part-31
~ వినాయకచవితి వినాయకుడి పుట్టినరోజా?
~ చాలా మంది అనుకున్నట్టు వినాయక చవితి వినాయకుడి పుట్టిన రోజు కాదు.వినాయకుడు అనాది.ఆయనే పరబ్రహ్మం.శివపార్వతుల వివాహసమయంలో గణపతి ఆరాధన చేశారు అంటే అప్పటికే గణపతి ఉన్నాడని అర్దం అవుతోంది.బ్రహ్మ సృష్టిని ప్రారంభించేముందు వినాయక ఆరాధన చేశాడు.అప్పుడు వినాయకునకు రూపం లేదు.ఓంకారమే వినాయకుడి రూపం.ఓంకారం ప్రణవం.ఓంకారాన్ని(గణపతిని) ధ్యానించాకే బ్రహ్మ దేవునకు సృష్టి ఆరంభంలో ఎదూరైన విఘ్నాలు తొలగిపొయయట.అందుకే "జ్యేష్టరాజం బ్రహ్మణాం" అని వేదం చెప్తుంది వినాయకుడి గురించి.ఆయను వేదం "బ్రహ్మణ్స్పతి"గా వర్నించింది.ఆయనే వాక్ స్వరూపం అన్నది వేదం.
~ సృష్టి ఆరభంలో మొట్టమొదటగా ఉద్భవించింది ఓంకారమే.ప్రతి మనిషి పుట్టిన వెంటనే ఏడ్చే ఏడుపును బాగా జాగ్రత్తగా గమనిస్తే ఓంకారమే వినపడుతుందట.అంటే మనం మొదటగా పలికింది మన గణపతినే మరి.
~ దేవ,మానవులకు మంచి నడవడిక ఉండాలంటే ఒక నాయకుడవసరం అని గమనించి,ఏలాంటి రూపంలేని స్వామి,ఒక రూపాన్ని పొందింది భాద్రపద శుద్ధ చవితి నాడు.అందువల్ల ఇది వినాయకుడు అవతరించిన రోజు కాని పుట్టిన రోజు కాదు.
~ వినాయకుడంటే ఈయనకు వినా వేరే నాయకుడు లేడని అర్దం.ఎవరిని అనుసరించడం వల్ల మంచి నాయకుడవుతారొ,విఘ్నాలు తొలగుతాయొ అతనే ప్రియపతి,గుణపతి,గణపతి.
~ ఒక స్త్రీ గర్భం ధరించింది,అది నిలిచింది అంటే గణపతి అనుగ్రహం ఉంది అని అర్దం.ఓం గర్భాధారాయ నమః.మనం మన తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకు మన అమ్మకు బంధం ఏర్పరిచి,మనకు తల్లి గర్భంలోనే బయట ప్రపంచానికి సంబందించి జ్ఞానం ప్రసాదించింది గణపతే అని "ఓం గర్భవాసిశిశుజ్ఞానప్రదాయ నమః" అనే నామ చెప్తోంది.అలాగే జలములకు అధిపతి అయి,తల్లి గర్భంలో పెరుగుతున్న పిండాన్ని కాపాడేవాడు గజముఖుడు.ఇవ్వాళ మన బ్రతికిబట్టకడుతున్నామంటే అది ఆయనె దయే మరి.అందుకే వినాయకుడికి పిల్లలంటే చాలా ఇష్టం(మనం వయసుతో సంబంధం లేకుండా మన అమ్మకు ఎప్పుడు పిల్లలమే).పిల్లలకు ఆయనే అంటే మహా ఇష్టం.ఇక్కడ పిల్లలు అంటే కేవలం హిందువలని మాత్రమె కాదు.అందరూ ఆయనే పిల్లలె,ఆయనచే కాపాడబడుతున్న వారె.వారు పూజించినా,పూజించకున్న ఆయన కర్తవ్యం సక్రమంగా నిర్వర్తిస్తాడు వినాయకుడు.చెప్పుకోవాలంటే చాలా ఉంది వినాయకుడి గురించి.
~ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు.
to be continued...........
No comments:
Post a Comment