Monday, 10 September 2012


part-22
~ సాముహికగణేశ ఉత్సవాలు సనాతనమా?ఆధునికమా?
~ చాలా మందిని వేదించే ప్రశ్న ఇది.నిజానికి సాముహిక గణేశ ఉత్సవాలు సనాతనమూ కాదూ,ఆధునికమూ కాదూ."కలౌకపి వినాయకౌ","కలౌ చండి వినాయకౌ","కలౌ వేంకటనాయకః"అని శాస్త్రాల్లొ కనిపిస్తుంది.అంటే కలియుగంలో త్వరగా ప్రసన్నమయ్యే దేవతలు,అధికంగా పూజింపబడేవారు వినాయకుడు,చండి(అమ్మవారు),హనుమంతుడు,వేంకటేశ్వరస్వామి.వీరిలో వినాయకుడి పేరు రెండుసార్లు చెప్పింది శాస్త్రం.అంటే వినాయకుడు ముఖ్యుడు అని అర్దం.

~ కలియుగంలో మానవులు మందబుద్ధులుగా,తెలివిలేని వారుగా ఉంటారని మన పురాణాల్లొ కనిపిస్తోంది.లేని కులాల పేరుతో,మతాల పేరుతొ నిరంతరం గొడవపడుతుంటారు.వేదవిద్యకు దూరం అవుతారు.విద్యాప్రదాతైన వినాయకుడు కులమతాలకు అతీతంగా అందరి నోట వేదమంత్రాలను చదివించడానికి ప్రతి వీధికి వస్తానని,ఎక్కడ పడితే అక్కడ కూర్చోని అందరికి జ్ఞానాన్ని ప్రసాదిస్తానని,అందుకే ప్రతి సంవత్సరం వస్తానని అన్నాడు.బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వీధి వీధికొ వినాయకుడు వచ్చి,కులమతాలకు అతీతంగా వేదవిద్యను అందరి నోట పలికిస్తాడని చెప్పారు.

~ మరాఠాల ఇలవేల్పు వినాయకుడు.స్వాతంత్ర్య పోరాటంలో కులాల వారిగా విడిపొయిన హిందువుల మధ్య సఖ్యతను పెంచడానికి బాలగంగాధర్ తిలక్ గారి ద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది.అంతకు ముందే రావచ్చు కదా అంటే కలియుగం మొదలైన 5000 సంవత్సరాల తరువాత నీటి కరువు వస్తుందని చెప్పబడింది.మనం ఇప్పుడు 5113 సంవత్సరంలో ఉన్నాం.సరిగ్గా 119 సంవత్సరాలకు పూర్వం ఈ సాముహిక ఉత్సవాల ప్రారంభం జరిగింది.కలియుగంలో నామజపం వల్లనే మొక్షం లభిస్తుందని,అందువల్ల అందరికి ముక్తిని ప్రసాదించడానికి గణపతి వీదుల్లొకి వస్తున్నాడు.అంతేకాదు అందరు కలిసి భజన,నామజపం,సంగీతకచేరి లాంటివి చెయ్యడం వల్ల వర్షాలు సమృద్దిగా కురుస్తాయి.ఇదేంటి?మేము నమ్మము అంటారా?అయితే ఇది చదవండి.

~ 1982లో అక్టోబరులో మద్రాసులో విపరీతమైన నీటికొరత ఏర్పడింది.దాంతో ప్రభుత్వం,ప్రముఖ వయోలిన్ విద్వాంసుడైన శ్రీ కునకోడి వైద్యనాధన్ గారిని సంగీతం ద్వారా వర్షం కొరకు ప్రార్ధించమని అడిగింది.ఆయన మద్రాసు నగరానికి మంచినీరు సర్ఫరాచేసే రెడ్ హిల్స్లో మోకాలు లోతు నీటిలో నిలబడి వర్షాన్ని ప్రేరేపించే కొన్ని ప్రముఖరాగాలను ఎన్నుకొని,ఆలపించటం జరిగింది.కొన్నిరోజులు మేఘాలు కనిపించినా వర్షం కురవలేదు.9వ రోజు కొద్దిగా వర్షం పడింది.15 రోజుల తరువాత మంచి వర్షాలు కురిశాయి.తరువాత ఆయన దాని గురించి వివరణ ఇవ్వడం జరిగింది.వేదాల్లొ ఇలాంటి అనేకానేక మేఘమధనాల గురంచి వివరించారు.

~ మరి కొంతమంది మతప్రచారం కోసం వినాయకుడిని వీధుల్లొకి లాగారని అంటున్నారు.అది వారి మూర్ఖత్వమే అవుతుంది.దైవసంకల్పం లేనిదే ఏలా సాధ్యమవుతుంది?స్వామి వివేకానందుడితో ఒక విదేశియుడు అన్నాడు,మీరు చెప్పిన మాటలు విని మీ హిందూ ధర్మం గురించి తెలుసుకోవాలని,అందులోకి మారాలని నేను ఏన్నొ ఉత్తరాలను రాశాను.నాకు ఒక ఉత్తరానికి కూడా జవాబు రాలేదు.అదే ఇతర మతాలవారయితే ఒక్క ఉత్తరం రాయాగానే ఇంటికి అనేకానేక పుస్తకాలను పంపుతారు.మతాన్ని విస్తరించుకుంటారు.మీరు ఎందుకు అలా చెయ్యరని అడిగాడట.దానికి బదులుగా స్వామి అన్నారు మీరు చెప్తున్న ఆ మాతాలు ప్రచారం మీద ఆధారపడ్డాయి.ప్రచారం ఆగిపొయిన మరుక్షణమే అవి ఉనికిని కోల్పోతాయి.కానీ మా ధర్మం ఆచరణ మీద ఆధారపడింది.కొన్ని కోట్లమంది హిందువులు ఈ ధర్మాన్ని ఆచరిస్తున్నారు.మా ధర్మం ఏ ప్రచారం లేకుండానే ఆచరణవల్ల మాత్రమే ఇన్ని వేల సంవత్సరాలుగా కొనసాగుతొంది అన్నారట.

~ మనం ప్రతిష్టించే విగ్రహాలను వికృతంగా తయారు చేయడం,ప్లాస్టెర్ ఆఫ్ పారిస్,రసాయన రంగుల విగ్రహాలను పూజించడం,పర్యావరణాన్ని కలుషితం చేయడం లాంటివి గణపతిని అవమానపరచడమే అవుతుంది.అందుకే పర్యావరణ హితకరమైన విగ్రహాలనే పూజిద్దాం.

~ నిమజ్జనం వెనుక ఉన్న అర్దం ఏమిటి?
to be continued.........

No comments:

Post a Comment