part-19
~ ఇంటికివచ్చిన అతిధి ఎంతో శ్రమపడి వచ్చాడు.అలసిపోయి ఉంటాడు,శరీరమంతా చెమటపట్టి సూక్ష్మక్రిములు చేరిఉంటాయి. కనుక అతను స్నానానికి ఏర్పాట్లు చేస్తాం కదా.అదే "స్నానం సమర్పయామి".
~ స్నానం చేయగానే త్రాగడానికి నీరు ఇచ్చేవారు.స్నానం చేయగానే నీరు తాగితే బి.పి.అదుపులొ ఉంటుంది.స్నాన సమయంలో స్నానపుగదిలో ఉన్న క్రిములు మన శ్వాస ద్వారా నొట్లోకి చేరుతాయి.కనుక నోరు శుభ్రపరుచుకోవడానికి నీరు ఇచ్చి తరువాత త్రాగడానికి నీరు ఇచ్చేవారు.అదే "స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి".
~ వచ్చినవాడు,వాడి బట్టలు కట్టుకోవడం కాదు మనం ఇచ్చినవి కట్టుకొవాలని మన పూర్వీకులు భావించారు.అందుకే వచ్చిన వాడికి చేనేత నూలు వస్త్రాలు సమర్పించేవారు(చేనేతవే ఎందుకు సమర్పించాలో 14,15 భాగాల్లొ చెప్పుకున్నాం కదా).అదే "వస్త్రం సమర్పయామి".
~ తదుపరి యజ్ఞోపవీతం ఇచ్చేవారు(వేదకాలంలో కులాలు లేవు.స్త్రీ పురుషులందరూ కూడా యజ్ఞోపవీతం ధరించేవారు,గాయత్రి జపం చేసేవారు).ఇంకో అర్దం వచ్చిన వారితో కలిసి కూర్చొని యజ్ఞం చేయడం.గత 5000 సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిఒక్కరు యజ్ఞం చేసేవారని చరిత్రకారుల పరిశోధనలో తేలింది.అలాగే యజ్ఞం మీద జరిగిన అన్ని పరిశోధనల్లొ అద్భుతమైన విషయాలు తెలిశాయి.అందువల్ల జెర్మని,ఫ్రాన్స్ లాంటి దేశాల్లో నిత్యం యజ్ఞం చేసి దాని బూడిదను అక్కడ పంటపోలాల్లొ ఎరువుగా వాడే కొంతమంది విదేశీయులు సైతం ఉన్నారు."ఈ ప్రపంచాన్ని కాలుష్యం,భూతాపం(గ్లొబల్ వార్మింగ్),భయంకర రోగాలనుండి కాపాడగల శక్తి ఒక్క యజ్ఞానికి మాత్రమే ఉందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతొ మంది గొప్ప శాస్త్రవేత్తలు ఘంటాపదంగా చెప్తున్నారు". అనేకానేక ఆధారాలతో సహా నిరూపించి చూపించారు.విశ్వకల్యాణం కోసమని యజ్ఞం రోజుకు రెండు సార్లు యజ్ఞం చేసేవారు.వచ్చిన వారిని కూడా భాగస్వాములుగా చేశారు.అదే "యజ్ఞొపవీతం సమర్పయామి".
~ వచ్చిన వారికి మంచి వాసన రావాలని,వారికి చల్లగా ఉండాలని గంధం పెట్టుకోమని ఇచ్చేవారు.అదే "గంధం సమర్పయామి".
~ ఈ కాలంలో మనం ఎవరైనా ఇంటికి వస్తే ఏమి ఇవ్వాల్సివస్తుందో అని భయపడుతున్నాం.కాని వేదకాలంలో వచ్చిన వాడికి(ఎవరైనా సరే) వజ్రవైడుర్యాలు,మరకతమణులు,నవరత్నఖచిత ఆభరణాలు బుట్టలు బుట్టలుగా ఇచ్చేవారు.వాడికి ఆనందాన్ని కలగచేసేవారు.ఇది ఆ కాలంలో మన దేశ సంపదను మనకు తెలియపరుస్తొంది.అదే "ఆభరణం సమర్పయామి".
~ మనకు ఇవాళ అంత సంపద ఉందా?భగవంతుడు ఆభరణమే అడగలేదు.ఆభరణాలకు బదులు అక్షతలు ఇవ్వండి చాలు అన్నాడు.అందుకే 'ఆభరణార్దం అక్షతాన్ సమర్పయామి".
~ మనం దేవుడికని సమర్పించేపూలల్లో చాలా పూలకు ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన గుణాలు,సూక్ష్మక్రిములను నాశనం చేయగల శక్తితోపాటు వ్యాధినిరోదక శక్తిని పెంపొందించే శక్తికూడా ఉంది.పూలు తలలొ పెట్టుకుంటే తలలో ఉన్న వేడిని తీసివేస్తాయి.వాటి వాసన కూడా గాలిలొ ఉన్న సూక్ష్మక్రిములను నాశనం చేస్తుంది.అందుకే వచ్చిన వారికి పూలు ఇస్తాం.అదే "పుష్పం సమర్పయామి".
~ మిగితా ఉపచారాలు మళ్ళీ చెప్పుకుందాం.
to be continued........
No comments:
Post a Comment