భారత దేశంలోని ఐరిష్ రాయబారి కార్యాలయం ప్రవేశ ద్వారం ముందు ఆ దేశ అధికారులు స్థాపించిన మహాగణపతి విగ్రహం.
ఐశ్వర్యానికి, అదృష్టానికి అధిదేవుడైన గణేశుడు, రాయబార కార్యాలయానికి వీసా కోసం వచ్చే వందలాదిమందిలో ఆత్మవిశ్వాసాన్ని నింపి, వారికి ఆశీర్వాదాలు అందించాలి అని ఐర్లాండ్ మంత్రి ఈ సందర్భంగా అన్నారు. గణేశుని ప్రతిమను స్థాపించడమే ఈ కార్యాలయాన్ని పవిత్రం చేయటమే కాక, భారతదేశం- ఐర్లాండ్ మధ్య సాంస్కృతికి వారధికి శ్రీకారం చుడుతుందని చెప్పారు.
ఈ ప్రతిమను స్థాపించడంలో కీలక పాత్ర వహించిన ఐర్లాండ్ రాయబారి ఒకసారి భారతదేశంలో మహాబలిపురం సందర్శించినప్పుడు, గణేశమూర్తిని చూసి ఆయన అందానికి వశుడయ్యారట. అందుకే అక్కడి కార్యాలయంలో స్థాపించారట. హిందూదేవతలు కొలువు తీరిన తొలి రాయబార కార్యాలయం కూడా ఇదే అవచ్చు. |
No comments:
Post a Comment