ఇప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకోబోతున్నాం. ప్రపంచదేశాలకు పేరు పెట్టిన ఘనత భారతమాతకు, సనాతన హిందూ ధర్మానికే దక్కింది. ఇది భారతీయులు అత్యంత గర్వించదగ్గ అంశం. ప్రపంచవ్యాప్తంగా సనాతనధర్మం యొక్క ప్రభావం ఎంతగా ఉండేదో, ఈ విషయం తేటతెల్లం చెస్తోంది. ఎప్పుడో త్రేతాయుగంలో రామాయణం జరిగింది. దాన్ని వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో 300 పైగా రామాయణ గ్రంధాలు ఉన్నాయి. ఇవి అనువాదాలు కాదు సుమా! ఆయా దేశాల ప్రజలు, రామాయణంలో ఉన్న విలువలను, సనాతన హైందవ ధర్మం గొప్పతనాన్ని గుర్తించి, తమ దేశంలో రామాయణం రచించారు. రామాయణం ముందుగా ఆగ్నేయ-ఆసియా దేశాలకు తరళి వెళ్ళింది. ఇక్కడ ఓ గొప్పతనం ఉంది. ప్రపంచంలో ఇతర మతస్థులు, వారి మతగ్రంధాలను ఒక చేత, కత్తులను ఇంకో చేత పట్టుకుని, రక్తపాతం చేస్తూ, మతప్రచారాన్ని సాగించి, జనంలో అశాంతిని రగిల్పి శాంతిని ప్రభోదించారు. కానీ హిందువులు (భారతీయులు) ఆ పని ఎప్పుడు చేయలేదు. రామయాణ విలువలను గుర్తించి ఎన్నో దేశాల ప్రజలు, మన వాల్మీకి రామయణాన్ని తమ దేశాలకు తీసుకెళ్ళి, అక్కడి పరిస్థితికి అనుగుణంగా కొంత మార్పు చేసి, తరతరాలుగా భోధిస్తున్నారు.
కంబొడియా వారు రాంఖెర్ అని, థాయిల్యాండ్ వారు రాంకిన్ గా రాముడిని సంబోధిస్తున్నారు. ఇండోనేషియా, మయలేషియా, విటెనం, చైనీయులు, కొరియన్లు, జపనీయులు, మంగోలులు, సైబేరియా దేశస్థులు, టిబెట్, బర్మా, పాకిస్థాన్, నేపాల్, పురారన తుర్కుషులు, అరబ్బులు, పర్షియన్లను సంస్కృత రామాయణ స్పూర్తితో తమ తమ రామాయాణాలను రచించుకున్నారు.
ఒకప్పుడు థాయిల్యాండ్ రాజధాని పేరు అయుత్థయా (Ayutthaya) అని ఉండేది. శ్రీ రాముడు రాజధాని అయోధ్యా నగర స్పూర్తితో వారు తమ భాషలో ఆ పేరును పెట్టుకున్నారట. అట్లాగే రాముని కుమారుడు లవుని పేరుతో లవపురి అనే పురాతన నగరం ధాయిల్యాండ్‌లో ఉండేది. అప్పుడు ధాయి రాజు పేరు భూమిపాల్ అతుల్యతేజ్ రామ (ఇతను ఈ పేరుతో తొమ్మిదవ తరం వాడు). లాఓస్ (Laos) దేశం పేరు కూడా లవుడి పేరు నుంచి పెట్టారు అక్కడి రాజులు. బర్మ అన్న దేశం పేరు బ్రహ్మ అనే పదం నుంచి వచ్చింది. ఇక్కడ కూడా ఒకనాడు సనాతన హిందు ధర్మం ఉంది. ఇక వియట్నం పూర్వనామం చంపా. సింగపూర్ కూడా సంస్కృత పదం నుంచే వచ్చింది. దాని అర్దం సింహాల యొక్క నగరమని. ఇప్పటి ముస్లిం దేశం భ్రూనై రాజధాని పేరు బంఢార్ సెరి భగవాన్. బంఢార్ శ్రీ భగవాన్ అనే నామం నుంచి వచ్చిందే. ఇండోనేషియా రాజధాని జకర్తా పూర్వనామం జయ కర్త అంటే ఎప్పుడు జయాలను చేకూర్చేది అని అర్దం.
To be continued .........

No comments:
Post a Comment