Monday, 21 July 2014

హిందూ ధర్మం - 102 (హిందు పదానికి చారిత్రిక ఆధారాలు)

హిందు పదం క్రీస్తు పూర్వమే వాడుకలో ఉందనడానికి కొన్ని ఆధారాలు లభించాయి. పర్షియా రాజు డరియస్ (Darius) హమదాన్ (Hamadan) , పెర్సెపోలిస్ (persepolis) మొదలైన శాసనాల్లో తన రాజ్యంలో 'హిదు'(Hidu) కూడా అంతర్భాగమని ప్రకటించినట్లు కనిపిస్తుంది. ఇది హిదు (హిందు) అన్న పదం క్రీ.పూ 450-500 ఏళ్ళకు ముందే ఉందని నిరూపిస్తోంది. డరియస్ (darius) వారసుడైన జెరిసెస్ (Xerexes) శాసనాల్లో అతని క్రింద పాలించబడిన రాజ్యాల ప్రస్తావన కనిపిస్తుంది. అందులో కూడా హిదు అనే ప్రాంతం ఉంది. ఈ శాసనం క్రీ.పూ.400-450 కి సంబంధించినది. ఇయం కటగువియ (ఇది సత్యగిదీన్), ఇయం గధారియ(ఇది గాంధార ప్రాంతం), ఇయం హిదువియ (ఇది హిందు ప్రాంతం) అంటూ ఈ మూడు పదాలు పెర్సెపోలిస్‌లోని ఒక పురాతన టూంబ్‌లో ఉన్నాయి. అట్లాగే అశోకుడు తన శాసనాల్లో భారతీయులను హిదువులని, భారత్‌ను హిదాలోకమని పదేపదే ప్రస్తావించాడు. ఈయన క్రీ.పూ.3వ శతాబ్దం వాడు. అశోకుడి శాసనాల్లో దాదాపు 70 సార్లు హిదా అనే పదం, దాని వ్యుత్పత్తులు కనిపిస్తాయి. 'ఈ ప్రజలంతా నా వాళ్ళే. నా ప్రజలు సుఖసంతోషాలతో ఉండలని నేను ఆశిస్తున్నాను. హింద్ ప్రజలు, మిగితా ప్రజలందరు బాగుండాలి' అని అశోకుడు తన శాసనాల్లో రాసుకున్నాడు.

పెర్సెపోలిస్‌లోని షాహపూర్‌ (Shahpur) కు చెందిన క్రీ.శ.310 కు చెందిన పహ్లవి(Pahlavi) శాసనాల్లో (inscriptions) అక్కడికి రాజుకు శకన్‌షాహ్ హింద్ శకస్థన్' అని, మంత్రులకు కూడా అదే విధమైన బిరుదులు ఉన్నాయని చారిత్రిక ఆధారాలు తెలుపుతున్నాయి. పైన చెప్పుకున్న చారిత్రిక ఆధారాలు హిందు అనే పదం కనీసం క్రీ.పూ. 1000 నుంచి 5000 ఏళ్ళకు పూర్వం నుంచి ఉన్నదని చెప్తున్నాయి.

జొరాస్ట్రియన్ మతస్థులకు సంబంధించిన అవెస్థ (పహ్ల్వి అవెస్థ/ Pahlavi avesta) గ్రంధంలో సప్తసింధుకు బదులుగా హప్తహిందు అనే పదం వాడినట్లు కనిపిస్తుంది. ఈ గ్రంధం క్రీ.పూ.1000 సంవత్సరాలకు ముందు నుంచి ఉంది. అట్లాగే వారి మతగ్రంధంలో వేదవ్యాస మహర్షి ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు జొరాస్ట్ర ఉండగా, గుస్తాష్ప్(Gustashp) అనే రాజు కొలువికి వెళ్ళినప్పుడు, తనను తాను పరిచయం చేసుకుంటూ 'నేను హింద్ అనే ప్రాంతంలో పుట్టాను' అని చెప్పుకుంటారు. వ్యాసుడు పుట్టింది భారత్‌లోనే, యమునా నది దగ్గర. గ్రీకులు కూడా హిందు పదాన్ని ఉచ్చరించే లోపంతోనే భారత్‌ను హిందూ అనబోయి, ఇండయో అన్నారు. ఈ ఇండయో అనే పదం గ్రీకు సాహిత్యంలో క్రీ.పూ. 5వ శతాబ్దానికే ముందు నుంచే ఉంది. గ్రీకులకు సరిగ్గా పలకడం రాక, అనేకమంది రాజుల పేరలను తప్పు పలికేశారు.

To be continued ...........

2 comments:

  1. అయ్యా అశోకుడు పాటించింది బౌద్ధ మతం, మీరు చెప్పిన శాసనాల లో ఈ శాసనాల లో ఈ వివరాలు ఉన్నాయో చెప్పండి,ఎందుకంటే నాకు చరిత్రలో హిందువులంటే ఎవరు ?అని తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను ,హిందువులు అంటే ఇప్పుడు ఉన్నట్టు అన్ని కులాలు అందులో ఉండేవా?లేక పోతే కేవలం కొన్ని కులాలే ఉండేవా?దయచేసి మీరు నాకు కొంచెం వివరంగా తెలియ చేయగలరు

    ReplyDelete
    Replies
    1. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత భౌద్ధం తీసుకున్నమాట వాస్తవమే. కానీ దానికి హిందు పదానికి సంబంధం లేదు. అప్పట్లో భారత్‌కు హింద్ అని ఒక పేరు. చరిత్రలో హిందువులు ఎవరు అంటే దానికి నా రాబోయే టపాల్లో మీకు సమాధానం లభిస్తుంది. ఇక కులాల విషయానికి వస్తే, అప్పటికి హిందు ధర్మంలో ఇన్ని కులాలు లేవు. నాలుగే వర్ణాలు ఉన్నాయి.

      Delete