61. నిజాయితీ లేకుండా గురు భక్తి యోగం లో ఏ విధమైన ఉన్నతి సాధ్యం కాదు.
62. నిశ్శబ్దంగా ఉండే ప్రదేశంలో ఉన్నతమైన ఆధ్యాత్మిక తరంగాలు గల ఒక మహా యోగి లేదా సమర్ధుడైన గురువు దగ్గర జీవించు. ఆయన వద్ద ఉంటూ గురువు భక్తియోగాన్ని ఆచరించు. అప్పుడు మాత్రమే భక్తియోగంలో విజయాన్ని సాధిస్తారు.
63. గురు-భక్తి యోగం లో ఘంటాపథంగా చెప్పే విషయం ఏమిటంటే బ్రహ్మనిష్ఠ-గురువు యొక్క పవిత్ర పాదపద్మాల యందు బేషరతుగా అనన్యమైన శరణాగతి చేయాలి.
64. గురు-భక్తి యోగ పద్ధతి ప్రకారం గురువు మరియు భగవంతుడు ఒక్కరే కనుక గురువుకు సంపూర్ణ శరణాగతి చేయటం అత్యవసరము.
65. గురువుకు శరణాగతి చేయుట అనేది గురు భక్తి యోగము అనే నిచ్చెనలో అత్యుత్తమమైన మెట్టు.
66. గురు భక్తి యోగ ఆచరణకు గురు సేవ చేయుట తప్పనిసరి.
67. గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడమే గురు-భక్తి యోగము యొక్క లక్ష్యము.
68. మొండితనము లేదా మంకుతనం కలిగిన శిష్యుడు ఈ గురు భక్తి యోగ ఆచరణలో ఎటువంటి ఖచ్చితమైన ఉన్నతి పొందలేడు.
69. చెడు సాంగత్యము అనేది గురు-భక్తి యోగాన్ని ఆచరించే శిష్యునికి పెద్ద శత్రువు.
70. ఈ గురు భక్తి యోగాన్ని ఆచరించాలి అనుకుంటే సుఖవంతమైన/ పశుప్రాయమైన/ విష్యాసక్తితో కూడిన జీవనాన్ని వదిలిపెట్టు.
71. ఎవరైతే దరిద్రాన్ని వదిలించుకుని, ఆనందాన్ని, సుఖాన్ని పొందాలని అనుకుంటారో వారు ఖచ్చితంగా గురు-భక్తి యోగాన్ని శ్రధ్హ, నిజాయతీతో ఆచరించాలి.
72. గురు సేవా యోగాన్ని పాటించడం చేత నిజమైన మరియు ఎల్లప్పటికి ఉండే ఆనందం కలుగుతుంది, కానీ బాహ్యమైన నశించిపోయే వస్తువుల వలన కాదు.
73. ఎల్లప్పుడూ తిరిగే జనన మరణ చక్రాలు, సుఖదుఃఖాలు, సంతోషవిచారాల మనకు బయటపడే మార్గం లేదా? శిష్యుడా, విను, దీనికి ఒక ఖచ్చితమైన మార్గం ఉంది. నీ యొక్క మనసును ఇంద్రియ విషయాల నుంచి మళ్లించి, ద్వైతానికి అతీతముగా తీసుకువెళ్లే గురుసేవా యోగమందు నిలుపు.
74. ఎవడైతే గురుసేవా యోగాన్ని లేదా గురు భక్తి యోగాన్ని పాటించడం మొదలుపెడతాడో, అటువంటి సాధకునకు నిజమైన జీవనం మొదలై, ఇహలోకంలోనూ పరలోకంలోనూ అతనికి ఎల్లప్పటికి ఉండే ఆనందం కలుగుతుంది.
No comments:
Post a Comment