Saturday, 8 September 2012


part-20
~ ఈ కాలంలో మన ఇంటికి ఎవరైనా అతిధులు వస్తున్నారంటే మనం రూంఫ్రెష్నర్లు కొడుతున్నాం.అవి చేతి మీద పడ్డా,తినే వస్తువుల్లో పడ్డా ఆరోగ్యానికి మంచిది కాదు.మన పూర్వీకులు ధూపం వేసేవారు.ధూపానికి చాలా విశిష్టత ఉంది.ఆయుర్వేదం ప్రకారం ధూపం వేయడం వల్ల గాల్లో ఉన్న క్రిములు నశిస్తాయి.అలాగే మనకు రోగనిరొధక శక్తి పెరుగుతుంది.
 
  ఈ మధ్య జాన్స్ హోప్ కిన్స్ మరియు హెబ్రివ్ విశ్వవిద్యాలయాలవారు ధూపం మరియు అగరుబత్తి వెలిగించడం మీద పరిశోధన చేశారు.రోజు ధూపం వాసన పీల్చడం వల్ల మానసికారోగ్యం చేకూరుతుందని,మెదడు ఉత్సహంగా పనిచేస్తుందని,కుంగుబాటు(డిప్రెషన్)కు గురయ్యే అవకాశాలు చాలా తగ్గిపొతాయని తమ పరిశోధనలో తెలిందని వివరించారు. ఈ వివరాలను ఈ పరిశోధనకు సంబంధించిన బృందానికి నాయకుడైన రాఫెల్ అమెరికా వారి పత్రికకు చెప్పడం,అది అమెరికా పత్రికల్లో రావడం జరిగింది.

  అగరుబత్తిలో ఆవుపేడ వాడతారు.ఆవుపేడను కాల్చడం చేత ఆ ప్రాంతంలో సూక్ష్మక్రిములు నాశనమవడంతో పాటు ఆక్సిజెన్(ప్రాణవాయువు)విడుదలవుతుంది.
 
  ధూపం ఇంట్లో ఉన్న దుష్టశక్తులను తరిమివేస్తుంది.అందుకే మన అన్ని కార్యక్రమాల్లో ధూపానికి అంత ప్రాధాన్యం.మన ఇంటికి వచ్చిన అతిధికి ఆరోగ్యం చేకూరాలని,అతన్ని ఆవహించి ఉన్న నెగిటివ్ శక్తులు దూరంగా పోవాలని ఇంటికి అథిదులు వచ్చినప్పుడు ధూపం వేసేవారు.మన ఆరోగ్యం కోసం నిత్యం పూజల్లో వాడేలా చేశారు. అదే "ధూపమాగ్రపయామి".

~ అతిధులు ఇబ్బందిపడుతున్నారేమొ అని ఇంకో లైట్ వేయాలా అని అడుగుతాం కదా.మనం కరెంట్ లైట్ వేస్తే వారెమో దీపం వెలిగించేవారు.మనం వెంటనే అంటాం అప్పుడు కరెంట్ లేదు కనుక దీపం వెలిగించారని.అది మన అపొహ.యజుర్వేదంలొ(24-15-19)కరెంట్ గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే సౌరవిద్యుత్తు,తోకచుక్కలు,కొన్ని రకాల వృక్షాల నుండి విద్యుత్తును వెలికితీసే విధానం గురించి చెప్పబడింది.

 రౌద్రీ భాస్వంతు సంయోగాజ్జాయతే మారికాభిదా|
 విషశక్తిస్తయా సూర్యకిరణాశని సంభవం||
   
 ఇదిగో పైన చెప్పబడ్డ శ్లొకంకూడా అలాంటిదే.అంతేకాదు మనం దీపంలో ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె వాడతాం కదా.ఆవునేయి కాల్చడం చేత ఆ వాసన లేదా గాలి ఎంత దూరం వ్యాపిస్తుందో,అంతదూరంవరకు సూక్ష్మక్రిములు నాశనమవుతాయని రష్యన్ల పరిశోధనలో తెలింది.దీపం కాలిన తరువాత దాని నుండి కార్బన్ అణువు విడుదల అవుతుంది.అది ఆ ప్రాంతంలో ఉన్న తేమను పీల్చేసి సూక్ష్మక్రిములు పుట్టకుండా చూస్తుంది.దీపపు కిరణాలు ఆ గదిలో ఉన్న అయస్కాంత తరంగాలు(మెగ్నటిక్ వెవ్స్) ద్వారా మన శరీరంలొకి ప్రవేశించి నాడులను శుభ్రపరిచి,మరింత లొపలికి ప్రవేశించి రక్తశుద్ధి చేస్తుందని కొంతమంది విదేశిశాస్త్రవేత్తల పరిశోధన వివరాలు.ఈ విధంగా చెప్పుకుంటూపోతే దీపం మీద ఎన్నొ గ్రంధాలు రాయచ్చు.అందుకే మన ధర్మశాస్త్రాలు దీపారధన రోజుకు రెండుసార్లు తప్పక చేయాలని మన ఆరొగ్యం కోసమని శాసనం చేశాయి(మరిన్ని విశేషాలు తరువాత చెప్పుకుందాం).  

 అందువల్ల వచ్చిన అతిధికి ఆరోగ్యం చేకూరాలని,సూక్ష్మ క్రిములు నాశనమవ్వాలని,గాలి శుద్ధి జరగాలని దీపం వెలిగించి పెట్టేవారు.అదే "దీపం దర్శయామి".  

మిగిలన ఉపచారాలు మళ్ళీ చెప్పుకుందాం.
   
to be continued...............
                     

No comments:

Post a Comment