కొందరు మాత్రం వస్తామనడంతో, వారిని తీసుకొని అడవిలో వెతకడానికి వెళ్ళాడు శ్రీ కృష్ణుడు. వారు వస్తున్నారు కాని వారికి శ్రీ కృష్ణుడి మీద నమ్మకం లేదు. గుర్రపు అడుగుజాడలను అనుసరించి వెళ్ళగా అక్కడ ప్రసేనుడి బట్టలు, ఎముకలు, రక్తపు మరకలు ఉన్నాయి. "చుశారా! నేను చంపానన్నారు. ఇక్కడ సింహపు అడుగుజాడలు ఉన్నాయి. వారిని సింహమే చంపింది. అందువల్ల ఎముకలే ఉన్నాయి కాని శరీరాలు లేవు. అది చంపి వారిని తినేసింది" అని కృష్ణుడాన్నాడు. అయితే వచ్చిన వారిలో కొందరు 'ఈయనే చంపి మణి తీసుకున్నాక, సింహం ఈ దారిన వచ్చినప్పుడు శవాలను తిని ఉంటుంది. మళ్ళీ ఒక కట్టుకధ అల్లుతున్నాడు. మహా మోసగాడు చుశారా' అన్నారు. ఇంకొక నీలాపనింద.
కాస్త ముందుకు వెళ్ళి చుస్తే అక్కడ ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. సింహం శవం ఉంది. ఎలుగుబంటి సింహాన్ని చంపి మణి ఎత్తుకుపొయింది. ఈ పాదముద్రలు పట్టుకొని వెళదాం అన్నాడు కృష్ణుడు. సింహం ఎలుగుబంటిని చంపుతుంది కాని ఎక్కడైన ఎలుగుబంటి సింహాన్ని చంపుతుందా? ఇది ఇంకొక కట్టుకధ అన్నారు ఆయనతో వచ్చిన వారు. మళ్ళీ అబద్దాలు ఆడుతున్నాడని నీలాపనిందలు వేశారు.
ఆ ఎలుగుబంటి జాంబవంతుడు. ఆయన 24 వ త్రేతాయుగంనాటి వాడు. కృష్ణుడు 28 వ ద్వాపరయుగం నాటి వాడు. త్రేతాయుగంలో రామసేతు నిర్మాణసమయానికే జాంబవంతుడు కడువృద్ధుడు. అంటే ఆయన వయసు చాలా ఎక్కువ. త్రేతాయుగంలో రామున్ని చూసిన జంబవంతుడు ఆయన సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. 'పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం' అని రాముడిని వర్ణిస్తాం. మగవారే మొహించేంతటి సుందరుడు శ్రీ రామ చంద్రుడు. అటువంటి రాముడిని గట్టిగా కౌగిలించుకొవాలి అని కోరిక పుట్టింది జాంబవంతుడికి. రామున్ని అడుగగా, ఈ అవతారంలో కుదరదు, రాబోయే కృష్ణావతారంలో అవకాశం ఇస్తానన్నాడు. ఆ జాంబవంతుడికే ఒక పిల్లవాడు పుట్టాడు. పేరు సుకుమారుడు. వాడి ఆహారం కోసమని అడవిలో తిరుగుతున్న జాంబవంతునకు శమంతకమణి నోట కరుచుకున్న సింహం కనిపించింది. ఆ మణి చూడడానికి బాగుందని సింహాన్ని చంపి ఆ మణిని తీసుకొని వెళ్ళి తన కూమారుడి ఉయ్యాలకు కట్టాడు. కళ్ళు మిరమిట్లుకొరిపే ఆ మణి ఒక పసిపిల్లవాడికి ఆట వస్తువంటే వారు ఎంత బలవంతులో అర్దం చేసుకోండి.
అంతా కలిసి ఆ ఎలుగుబంటి అడుగుజాడలను పట్టుకొని వెళ్ళగా, ఒక గుహలోకి వెళ్ళినట్టు ఆ అడుగుజాడల గుర్తులు ఉన్నాయి. కృష్ణుడు లోపలికి వెళ్ళి వెతుకుదాం అన్నప్పటికి వారు రాలేదు. రాకపోగా వచ్చినవారు కృష్ణుడు లోపలికి తీసుకువెళ్ళి చంపుతాడని, అందుకోసమే ఈ అడవిలో ఈ గుహ వద్దకు తీసుకువచ్చాడని అన్నారు. కృష్ణుడు 'ఒంటరి లోపలికి వెళతాను, బయట వేచి ఉండండి' అన్నా, తాము వేచి ఉండేది లేదని, ద్వారకకు తిరిగి వెళ్ళిపొయారు.
