part-32
~ గణేశుడు,గణపతి అంటే ఎవరు?
~ "గణశబ్ధ సమూహన్య వాచకః పరికీర్తితః","గణానాం పతిః గణపతిః".సర్వదేవతలకు,దానవులకు,మానవులకు అధ్యక్షుడు ఎవరో,అన్ని గణాలకు ఈశ్వరుడెవరో అతనే గణేశ్వరుడని,గణపతి అని అర్దం.అందరికి అంటే సర్వేశ్వరుడైన పరమశివుడికి కూడా గణపతి ఈశ్వరుడు.
~"గణానాం జీవజాతానాం యః యీశః స్వామి సః గణేశః".సర్వగణాలకు,జీవరాశికి ఈశ్వరుడు గణేశుడు.
~"యే ప్రకృత్యాదయో జడా జీవాశ్చ గణ్యంతే సాంఖ్యాంతే|
తేషామీశః స్వామీ గణేశః||"
ఈ మొత్తం ప్రకృతిలొని చరాచరాత్మక(కదిలేవి,కదలని వాటితో ఏర్పడిన)సృష్టి మొత్తం(ఉన్నది ఉన్నట్లుగా)ఎవరిచే లెక్కించబడుతుందో(గణింపబడుతుందో),ఎవరిచే పాలింపబడుతొందో ఆయనే గణపతి.అంటే మనం ఉన్నాము లేదా ఒక వస్తువు ఉంది అంటే దానికి ఒక నాయకుడు(ఈశ్వరుడు)ఉన్నాడు.ఆయనే గణపతి.
~ "గణ్యంతే బుధ్యంతే తే గణాః".మనకు కనిపించే ఈ దృశ్యరూప ప్రకృతి అంతా గణమని,దానికి అధిష్టాత,అధినాయకుడు పరబ్రహ్మ అని,ఆ పరబ్రహ్మమే గణపతి అని శాస్త్రము.
~ "జ్యేష్టరాజం బ్రహ్మణాం" అని అంటే బ్రహ్మకంటే పెద్దవాడని.
~ ఒక్క వినాయకుడి గురించి మనం మాట్లాడుకుంటే సమస్త విశ్వంగురుంచి మాట్లాడుకున్నట్టు.ఒక్క వినాయకుడిని ధ్యానిస్తే సమస్త దేవతలను,యక్షులను,కిన్నెరులను,కింపురుషులను,గంధర్వులను,అండపిండబ్రహ్మాండాన్ని,అనంతమైన విశ్వాన్ని ధ్యానించినట్టే.గణపతి గురించి తెలుసుకోవడమంటే ఈ సృష్టి గురించి తెలుసుకొవడమే.
~ అటువంటి గణపతిని వర్ణించడం,ఆయన గురించి వివరించడం కష్టమని మన శాస్త్రాలు చెప్తున్నాయి.
~ ఇంతగొప్ప గణపతికి ఒక చిన్న బెల్లం ముక్క నైవెద్యంగా సమర్పిస్తే స్వామికి మహానందం.మనం రోజు చిన్న బెల్లం ముక్క తింటే ఆరోగ్యానికి మంచిదని,మన ఆరోగ్యం కోసం ఆయన బెల్లం ముక్క సమర్పించమన్నాడు.
to be continued...........
No comments:
Post a Comment