Monday, 3 September 2012

సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?

part-15

Should be read by youth especially.


సంప్రదాయ దుస్తుల వెనుక ఉన్న సైన్స్ ఏమిటి?
ముందు శరీర నిర్మాణం గురించి ఓ విషయం తెలియాలి. మగవారి శరీరనిర్మాణంలో వృషణాలు (టెస్టిస్) ముఖ్యమైన భాగాలు. అవే సంతానోత్పత్తికి, ఓజస్సు శక్తికి కారణమైన వీర్యాన్ని ఉత్పత్తి చేసి, తమలో దాచుకుంటాయి. వాటి ఉష్ణోగ్రత శరీరసాధారణ ఉష్ణోగ్రతకన్న 2 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అవి తక్కువ ఉష్ణోగ్రతలో మాత్రమే వీర్యకణాలను ఉత్పత్తి చేయగలుగుతాయి. ఉష్ణోగ్రత పెరిగితే ఉత్పత్తిపై ప్రభావం చూపి, వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుంది. ఉష్ణోగ్రత మరీ పెరిగితే ఉత్పత్తి పూర్తిగా నిలిచిపొయే ప్రమాదం ఉంది. నపుంసకత్వం వస్తుంది. ఒకవేళ ఉత్పత్తి జరిగినా ఫర్టిలిటి అతి తక్కువగా ఉంటుంది.

బిగుతగా (టైట్ గా) ఉండే బట్టలు వేసుకోవడం చేత శరీర ఉష్ణొగ్రత పెరుగుతుంది. ముఖ్యంగా లోదుస్తులు (Inner wear) బిగుతుగా ఉంటుంది కనుక వృషణాల ఉష్ణోగ్రత అసాధారణంగా పెరుగుతుంది. ఫలితంగా వీర్యకణాలసంఖ్య తగ్గిపోతుంది. మనం వేసుకునే జీన్స్ ప్యాంట్స్ బాగా దళసరిగా ఉంటాయి. గాలిని వాటిలోనుండి శరీరానికి తగలడం ఆసాధ్యం. వేసవిలో ఇది అనుభవమే. అందువల్ల వృషణాల ఉష్ణొగ్రత మరింత పెరుగుతుంది. ఫలితం మరింత వీర్యోత్పత్తి తగ్గిపోవడం, సంతానసామర్ద్యం దెబ్బతింటుంది.

అక్కడితో ఆగదు. ఈ కారణంగా జన్యువుల్లో (genes) లోపం ఏర్పడుతుంది. అది తరువాతి తరలవారిలో కూడా కోనసాగుతుంది. వారి వంశం మొత్తం ఆ లోపంతో బాధపడుతుంది. గత కొంతకాలంగా జరిగిన పరిశోధనలో తేలిందేంటంటే అంటే గత 20 సంవత్సరాలుగా వీర్యకణాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందట.     

ఈ విషయం తెలిసిన మన మహర్షులు, వాటి ఉష్ణోగ్రత పెరగకుండా ఉండటానికి పంచె మాత్రమే సరైనదని పరిశోధించి, దానినే మాత్రమే కట్టుకోమన్నారు. పంచె బిగుతుగా ఉండదు, వదులుగా ఉంటుంది. అందునా నూలు (కాటన్) పంచె వల్ల శరీర మరియు వృషణాల ఉష్ణోగ్రత పెరగకుండా ఉంటుందని, అది తెల్లది ధరించడంవల్ల వేడిని తిప్పికొట్టి శరీరాన్ని కాపాడుతుందని, చల్లగా ఉంచుటానికి దోహదపడుతుందని కేవలం పంచె మాత్రమే కట్టుకోవాలని శాసనం చేశారు.

ఇక స్త్రీల విషయంలో కూడా ఇంతే. బిగుతగా ఉండేవి, దళసరివి (జీన్స్ లాంటివి) కట్టుకోవడం చేత అండ విడుదల సమయంలో సమస్యలు వస్తాయి, సంతాన సమస్యలు విపరీతంగా వేదిస్తాయి. లెగిన్స్ లాంటివి ధరించడంచేత తొడల్లో రక్తప్రసరణ సక్రమంగా సాగదని తాజాగా జరిపిన పరిశోధనలో తేలింది. అంతేకాదు స్త్రీలకు సంబంధించి నెలసరి వంటి అనేకానేక సమస్యలకు మూలకారణం ఈ ఫ్యాషన్ దుస్తులేనట.. ఇంకా చెప్పలాంటే గర్భంధరిచే అవకాశాలు పూర్తిగా కోల్పోయినా ఆశ్చర్య పోనవసరంలేదు అని వైద్యులు అంటున్నారు..

ఇది కూడా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే తెలిసిన మహర్షులు చీర మాత్రమే కట్టుకోవాలని నియమం పెట్టారు. అందుకే ఆ కాలంలో సంతానసాఫల్య కేంద్రాలు లేవు. ఫ్యాషన్ పేరుతోనో, స్వేచ్చ అని చెప్తూనో, నాగరికం అని మనం ఈ విదేశిదుస్తులను ధరిస్తున్నాం. మన పిల్లలకు చిన్న వయసునుండే ఈ వస్త్రాలు వేసి వారికి తీరని ద్రోహం చేస్తున్నాం.

అలాగే వేదం ఒక్కసారి ఒక బట్ట కట్టుకుంటే దాన్ని ఉతకకుండా మళ్ళి కట్టుకోరాదని చెప్పింది.ఎందుకంటే మన శరీరం ద్వారా వచ్చిన చెమటలో సూక్ష్మక్రిములు మన ధరించిన వస్త్రాలకు అంటుకుంటాయి. స్నానం తరువాత విప్పిన బట్టలే మళ్ళీ ధరిస్తే రోగాలు వస్తాయని ఆయుర్వేదంతో పాటు నేటి ఆధునిక పరిశోధనులు తెలుపుతున్నాయి.

వేదం ఏమి చెప్పిన నిజమే చెప్తుంది. కఠినంగా అనిపించినా అనేకానేక కారణాలు ఉంటాయి వేద వచనం వెనుక.

To be continued .................

No comments:

Post a Comment