Sunday 8 October 2023

శ్రీదత్త పురాణము (280)

 


శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ భావము


"వేదవ్యాసా! కలియుగంలో సంకల్పం ఎలా సిద్ధిస్తుంది? ధర్మార్థకామమోక్షసాధనమని దేనిని చెప్పుదురు?" అని ఋషులు అడిగిరి. (1) ఋషులారా! తొందరగా సంకల్పాన్ని సిద్ధింప జేసేదీ, ఒక్కసారి చదివితే చాలు. భోగమోక్షాలనిచ్చేది చెపుతాను అందరూ వినండి అని వ్యాసుడన్నారు. (2) హిమవత్పర్వత గౌరీశృంగం మీద కల్పవృక్షాలతో శోభిస్తూ మెరసి పోతున్న దివ్య మహారత్నఖచితమైన హేమమండపం నడుమ (3) పరమేశ్వరుడు రత్నసింహాసనం మీద కూర్చున్నాడు. ఆయన ప్రసన్నుడై ఉన్నాడు. ఆయన ముఖపద్మం పై చిరునవ్వు మెరుస్తున్నది. అట్టి శంకరునితో పార్వతీదేవి - (4) "దేవదేవా! మహాదేవా! లోకశంకరా! శంకరా! సర్వమంత్రాలను, సమస్త యంత్రాలను, (5) అనేక తంత్రాలను నీవల్ల నేను విన్నాను. "ఇపుడు వాటినన్నింటిని విశేషించి మహీతలాన్ని చూడాలనుకొంటున్నాను" అని అన్నది. (6) ఇలా పార్వతి పలికినది విని, పరమేశ్వరుడు సంతోషంతో ఆమెను ప్రేమగా చేతితో నిమురుతూ ఆమెతో ఇట్లన్నాడు -(7) "నేనిప్పుడు నీతోపాటు వృషభాన్ని అధిరోమించి బయలుదేరుతున్నాను" అన్నాడు, అలా పలికి శంకరుడు పార్వతితో సహా వృషభం అధిరోహించి, భూమండలం చూడబోయాడు. గౌరీదేవికి భూలోక వింతలు చూపిస్తూ వింధ్యాచలపర్వత ప్రాంతంలో సుదుర్గమమైన మహారణ్యముకు చేరుకున్నాడు. ఒకచోట వారికి గొడ్డలిని చేత ధరించిన ఒక కిరాతుడు కనిపించాడు. అతడు సమిదలు మొదలగునవి తీసికొని పోవుటకై ఆ అడవిలో తిరుగుచుండెను, అతని శరీరము వజ్రమువలె దృఢముగా నుండెను. ఇంతలో గొప్పవైన గోళ్ళు కోరలూ ఉన్న ఒక పెద్దపులి ఆ కిరాతుని చంపబోవుచుండెను. అయితే చాలా వింత గొల్పెడు చరిత్రగల ఆ కిరాతుడు తనను రక్షించుకోనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. అతనిలో దుఃఖములేదు, విచారమూ లేదు. పైగా సంతోషంతో నిర్భయంగా నిలబడి యుండెను. (8,9,10,11)


తర్వాత (అదే సమయంలో) ఒక లేడి పరుగెత్తుతూ వచ్చింది. దానిని చూసి ఆ పెద్ద పులి భయముతో పారిపోయింది, ఇట్టి వింతను చూచిన పార్వతి శంకరునితో(12) "ఏమాశ్చర్యం, ఏమాశ్చర్యం, శంభూ! ఎదురుగా చూడు" అన్నది. అలా అనేసరికి పురాణవేత్తయగు ఆ శంభుదేవుడు చూచి ఇట్లనెను. (13) "గౌరీ! వాక్కులకూ, మనస్సుకూ అందని చోద్యం నీకు చెపుతాను, మేము చూడనిదంటూ ఏ కొంచెము ఎక్కడా లేదు." (14) పార్వతీ! ఇప్పుడు దీనిని గూర్చి నేను చక్కగా సంగ్రహంగా చెపుతాను, వినుము ఈ బిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు, (15) ప్రతిరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూలఫలాదులూ తెచ్చి (16) ముందు మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మౌనులందరు కూడా అతని పట్ల దయతో ఉంటారు, (17) అక్కడే దలాదనుడు ఒక మహాయోగి ఉన్నాడు. ఆయన తన ఆశ్రమంలో నివసిస్తూనే ఒకానొకప్పుడు దిగంబరుడైన దత్తాత్రేయ సిద్ధుని తలచుకొన్నాడు. (18) దత్తాత్రేయుడు స్మర్తృగామి (= తనను తలచుకొన్న వారివద్దకు పెడతాడు) అని విన్నకథ పరీక్షించటానికి అతడు దత్తాత్రేయుని స్మరించాడు. మరుక్షణంలోనే దత్తాత్రేయ యోగీంద్రుడు ప్రత్యక్షమయ్యాడు. (19) దలాదన మహాముని ఆయనను చూచి ఆశ్చర్యసంతోషాలతో పూజించాడు. ఎదుటకూర్చున్న ఆయనతో ఇట్లనెను -(20) దత్తాత్రేయ మహాముని! నా ఆహ్వానం విని విచ్చేశావు..


No comments:

Post a Comment