పడ్డ అపనింద తొలగించుకోవాలని కృష్ణపరమాత్మ చీకటిగా ఉన్న ఆ గుహలోనికి వెళ్ళాడు. కొంచం దూరం వెళ్ళాక అక్కడ యవ్వనంలో ఉన్న ఒక స్త్రీ ఒక పిల్లవాడిన ఉయ్యాలలో వేసి ఊపుతోంది. ఆ స్త్రీ జాంబవతి. జాంబవంతుని కూమార్తే. ఊయలలో ఉన్నది జాంబవంతుని కూమారుడు సుకుమారుడు. తమ్ముడిని ఊయలలో పడుకోబెట్టి ఊయల ఊపుతోంది. ఆ ఊయలకు శమంతక మణి కట్టి ఉండడం కృష్ణుడు చూశాడు. కృష్ణుడిని చూడగానే జాంబవతి మొహించింది. ఆయనే తనకు భర్త అని భావించింది. కృష్ణుడు ఆ మణి వంకే చూడడం గమనించి ఆ మణి కృష్ణుడిదే అని, తన తండ్రి తీసుకువచ్చి ఉంటాడని, కృష్ణుడు మణి కోసమే వచ్చాడని గ్రహించింది. ఎవరైన క్రొత్తవారు వచ్చారని తెలిస్తే జాంబవంతుడికి కోపం వస్తుందని, కృష్ణుడిని చంపుతాడని భయపడుతుండగా, ఆ మణి కోసం కృష్ణుడు దగ్గరగా వస్తున్నాడు. ఆవిడ కృష్ణుడికి ఆ మణి ఇక్కడకు ఎలా వచ్చిందో అర్దమయ్యేలా, పిల్లవాడికి జోల పాడుతున్నట్టుగా, జాంబవంతునకు కృష్ణుడు వచ్చాడన్న సంగతి తెలియకుండా ఉండేందుకని ఒక పాట రూపంలో ఊయల ఊపుతూ జరిగినదంతా చెప్పింది.
సింహప్రసేనమవధి సింహోజాంబవతాహతః
సుకుమారకమారోధి తవహేష్యాశ్శమంతకః
సింహం ప్రసేనుడిని చంపింది. సింహాన్ని జాంబవంతుడు చంపాడు. ఓ సుకుమార! నువ్వు ఏడవకు. ఈ మణి నీదే అని అర్దం.
ఇంతా చెప్పిన కృష్ణుడు దగ్గరకు వచ్చేస్తున్నాడు. ఏంటయ్యా, ఎంత చెప్పిన వినకుండా దగ్గరకు వచ్చేస్తున్నావు. మా నాన్న చూస్తే నిన్ను చంపేస్తాడు. అది నేను తట్టుకోలేను. వెనక్కి వెళ్ళు అని జాంబవతి పలికింది. రక్షించాలనుకుంది, ఇంతలో జాంబవంతుడు వచ్చాడు.
To be Continued ...........

ఈ శ్లోకం విషయం. దీనిలో ఉన్న చిక్కుల గురించి ఈ కథయొక్క రెండవభాగపుటపాలో నేను వ్యాఖ్యానించాను ఇప్పటికే. అదొకసారి గుర్తుచేసుకోండి.
ReplyDeleteమీ టపాలో కొన్ని ముద్రారాక్షసాలు సరిచేసుకోండి.
అలాగే కురువృధ్ధుడు అనకంటి అది కురువంశపు వృధ్ధుడు అన్న అర్థంలో వాడాలి అన్యథా కాదు. కడువృధ్ధుడు అనండి
మీరు శ్రీచాగంటి వారి ప్రవచనంలో ఉన్నది సరిగానే అనుసరించారు.
తప్పును సవరించానండి
Deleteఓయి అల్ప డింభకా! కురు అంటే ఇరు (రెండు) అని కాదు. కురు అన్నది వంశం, ముఖ్యంగా భారత దేశ వంశం. కడు అనగా ఎక్కువ, విపరీతం అని అర్ధం.
ReplyDeleteతప్పును సవరించానండి
Delete