Wednesday, 18 October 2023

శ్రీదత్త పురాణము (290)

 


ప్రాతఃస్మరణము


శిరస్సులో తెల్లని అష్టదళ పద్మమును భావించి దాని కర్ణికపై మణి పీఠము పై చిరు నగవుతో అభయ, వరదహస్తములతో సర్వాలంకారభూషితుడైన దత్తాత్రేయ సద్గురువును (నీ గురువును) జ్యోతి మండలము మధ్యగా నుండు నట్లు భావన చేయుము.


శ్లో॥ ఆనందం, సద్గురుం శాంతం భవ వైద్యం జగద్గురుం 

వేదవేద్య మనిర్వాద్యం దత్తాత్రేయ ముపాస్మహే 

ఆత్రేయం బ్రహ్మరంధ్రస్థం ద్విభుజం గురురూపిణం 

ఓంకారం ప్రత్యగాత్మానం పరబ్రహ్మస్వరూపిణం 

పరామాత్మాన మవ్యక్తం దత్తాత్రేయం స్మరామ్యహం


అనసూయాత్మజం చంద్రానుజం దుర్వాసోగ్రణం 

నారాయణం మహావిష్ణుం దత్తాత్రేయం నమామ్యహం 

మహాదేవం త్రినయనం భస్మోద్ధూలిత విగ్రహం 

చిన్ముద్రితకరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం 

త్రిమూర్తిం త్రిగుణం త్ర్యన్నం త్రిశక్తిం త్రిసర్వ త్రికం 

త్రికోణాంతర్బిందురూపం దతాత్రేయం భజామ్యహం 

కాశీస్నానానంతరం కొల్హాజాపినం మాహురీభుజం 

సహ్యశాయిన మాత్రేయం అవధూతం భజామ్యహం


పై విధముగా దత్తదేవుని స్మరించి ఆ సద్గురుని పాదముల నుండి స్రవించుచున్న అమృతధారలతో శరీరమంతయు తడిసి అమృతమయమైనట్లు భావించవలెను. కొద్ది నిముషములపాటు కలిగిన ఆనందమును శాంతిని అనుభవించవలెను.


No comments:

Post a Comment