Monday 9 October 2023

శ్రీదత్త పురాణము (281)

 


నీవు స్మర్తృగామివి అని జనులనుకొనే మాట పరీక్షించాలని (21) నిన్నిప్పుడు స్మరించాను. నా ఆపరాధం క్షమించు" అన్నారు. దత్తాత్రేయుడు మునితో ఇట్లు పలికెను - "నా ప్రకృతి ఇటువంటిది. (22) భక్తిలేకుండి కాని, మంచి భక్తి ఉండి కాని, అన్యాలోచన లేకుండా నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారు కోరినవి ఇస్తాను" అని చెప్పాడు. (23) (మళ్ళీ) దత్తాత్రేయుడు దలాదనమునీశ్వరునితో "నీకేది ఇష్టమయితే అది కోరుకో నీవు తలుచుకొన్నందున వచ్చాను కదా" అన్నాడు. (24) ముని దత్తాత్రేయునితో " మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సలో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది యగు దానిని నాకు ప్రసాదింపుము" అన్నాడు. (25)

 

శ్రీ దత్తాత్రేయుడు "నా వజ్రకవచం ఉన్నది. తీసుకో" అని మునితో అన్నారు. అలాగే అని అంగీకరించాడు దలాదనముని. ఆయనకు (26) దత్తాత్రేయుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషిని, చందస్సునూ ముందుగా చెప్పి న్యాసం, ధ్యానం, దాని ప్రయోజనం అంతా వివరించి చెప్పాడు. (27)

 

ధ్యానమ్

 

జగత్తు అనే మొక్కకు దుంప (నేరు) వంటివాడు, సత్ చిత్ ఆనందమూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. (1) ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నుడు అయి పిశాచంలా ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష వారి స్వరూపుడు, భోగమోక్ష ప్రదాయకుడు. (2) ఆయన ప్రతిదినము వారణాసి (కాశీ) పురంలో స్నానం చేస్తాడు. కొల్హాపురంలో జపం చేస్తారు. మాహురీపురంలో భిక్షతో భోజనం చేస్తాడు. సహ్య పర్వతంపై దిగంబరుడై శయనిస్తాడు. (3) ఆయన ఆకారం ఇంద్రనీలమణిలా ఉంటుంది. ఆయన కాంతి వెన్నెలలా ఉంటుంది. ఆయన చిరుజడలు కదులుతూ వైడూర్యంలా మెరుస్తూ ఉంటాయి. (4) ఆయన కన్నులు తెల్లగా ఉండి మైత్రిని కలిగి ఉంటాయి. ఆయన కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. ఆయన కనుబొమ్మలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ, నల్లగా ఉంటాయి. ఆయన ముఖం చంద్రునిలా ఉంటుంది. (5) ఆయన నవ్వు పొగమంచును తిరస్కరించేంతటి చల్లగా ఉంటుంది. సొగసైన కంఠం శంఖాన్ని మించిపోయింది. ఆయన భుజాలు పుష్టిగా ఉంటాయి. పొడవైన బాహువులుంటాయి. ఆయన చేతులు చిగుళ్ళను మించి కోమలంగా ఉన్నాయి

No comments:

Post a Comment